స్టెతస్కోప్ ఏ సూత్రంతో పని చేస్తుంది?
1. మనిషి వినగల తరంగాల పౌనఃపున్యం వ్యాప్తి?
ఎ) 20Hz-20000Hz
బి) 30Hz-30000Hz
సి) 20Hz-2000Hz
డి) 30Hz-3000Hz
2. ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) పౌనఃపున్యం
బి) తరంగదైర్ఘ్యం
సి) యానకం
డి) ధ్వని జనకం
3. ధ్వని ఎక్కువ వేగంతో ఎందులో
ప్రయాణిస్తుంది?
ఎ) గాలి బి) నీరు
సి) ఆల్కహాల్ డి) ఇనుము
4. రేడియో యాంటెనా తరంగాలు గ్రహించడంలో ఏ దృగ్విషయం ఇమిడి ఉంది?
ఎ) పరావర్తనం బి) అనునాదం
సి) ప్రతినాదం డి) ప్రతిధ్వని
5. సరైన ప్రవచనం గుర్తించండి.
ఎ) ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు
బి) ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు
సి) యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు
డి) అన్నీ సరైనవే
6. తరంగ పౌనఃపున్యాన్ని నిర్ణయించే అంశం?
ఎ) తరంగ జనకం బి) యానకం
సి) తరంగంలోని శక్తి డి) ఎ, బి
7. ఖాళీగా ఉన్న గదిలో ధ్వని పలుమార్లు వినబడటానికి కారణం?
ఎ) అనునాదం బి) ప్రతినాదం
సి) విస్పందనాలు డి) ప్రతిధ్వని
8. ఏ ధ్వని పౌనఃపున్యం ఎక్కువ?
ఎ) పులి గాండ్రింపు
బి) ఏనుగు ఘీంకారం
సి) మగవారి గొంతు డి) ఆడవారి గొంతు
9. రైలు కూత పెడుతూ స్టేషన్ నుంచి దూరంగా వెళ్లేటప్పుడు, ప్లాట్‌ఫాంపై నిలుచున్న వ్యక్తికి వినబడే కూత పౌనఃపున్యం?
ఎ) కూత వాస్తవ పౌనఃపున్యం కంటే ఎక్కువ
బి) కూత వాస్తవ పౌనఃపున్యం కంటే తక్కువ
సి) కూత వాస్తవ పౌనఃపున్యానికి సమానం
డి) ఎ, బి
10. యాంత్రిక తరంగం ప్రయాణించేటప్పుడు?
ఎ) యానకంలోని కణాలు తరంగంతో పాటు ముందుకు ప్రయాణిస్తాయి
బి) యానకంలోని కణాలు కంపన చలనంలో ఉంటాయి
సి) యానకంలోని కణాలు కదలకుండా ఉంటాయి
డి) యానకంలోని కణాలు భ్రమణ చలనంలో ఉంటాయి
11. స్థిర తరంగాలు ఏర్పడాలంటే రెండు
తరంగాల మధ్య ఉండాల్సిన దశాభేదం
ఎ) 00 బి) 900
సి) 1800 డి) 2700
12. సరైన ప్రవచనం గుర్తించండి
ఎ) మెరుపు కనిపించిన తరువాత కొన్ని
సెకన్లకు ఉరిమిన శబ్దం వినిపిస్తుంది
బి) ఉరిమిన కొన్ని సెకన్ల తరువాత మెరుపు కనిపిస్తుంది
సి) మెరుపు, ఉరుము రెండూ ఒకేసారి భూమిని చేరుతాయి
డి) మెరుపు, ఉరుము అనేవి పరస్పరం సంబంధం లేనివి
13. సముద్రాల లోతు తెలుసుకోవడానికి ‘SONAR’ పద్ధతిని ఉపయోగిస్తారు. ‘SONAR’ అంటే..
ఎ) Sound Detection and Ranging
బి) Sound Observation and Ranging
సి) Sound Navigation and Ranging
డి) Sound Obervation, Navigation and Ranging
14. అతి ధ్వనుల పౌనఃపున్యం కింది వాటిలో దేనికంటే ఎక్కువగా ఉంటుంది?
ఎ) 2000 Hz బి) 20,000 Hz
సి) 5,000 Hz డి) 50,000 Hz
15. పరశ్రావ్యాలను కూడా వినగలిగేవి?
ఎ) పాములు బి) ఏనుగులు
సి) తిమింగలాలు డి) పైవన్నీ
16. అతి ధ్వనులకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) లోహాలలో సన్నని రంధ్రాలు చేయవచ్చు
బి) స్కానింగ్ ద్వారా శరీర అంతర్గత అవయవాలను చిత్రీకరించడం
సి) పాలను పాశ్చరైజేషన్ చేయడం
డి) పైవన్నీ
17. స్టెతస్కోప్ పని చేసే సూత్రం?
ఎ) బహుళ పరావర్తనం ద్వారా ధ్వని ఆవర్తనం
బి) సంపూర్ణాంతర పరావర్తనం
సి) సంపూర్ణాంతర ప్రసారం ద్వారా ధ్వని ఆవర్తనం
డి) ధ్వని వక్రీభవనం
18. సినిమా హాల్లో గోడలు, సీలింగ్‌లను
థర్మకోల్, రంపపు పొట్టుతో చేసిన అట్టలతో కప్పి ఉంచడానికి కారణం?
ఎ) అనునాద ప్రభావాన్ని తగ్గించడానికి
బి) అనునాద ప్రభావాన్ని పెంచడానికి
సి) ప్రతినాద ప్రభావాన్ని తగ్గించడానికి
డి) ప్రతినాద ప్రభావాన్ని పెంచడానికి
19. మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదుసార్లు వినిపించడానికి కారణం?
ఎ) ఒక ఉరుము మరో మేఘం ఉరమడానికి కారణం అవుతుంది
బి) ఒక ఉరుము అదే మేఘం మరోసారి ఉరమడానికి కారణమవుతుంది
సి) ఉరుము భూమికి, మేఘానికి మధ్య బహుళ పరావర్తనం చెందుతుంది
డి) పైవన్నీ సరైనవే
20. ఆడవారి గొంతు కీచుగా ఉండటానికి కారణం?
ఎ) అధిక తరంగదైర్ఘ్యం
బి) అధిక పౌనఃపున్యం
సి) అధిక కంపనపరిమితి
డి) అధిక హరాత్మకాలు
21. ప్రతిధ్వని వినాలంటే శబ్ద జనకానికి అవరోధం కనీసం ఎంత దూరంలో ఉండాలి?
ఎ) 10.5 మీ. బి) 16.5 మీ.
సి) 20.5 మీ. డి) 26.5 మీ.
22. వినికిడి స్థిరత విలువ?
ఎ) 0.1 సెకన్లు బి) 0.01 సెకన్లు
సి) 0.2 సెకన్లు డి) 0.02 సెకన్లు
23. అనుదైర్ఘ్య తరంగంలో కణాల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?
ఎ) సంపీడనం బి) విరళీకరణం
సి) శృంగం డి) ద్రోణి
24. తీగల్లో కంపన నియమాలను సరి చూడటానికి ఉపయోగించే పరికరం?
ఎ) హైడ్రోమీటరు బి) పాథోమీటర్
సి) సోనోమీటర్ డి) ఫైరోమీటర్
25. కార్లు, బస్సులు ఒక ప్రత్యేక వేగంతో ప్రయాణించేటప్పుడు కిటికీ అద్దాలు
చప్పుడు చేయడానికి కారణం?
ఎ) విస్పందనాలు బి) ప్రతినాదం
సి) డాప్లర్ ప్రభావం
డి) అనునాదం
26. టీవీ ఆన్ చేసినప్పుడు?
ఎ) మొదట బొమ్మ కనిపిస్తుంది
బి) మొదట మాటలు వినిపిస్తాయి
సి) బొమ్మ, మాటలు ఒకేసారి వస్తాయి
డి) పెట్టిన ఛానల్‌పై ఆధారపడి బొమ్మ మాటలు వస్తాయి
27. నీటితో ఉన్న బకెట్‌ను చిన్నగా తట్టినప్పుడు ఆ నీటిపై ఏర్పడే తరంగాలు?
ఎ) తిర్యక్ తరంగాలు
బి) అనుదైర్ఘ్య తరంగాలు
సి) పురోగామి తరంగాలు
డి) మొదట పురోగామి తిర్యక్ తరంగాలు, తర్వాత స్థిర తరంగాలు
28. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో ధ్వనివేగం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు
డి) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
29. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు?
ఎ) డెసీ మీటర్స్ బి) డెసిబుల్స్
సి) డెసిజౌల్ డి) డెసిక్రోమ్స్
30. మనిషి చెవి ఒక సెకనులో స్పష్టంగా వినగల ధ్వని మాత్రలు (syllables) సంఖ్య
గరిష్ఠంగా?
ఎ) 5 బి) 10 సి) 15 డి) 20
31. వయస్సు పెరిగిన కొద్దీ మనిషి వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణం?
ఎ) తక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలకు కర్ణభేరి స్పందించదు
బి) ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలకు కర్ణభేరి స్పందించదు
సి) ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న తరంగాలకు కర్ణభేరి స్పందించదు
డి) ఎక్కువ కంపన పరిమితి ఉన్న తరంగాలకు కర్ణభేరి స్పందించదు
32. ధ్వనివేగం అధికంగా ఉండే వాయువు?
ఎ) క్లోరిన్ బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) ఆక్సిజన్ డి) హైడ్రోజన్
33. సూపర్ సోనిక్ వేగం అంటే?
ఎ) 1200 కి.మీ./గంట కంటే ఎక్కువ
బి) 1500 కి.మీ./గంట కంటే ఎక్కువ
సి) 1800 కి.మీ./గంట కంటే ఎక్కువ
డి) 2100 కి.మీ./గంట కంటే ఎక్కువ
34. అనుదైర్ఘ్య తరంగం వేటిని కలిగి ఉంటుంది?
ఎ) శృంగాలు, ద్రోణులు
బి) సంపీడన, విరళీకరణాలు
సి) ప్రస్పందన, అస్పందనాలు
డి) పైవేవీకావు
35. హెర్ట్ అంటే..?
ఎ) మీటర్ దూరంలో ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
బి) సెకను కాలంలో ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
సి) నిమిషం కాలంలో ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
డి) గంటలో ఉత్పత్తి అయ్యే తరంగాల సంఖ్య
36. స్పీకర్ వాల్యూమ్ పెంచితే ధ్వని లక్షణాల్లో మారేది?
ఎ) కంపన పరిమితి బి) పౌనఃపున్యం
సి) వేగం డి) తరంగ దైర్ఘ్యం
37. పాటల రికార్డింగ్‌ను ప్రత్యేక గదుల్లో నిర్వహించడానికి కారణం ?
ఎ) బయటి ధ్వనులు రికార్డు కాకూడదని
బి) ఆ గదిలోని ధ్వనుల ప్రతినాదం
తగ్గించడానికి
సి) పాడే వ్యక్తి ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి
డి) ఎ, బి
38. గబ్బిలాలు తమ ప్రయాణ మార్గంలో అవరోధాలను గుర్తించే ప్రక్రియ?
ఎ) అతిధ్వనుల పరావర్తనం
బి) అతిధ్వనుల వక్రీభవనం
సి) అతిధ్వనుల వివర్తనం
డి) అతిధ్వనుల ధృవణం
39. సంగీత వాయిద్య పరికరాలను శృతి
చేయడంలో ఉపయోగపడే ప్రక్రియ?
ఎ) ప్రతిధ్వనులను గుర్తించడం
బి) ప్రతినాద కాలాన్ని గుర్తించడం
సి) విస్పందనాలను గుర్తించడం
డి) అనునాదాన్ని గుర్తించడం
40. అనునాదం అనేది..?
ఎ) సహజ పౌనఃపున్యాలు సమానం
అయినప్పుడు ఏర్పడుతుంది
బి) బలాత్కృత కంపనాల్లో ప్రత్యేక సందర్భం
సి) శక్తి ఒక వస్తువు నుంచి మరో వస్తువుకు గరిష్ఠంగా బదిలీ అయ్యే ప్రక్రియ
డి) అన్నీ సరైనవే
41. భూకంపం వచ్చినప్పుడు ఏర్పడే తరంగాలు?
ఎ) ఉపరితల తరంగాలు
బి) ప్రాథమిక తరంగాలు
సి) గౌణ తరంగాలు డి) పైవన్నీ
42. భూకంప తీవ్రతను కొలిచే పరికరం?
ఎ) సిస్మో గ్రాఫ్ బి) సోనోమీటర్
సి) రిజోనేటర్ డి) కార్డియోగ్రాఫ్
43. శని గ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేది?
ఎ) విస్పందనాలు బి) డాప్లర్ ప్రభావం
సి) అనునాదం డి) ప్రతినాదం
44. క్రమంగా కంపన పరిమితి తగ్గే తరంగాలు?
ఎ) తల తరంగాలు
బి) ప్రాథమిక తరంగాలు
సి) అవరుద్ధ తరంగాలు
డి) అనునాద తరంగాలు
45. స్థిర తరంగాల విషయంలో సరైన ప్రవచనం కానిది?
ఎ) ప్రస్పందన, అస్పందన బిందువులుంటాయి
బి) రెండు వరుస అస్పందనాల మధ్యదూరం తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది
సి) శక్తి ప్రసారం జరగదు
డి) అన్ని కణాలు గరిష్ఠ కంపన పరిమితితో చలిస్తాయి
46. దృఢ అవరోధం నుంచి పరావర్తనం చెందిన తరంగం ప్రావస్థలో మార్పు?
ఎ) 900 బి) 1800
సి) 2700 డి) 3600
47. జెట్ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు గాలిలో ఉత్పన్నమయ్యే తరంగాలు?
ఎ) ఉపరితల తరంగాలు
బి) అయస్కాంత తరంగాలు
సి) అఘాత తరంగాలు డి) పైవన్నీ
48. ఒక వ్యక్తి పక్క గదిలోని మాటలను వినడానికి కారణం?
ఎ) ధ్వని పరావర్తనం బి) ధ్వని వివర్తనం
సి) ధ్వని వక్రీభవనం డి) అతిధ్వని
49. సూర్యుని భ్రమణాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే దృగ్విషయం?
ఎ) విస్పందనాలు బి) వ్యతికరణం
సి) వివర్తనం డి) డాప్లర్ ప్రభావం
50. ఒక నక్షత్రానికి సంబంధించి వర్ణపట రేఖలు ఎరుపుకొనవైపు విస్థాపనం చెందుతున్నాయి అంటే?
ఎ) నక్షత్రం పరిశీలకుని నుంచి దూరంగా పోతున్నట్లు
బి) నక్షత్రం పరిశీలకున్ని సమీపిస్తున్నట్లు
సి) ఇది ఎట్టి సమాచారాన్ని ఇవ్వదు
డి) నక్షత్రం అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్నట్లు
51. లోహాల్లో పగుళ్లను లేదా రంధ్రాలను గుర్తించడానికి ఉపయోగపడేవి?
ఎ) పరశ్రావ్యాలు బి) అతిధ్వనులు
సి) ప్రతిధ్వనులు డి) విస్పందనాలు
52. ధ్వనివేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే తరంగాలను ఏమంటారు?
ఎ) సూపర్సోనిక్ బి) పరశ్రావ్యాలు
సి) సబ్‌సోనిక్ డి) అతిధ్వనులు
53. ఎకోకార్డియోగ్రఫీలో ఉపయోగించే తరంగాలు, దృగ్విషయం వరుసగా…
ఎ) అతిధ్వనులు, పరావర్తనం
బి) అతిధ్వనులు, వ్యతికరణం
సి) శ్రవ్యతరంగాలు, పరావర్తనం
డి) శ్రవ్యతరంగాలు, వ్యతికరణం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు