కన్యాకుమారి అగ్రం వద్ద పీడనం ఎంత ? ( ఇండియన్ జాగ్రఫీ)
భారతదేశ శీతోష్ణస్థితి
-వాతావరణం అంశాలపై ఉష్ణోగ్రత, పీడనం, ఆర్ధత, అవపాతం, పవన వేగం వంటి వాటిని స్వల్పకాలానికి పరిగణించినట్లయితే దానిని వాతావరణ పరిస్థితి (Weather Condition) అంటారు.
– ఒక ప్రదేశంలోని దీర్ఘకాల వాతావరణ పరిస్థితుల సగటును శీతోష్ణస్థితి (Climate) అంటారు.
– భారత వాతావరణ శాఖ (IMD) 30 సంవత్సరాల వాతావరణ పరిస్థితులను లెక్కించి భారత శీతోష్ణస్థితిని నిర్ధారించారు.
– 26 డిగ్రీల అక్షాంశం వద్ద గల జైసల్మేర్ 12 సెం.మీ. వార్షిక వర్షపాతాన్ని పొందుతుంది.
– 25 డిగ్రీల అక్షాంశం వద్దగల మాసిన్రామ్ 1187 సెం.మీ. వార్షిక వర్షపాతం పొందుతుంది.
-34 డిగ్రీల అక్షాంశం వద్దగల లేహ్ (లడఖ్)లో 5 సెం.మీ. వర్షపాతం మాత్రమే కురుస్తుంది.
-లడఖ్ ముఖద్వారం (Gateway to Ladakh)గా పిలిచే ద్రాస్‌లో -450C ఉష్ణోగ్రత నమోదవుతుండగా, పశ్చిమ రాజస్థాన్‌లోని ‘చురు’ ప్రాంతంలో 500C వరకు నమోదవుతుంది.
-భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత వ్యత్యాసం ‘గ్రేట్ నికోబార్’ వద్ద నమోదవుతుంది.
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలు
1) ఉనికి (Location)
– అక్షాంశపరంగా 804| ఉత్తర అక్షాంశం నుంచి 3706| అక్షాంశాల మధ్య విస్తరించడంవల్ల కర్కాట రేఖకు దిగువనగల ప్రాంతం ఉష్ణమండలంలోను, ఎగువనగల భాగం సమశీతోష్ణ మండలంలోను ఉంది.
2) భూమి, నీరు విస్తరించి ఉండటం (Distribution of Land and Water)
-ద్వీపకల్ప పీఠభూమికి మూడువైపులా నీరు ఉండటం భారతదేశ శీతోష్ణస్థితులపై గణనీయ ప్రభావాన్ని కలిగి ఉంది.
– రుతుపవనాల ఆవిర్భావానికి, సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితులను కలిగి ఉండటానికి, అయనరేఖా చక్రవాతాలు ఏర్పడటానికి కారణమవుతుంది.
3) సముద్రం నుంచి దూరం (Distance from the Sea)
– తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తక్కువగా ఉండి, అధిక వర్షపాతాన్ని పొందుతూ, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితిని (Maritime Climate) కలిగి ఉంటాయి.
సముద్రానికి దూరంగా ఉన్న ఢిల్లీ, నాగ్‌పూర్, హైదరాబాద్ లాంటి నగరాలు అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలను నమోదు చేస్తూ తక్కువ వర్షపాతాన్ని కలిగి ఖండాంతర్గత శీతోష్ణస్థితి (Extreme Climate)ని కలిగి ఉంటాయి.
4) హిమాలయ పర్వతాలు
నైరుతి రుతుపవనాలను అడ్డుకొని ఉత్తర భారతదేశ మైదానాల్లో వర్షం కురవడానికి, సైబీరియా నుంచి వచ్చే శీతల గాలులను అడ్డుకోవడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
5) ఎత్తు (Altitude)
ఎత్తు పెరిగే కొద్ది పీడనం, ఉష్ణోగ్రతలు తక్కువ అవుతాయి.
11 డిగ్రీల అక్షాంశం వద్దగల ఊటీ (2240 మీ.), కోయంబత్తూరు (411 మీ.) పట్టణాలు వరుసగా 130C, 26.80C జనవరి ఉష్ణోగ్రతలు నమోదు చేస్తాయి. కారణం ఎత్తులో తేడాలు ఉండటం వల్లనే.
6) పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, తూర్పు హిమాలయాలు, ఉత్తర భారతదేశ మైదానాలు అన్ని కూడా వివిధ రకాలుగా శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి.
పశ్చిమతీర మైదానాల్లో పర్వతీయ వర్షపాతం (Orographic Rainfall) కురవడానికి, షిల్లాంగ్ పీఠభూమి వర్షాఛాయ ప్రాంతం (Rain Shadow Region) కావడానికి ఈ నిమ్నోన్నతాలే కారణం.
7) ప్రపంచ పవనాలు (Planetary Winds)
భారతదేశం సహజంగా శుష్క ఈశాన్య వ్యాపార పవనాల మేఖల (Dry North East Trade Wind Zone)లో ఉంది.
జూన్ నెలలో ఆగ్నేయ వ్యాపార పవనాలు నైరుతి రుతుపవనాలుగా రూపాంతం చెంది వర్షగమనానికి కారణమవుతాయి.
lశీతాకాలంలో నైరుతి పశ్చిమ పవనాలు వాయవ్య భారతంలోకి ప్రవేశించి పశ్చిమ విక్షోభాలకు కారణం (Western Disturbances) అవుతాయి.
8) జెట్ స్ట్రీమ్స్
ట్రోపో ఆవరణ పైభాగంలో (9-13 కి.మీ.) అత్యంత వేగంగా వీచే వాయురాశులను జెట్ స్ట్రీమ్స్ అంటారు.
శీతాకాలంలో పశ్చిమ జెట్ స్ట్రీమ్స్, నైరుతి రుతుపవన కాలంలో తూర్పు జెట్ స్ట్రీమ్స్ ప్రభావానికి భారతదేశం లోనవుతుంది.
పై అంశాలే కాకుండా టిబెట్ పీఠభూమి, ఎల్‌నినో, లానినో, సోమాలియా ప్రవాహం, హిందూ మహాసముద్ర ద్వయాంశ స్థితి (Indian Ocean Dipole) మొదలైనవి భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.
శీతోష్ణస్థితిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే కొన్ని భావనలు
1) సూర్యుడి గమనం
డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం సూర్యుడు మకర రేఖ మీద ప్రకాశిస్తూ, భారతదేశానికి దూరంగా ఉండటం.
మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం సూర్యుడు 160C అక్షాంశం వద్ద ప్రకాశిస్తూ ఉండటమే.
2) కొరియాలిసిస్ ఎఫెక్ట్
స్వభావికంగా కదిలే పవనాలు, సముద్ర ప్రవాహాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపునకు వంగి ప్రయాణిస్తాయి. దీన్నే కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటారు.
దీనివల్లనే ‘ఆగ్నేయ వ్యాపార పవనాలు’ భూమధ్య రేఖను దాటగానే కుడివైపునకు వంగి నైరుతి రుతుపవనాలుగా రూపాంతం చెందుతాయి.
‘ఈశాన్య వ్యాపార పవనాలు’ భూమధ్య రేఖను దాటి వాయవ్య రుతుపవనాలు రూపాంతరం చెంది ఆస్ట్రేలియా ఖండం ఉత్తర భాగాన్ని చేరుకుంటాయి.
3) పీడనం (పీడన మండలాలు)
వాతావరణ అంశాల్లో అత్యంత అస్థిరమైన అంశం పీడనం.
150C ఉష్ణోగ్రత, 450 అక్షాంశం వద్ద, 0 మీటర్ల ఎత్తులో కొలిచిన పీడనాన్ని సామాన్య వాతావరణ పీడనంగా గుర్తించారు. దాని విలువ 1013.25 మిల్లీబార్ లేదా 76 మీ. లేదా 29.92 అంగుళాలుగా గుర్తించారు.
వాతావరణ పీడనాన్ని ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా పీడనంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
ఉదాహరణకు వేసవికాలంలో వాయవ్య భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అల్పపీడనం నమోదు చేస్తాయి. శీతాకాలంలో ఉత్తరానగల శీతల పరిస్థితులవల్ల అధిక పీడనాన్ని నమోదు చేస్తాయి. పవనాల దిశను, పవన వేగాన్ని కూడా పీడన అంశాలే ప్రభావితం చేస్తాయి.
4) అంతర అయనరేఖా అభిసరణ (Inter Tropica Convergence Zone-ITCZ)
ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలుసుకొనే అల్పపీడన ప్రాంతాన్ని అంతర అయనరేఖా అభిసరణ ప్రాంతం అంటారు.
ఇది ఎల్లప్పుడూ సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూ, కదులుతూ ఉంటుంది.
అంటే మార్చి 21 నాడు భూమధ్య రేఖ వద్ద, జూన్ 21 నాడు కర్కట రేఖ వద్ద, డిసెంబర్ 22 నాడు మకర రేఖ వద్ద కేంద్రీకృతం అవుతుంది.
5) జెట్ స్ట్రీమ్స్
23 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యగల ఉప అయన రేఖ అధిక పీడన మండలం నుంచి భూమధ్యరేఖ అల్పపీడన మండలం వైపునకు వీచే పవనాలను వ్యాపార పవనాలు (Trade Winds) అంటారు.
భూమధ్య రేఖ వద్ద ఈ పవనాలు పైకి లేచి వర్షాన్ని ఇస్తాయి. పైకి లేచిన ఈ గాలులు చల్లబడి మళ్లీ రెండుగా విడిపోయి వ్యాపార పవనాలకు వ్యతిరేక దిశలో ట్రోపో ఆవరణం పై భాగాన వీస్తాయి. ఇవి చల్లబడి, అధిక వేగంగా, అతి తక్కువ ఆర్ధతను కలిగి ఉంటాయి. వీటినే జెట్ స్ట్రీమ్స్ అంటారు.
ఇవి శీతాకాలంలో గంటకు 184 కి.మీ. వేగాన్ని కలిగి ఉంటే వేసవి కాలంలో 110 కి.మీ. వేగాన్ని కలిగి ఉంటాయి.
తూర్పు జెట్ స్ట్రీమ్స్ నైరుతి రుతుపవనాలకు కారణం అవుతుంటే, పశ్చిమ జెట్‌స్ట్రీమ్స్ ఈశాన్య రుతుపవనాలకు కారణం అవుతున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం భారతదేశ శీతోష్ణస్థితిని నాలుగు రుతువులుగా విభజించారు.
1) శీతాకాలం (Winter)- డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి
2) వేసవికాలం (Summer)- మార్చి, ఏప్రిల్, మే
3) నైరుతి రుతుపవనకాలం (S-W Monsoon)- జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్
4) ఈశాన్య రుతుపవనకాలం (N-E Monsoon/ Autumn)- అక్టోబర్, నవంబర్
1) శీతాకాలం (The season of Land Monsoon)
ఎ) ఉష్ణోగ్రత: డిసెంబర్, జనవరి నెలలు దేశం మొత్తానికి అతి తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేస్తాయి.
వాయవ్య ప్రాంతంలో 150 కంటే తక్కువ సగటు నెల ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి. అప్పుడప్పుడు ఘనీభవన స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఫలితంగా చల్లని, పొడి వాతావరణ పరిస్థితులు, స్థిరత్వం గల గాలి, నిర్మల ఆకాశం వంటి పరిస్థితులు
ఏర్పడుతాయి.
దేశ ప్రధాన భూభాగం మొత్తం ప్రతి చక్రవాత పరిస్థితులు (Anticyclone) ఉంటాయి.
ద్వీపకల్ప ప్రాంతంలో 200C నుంచి 250C వరకు నెల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కర్కట రేఖకు సమాంతరంగా 200C సమ ఉష్ణోగ్రత (Isotherm) రేఖ గీస్తారు.
సముద్ర ప్రభావం, భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంవల్ల ద్వీపకల్ప పీఠభూమిలో శీతాకాలం ప్రభావం ఉండదు.
తిరువనంతపురంలో జనవరి సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 310C, జూన్‌లో 29.50C ఉంటాయి. తూర్పు తీరం కంటే పశ్చిమ తీరంలో 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
భారతదేశంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ద్రాస్ పట్టణంలో 1908, డిసెంబర్ 28 నాడు -450C నమోదయ్యింది.
ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం
1) సూర్యుడికి దూరంగా ఉండటం, ఏటవాలు కిరణాలు పడటం
2) సముద్ర ప్రభావానికి దూరంగా, ఖండాంతర్గత ప్రాంతంలో ఉండటం
3) సైబీరియా ప్రాంతపు శీతలగాలుల ప్రభావం
4) హిమాలయ పర్వత ప్రాంతాల్లో (హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్) కురిసే దట్టమైన పొగమంచుతో కూడిన హిమపాతం అయిన ‘మహవత్’ వల్ల శీతల ప్రవాహాలు ఏర్పడటం
5) ద్రాస్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడానికి పై కారణంతోపాటు 3230 మీ. ఎత్తులో ఉండటం కారణం
6) దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు జనవరిలో నమోదు కాగా, ఉత్తర భారత్ నుంచి దక్షిణ భారత్‌కు పోయిన కొద్ది పెరుగుతుంది.
బి) పీడనం, పవనాలు (Pressure, Winds) : వాయవ్య ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఆర్ధత ఉండటంవల్ల అత్యధిక పీడనం నమోదవుతుంది.
ఇక్కడ 1019 మిల్లీ బార్ల పీడనం నమోదు కాగా, దక్షిణాన కన్యాకుమారి అగ్రం వద్ద 1013 మిల్లీబార్ల పీడనం నమోదవుతుంది.
పవనాలు వాయవ్య అధిక పీడనం, ఈశాన్య అధిక పీడనం నుంచి దక్షిణం వైపునకు వీస్తాయి.
పీడన ప్రమాణత (Pressure Gradient) తక్కువ కాబట్టి పవన వేగం గంటకు 3 నుంచి 5 కి.మీ. ఉంటుంది.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు