యథావాక్కుల అన్నమయ్య ఏ శతాబ్దికి చెందినవాడు?
తెలుగు
1. ‘దానశీలము’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) శ్రీనాథుడు 2) బమ్మెర పోతన
3) ఎర్రన 4) తిక్కన
2. బమ్మెర పోతన ఏ శతాబ్దానికి చెందినవాడు?
1) 13 2) 14 3) 15 4) 16
3. పోతన తన భాగవత పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
1) శ్రీ రామచంద్రుడు
2) శ్రీ మహావిష్ణువు
3) శ్రీ వేంకటేశ్వరుడు
4) విశ్వేశ్వరుడు
4. కింది వాటిలో పోతన రచన కానిది ఏది?
1) భోగినీ దండకం 2) వీరభద్ర విజయం
3) నారాయణ శతకం 4) హర విలాసం
5. కింది వాటిలో పోతన బిరుదు ఏది?
1) సహజ పండితుడు
2) కవిసార్వభౌమ
3) శంభుదాసుడు
4) ప్రబంధ పరమేశ్వరుడు
6. ‘దానశీలము’ అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
1) ఇతిహాసం 2) పురాణం
3) కథానిక 4) నాటకం
7. కింది వాటిలో పురాణ లక్షణాలేవి?
1) స్వర్గం, ప్రతిసర్గం
2) వంశం, మన్వంతరం
3) వంశానుచరితం 4) పైవన్నీ
8. పురాణాలు ఎన్ని?
1) 16 2) 17 3) 18 4) 19
10. ‘అపూటం’ అంటే అర్థం ఏమిటి?
1) కొద్దిగా 2) పూర్తిగా
3) కోరిక 4) చిలకరించు
11. ‘కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కబ్జుండు విశ్వంభరుం’ అనేది ఏ పద్యభాగం?
1) ఉత్పలమాల 2) చంపకమాల
3) మత్తేభం 4) శార్దూలం
12. ‘గర్వోన్నతి’ ఏ సంధి?
1) సవర్ణదీర్ఘ సంధి 2) గుణ సంధి
3) యణాదేశ సంధి 4) అత్వ సంధి
13. కింది వాటిలో ‘కులము’నకు నానార్థం కానిది?
1) వంశం 2) జాతి
3) ఇల్లు 4) పొలము
14. కింది వాటిలో త్రికసంధి పదం కానిది ఏది?
1) అచ్చోటు 2) ఎక్కాలము
3) ఇవ్విధము 4) అణ్వాయుధము
15. ‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?’ అనేది ఏ పద్య పాదం?
1) మత్తేభం 2) చంపకమాల
3) శార్దూలం 4) ఉత్పలమాల
16. ‘ఎవరి భాష వాళ్లకు వినసొంపు’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) దాశరథి 2) డాక్టర్ సామల సదాశివ
3) డాక్టర్ సి.నారాయణరెడ్డి
4) గూడూరి సీతారాం
17. కింది వాటిలో డాక్టర్ సామల సదాశివ రచనలేవి?
1) ఉర్దూ సాహిత్య చరిత్ర, యాది
2) మలయ మారుతాలు
3) అమ్జద్ రుబాయీలు, సంగీత శిఖరాలు
4) పైవన్నీ
18. డాక్టర్ సామల సదాశివకు ‘అమ్జద్ రుబాయీలు’ అనువాదానికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది?
1) 1962 2) 1963
3) 1964 4) 1965
19. 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సామల సదాశివ రచన ఏది?
1) స్వరలయలు
2) అమ్జద్ రుబాయీలు
3) మలయ మారుతాలు 4) యాది
20. ‘ఎవరి భాష వాళ్లకు వినసొంపు’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
1) కథానిక 2) వ్యాసం
3) నాటకం 4) పద్య
21. ‘ఎవరి భాష వాళ్లకు వినసొంపు’ అనే పాఠ్యభాగం సామల సదాశివ ఏ రచన నుంచి గ్రహించబడింది?
1) యాది 2) స్వరలయలు
3) సంగీత శిఖరాలు
4) మలయ మారుతాలు
22. ‘వీర తెలంగాణ’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) డాక్టర్ పాకాల యశోదారెడ్డి
2) డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య
3) డాక్టర్ సి.నారాయణరెడ్డి
4) డాక్టర్ సామల సదాశివ
23. కింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది?
1) రుద్రవీణ 2) అగ్నిధార
3) పునర్నవం 4) హరివంశం
24. దాశరథి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర పేరు?
1) యాత్రాస్మృతి 2) నవమి
3) నా జీవితం 4) ఆలోచనాలోచనలు
25. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద’ అన్నవారు ఎవరు?
1) కాళోజి నారాయణరావు
2) దాశరథి కృష్ణమాచార్య
3) ఆదిరాజు వీరభద్రరావు
4) గూడూరి సీతారాం
26. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి ఏ సంవత్సరంలో గాలిబ్ గజళ్లను అనువదించారు?
1) 1960 2) 1961
3) 1962 4) 1963
27. దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?
1) 1962 2) 1964
3) 1967 4) 1969
28. దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది?
1) 1971 2) 1972
3) 1973 4) 1974
29. ‘వీర తెలంగాణ’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
1) పద్యం 2) వచనం
3) కథానిక 4) వ్యాసం
30. ‘వీర తెలంగాణ’ పాఠ్యభాగం దాశరథి సాహిత్యంలోని ఎన్నో సంపుటి నుంచి గ్రహించారు?
1) 2వ 2) 3వ 3) 4వ 4) 1వ
31. ‘నీ యొడిలోన పెంచితిని నిండుగ కోటి తెలుంగ కుర్రలన్’ అనేది ఏ పద్యపాదం?
1) ఉత్పలమాల 2) చంపకమాల
3) మత్తేభం 4) శార్దూలం
32. ఫుల్ల అంటే అర్థం ఏమిటి?
1) మెరుపు తీగలు 2) విచ్చుకున్న
3) అత్యంత స్వచ్ఛమైన
4) ప్రకాశవంతమైన
33. కింది వాటిలో ‘దంష్ట్రలు’ అనే పదానికి నానార్థం కాని పదం ఏది?
1) కోరలు 2) దంతాలు
3) పళ్లు 4) చప్పుడు
34. కింది వాటిలో ఉకార సంధి పదం ఏది?
1) సయ్యాటలాడెన్ 2) మేనత్త
3) శ్రవణాభ్రమ 4) దారినిచ్చిరి
35. కింది వాటిలో రూపక సమాస పదం ఏది?
1) కాంతివార్ధులు 2) వికార దంష్ట్రలు
3) మతపిశాచి 4) బ్రతకుత్రోవ
36. ‘ఛేక’ అంటే అర్థం ఏమిటి?
1) జంట 2) ఏకైక
3) అరటి 4) తేలు
37. ‘నిప్పులో పడితే కాలు కాలుతుంది’ ఈ వాక్యం ఏ అలంకారానికి ఉదాహరణ?
1) వృత్త్యనుప్రాస 2) ఛేకానుప్రాస
3) అంత్యానుప్రాస 4) లాటానుప్రాస
38. ‘కొత్తబాట’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) డాక్టర్ పాకాల యశోదారెడ్డి
2) డాక్టర్ సి.నారాయణరెడ్డి
3) అలిశెట్టి ప్రభాకర్
4) సామల సదాశివ
39. కింది వాటిలో డాక్టర్ పాకాల యశోదారెడ్డి రచన కానిది?
1) మాఊరి ముచ్చట్లు
2) ఎచ్చమ్మ కథలు
3) ధర్మశాల 4) పరిష్కారం
40. డాక్టర్ పాకాల యశోదారెడ్డి కింది ఏ అంశంపై పరిశధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు?
1) తెలుగులో హరివంశాలు
2) ఆంధ్ర సాహిత్య వికాసం
3) ఎర్రాప్రగడ
4) పారిజాతాపహరణ పర్యాలోచనమం
41. ‘కొత్త బాట’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
1) కథానిక 2) వ్యాసం
3) పద్యం 4) వచనం
42. కింది వాటిలో వృద్ధి సంధి పదం కానిది?
1) రసైక 2) దివ్యౌషధం
3) మహౌషధి 4) మూటగట్టు
43. ‘నగర గీతం’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) కృష్ణస్వామి ముదిరాజ్
2) అలిశెట్టి ప్రభాకర్
3) డాక్టర్ సి. నారాయణరెడ్డి
4) పాకాల యశోదారెడ్డి
44. కింది వాటిలో అలిశెట్టి ప్రభాకర్ కవితా సంకలనాలు ఏవి?
1) ఎర్ర పావురాలు, మంటల జెండాలు
2) రక్త రేఖ, చురకలు
3) సంక్షోభగీతం, సిటీలైఫ్, ఎన్నికల ఎండమావి
4) పైవన్నీ
45. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెబితే దాన్ని ఏమంటారు?
1) కథానిక 2) పాట
3) పద్యం 4) మినీ కవిత
46. ‘నగర గీతం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
1) వ్యాసం 2) పద్యం
3) మినీ కవిత 4) గజల్
47. ‘నగర గీతం’ అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించారు?
1) అలిశెట్టి ప్రభాకర్ కవిత
2) ఎన్నికల ఎండమావి
3) రక్త రేఖ
4) ఎర్ర పావురాలు
48. కింది వాటిలో ‘మరణం’ అనే పదానికి పర్యాయపదం కానిది ఏది?
1) కాలధర్మం 2) చావు
3) గిట్టడం 4) కళత్రం
49. ‘నగారా మోగించా నయాగరా దుమికిందా’ ఈ పాదంలో ఏ అలంకారం దాగి ఉంది?
1) వృత్త్యనుప్రాస 2) లాటానుప్రాస
3) ఛేకానుప్రాస 4) అంత్యానుప్రాస
50. ‘ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు’ ఈ వాక్యంలోని అలంకారం?
1) ఉపమాలంకారం
2) రూపకాలంకారం
3) ఉత్ప్రేక్ష అలంకారం
4) అతిశయోక్తి అలంకారం
51. ‘భాగ్యోదయం’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) కృష్ణస్వామి ముదిరాజ్
2) ఆదిరాజు వీరభద్రరావు
3) సామల సదాశివ
4) గూడూరి సీతారాం
52. కృష్ణస్వామి ముదిరాజ్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికయ్యారు?
1) 1955 2) 1956
3) 1957 4) 1958
53. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథం?
1) స్వీయ చరిత్ర 2) జీవిత చరిత్ర
3) యాత్రా చరిత్ర 4) కథా చరిత్ర
54. ‘భాగ్యోదయం’ అనే పాఠ్యభాగం ఏ
ప్రక్రియకు చెందినది?
1) కథానిక 2) నవల
3) వ్యాసం 4) జీవిత చరిత్ర
55. కింది వాటిలో ‘అండ’ అనే పదానికి పర్యాయపదం కానిది ఏది?
1) తోడు 2) సహాయం
3) బలం 4) గొప్పదనం
56. సర్వేశ్వర శతక కర్త ఎవరు?
1) ధూర్జటి
2) యథావాక్కుల అన్నమయ్య
3) ఎలకూచి బాలసరస్వతి
4) కంచర్ల గోపన్న
57. యథావాక్కుల అన్నమయ్య ఏ శతాబ్దికి చెందినవాడు?
1) 11 2) 12 3) 13 4) 14
58. ‘భవదీయార్చన సేయుచో బ్రథమ పుష్పంబెన్న సత్యంబు రెం’ అనేది ఏ పద్యపాదం?
1) ఉత్పలమాల 2) చంపకమాల
3) మత్తేభం 4) శార్దూలం
59. శ్రీకాలహస్తీశ్వర శతక కర్త ఎవరు?
1) కాకుత్థ్సం శేషప్పకవి
2) కంచర్ల గోపన్న
3) యథావాక్కుల అన్నమయ్య
4) ధూర్జటి
60. ధూర్జటి ఏ శతాబ్దానికి చెందినవాడు?
1) 15 2) 16 3) 17 4) 18
61. ‘ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో’ అనేది ఏ పద్యపాదం?
1) శార్దూలం 2) మత్తేభం
3) చంపకమాల 4) ఉత్పలమాల
62. ‘మల్లభూపాలీయం’ నీతి శతక కర్త ఎవరు?
1) ఎలకూచి బాలసరస్వతి
2) నంబి శ్రీధరరావు
3) అందె వేంకటరాజం
4) ఉత్పల సత్యనారాయణాచార్య
63. తెలుగులో మొదటి త్య్రర్థి కావ్యమైన ‘రాఘవ యాదవ పాండవీయం’ రచించినవారు ఎవరు?
1) ధూర్జటి
2) ఎలకూచి బాలసరస్వతి
3) శ్రీనాథుడు 4) కంచర్ల గోపన్న
64. భర్తృహరి సంస్కృతంలో రాసిన ‘సుభాషిత త్రిశతి’ని తెలుగులోకి అనువదించిన తొలి కవి ఎవరు?
1) ధూర్జటి 2) శ్రీపతి భాస్కర కవి
3) ఎలకూచి బాలసరస్వతి
4) వడ్డాది సుబ్బరాయకవి
65. ‘సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లన్ బుధుండౌదలన్’ అనేది ఏ పద్యపాదం?
1) మత్తేభం 2) శార్దూలం
3) ఉత్పలమాల 4) చంపకమాల
66. దాశరథీ శతక కర్త ఎవరు?
1) ఎలకూచి బాలసరస్వతి
2) కంచర్ల గోపన్న
3) ధూర్జటి 4) నంబి శ్రీధరరావు
67. కంచర్ల గోపన్న ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు?
1) హనుమద్దాసు 2) వేంకటదాసు
3) రామదాసు 4) విష్ణుదాసు
68. కంచర్ల గోపన్న ఏ శతాబ్దికి చెందినవాడు?
1) 15 2) 16 3) 17 4) 18
69. ‘భండభీముడార్తజన బాంధవు డుజ్వల బాణతూణ కో’ అనేది ఏ పద్యపాదం?
1) ఉత్పలమాల 2) చంపకమాల
3) మత్తేభం 4) శార్దూలం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు