నల్లరేగడి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? (జనరల్ స్టడీస్)
167. జతపరచండి
ఎ. సున్నపు రాయి 1. కాల్షియం ఆక్సైడ్
బి. పొడి సున్నం 2. కాల్షియం హైడ్రాక్సైడ్
సి. తడి సున్నం 3. కాల్షియం కార్బొనేట్
డి. ఎముకల్లోని కాల్షియం 4. కాల్షియం పాస్ఫేట్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
168. నిశ్చితం (ఎ)- జీవుల్లో ప్రొటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేయడం అనేది జీర్ణ సంబంధమైన ప్రక్రియ
కారణం (ఆర్)- గ్లూకోజ్‌ను CO2, H2Oలు గా విచ్ఛిన్నం చేయడం శ్వాస సంబంధ క్రియ
1) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, (ఎ) కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) సరైనది కానీ (ఆర్)కు సరైనది కాదు
4) (ఎ) సరైనది కాదు కానీ (ఆర్) సరైనది
169. మార్బుల్ రసాయన సంకేతం
1) Na2CO3 2) CaCO3
3) MgCO3 4) K2CO3
170. అత్యంతముగా చల్లబడిన ద్రవం
1) టెఫ్లాన్ 2) పాదరసం
3) గ్లాసు 4) ఐస్-క్రీం
171. కింది వాటిలో దేనికి సరిహద్దులు పరిమితమై ఉండవు
1) బయోస్ఫియర్ రిజర్వు
2) కాలనీ పార్కు
3) జాతీయ పార్కు 4) అభయారణ్యం
172. హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా అనుసంధానించిన క్రమంలో ఆధారాలను అమర్చండి?
ఎ. వాతావరణం బి. జీవావరణం
సి. జలావరణం డి. శిలావరణం
1) ఎ, బి, సి, డి 2) సి, ఎ, డి, బి
3) డి, ఎ, బి, సి 4) బి, సి, డి, ఎ
173. కింది వాటిలో సరైనది ఏది?
i. అంగారక, గురు గ్రహాల మధ్య ఉండేవి ఆస్టరాయిడ్స్
ii. తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేసే గ్రహం వరుణుడు
iii. అతి శీతల గ్రహం నెఫ్ట్యూన్
1) i, ii 2) ii, iii
3) i, ii, iii 4) iii
174. జతలను పరిశీలించండి
పరిశ్రమ/ప్రాజెక్టు రాష్ట్రం/ప్రదేశం
ఎ. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి 1. కర్ణాటక
బి. భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమకు ఆది 2. సూరత్
సి. భారతదేశంలో అత్యధికముడి మైకా ఉత్పత్తి రాష్ట్రం 3. ఆంధ్రప్రదేశ్
డి. భారతదేశంలో మొట్టమొదటి జనపనార కర్మాగారం ప్రారంభమైన ప్రదేశం 4. రిష్రా
సరైన జతలను లేదా జవాబులు ఎంపిక చేయండి.
1) ఎ, బి, సి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
175. i. ప్రచ్ఛాయ- భూమి చీకటి భాగంలో ఉండే ప్రాంతం
ii. పాక్షిక ఛాయ – ప్రచ్ఛాయ చుట్టూ ఉన్న భాగం పాక్షిక ఛాయ
1) i 2) ii 3) i, ii 4) ఏవీకావు
176. కింది పేర్కొన్న సాగునీటి పథకాల్లో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి?
ఎ. చనాకా-కొరాటా ప్రాజెక్టు (నిర్మాణంలో ఉన్నది)
బి. మత్తడి వాగు ప్రాజెక్టు
సి. నీల్వాయి ప్రాజెక్టు
డి. సదర్మత్ ప్రాజెక్టు
ఇ. సాత్నాలా ప్రాజెక్టు
1) ఎ, బి, డి, ఇ 2) ఎ, బి, ఇ
3) సి, డి, ఇ 4) ఎ, బి, సి
177. జతపరచండి
ఎ. అంతర్భాగం 1. లోయలు ఉన్న నదీజలం
బి. సన్నని లోతైన భూతలం 2. సరస్సు
సి. సముద్రాంతర్భాగంలోని ఎత్తైన కొండలు 3.రిడ్జ్
డి. రెండు జల భాగాలను వేరుచేసేది 4. భూసంధి
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-2, సి-3, డి-1
178. కింది వాటిలో సరైనవి
1. భంగర్ : పాత ఒండ్రు మట్టితో నిక్షిప్తమైన సారవంతమైన నేలలు
2. బాబర్ : సింధూ – తీస్తా నదుల మధ్యగల శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉండును
1) 1 2) 2 3) 1, 2 4) ఏవీకావు
179. పశ్చిమ కనుమల జీవవైవిధ్య హాట్‌స్పాట్‌కు సంబంధించి ఏది నిజమైనది కాదు?
1) పశ్చిమ కనుమల ప్రాంతం 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది
2) ఇది అత్యంత సంపద గల స్థానీయ జాతుల కేంద్రం
3) లయన్-టేల్ మకాక్యూ, మలబార్ గ్రే హార్న్‌బిల్ ఇక్కడ లభించే అరుదైన జంతుజాలం
4) పశ్చిమ కనుమలపై ఎకాలజీ నిపుణుల మాధవ్ గాఢ్గిల్ నాయకత్వం వహించారు
180. కింది వాటిలో భిన్నమైనది ఏది?
1) శబరి 2) సీలేరు
3) ప్రాణహిత 4) కొయన
181. కింది వాటిలో సరికాని జత?
1) అరటి పరిశోధన కేంద్రం – తిరుచునాపల్లి
2) నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ – ఆనంద్
3) తేయాకు పరిశోధన కేంద్రం – జోర్హాట్
4) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చి – బెంగళూరు
182. కింది వాటిలో సరైనది ఏది?
1. భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ గల రాష్ట్రం రాజస్థాన్
2. అతిపెద్ద అంతర్భూభాగ నది ఘగ్లర్
3. స్టాల్ రావర్ అని లూనీ నదికి పేరు
1) 1 2) 2, 3
3) 1, 3, 2 4) 1, 3
183. కింది వాటిని జతపరచండి
ఇనుప గనులు రాష్ట్రాలు
1. ఢిల్లీ రాజ్హరా ఎ. ఒడిశా
2. సింగభం బి. కర్ణాటక
3. మయూరంజ్ సి. ఛత్తీస్‌గఢ్
4. కుద్రేముఖ్ డి. జారండ్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
184. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఏఏ మొట్రోపాలిటన్ నగరాలను కలుపుతుంది.
1) ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్, ముంబై
2) కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్
3) ముంబై, భోపాల్, భువనేశ్వర్, కోల్‌కతా
4) ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై
185. నల్లరేగడి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) అసోం 2) బీహార్
3) పంజాబ్ 4) మహారాష్ట్ర
186. వ్యవసాయ రంగంలో భూసంస్కరణలు అమలు చేయడానికి ముందున్న కౌలుదారులు
1) శాశ్వత కౌలుదారులు
2) తాత్కాలిక కౌలుదారులు
3) ఉప కౌలుదారులు
4) పై వారందరూ
187. అమర్త్యసేన్ పేదరిక సూచీ అంచనాలకు ఆధారం వీటిలో అసమానతలు
1) వినియోగ వ్యయాలు 2) ఆదాయాలు
3) ఆహార కేలరీల శక్తి
4) వినియోగ వస్తువులు
188. భారత జాతీయ వ్యవసాయ విధానం (1993) ముఖ్య ఉద్దేశం ప్రచ్ఛన్న నిరుద్యోగితను తగ్గించటం, మరొకటి?
1) వ్యవసాయ కమతాలు సమీకరించడం
2) వ్యవసాయ ఎగుమతులు పెంపొందించటం
3) వ్యవసాయ సబ్సిడీలను పెంచడం
4) వ్యవసాయ రంగాన్ని సంఘటితంగా మార్చుట
189. కిశోర శక్తి యోజనకు సంబంధించి కింది వివరణలతో సరైనవి ఏవి?
ఎ. 10 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల కౌమార బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది
బి. కౌమార బాలికల పరిపూర్ణ అభివృద్ధికి ఈ పథకం ఒక పవిత్రమైన చొరవగా భావింపబడుతుంది
సి. జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం, పాఠశాలకు వెళ్లి సమాజంలో ఉత్పాదక సభ్యులయ్యేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
190. నీతి ఆయోగ్‌కు సంబంధించి కింది వివరణలో సరైనవి?
ఎ. ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను స్థాపించింది
బి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన, దిశాత్మకమైన, శాస్త్రీయమైన, సాంకేతికమైన ఉత్పాదితాలను అందిస్తుంది
సి. సహకారం ద్వారా పరిజ్ఞానాన్ని నవకల్పనను, ఎంట్రప్రెన్యురల్ మద్దతును అందిస్తుంది
డి. నీతి ఆయోగ్ వైస్-చైర్మన్‌గా అరవింద్ పణగారియ ఉన్నారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి 4) ఎ, డి
191. జతపరచండి
ఎ. కేసరి 1. గాడిచర్ల
హరిసర్వోత్తమ రావు
బి. వివేకవర్ధిని 2. శశికుమార్ ఘోష్
సి. స్వరాజ్య పత్రిక 3. తిలక్
డి. అమృత బజార్ పత్రిక 4. కందుకూరి వీరేశిలింగం
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4
192. కింది వివరాలను పరిశీలించండి
ఎ. 1921లో ఆంధ్ర జన కేంద్ర సంఘ స్థాపన, అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందింది. నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం, జాగృతికి గట్టి పునాదులేర్పరచాయి.
బి. తెలంగాణ ప్రజల్లో 80 శాతం మంది తమ మాతృ భాష తెలుగులో, అలాగే మారట్వాడలో మరాఠి, కన్నడ భాషల్లో అంటే ప్రజల భాషల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి సరైన, సమర్థవంతమైన వేదికను అందించింది
సరైన జవాబును ఎంపిక చేయండి.
1) ఎ, బి సరైనవి కావు 2) ఎ, బి సరైనవి
3) ఎ సరైనది 4) బి సరైనది
193. కింది వివరణలను పరిశీలించండి
ఎ. నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడు భీమ్జీగోండ్
బి. ‘జల్-జంగల్-జమీన్’ అనే నినాదాన్ని కుమురం భీం ఇచ్చాడు
సి. ఆదిలాబాదు జిల్లాలోని ఉట్నూర్ ప్రాం తంలో భీమ్జిగోండ్ నాయకత్వంలో గోండులు తిరుగుబాటు చేశారు
సరైనవి కాని వివరణలను ఎంపిక చేయండి.
1) ఎ, సి 2) సి, బి
3) సి 4) ఎ, బి, సి
194. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రి ద్వారా ఏర్పాటు చేసిన అన్ని పార్టీల సమావేశాలను బహిష్కరించిన పార్టీలు ఏవి?
1) బీజేపీ, టీఆర్ఎస్
2) బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్
3) బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, ఎఐఎంఐఎం
4) బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, ఎఐఎంఐఎం, సీపీఐ, సీపీఐ(ఎం)
195. కింది వాటిని జతపరచండి
పథకం/పాలసీ ప్రవేశపెట్టిన/అమలుచేసిన తేదీ
ఎ. TS-iPASS 1. జనవరి 1, 2015
బి. షీ టీం 2. అక్టోబర్ 2, 2014
సి. ఆరోగ్య లక్ష్మీ 3. జూన్ 12, 2014
డి. హరితహారం 4. జూన్ 2, 2015
ఇ. షాదీ ముబారక్ 5. ఏప్రిల్ 1, 2015
6. జూలై 3, 2015
1) ఎ-4, బి-5, సి-2, డి-6, ఇ-3
2) ఎ-3, బి-5, సి-1, డి-6, ఇ-2
3) ఎ-4, బి-3, సి-1, డి-5, ఇ-2
4) ఎ-2, బి-5, సి-3, డి-6, ఇ-1
196. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందానికి పూర్వ రంగంగా భావిస్తున్న ‘ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం’పై భారత్ ఏ దేశంతో కలిసి సంతకాలు చేసింది? (రెండు దేశాల మధ్య వస్తు సేవల సరఫరాలు, నిపుణులు, పర్యాటకుల రాకపోకలను ఏక్టా పెంచుతుంది. పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ భౌగోళిక సంబంధాలను సుసంపన్నం చేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది)
1) ఆస్ట్రేలియా 2) కాంబోడియా
3) చైనా 4) ఫిజి
197. జమ్మూకశ్మీర్‌లోని ఏ నదిపై 540 మొగా వాట్ల క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. (ఈ ప్రాజెక్టుకు రూ. 4,526 కోట్ల వ్యయం అవుతుందని అంచనా)
1) జీలం 2) చీనాబ్ 3) సట్లెజ్ 4) రావి
198. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ భారత పర్యటనలో భాగంగా 2022, ఏప్రిల్ 25న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
బి. వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఈయూ, తీర్మానించాయి. వాటిలో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈయూ భారత్ వాణిజ్య, సాంకేతిక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సి. ఇది ఈయూ ఏర్పాటు చేయనున్న రెండో వాణిజ్య, సాంకేతిక మండలి. గతంలో అమెరికాతో ఈ తరహా ఒప్పందాన్ని ఈయూ కుదుర్చుకుంది. భారత్‌కు మాత్రం ఇదే మొదటిది.
1) ఎ, సి 2) ఎ, బి 3) సి 4) పైవన్నీ
199. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది?
(2022, ఏప్రిల్ 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దేశీయంగా అన్లైన్ దిగ్గజాల ఆధిపత్యాన్ని తగ్గించి, చిన్న రిటైలర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఈ కామర్స్ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా ఎంపిక చేసిన వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్ సేవల సంస్థలకు ఓఎన్డీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.)
1) ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూరు
2) ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా
3) ఢిల్లీ, విశాఖపట్నం, హైదరాబాద్, వారణాసి, అహ్మదాబాద్
4) ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై
200. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం యూఎస్ఏకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 2020తో పోలిస్తే 2021లో ఎంత శాతం పెరిగింది?
(2021లో భారత్ నుంచి మొత్తం 2,32, 851 మంది విద్యార్థులు అమెరికా వచ్చినట్లు నివేదిక పేర్కొంది. చైనా నుంచి అత్యధికంగా 3,48,992 మంది విద్యార్జనకు అమెరికా వెళ్లారు.)
1) 12% 2) 15%
3) 18% 4) 22%
సమాధానాలు
167.2 168.2 169.2 170.3 171.4 172.2 173.3 174.4 175.3 176.2 177.1 178.3 179.1 180.4 181.4 182.3
183.4 184.4 185.4 186.4 187.2 188.4 189.2 190.1 191.3 192.2 193.1 194.2 195.2 196.1 197.2 198.4
199.1 200.1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు