వాస్తు కళాభిమానులు-సంపన్నరాజ్య పాలకులు
కుతుబ్షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలను గౌరవించిన కుతుబ్షాహీలు వాస్తు కళాభిమానులు. వీరు అనేక కట్టడాలను నిర్మించారు.
ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేశారు.
కుతుబ్షాహీలు తమ పాలనాకాలంలో రాష్ర్టాలను తరఫ్ లేదా సిమ్త్లుగా విభజిం చారు. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో 6 తరఫ్లు ఉండేవి. అబ్దుల్లా తానీషా కాలంలో మొత్తం 37 సర్కారులు 517 పరగణాలు ఉండేవని డచ్ కంపెనీ రికార్డుల వల్ల తెలుస్తుంది. రేవు పట్టణంలో ఉన్నతాధి కారిని షాబందర్ అనేవారు. భూమి శిస్తు వసూలు అధికారాన్ని వేలం పాటలో అందరికంటే ఎక్కువ డబ్బు చెల్లించేవారికే ఇచ్చేవారు. ఈ రకమైన హక్కులను కొన్నవారిని ముస్తజీర్లు అనేవారు. ముస్తజీర్లుగా హిందువులనే ఎక్కువ సంఖ్యలో నియమించారు. మచిలీపట్నం వార్షిక ఆదాయం ఒక లక్ష ఎనబైవేల పగోడాలు. దీనిలో ఐదువేల పగోడాలను సుల్తాన్ హవల్దార్ జీతంగా చెల్లించేవాడు. మూడు వేలు హవల్దార్ తన కింది ఉద్యోగులకు చెల్లింపుల కోసం తీసుకున్నాడు.
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాలను సర్కార్లుగా విభజించారు. వీరి అనేక ఫర్మానాల్లో దేశ్పాండే, తానేదార్, దేశ్ముఖ్, కులకర్ణి మొదలైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులుండేవారు. వీరి కాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు తొలిమెట్టు. గ్రామస్థాయిలో పెద్ద మఖుద్దుమ్. కులకర్ణి గ్రామ అకౌంటెంట్, దేశ్పాండే పరగణా స్థాయి అకౌంట్స్ అధికారి.
గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్ షాహీలు బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాన్ని పోషించారు. సుల్తాన్ ఆధీనంలో సిద్ధ సైన్యం రాజధానిలో ఉండేది. సుల్తాన్ కులీ రాజ్యస్థాపన తొలిరోజుల్లోనే రాజ్య పటిష్టతకు బలోపేతమైన సైన్యాన్ని రూపొందించాడు. సైన్యంలో హిందూ, ముస్లిం, ఇరానీలు ఉండేవారు. కుతుబ్ షాహీల ఆదాయంలో ఎక్కువ భాగం సైన్యం పోషణకు, సైనికుల జీతభత్యాలకే సరిపోయేది.
- గోల్కొండ రాజ్యంలో కూడా వ్యవసాయం ప్రధాన జీవనాధారం. భూమి శిస్తే ఖజానాకు ముఖ్య ఆదాయ వనరు. కుతుబ్ షాహీలు అనేక విధాలుగా వ్యవసాయా భివృద్ధికి కృషిచేశారు. భూమి రికార్డుల్లో భూమి సాగుచేసే వ్యక్తిని రయ్యత్ అని పేర్కొన్నారు. రయ్యత్ నుంచే రైతు అనే పదం ఏర్పడిందని కొందరి పండితుల అభిప్రాయం. ఏ ముస్లిం పాలకులు కూడా భూమిపై రైతు సంపూర్ణ హక్కును గుర్తించలేదు. ఒక్క మాలిక్ అంబర్ మాత్రమే తన రాజ్యంలో (అహ్మద్ నగర్) మిరాశీ హక్కును గుర్తించాడు.
- కుతుబ్షాహీల కాలంలో భూమిశిస్తు, ఇతర పన్నులు, సుంకాలు అన్ని కలిపి 82,95,196 హొన్నుల ఆదాయం వచ్చేది. ఒక హొన్ను అంటే నేటి 3 రూపాయలకు సమానం. అంటే చిట్టచివరి గోల్కొండ సుల్తాన్అబ్దు ల్లా కుతుబ్షా కాలంనాటి మొత్తం రెయన్యూ రూ. 2,47,85,529. ఈ ఆదాయంలో అధిక భాగం తెలంగాణ ప్రాంతంలో ఉన్న సర్కార్ల నుంచి వచ్చేది. ఇదే కాకుండా వజ్రాల గనులు లీజుకు ఇవ్వటం వల్ల భారీ మొత్తంలో ఆదాయం వచ్చేది. పరిశ్రమల నుంచి, వర్తక వ్యాపారం వల్ల కూడా ఆదాయం వచ్చేది.
- న్యాయపాలన కుతుబ్షాహీలు న్యాయ నిర్వహణలో స్థానిక హిందూ ధర్మ సూత్రాలను, న్యాయకోవిదుల సలహాలను, సూచనలను తీసుకొని న్యాయపాలన చేశారు. గ్రామస్థాయి నుంచి సివిల్, క్రిమినల్ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ముస్లిం మతపెద్దలు ఖాజీలు, మౌల్వీలు, పండితులు కూడా న్యాయ నిర్వహణలో కీలకపాత్ర నిర్వహించారు. దాద్మహల్, అమన్ మహల్ వంటి న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానాల్లో సమావేశమై వివిధ కేసులు విచారించి తీర్పు చేప్పేవారు. విదేశీ వర్తకుల, సరుకుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- కుతుబ్షాహీల కాలంలో ప్రజలు హిందు వులు, పాలకులు ముస్లింలు, షియాలు. కుతుబ్షాహీలు స్థానిక ప్రజల సామాజిక వ్యవస్థను, మత ఆచారాలను గౌరవించారు. ఈ అంశమే వారి విజయానికి, ఖ్యాతికి కారణమైందని పండితుల అభిప్రాయం. సామాజిక మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోలేదు. దసరా, దీపావళి, హోళీ, రంజాన్, బక్రీద్, నవ్రోజ్, మొహర్రం ముఖ్య పండుగలు. హిందూ-ముస్లింలు సంఖ్యతతో వీటిని జరుపుకొనేవారు.
- మధ్య యుగ దక్కన్లోలో వెలసిన ఐదు షియా రాజ్యాల్లో గోల్కొండ సంపన్న రాజ్యం. దీనికి కారణం రెండు అంశాలు. ఒకటి గోల్కొండ రాజ్యంలోని సహజ సంపద. ముఖ్యంగా అత్యంత విలువైన వజ్రాల గనులు, తీరాంధ్ర ప్రాంతంలోని సారవంతమైన భూములు నీటివసతులు. మచిలీపట్నం మధ్య ఆసియా కేంద్రంగా ఐరోపా దేశాలతో భారీ ఎత్తున కొనసాగిన విదేశీ వ్యాపారం.
- ప్రజలు సొంత భూములు, వ్యాపారాలు కలిగి ఉండేవారు. ప్రధానంగా వ్యవసాయమే ఎక్కువమంది ప్రజల వృత్తి. జమీందారి భూములు, హవేలీ భూములని రెండు రకాలుగా ఉండేవి. వ్యవసాయ పనులు జూన్ నుంచి అక్టోబర్ వరకు జరిగేవి. కోస్తా ప్రాంతంలో నీటి వసతులు పుష్కలంగా ఉన్నందువల్ల రైతాంగం మంచి లాభాలు గడించేవారు. తెలంగాణ ప్రాంతంలో పండ్లు, పూలు పుష్కలంగా పండించేవారు. హిందువులు వరి ఎక్కువగా పండించేవారు.
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు