ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లలో నో చేంజ్
- పాత పద్ధతిలోనే సూపర్ న్యూమరరీ కోటాలో 10% సీట్లు
- స్పష్టత ఇచ్చిన ఉన్నత విద్యామండలి
ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లలో ఎలాంటి మార్పులేదని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టతనిచ్చారు. పాత పద్ధతిలోనే సూపర్న్యూమరరీ కోటా కింద 10శాతం సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మంగళవారం ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయించగా, కన్వీనర్ కోటా సీట్లకు అదనంగా 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను అమలుచేసినట్టు వెల్లడించారు. విద్యా, ఉద్యోగాల భర్తీలో భాగంగా రాష్ట్రంలో 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్నది. తొలిసారిగా నిరుటి నుంచి 10శాతం సీట్లను పెంచి భర్తీ చేపట్టగా, ఈ విద్యాసంవత్సరం కూడా అదే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
అయితే, అదనంగా సీట్లను పెంచకుండా.. ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను అమలుచేస్తున్నారన్న వార్తలొచ్చాయి. దాంతో రిజర్వ్డ్ కోటాలోని వారికి నష్టం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రిని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, పాత పద్ధతిలోనే మొత్తం సీట్లలో 10శాతం సీట్లను పెంచుతున్నామని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి గందరగోళానికి గురికానొద్దని కోరారు. పాత జీవో ప్రకారం.. ఎంసెట్లో 66వేలకు పైగా సీట్లుండగా, 6,600 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటాలో లభించనున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు