ఇంజినీరింగ్ కటాఫ్ ర్యాంకుల విడుదల
– గత ఏడాది వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి
– ఎంసెట్ హెల్ప్ లైన్ నంబర్లు 76600 09768/ 69
ఎంసెట్ అభ్యర్థుల సౌకర్యార్థం ఉన్నత విద్యామండలి మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది వివిధ ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన కటాఫ్ ర్యాంకుల వివరాలను https:// www.tsche.ac.in వెబ్సైట్లో పొందుపరిచింది. ఆ కాలేజీల్లో నిరుడు భర్తీ అయిన కోర్సులు, క్యాటగిరీ, రిజర్వేషన్ల వారీగా కటాఫ్ ర్యాంకులతోపాటు, ట్యూషన్ ఫీజుల వివరాలను సైతం వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంజినీరింగ్‌తోపాటు, ఐసెట్, ఈసెట్, పాలిసెట్ కటాఫ్ ర్యాంకుల వివరాలను సైతం వెబ్సైట్లో ఉంచారు. వీటిని పరిశీలించి, విద్యార్థులు తమ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనాకు రానొచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబా ద్రి తెలిపారు. విద్యార్థులు కాలేజీలు, కన్సల్టెన్సీల చుట్టూ తిరిగి అవస్థ పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు సైతం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
రెండు హెల్ప్ లైన్లు
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల సందేహాల నివృత్తికి ఉన్నత విద్యామండలిలో రెండు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే విద్యార్థులు 76600 09768/ 69 నంబర్లను సంప్రదించాలని ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు