ట్రిపుల్ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. మొత్తం 1,500 సీట్లకు 33,005 దరఖాస్తులు వచ్చాయి. 1,404 సీట్లు నిండాయి. ఈ జాబితాను సోమవారం వర్సిటీలో ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. మిగిలిన 96 సీట్లను స్పోర్ట్స్, పీహెచ్, క్యాప్‌తోపాటు 105 గ్లోబల్ క్యాటగిరి సీట్ల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఇన్చార్జి వీసీ తెలిపారు. మెరిట్ జాబితాలో 99 శాతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఎంపికయ్యారు. సీట్లు పొందినవారిలో బాలికలే అధికంగా ఉన్నారు.
జాబితాను admissions.rgukt.ac.inలో పెట్టారు. సీటు పొందిన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల వరకు దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాల్సి ఉంటుంది.
Previous article
నిట్‌లో 99 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
Next article
6,61,196 మందికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు