రాజ్యాంగ పరిషత్ న్యాయసలహాదారుడు ఎవరు?
భారత రాజ్యాంగం… దేశ పరిపాలనకు ఇది ఆది గ్రంథం. దీని రచన, కమిటీలు, పఠనాలు, సభ్యుల వివరాలు ఎంతో ముఖ్యం. దేశంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ఇది తప్పనిసరి అంశం. రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేక వ్యాసం…
భారత రాజ్యాంగ పరిషత్
– ప్రపంచంలోని మొదటి రాజ్యాంగసభ అమెరికా దేశంలో ఏర్పడిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ఇది క్రీ.శ.1787లో ఏర్పడింది. అమెరికాలో రాజ్యాంగ రచన 1787, మే 25 నుంచి 1787 సెప్టెంబర్ 17 వరకు చేశారు.
– భారతదేశంలో మొదటిసారి 1918 డిసెంబర్లో ఢిల్లీలో భారత జాతీయ కాంగ్రెస్ స్వయంనిర్ణయాధికార తీర్మానం చేసింది.
– 1927లో లార్డ్ బిర్కెన్‌హెడ్ సవాలును స్వీకరించి 1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాం రచనా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను నెహ్రూ రిపోర్టు అంటారు.
– 1934లో మానవేంద్రనాథ్ రాయ్ తమ రాజ్యాంగాన్ని తామే తయారుచేసుకునే రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని ప్రకటించాడు.
– 1936 ఏప్రిల్ 12లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఫైజాపూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి డిమాండ్ చేసింది.
– 1938లో జవహర్‌లాల్‌నెహ్రూ సార్వజనీన వయోజన ఓటుహక్కు ద్వారా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు.
– భారతీయులకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని 1942లో సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ మొదటి సారిగా ప్రతి పాదన చేశాడు.
– జాతిపిత మహాత్మాగాంధీ 1922లో యంగ్ ఇం డియా పత్రికలో భారతదేశ రాజకీయ భవిష్యత్ భారతీయులే స్వయంగా తేల్చుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం అనేది బ్రిటీష్‌వారు ఇచ్చే భిక్ష కాదు అన్నాడు. అంటే దీని అర్థం మన రాజకీయ అధికారాన్ని మనమే తేల్చుకోవాలి.
– మహాత్మాగాంధీ హరిజన్ అనే పత్రికలో 1939లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి డిమాండ్ చేశాడు.
– బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి రావడంతో 1946లో అనాటి బ్రిటీష్ ప్రధాని మంత్రి త్రయ రాయబారాన్ని ప్రకటించాడు. దీన్నే క్యాబినెట్ మిషన్ప్లాన్ అంటారు. ఇందులో సభ్యులు..
1. పెథిక్స్ లారెన్స్ 2. సర్స్ట్రాఫర్డ్ క్రిప్స్ 3. ఏవీ అలెగ్జాండర్
– క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకు 1946 జూలై -ఆగస్టు నెలలో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.
రాజ్యాంగ పరిషత్ నిర్మాణం
1. 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున ప్రాతినిథ్యం కల్పించారు.
2. స్వదేశీ సంస్థానాలు, చీఫ్ కమిషనర్ ప్రాంతాలకు రాజ్యాంగ పరిషత్‌లో ప్రాతినిథ్యం కల్పించారు.
3. రాజ్యాంగ పరిషత్‌కు పరోక్షంగా, దామాషా పద్ధతిలో ప్రాతినిథ్యం కల్పించారు.
4. రాజ్యాంగ పరిషత్‌లో 3 రకాల సభ్యులు మొత్తం 389 మంది సభ్యులకు ప్రాతినిథ్యం కల్పించారు.
ఎ. బ్రిటీష్ పాలిత ప్రావిన్సుల (రాష్ర్టాలు) నుంచి 292 మంది పరోక్షంగా ఎన్నికయ్యారు.
బి. స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.
సీ. చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అనగా ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బెలూచిస్థాన్ ప్రాంతాల నుంచి నలుగురు సభ్యులను తీసుకున్నారు.
6. రాజ్యాంగ పరిషత్‌లో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి 208 మంది, ముస్లిం లీగ్ నుంచి 73 మందికి ప్రాతినిథ్యం కల్పించారు.
7. రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి తిరిగి రాజ్యాంగ పరిషత్‌కు నామినేట్ అయినవారు – ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.
8. రాజ్యాంగ పరిషత్‌కు నామినేట్ అయిన సభ్యుల సంఖ్య : 15
9. రాజ్యాంగ పరిషత్‌లో మహిళలు – 15 మంది.
10. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన ప్రముఖులు – నీలం సంజీవరెడ్డి, వీసీ కేశవరావు, ఎం సత్యనారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, ఎన్జీ రంగా, దుర్గాబాయి దేశ్‌ముఖ్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మోటూరి కృష్ణారావు, బొబ్బిలి రాజా, రామకృష్ణ రాజన్.
11. జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్‌లో సభ్యుడు కాదు.
రాజ్యాంగ పరిషత్ సమావేశాలు
ప్రథమ సమావేశం
-మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 నుంచి 23 వరకు ప్రస్తుత పార్లమెంట్ సెంట్రల్ హాల్ (న్యూఢిల్లీ)లో జరిగింది.
– ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని అనుసరించి జేబీ కృపాలాని సూచన ఆధారంగా రాజ్యాంగ పరిషత్‌లో వయస్సులో పెద్ద అయిన డా. సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడు – ఫ్రాంక్ ఆంథోని
– డిసెంబర్ 11, 1946లో రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగాడా. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
– రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు – హెచ్‌సీ ముఖర్జీ, వీటీ కృష్ణమాచారి
– రాజ్యాంగ పరిషత్ న్యాయ సలహాదారుడు – బెనగల్ నర్సింగరావు
– రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి – హెచ్వైఆర్ అయ్యంగార్
– రాజ్యాంగ పరిషత్ ప్రైవేట్ కార్యదర్శి – ఎబెల్
– రాజ్యాంగ పరిషత్‌లో డిసెంబర్ 13న 1946లో జవహర్లాల్ నెహ్రూ 7 అంశాలతోకూడినల క్ష్యాలు, ఆశయా ల తీర్మానం ప్రవేశపెట్టాడు.
రెండో సమావేశంలో
– లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జనవరి 22, 1947లో రాజ్యాంగ పరిషత్ ఆమోదంతో ప్రవేశికగా అముల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్ మొత్తం 11 సమావేశాలు నిర్వహించింది.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ
-రాజ్యాంగ ముసాయిదా కమిటీని 29 ఆగస్టు 1947న ఏర్పాటు చేశారు. ఇది అతి ముఖ్యమైన కమిటీ. దీనికి చైర్మన్ డా. బీఆర్ అంబేద్కర్.
సభ్యులు..
1. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్
2. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
3. కేఎం మున్షీ
4. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా
5. బీఎల్ మిట్టల్ (మిట్టల్ అనారోగ్యంతో ఎన్ మాధవరావు నియామకం)
6. డీపీ ఖైతాన్ (ఇతని మరణంతో వీటీ కృష్ణమాచారి నియామకం)
– రాజ్యాంగ ముసాయిదాకు ఎస్ఎన్ ముఖర్జీ డ్రాప్ట్మెన్గా వ్యవహరించాడు.
– ముసాయిదా కమిటీ అండర్ సెక్రటరీ కేవీ పద్మనాభ.
– ఎన్ మాధవరావు, సయ్యద్ సాదుల్లా రాజ్యాంగ రచనలో ఎలాంటి ప్రత్యేక పాత్ర లేనందున వారు క్రమం తప్పకుండా హాజరుకావడం వలన వీరిని కోరమ్ పిటి సభ్యులు అంటారు.
– రాజ్యాంగ ముసాయిదా కమిటీని తాను రూపొందించిన ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా 21 ఫిబ్రవరి 1948లో సమర్పించింది.
– ముసాయిదా రాజ్యాంగంలో 315 నిబంధనలు 8 షెడ్యూళ్లతో రూపొందించారు.
– రాజ్యాంగ పరిషత్‌లో మొదటి పఠనం నవంబర్ 4, 1948 నుంచి నవంబర్ 9 1948 వరకు జరిగింది.
– రెండో పఠనం 1948 నవంబర్ 15 నుంచి 1949, అక్టోబర్ 17 వరకు జరిగింది.
– రాజ్యాంగ పరిషత్‌లో మూడో పఠనం నవంబర్ 14, 1949 నుంచి నవంబర్ 26, 1949 వరకు జరిగింది.
– 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది.
క్యాబినెట్ మిషన్ ప్లాన్-1946
-బ్రిటీష్ ప్రధాని లార్డ్ అట్లీ (లేబర్ పార్టీ) భారతీయులకు స్వాతంత్య్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ముగ్గురు సభ్యులతో 1946 మార్చి 23న బ్రిటీష్ పార్లమెంట్లో ప్రకటన చేశాడు.
మంత్రిత్రయ రాయబారంలోని సభ్యులు
A. లార్డ్ పెథెక్ లారెన్స్
B. సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్
C. ఏవీ అలెగ్జాండర్
-ఈ కమిటీ 1946 మే 16న తన ప్రతిపాదనలు ప్రకటించింది.
సిఫారసులు: భారతదేశ పరిపాలన నిర్వహించడం కోసం 14 మందితో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది.
– రాజ్యాంగపరిషత్‌లో 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున ప్రాతనిథ్యం కల్పించబడుతుంది.
– ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పాటు చయడం.
– పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతం సాధ్యం కాదు.
– 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్‌కు పరోక్షంగా ఎన్నికలు నిర్వహించారు.
– 1946 సెప్టెంబర్ 2న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
– బ్రిటన్ ప్రధాని లార్డ్ క్లిమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న బ్రిటన్ దిగువ సభలో ఒక ప్రకటన చేస్తూ 1948 జూన్ వరకు భారతదేశం నుంచి బ్రిటీష్ ప్రభుత్వం వైదొలుగుతుందని ప్రకటన చేశారు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు.
– లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3, 1947లో భారతదేశ విభజన చట్టం ప్రకటించారు.
– లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందింది. పాకిస్తాన్ మొదటి అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా, మొదటి ప్రధాని లియాఖత్ అలీఖాన్.
– భారతదేశం 1947 ఆగస్టు 14 రాత్రి (15 తెల్లవారుజామున) స్వాతంత్య్రం పొందింది.
– 1946 డిసెంబర్ 9న భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడగా 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. 1950 జనవరి 26న రాజ్యంగం అమల్లోకి వచ్చింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు