ఫిజికల్, ఆర్ట్స్‌లో నాలుగేండ్ల కొత్త కోర్సులు
# త్వరలో బీఈడీ తరహాలో అందుబాటులోకి
# డీఈడీ, బీఈడీ కాలేజీల్లో మల్టీడిసిప్లినరీ విధానం
# టీచర్ ఎడ్యుకేషన్‌లో ఎన్సీటీఈ సంస్కరణలు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ విద్య (టీచర్ ఎడ్యుకేషన్)లో మరిన్ని సంస్కరణల దిశగా అడుగులేస్తున్నది. ఇప్పటికే ఎన్సీటీఈ నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు విడతలవారీగా అనుమతులిస్తున్నది. కొత్తగా నాలుగేండ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకు 2030 సంవత్సరాన్ని గడువుగా నిర్దేశించుకొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ, బీపీఈడీ కోర్సులను అమలుచేస్తున్నారు. ఈ కొత్త విధానం అమలుతో మూడేండ్ల డిగ్రీ, రెండేండ్ల బీఈడీనీ నాలుగేండ్లకే పూర్తిచేయడం ద్వారా ఏడాది సమయం ఆదా అవుతున్నది. నాలుగేండ్ల బీఈడీలో భాగంగా బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ పేరుతో సర్టిఫికెట్లను అందజేస్తారు. నాలుగేండ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తిచేసినవారికి బీఏ బీపీఈడీ, బీఎస్సీ బీపీఈడీ, బీకాం బీపీఈడీ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఆర్ట్ ఎడ్యుకేషన్ వారికి ఇచ్చే సర్టిఫికెట్లపై ఎన్సీటీఈ త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నది.
మల్టీ డిసిప్లినరీ విధానం
డీఈడీ, బీఈడీ కాలేజీల్లో మలీ ్టడిసిప్లినరీ విధానం అమలుకు ఎన్సీటీఈ నిర్ణయించింది. 2030లోపు క్రమంగా మల్టీ డిసిప్లినరీ కాలేజీలుగా మార్చాలని భావిస్తున్నది. ఈ విధానంలో బీఈడీ, డీఈడీ కాలేజీల్లో ఆర్ట్, సైన్స్, కామర్స్ కోర్సులను ప్రవేశపెడతారు. వీటి విధివిధానాల ఖరారుకు ఇటీవలే నిపుణుల కమిటీని నియమించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు