ఏటా తగ్గుతున్న ఇంజినీరింగ్ సీట్లు
-
2014లో 1.87లక్షలున్న సీట్లు..
-
ఈ ఏడాది 1.11లక్షలకు కుదింపు
-
ఎనిమిదేండ్లల్లో రాష్ట్రంలో 76 వేలకు పైగా తగ్గిన సీట్లు
ఒకప్పుడు ఇంజినీర్ కావాలన్నది కల.. కానీ నేడు ఇంజినీరింగ్ అంటేనే వామ్మో అంటున్నారు. గతంలో అవకాశం లేక చాలామంది విద్యార్థులు అది కలగానే మిగిల్చికోగా, ఇప్పటి విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని వదులుకొంటున్నారు. దాంతో ఏటా ఇంజినీరింగ్ సీట్లు తగ్గుతున్నాయి. గత ఎనిమిదేండ్లలో 76 వేలకుపైగా సీట్లు తగ్గడం గమనార్హం. ఒకప్పుడు సీట్లు దొరకక విద్యార్థులు ఇబ్బందిపడేవారు. కానీ ఇప్పుడు కళాశాలలే విద్యార్థుల వద్దకు అడ్మిషన్ల కోసం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది సీట్లు కాస్త పెరగడం కొంత ఉపశమనం కలిగించినట్టెంది.
తగ్గుతున్న కాలేజీల సంఖ్య
2014లో మొత్తం 319 ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వీటిలో 1.87 లక్షల సీట్లుండేవి. కాలేజీల సంఖ్య తగ్గుతుండటంతో ప్రస్తుతానికి 1.11లక్షల సీట్లే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులంతా ఎన్బీఏ, న్యాక్ గుర్తింపు పొందిన కాలేజీలో చేరుతున్నారు. డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. అత్యధికులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రిక్రూట్మెంట్ల సౌకర్యం ఉన్న కాలేజీలనే ఎంపిక చేసుకొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కాలేజీల్లోనే చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు మూతపడుతున్నాయి.
కోర్సులకు డిమాండ్ అంతంతే
ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం ఐదారు కోర్సులకు మించి డిమాండ్ కనిపించడం లేదు. ఇంజినీరింగ్‌లో 45 కోర్సులున్నాయి. వీటిలో సీఎస్ఈ, దాని అనుబంధ కోర్సులు, కొత్తగా ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సుల్లోనే విద్యార్థులు చేరుతున్నారు. గతంలో ఐటీ కోర్సుకు తీవ్ర డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు సీఎస్ఈ హవాలో ఈ కోర్సు నామమాత్రమైంది. కొద్దిమేర డిమాండ్ ఉన్న ఈసీఈ, మెకానికల్, ఈఈఈ కోర్సులున్న పలు కాలేజీల్లో గతంలో 180 సీట్లుంటే ఇప్పుడు 30 సీట్లకు తగ్గిపోయాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు