యూపీఎస్సీలో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్
ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎట్టకేలకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)ను ప్రారంభించింది. భవిష్యత్తులో యూపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకొనే వారు ఈ ఓటీఆర్ ప్లాట్‌ఫాంపై రిజిస్టర్ చేసుకోవాలని సీనియర్ అధికారి ఒకరు సూచించారు. తద్వారా అభ్యర్థులు వివిధ రిక్రూట్మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రతిసారీ తమ వివరాలను పొందుపరచాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ ఓటీఆర్ ద్వారా అభ్యర్థులకు ఎంతో సమయం కలిసొస్తుందని, దరఖాస్తు ప్రక్రియ సులభమవుతుందని ఆ అధికారి తెలిపారు. తప్పులు దొర్లే అవకాశం కూడా ఉండదని పేర్కొన్నారు. ఓటీఆర్ కల నెరవేరిందని, అభ్యర్థుల వివరాలు కమిషన్ సర్వర్‌లో భద్రంగా ఉంటాయని వివరించారు.
Previous article
Free coaching for CSAT 2023
Next article
ఏటా తగ్గుతున్న ఇంజినీరింగ్ సీట్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు