రాజ్యాంగ ప్రవేశిక ఎన్నిసార్లు సవరించారు?
పాలిటీ
1. కింది వాటిలో భారత రాజ్యాంగానికి మూలాధారమైన పునాది ఏది?
ఎ. ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రభుత్వం
బి. రాజ్యాంగం లౌకికతత్వాన్ని కలిగి ఉండటం
సి. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య స్పష్టత ఉండటం
డి. రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని కలిగి ఉండటం
పై వాటిలో సరైనది
1) బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
2. ప్రవేశిక ఎలా మొదలవుతుంది. భారతదేశం ఒక?
1) సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర
2) సార్వభౌమ, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర
3) సామ్యవాద, ప్రజాస్వామ్య, సార్వభౌమ, లౌకిక, గణతంత్ర
4) ప్రజాస్వామ్య, సార్వభౌమ, లౌకిక, సామ్యవాద, గణతంత్ర
3. ‘ప్రవేశిక’ కు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. భారత రాజ్యాంగ స్వభావాన్ని తెలుపుతుంది
బి. భారత రాజ్యాంగ లక్షణాలను తెలుపుతుంది
సి. భారత రాజ్యాంగ అధికారానికి మూలం ఎవరో తెలుపుతుంది
డి. భారత రాజ్యాంగం ఆమోదం గురించి తెలుపుతుంది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, బి
4. భారత రాజ్యాంగ ముందుమాట (Pream ble) లో ఏ విధంగా రాశారు?
1) భారత ప్రజలైన మేము, అంగీకరించి ఏర్పరిచి ఈ రాజ్యాంగాన్ని భారత్‌కు ఇస్తున్నాం
2) మేము రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులం ఆమోదించి ఏర్పరచి ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాం
3) మేము, భారత ప్రజలు ఈ రాజ్యాంగాన్ని ఏర్పరచి ఆమోదించి మాకు మేము ఇస్తున్నాం
4) మేము.. భారతదేశ జనులం మా రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించి ఏర్పరచి ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇస్తున్నాం
5. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదాలు?
ఎ. సామ్యవాద బి. లౌకిక
సి. సమగ్రత డి. సార్వభౌమ
1) బి, సి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, సి
6. జతపర్చండి?
ఎ. రాజ్యాంగ తాళం 1. ఠాకూర్ భార్గవ
బి. భారత రాజ్యాంగానికి ఆత్మవంటిది 2. ఎర్నెస్ట్ బార్కర్
సి. భారత ప్రజల కలల సాకారం 3. అల్లాడి కృష్ణస్వామి
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-1, బి-3, సి-2
7. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం
వివరించేది?
1) రాజ్యాంగం మౌలిక స్వరూపం, స్వభావాన్ని మార్చడానికి వీలులేదు
2) రాజ్యాంగంలోని అంశాలు మార్పు చేయాలంటే పార్లమెంటుతో పాటు రాష్ట్రశాసన సభల తీర్మానం అవసరం
3) రాజ్యాంగంలోని అంశాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సూచన మేరకు మార్పు చేయాలి
4) ఏదీకాదు
8. రాజ్యాంగ ప్రవేశికలో భారత్ గురించి ఎలా పేర్కొన్నారు?
1) భారత ప్రజలమైన మేము మాకు మేముగా రాజ్యాంగాన్ని రూపొందించి సమర్పించుకుంటున్నాం
2) రాజ్యాంగ సభ సభ్యులమైన మేము
3) రాజ్యాంగ సభలోని ప్రజలమైన మేము
4) ఏదీకాదు
9. ‘రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే’ అనే భావనకు మూలం?
1) రాజ్యాంగం లిఖితబద్ధ్దంగా ఉంది
2) భారత సమాజంలో ఉన్న సంప్రదాయం
3) భారత పార్లమెంట్ చట్టం ద్వారా అవతరణ
4) సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అవతరణ
10. ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలు వేటి ప్రభావం చేత రాజ్యాంగంలో చేర్చారు?
1) ఫ్రెంచ్ విప్లవం 2) రష్యా విప్లవం
3) అమెరికా స్వాతంత్య్రం
4) యూఎస్ చార్టర్
11. 42వ రాజ్యాంగ సవరణ ఏ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చింది?
1) సామ్యవాద, లౌకిక
2) సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య
3) సామ్యవాద, లౌకిక, ఐక్యత
4) సామ్యవాద, లౌకిక, సమగ్రత
12. జతపర్చండి?
ఎ. రాజ్యాంగ మౌలిక స్వరూపం 1. బేలాబెనర్జీ Vs స్టేట్ ఆఫ్ బీహార్
బి. బ్యాంకుల జాతీయీకరణ 2. గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్
సి. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు 3. ఆర్సీ కూపర్ Vs UoI డి.ఆస్తుల జాతీయం, నష్టపరిహారం 4. కేశవానంత భారతి Vs కేరళ ప్రభుత్వం
13. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ఏయే విషయాల్లో స్వేచ్ఛను పొందవచ్చు?
ఎ. ఆలోచన, భావప్రకటన
బి. అంతస్తు, అవకాశాలు
సి. విశ్వాసం, నమ్మకం, ఆరాధన
డి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
14. భారత రాజ్యాంగం ప్రవేశికను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పులు చేర్చారు?
1) 44వ సవరణ చట్టం
2) 42వ సవరణ చట్టం
3) 46వ సవరణ చట్టం 4) ఏదీకాదు
15. భారత రాజ్యాంగానికి ప్రవేశిక కీ నోట్ అన్నది ఎవరు?
1) ఎర్నెస్ట్ బర్కర్ 2) కేఎం మున్షీ
3) డా. బీఆర్ అంబేద్కర్
4) డీడీ బసు
16. కింది పదాలను ప్రవేశికలో ఉన్న వరుస క్రమంలో అమర్చిండి?
ఎ. సామ్యవాద బి. ప్రజాస్వామ్యం
సి. సార్వభౌమాధికారం డి. లౌకిక
1) సి, ఎ, డి, బి 2) ఎ, బి, సి, డి
3) బి, డి, ఎ, సి 4) డి, సి, బి, ఎ
17. లౌకికవాదం గురించి కింది స్టేట్మెంట్లు పరిశీలించండి?
ఎ. ఇది మతపరమైన తాత్వికతను పెంపొదిస్తుంది
బి. రాజకీయాల నుంచి వేరు చేస్తుంది
సి. మతపరమైన సంస్థలకు ప్రభుత్వ మద్దతును నిషేధిస్తుంది
డి. మతభావాలను, ఆదర్శాలను వ్యతిరేకిస్తుంది
1) బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
18. కింది వాటిలో ఏది భారత రాజ్యాంగ పీఠికలో భాగం?
1) భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఈ రాజ్యాంగాన్ని చర్చించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం
2) పార్లమెంట్ సభ్యులమైన మనం ఈ రాజ్యాంగాన్ని చర్చించి ఆమోదించి మనకు మనం సమర్పించుకుంటున్నాం
3) రాజ్యాంగ పరిషత్తు సభ్యులమైన మనం చర్చించి ఆమోదించి మనకు మనం
సమర్పించుకుంటున్నాం
4) ఏదీకాదు
19. ప్రియంబుల్ లేదా ప్రవేశికను రచన సంఘం ముందు ప్రవేశపెట్టినది ఎవరు?
1) బీఎన్ రావు
2) డా. బీఆర్ అంబేద్కర్
3) జవహర్లాల్ నెహ్రూ
4) వల్లభాయ్ పటేల్
20. రాజ్యాంగ ప్రవేశిక ఎన్నిసార్లు సవరించారు?
1) 1 2) 2 3) 3 4) 4
21. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభాతృత్వం రాజ్యంగం ముందుమాటలో తీసుకున్నారు. ఇందుకు ప్రేరణ ఇచ్చిన అంశం?
1) రష్యా విప్లవం
2) ఫ్రెంచ్ విప్లవం
3) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన
4) యూఎన్వో చార్టర్
22. కింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరైన అంశాలు?
1) ఇది న్యాయస్థానాల ద్వారా అమలు చేయరు
2) సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని ఇటీవల తీర్పు ఇచ్చింది
3) రెండు సార్లు సవరించారు
4) పైవన్నీ సరైనవే
23. ప్రవేశిక మొట్టమొదటిసారిగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు?
1) 24 2) 42 3) 44 4) ఏదీకాదు
24. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి?
1) రాజ్యాంగంలోని కొన్ని అంశాలు ఎంతో ముఖ్యమైనవి. వాటిని సవరించడం, రద్దుచేయడం కుదరదు
2) ప్రాథమిక హక్కులను రద్దు చేయరాదు
3) 368 ప్రకరణలో పేర్కొన్న విధంగా మినహా మరేవిధంగా రాజ్యాంగాన్ని సవరించకూడదు
4) రాజ్యాంగ పీఠికను సవరించకూడదు
25. ఏ కేసులో సుప్రీం కోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు, అని రూలింగ్ ఇచ్చింది?
1) బేరు బారీ కేసు
2) గోలక్‌నాథ్ కేసు
3) కేశవానంద భారత కేసు
4) పైవన్నీ
26. ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు’ అన్నది ఎవరు?
1) డా. బాబూ రాజేంద్రప్రసాద్
2) మహావీర్ త్యాగి
3) బీఆర్ అంబేద్కర్ 4) పాల్కీవాలా
27. ప్రవేశికకు సంబంధించి..
ఎ. దీన్ని న్యాయస్థానాల ద్వారా
అమలుపర్చవచ్చు
బి. రాజ్యాంగం ఏర్పర్చిన అమలుచేయాల్సిన లక్ష్యాలను తెలుపుతుంది
సి. రాజ్యాంగాన్ని చట్టపరంగా అన్వయించడంలో భాషాపరంగా సంశయం ఏర్పడినప్పుడు ప్రవేశిక తోడ్పడుతుంది
డి. రాజ్యాంగం ప్రజాధికారంపై ఆధారపడుతుందని ప్రకటిస్తుంది
పై వాటిలో సరైనవి
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) బి, సి, డి
28. ప్రవేశికలో పొందుపర్చిన కొన్ని ఆదర్శాలు మొదట ఎక్కడ పేర్కొన్నారు?
1) సంపూర్ణ స్వరాజ్ సందర్భంగా రావీనది ఒడ్డున నెహ్రూ ఉపన్యాసంలో
2) నెహ్రూ నివేదికలో
3) భారత కాంగ్రెస్ కరాచీ సమావేశంలో ఆమోదించిన ఒక తీర్మానంలో
4) రాజ్యాంగ సభ ఆమోదించిన లక్ష్యాల తీర్మానంలో
29. కింది వాటిలో ప్రవేశిక నుంచి స్పష్టంగా వెల్లడవుతున్న అంశాలు ఏవి?
1) రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది
2) సాధించాల్సిన ఆదర్శాలు
3) ప్రభుత్వ వ్యవస్థ
4) అధికారానికి ఆధారం
30. కింది వాటిలో భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న పదాల క్రమం ఏది?
1) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర
2) సామ్యవాద, లౌకిక, సర్వసత్తాక,
ప్రజాస్వామ్య, గణతంత్ర
3) లౌకిక, సర్వసత్తాక, ప్రజాస్వామ్య,
సామ్యవాద, గణతంత్ర
4) సర్వసత్తాక, ప్రజాస్వామ్య,
లౌకిక, సామ్యవాద, గణతంత్ర
31. అవతారిక రాజ్యాంగంలో భాగమా? కాదా? అనే అంశాన్ని విశదీకరించాల్సిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరితే..సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశిక (అవతారిక) రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ఏ కేసులో పేర్కొంది?
1) బేరుబారి
2) కేశవానంద భారతి
3) ఎస్సార్ బొమ్మై
4) మినర్వామిల్స్
32. ‘మన కలలు కన్న ఒక ఆదర్శ రాజ్యాంగం’ అనే భావనను రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంటుందని తెలిపింది ఎవరు?
1) మహావీర్ త్యాగి
2) డా. బీఆర్ అంబేద్కర్
3) కృష్ణస్వామి అయ్యర్
4) కేఎం మున్షీ
33. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక’ అనే పదాలను చేర్చారు?
1) 41 2) 42 3) 43 4) 44
34. కింది వాక్యాలను పరిశీలించండి?
ఎ. ప్రవేశిక అనేది భారత రాజ్యాంగ
తత్వాన్ని తెలుపుతుంది
బి. ప్రవేశికకు ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ అనే పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు
సి. భారత రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం- నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు,
లక్ష్యాల తీర్మానం
పై వాటిలో సరైనవి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
35. భారత రాజ్యాంగంలో ఆర్థిక న్యాయం అనే భావన ఎక్కడ పొందుపరిచారు?
1) ప్రవేశిక, ప్రాథమిక హక్కులు
2) ప్రవేశిక, ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
4) ఏదీకాదు
1) ఎ-1, బి-3, సి-2, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు