గ్రూప్ 2, 3పై టీఎస్పీఎస్సీ కసరత్తు
- ఆయా శాఖల అధికారులతో భేటీ
- ఇండెంట్లు సమర్పించాలని ఆదేశం
- త్వరలోనోటిఫికేషన్లిస్తామని వెల్లడి
తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది అసెంబ్లీలో ప్రకటించగా, అప్పటినుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తూనే ఉన్నది. ఐదు నెలల్లోనే 52,460 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా నియామక సంస్థలు ఇప్పటికే 19,359 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గత నెల 30న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్థికశాఖ ఆమోదించగానే
నియామక ప్రక్రియను చేపట్టాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
కసరత్తు ముమ్మరం
గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1,373 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయా శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 100 మంది అధికారులు తమ శాఖల పరిధిలోని ఖాళీలు, సమస్యల గురించి తెలిపారు. సర్వీ స్ రూల్స్, సవరణలు, క్లారిఫికేషన్లు, రోస్టర్ విధానం, ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతలు తదితర విషయాలన్నీ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వారికి వివరించారు. త్వరితగతిన గ్రూప్ 2,3 ఉద్యోగాలకు నోటిఫికేన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయాశాఖల అధికారులు పూర్తి ఇండెంట్లు సమర్పించాలని కోరారు.సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారానే టీచర్ పోస్టుల భర్తీ
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారానే భర్తీచేయనున్నారు. ఇదే అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు పలుమార్లు పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 10,500 టీచర్ పోస్టులను భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించా రు. ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. ఆర్థికశాఖ ఆమోదం లభించగానే పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు