ఇంటర్ పుస్తకాలు ముందే ముద్రణ
-వచ్చే ఏడాది కూడా బుక్స్ రెడీ
– తెలుగు అకాడమీ ద్వారా ప్రింట్
-పూర్తయిన 1.80 లక్షల పుస్తకాలు
-వారం రోజుల్లో విద్యార్థుల చేతికి
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన పాఠ్యపుస్తకాలను ఇంటర్‌బోర్డు ముందే సిద్ధం చేసింది. తెలుగు అకాడమీ ద్వారా రెండేండ్ల పుస్తకాలను ఒకేసారి ముద్రించింది. ఈ ఏడాదితోపాటు వచ్చే విద్యాసంవత్సరానికి కావాల్సిన పాఠ్యపుస్తకాలను సైతం రెడీ చేసింది. ప్రతిఏటా 1.80 లక్షల పుస్తకాలను ప్రింట్ చేస్తుండగా, ఈ ఏడాది 3.60 లక్షల పుస్తకాలను ఒకేసారి ముద్రించింది. వారం పది రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించిన పుస్తకాలు విద్యార్థులకు అందనున్నాయి. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాలను నిల్వ ఉంచి, నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు అందజేస్తారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా న్యూస్ ప్రింట్ (పేపర్) సరఫరా ఆలస్యమై ఆ ప్రభావం పుస్తకాల ముద్రణపై పడింది. ఈ నేపథ్యంలోనే రెండేండ్లకు కావాల్సిన పుస్తకాలను ఈ సంవత్సరమే ముద్రించారు. ఇక నుంచి ఏడాది ముందుగానే పుస్తకాలను సిద్ధచేస్తారు.
15 వరకు ఫస్టియర్ ప్రవేశాలు
ఇంటర్ ఫస్టియర్‌లో ఇప్పటి వరకు 70,259 విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. గురుకులాల్లో మరో 22 వేల మంది చేరారని తెలిపారు. ఫస్టియర్‌లో ప్రవేశాలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించామని చెప్పారు. నిరుడు ప్రభుత్వ కాలేజీల్లో 84 వేల మంది విద్యార్థులు చేరారని గుర్తుచేశారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత మరింత మంది చేరుతారని పేర్కొన్నారు.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ గండం
ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ గండం తప్పేలా లేదు. బోర్డు పరిధిలో మొత్తంగా 2,168 కాలేజీలుంటే. ఈ ఏడాది 1,582 కాలేజీలు మాత్రమే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొన్నాయి. మరో 586 కాలేజీలు దరఖాస్తు చేయలేదు. 1,582 కాలేజీల్లో అంతా సవ్యంగా ఉన్న 786 కాలేజీలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపును జారీచేసింది. మరో 450 కాలేజీలకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ సమస్య కారణంగా అఫిలియేషన్లు ఇవ్వలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు