బ్యాంకులు- ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ/ ఆర్థికాభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
- బ్యాంకింగ్ వ్యవస్థ లేకుండా నేటి ఆర్థికాభివృద్ధిని సాధించలేం, ఊహించలేం.
- ప్రపంచంలో ఒక దేశ ఆర్థిక విధానాలను అంటే ద్రవ్య కోశ విధానాల రూపకల్పనలో వాటిని అమలు చేయడంలో బ్యాంకులు బ్యాంకింగ్ వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- బ్యాంకు అనే పదాన్ని వివిధ దేశాల్లో, వివిధ రకాల పేర్లతో, వివిధ ప్రయోజనాలతో వాడుతున్నారు.
BANCO అనే ఇటాలియన్, BANC అనే జర్మనీ పదాల నుంచి BANK అనే ఆంగ్ల పదం ఆవిర్భవించింది. - BANK అనే ఆంగ్ల పదానికి అర్థం ‘ద్రవ్యాన్ని మారకం చేయడం’ ఫ్రెంచ్‌లో BANQUE అనే గ్రీక్ పదం అర్థం బల్ల (Bench)
- ఇటలీలో BANCO అనే పదం అర్థం బల్ల
- జర్మనీలో BANC అనే పదం అర్థం ఉమ్మడి నిల్వ.
- ఒక నిర్ణీత ప్రదేశంలో బల్లలపై ద్రవ్యాన్ని మార్పిడి చేసే ప్రక్రియగా పేర్కొనడం జరిగింది. ప్రారంభంలో ద్రవ్యమార్పిడికి మాత్రమే ఈ పదాన్ని ఉపయోగించేవారు. వీరు చిల్లర నాణేలను బెంచీలపై ఉంచి ఆర్థిక కార్యకలపాలను సాగించడంతో ఈ పదం వాడుకలోకి వచ్చింది.
- సాధారణంగా బ్యాంకు అంటు ద్రవ్యాన్ని మారకం చేసే సంస్థ
- సాధారణంగా పొదుపులను స్వీకరించి, వాటిని అవసరమైన వారికి పెట్టుబడుల కోసం రుణాలుగా అందించే విత్తసంస్థను బ్యాంకు అంటారు. అంటే అప్పులు తెచ్చే, అప్పులు ఇచ్చే ఒక వ్యవస్థే బ్యాంకు.
- ప్రభుత్వ అనుమతితో ఏర్పడిన ఒక ఆర్థిక సంస్థను బ్యాంకు అంటారు.
- ఆర్థిక వ్యవహారాలను బ్యాంకింగ్, వ్యవహారాలను నిర్వహించే సంస్థను బ్యాంకు అంటారు,
- కాథల్ ప్రకారం ఇతరుల నుంచి రుణాలను తీసుకొని తనవద్ధ ఉన్న ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ద్రవ్యాన్ని సృష్టించడమే బ్యాంకుల వ్యాపారం.
డా. హెర్బర్డ్ ఎల్. హర్ట్ ప్రకారం “సాధారణ వ్యాపార సరళిలో జమకట్టే సొమ్మును వారిపేర కరెంట్ ఖాతాలో జమ కడుతూ, ఆయా వ్యక్తులు జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ చెల్లించే వారిని బ్యాంకు” అంటారు.
భారత బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 లోని సెక్షన్ -5 ప్రకారం
కోరిన వెంటనే గాని, ఇతర సమయంలో గాని చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్ల ద్వారాగాని తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాని, పెట్టుబడి కోసం గాని ఉపయోగించడం బ్యాంకు వ్యాపారం. - రుణాలు ఇచ్చే ఉద్దేశంగాని పెట్టుబడి చేసే ఉద్దేశంగాని ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి తిరిగి వారు కోరినప్పుడు నగదు చెల్లించే సంస్థను బ్యాంకు/బ్యాంకింగ్ అంటారు.
- ఆర్థిక వ్యవస్థకు స్వల్పకాలిక దీర్ఘకాలిక నిధులను సమకూర్చుట అప్పులు, ఇవ్వడం, తీసుకోవడం, ద్రవ్య సప్లయి రుణాల సప్లయి మొదలైన అంశాలను నిర్వహించేదే బ్యాంకింగ్ వ్యవస్థ.
- ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పురాతనమైనది. క్రి.పూ. 200 సం.లకు పూర్వం గ్రీక్ దేవాలయాలైన యుపసన్ డెలఫి ఒలంపియా దేవాలయాల్లో విలువైన వజ్రాలను నిల్వ చేసే వారు.
బైబిల్ కొత్త నిబంధనల్లో జెరూసలేం దేవాలయాల్లో వడ్డీ వ్యాపార కార్యకలపాలు నిర్వహించినట్లు ఆదారాలున్నాయి. - రోమన్ సామ్రాజ్యం దేవాలయాల నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారు. ఈ ఆర్థిక కార్యకలాపాల నిర్వాహణకు పూజారులు ఆర్థిక ఏజెంట్లుగా వ్యవహరించేవారు.
- మధ్యయుగంలో యూదులు కూడా ద్రవ్య కార్యకలాపాలను నిర్వహించేవారు. క్రైస్తవ చర్చి అభిప్రాయంలో వడ్డీని వసూలు చేయడం పాపమని క్షమించరాని నేరంగా పరిగణించేవారు. అంటే క్రైస్తవులు కూడా పరిమిత వ్యాపారంలో భాగస్వాములయ్యారు. అని అర్థమవుతుంది.
- క్రీ.పూ. 600లోనే బాబిలోన్ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని డెవిల్ పౌట్ అనే ఫ్రెంచ్ రచయిత పేర్కొన్నాడు.
- ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు (పబ్లిక్ సంస్థ) ది బ్యాంక్ ఆఫ్ వెనిస్
- క్రీ.శ. 1157 లో ఇటలీలో నెలకొల్పబడింది.
- ఆ తర్వాత క్రీ.శ. 1401 లో బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా
క్రీ.శ. 1407 లో బ్యాంక్ ఆఫ్ జెనీవా - క్రీ.శ. 1609 లో బ్యాంక్ ఆఫ్ అమ్‌స్టర్ డామ్
క్రీ.శ. 1690 సం.లో బ్యాంక్ ఆఫ్ హమ్బర్గ్ స్థాపించబడింది. - ఇటలీ నుంచి వలస వెళ్లిన లంబార్డ్ ప్రజలు, ఇంగ్లండ్, యూరప్‌లలో బ్యాంకులను స్థాపించారు.
- బ్యాంకింగ్ వ్యవస్థకు పుట్టినిల్లు ఇటలీ
- లాంబర్డ్ ఆఫ్ ఇటలీ బ్యాంకును ఇంగ్లాండ్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
- ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంకు, రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్‌ను 1656లో స్థాపించారు., 1668 నుంచి పనిచేస్తుంది.
- 1994 జూలై 27న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించారు.
- ప్రపంచంలో కేంద్రబ్యాంకులకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తల్లిలాంటిది.
- 1883లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాణిజ్య బ్యాంకుగా రూపొందింది.
- 1800లో ది బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌ను ఫ్రాన్స్‌లో స్థాపించారు.
- 1914లో ఫెడరల్ రిజర్వు బ్యాంకును అమెరికా స్థాపించింది.
యూనిట్ బ్యాంకింగ్
- ఒకే బ్రాంచ్ కలిగి అదే ప్రధాన కార్యాలయంగా పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థను యూనిట్ బ్యాంకింగ్ అంటారు. యూనిట్ బ్యాంకింగ్‌ను మొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
బ్రాంచ్ బ్యాంకింగ్
- ఒక బ్యాంకు ఒక ప్రధాన కార్యాలయం కలిగి ప్రపంచ దేశ వ్యాప్తంగా అనే బ్రాంచీలు కలిగి ఉండి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుటను బ్రాంచ్ బ్యాంకింగ్ అంటారు.
- బ్రాంచ్ బ్యాంకింగ్‌ను మొదటిసారిగా ఇంగ్లాండ్‌లో ప్రారంభించారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ బ్రాంచ్ బ్యాంకింగ్ రకానికి చెందినది.
కోర్ బ్యాంకింగ్
- ఒక బ్యాంకు ప్రధాన కార్యాలయం వివిధ బ్రాంచీల నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసి ఇంటర్ బ్రాంచ్ ఆపరేషన్స్ చేయడానికి అవకాశం కలిగి ఉంటే దానిని కోర్ బ్యాంకింగ్ ఉంటారు.
- కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ద్వారా ఒక బ్యాంకు కస్టమర్ దేశ వ్యాప్తంగా ఆ బ్యాంకుకు సంబంధించిన బ్రాంచీలలో లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అంటే కస్టమర్ బ్రాంచ్ ఓరియంటెడ్ కస్టమర్ నుంచి బుక్ఓరియంటెడ్ కస్టమర్‌గా గుర్తించ బడతాడు.
యూనివర్సల్ బ్యాంకింగ్
- ఒక వాణిజ్య బ్యాంకు వాణిజ్య విధులతోపాటుగా బీమా పెట్టుబడి స్టాక్ బ్రోకింగ్ మొదలైన ఇతర సేవలు కూడా అందిస్తే దానిని యూనివర్సల్ బ్యాంకింగ్ అంటారు.
- భారతదేశంలో ఆర్.హెచ్. ఖాన్ కమిటీ యూనివర్సల్ బ్యాంకింగ్ వ్యవస్థను సూచించింది.
మిక్స్డ్ బ్యాంకింగ్
- స్వల్పకాలిక రుణాలతోపాటు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసే బ్యాంకింగ్ వ్యవస్థను మిశ్రమ బ్యాంకింగ్ అంటారు.
న్యారో బ్యాంకింగ్
- రుణాలు మంజూరు చేయడంలో కఠినమైన నియమ నిబంధనలు పాటించే బ్యాంకుల వ్యవస్థను న్యారో బ్యాంకింగ్ అంటారు.
- భారతదేశంలో న్యారో బ్యాంకింగ్‌ను ఎం. నర్సింహ కమిటీ సూచించింది.
కాసినో బ్యాంకింగ్
రుణాలు మంజూరు చేయడంలో సులభమైన నియమ నిబంధనలు పాటించే బ్యాంకుల వ్యవస్థను కాసినో బ్యాంకింగ్ అంటారు. కాసినో బ్యాంకింగ్ వల్ల రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు నిరర్థక ఆస్తులు పెరగుతాయి.
డెవలప్మెంట్ బ్యాంక్స్ :
- పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసే బ్యాంకులను డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటారు.
రచయిత: పానుగంటి కేశవ రెడ్డి
వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని: 9949562008
ప్రాక్టీస్ బిట్స్
1. బ్యాంక్ అనే పదానికి ఆధారాలు ఏవి?
ఎ) బ్యాంకో బి) బాంక్
సి) బ్యాంకో, బాంక్ డి) బ్యాంకర్లు
2. జర్మనీలో బాంక్ అనే పదానికి అర్థం ఏమిటి?
ఎ) ఉమ్మడి నిల్వనిధి
బి) ఉమ్మడి సప్లయి నిధి
సి) బల్ల డి) పైవన్నీ
3. గ్రీక్, రోమ్లలో వడ్డీ వ్యాపారులను ఏమంటారు?
ఎ) బాంకర్లు బి) బెంచర్స్
సి) స్వర్ణకారులు డి) వర్తక వ్యాపారి
4. ఫ్రెంచ్ (గ్రీక్) భాషలో BANQUE అనే అర్థం ఏమిటి?
ఎ) ఉమ్మడి నిల్వనిది బి) బల్ల
సి) ద్రవ్య మారకం డి) పైవన్నీ
5. సాధారణంగా బ్యాంకు అనే పదానికి అర్థం ఏమిటి?
ఎ) ద్రవ్యాన్ని సరఫరా చేసే సంస్థ
బి) ద్రవ్యాన్ని మారకం చేసే సంస్థ
సి) ద్రవ్యాన్ని నిల్వ చేసే సంస్థ
డి) పైవన్నీ
6. బ్యాంక్ అంటే
ఎ) రుణాలను తెచ్చే, రుణాలను ఇచ్చే సంస్థ
బి) ప్రభుత్వ అనుమతితో ఏర్పడిన ఒక
ఆర్థిక సంస్థ
సి) ఆర్థిక/ బ్యాంకింగ్ వ్యాపారాలను
నిర్వహించే సంస్థ డి) పైవన్నీ
7. దేవాలయాల నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించిన సామ్రాజ్యం?
ఎ) రోమన్ సామ్రాజ్యం
బి) గ్రీక్ సామ్రాజ్యం
సి) జర్మనీ సామ్రాజ్యం
డి) ఫ్రెంచ్ సామ్రాజ్యం
8. మధ్యయుగంలో ద్రవ్య కార్యకలపాలను నిర్వహించినది ఎవరు?
ఎ) బాబిలోనియన్లు బి) యూదులు
సి) ఈజిప్షియన్లు డి) గ్రీకులు
9. క్రీ.పూ. 600లో బాబిలోన్ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని పేర్కొన్నది ఎవరు?
ఎ) డెవిల్సౌట్ బి) క్రౌదర్
సి) ఆర్థిక ఏజెంట్లు డి) పై అందరు
10. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు / పబ్లిక్ సంస్థ ఏది?
ఎ) రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
బి) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
సి) ది బ్యాంక్ ఆఫ్ వెనిస్
డి) ఫెడరల్ రిజర్వు బ్యాంకు
11. బ్యాంక్ ఆఫ్ అమ్‌స్టర్‌డామ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) క్రీ.శ. 1401 బి) క్రీ.శ. 1407
సి) క్రీ.శ. 1609 డి) క్రీ.శ. 1690
12. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్రబ్యాంకు ఏది?
ఎ) రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
బి) ది బ్యాంక్ ఆఫ్ వెనిస్
సి) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్
డి) ఫెడరల్ బ్యాంకు
13. బ్యాంకింగ్ వ్యవస్థకు పుట్టినిల్లు ఏది?
ఎ) గ్రీక్ బి) ఇటలీ
సి) జర్మనీ డి) ఇంగ్లాండ్
14. ప్రపంచంలో కేంద్ర బ్యాంకులకు తల్లిలాంటింది?
ఎ) రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్
బి) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్
సి) ఫెడరల్ బ్యాంకు
డి) ది బ్యాంక్ ఆఫ్ వెనిస్
15. ది బ్యాంక్ ఆఫ్ వెనిస్ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) క్రీ.శ. 1156 బి) క్రీ.శ.1157
సి) క్రీ.శ. 1158 డి) క్రీ.శ. 1159
16. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) క్రీ.శ.1694 బి) క్రీ.శ. 1695
సి) క్రీ.శ. 1696 డి) క్రీ.శ. 1698
సమాధానాలు
1-సి 2-ఎ 3-బి 4-బి
5-బి 6-డి 7-ఎ 8-బి
9-ఎ 10-సి 11-సి 12-ఎ
13-బి 14-బి 15-బి 16-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు