నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?
భారత దేశ చరిత్ర & సంస్కృతి
90. వేద ప్రజలు క్షీణత, నాశనం మృత్యురూపంగా భావించిన దేవత ఎవరు?
1) అదితి 2) నిర్తి
3) సావిత్రి 4) అరణ్యాని
91. మృత్యు భావనను ప్రప్రథమంగా ఏ వేద సాహిత్యంలో పేర్కొన్నారు?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) శతపథ బ్రాహ్మణం
3) చాందోగ్య ఉపనిషత్తు
4) ప్రశ్న ఉపనిషత్తు
92. పెద్దల నిర్ణయాలు, ఆచార వ్యవహారాలను అనుసరించి అందరూ ఒప్పుకొని చేసే వివాహాన్ని ఏమంటారు?
1) సాంప్రదాయ వివాహం
2) దైవ వివాహం
3) బ్రహ్మ వివాహం 4) ఆర్ష వివాహం
93. కింది జవాబుల్లో సరిగా జతపరచని దాన్ని గుర్తించండి
1) అసిక్ని-చినాబ్ 2) సుతుద్రి-సట్లెజ్
3) విపాస్-జీలం 4) పరుష్ని-రావి
94. రాజసూయ, అశ్వమేధ, వాజపేయ యాగాలను గురించి ప్రప్రథమంగా ప్రస్తావించిన వేద సాహిత్యమేది?
1) సంహితలు 2) బ్రాహ్మణాలు
3) అరణ్యకాలు 4) ఉపనిషత్తులు
95. సప్తసింధూ ప్రాంతాన్ని ఆర్యుల జన్మస్థానంగా ప్రతిపాదించిందెవరు?
1) బాలగంగాధర తిలక్ 2) డా. ఎ.సి. దాస్
3) ప్రొ. మాక్స్ ముల్లర్ 4) ప్రొ. పెంకా
96. రుగ్వేద కాలంలో గణాల మధ్య యుద్ధాలు ఎందుకు జరిగాయి?
1) భూభాగం 2) గోవులు
3) బంగారు, వెండి ఆభరణాలు
4) కీర్తి
97. పురోహితుడైన వరునికి కన్యాదానం చేసే వివాహ పద్ధతిని ఏమంటారు?
1) బ్రహ్మ వివాహం 2) దైవ వివాహం
3) గాంధర్వ వివాహం
4) ప్రజాపత్య వివాహం
98. రుగ్వేదంలో ఏ తీర్థ్థంకరుని గురించి ప్రస్థావన వచ్చింది?
1) రుషభనాథుడు 2) పార్శనాథుడు
3) మహావీరుడు 4) దేవదత్తుడు
99. సిద్ధార్థుడు, గౌతముడుగా మారడానికి స్ఫూర్తినిచ్చిన నాలుగు ముఖ్య సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించండి
1) వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, సన్యాసం
2) అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం, సన్యాసం
3) మరణం, సన్యాసం, అనారోగ్యం, వృద్ధాప్యం
4) సన్యాసం, మరణం, వృద్ధాప్యం, అనారోగ్యం
100. గౌతమ బుద్ధుడు కుశినగరంలో మరణించేటప్పుడు అతని పక్కనే ఉన్న శిష్యుడు ఎవరు?
1) సారిపుత్ర 2) ఆనంద
3) నాగసేన 4) అంబపాలి
101. బౌద్ధమతంలోని త్రిరత్నాల్లో లేనిది?
1) బుద్ధ 2) ధర్మ
3) నిర్వాణ 4) సంఘ
102. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?
1) హిందీ 2) పాళీ
3) మరాఠీ 4) మాగధి
103. చైనాలో మాధ్యమిక బౌద్ధాన్ని ప్రచారం చేసిన భారతీయ గురువు?
1) కుమారజీవ 2) పరమార్థ
3) బోధిధర్మ 4) బోధివుచి
104. యోగాచార లేక విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త ?
1) వత్తగామిని 2) మైత్రేయనాథ
3) అసంగ 4) వసుబంధు
105. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిది?
1) స్థూపం 2) విహారం
3) సంఘం 4) చైత్యం
106. అశోకునివలే బౌద్ధమతాన్ని ప్రోత్సహించి, బౌద్ధ సంఘంలోని విభేదాలను రూపుమాపడానికి కృషి చేసిన చక్రవర్తి?
1) కనిష్కుడు 2) మీనాండర్
3) ధర్మపాలుడు 4) హర్షుడు
107. నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?
1) వైశాలి 2) కశ్మీర్
3) కురుక్షేత్ర 4) పాటలీపుత్రం
108. బుద్ధఘోషుని ఏ రచన తొలి బౌద్ధంపై విజ్ఞానం సర్వస్వం వంటిది?
1) సామంత పసాదిక 2) విసుద్ధిమాగ్గ
3) సుమంగల విలాసిని
4) మనోరథపురాని
109. సంస్కృతంలో అత్యంత ప్రాచీన నాటకం ‘సారిపుత్ర ప్రకరణం’ రచించింది?
1) వసుమిత్రుడు 2) అశ్వఘోషుడు
3) వసుబంధు 4) అసంగుడు
110. రోహిణి నదీ జలాల కోసం ఏ రెండు రాజ్యాల మధ్య ఉత్పన్నమైన యుద్ధ పరిస్థితి గౌతమ బుద్ధుని శాంతి సందేశంతో తొలగిపోయింది?
1) శాక్య, కోసల 2) మగధ, కళింగ
3) అంగ, వంగ 4) కోసల, వైశాలి
111. దిగంబర జైనులు 4వ శతాబ్దంలో మగధలో సంభవించిన కరువు మూలంగా ఎవరి నాయకత్వాన కర్నాటకలోని శ్రావణబెళగోళ ప్రాంతానికి వలస వచ్చారు?
1) స్థూల బాడు 2) భద్రబాడు
3) పార్శనాథుడు 4) అశ్వసేనుడు
112. దక్షిణ భారతదేశంలో ఉన్న బుద్ధుని అస్థికలున్న తొలి మహాస్థూపం?
1) అమరావతి 2) నాగార్జున కొండ
3) భట్టిప్రోలు 4) పైవేవీ కాదు
113. మాధ్యమిక వాదం లేక శూన్యవాదాన్ని ప్రవచించిన ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడు?
1) గౌతమీపుత్ర శ్రీ శాతకర్ణి
2) వశిష్ఠీపుత్ర పులోమావి II
3) యజ్ఞశ్రీ గౌతమీపుత్ర
4) పులోమావి IV
114. ‘మహాపురాణాన్ని’ రచించిన జీనసేనుడు, గుణభద్రుడు ఏ రాష్ట్ర కూట రాజు ఆస్థానంలో ఉన్నారు?
1) దంతిదుర్గుడు
2) ఒకటో అమోఘవర్షుడు
3) ఒకటవ కృష్ణుడు 4) ఇంద్ర III
115. విష్ణు, భాగవత పురాణాల్లో ఏ జైన తీర్థంకురున్ని నారాయణుని అవతారంగా పేర్కొన్నారు?
1) మహావీరుడు 2) పార్శనాథుడు
3) రుషభనాథుడు 4) అరిష్టనేమి
116. బాక్టియన్ రాజు మీనాండర్ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం ‘మిళిందపన్హా’ గ్రంథంలో ఉంది?
1) నాగసేనుడు 2) నాగార్జునుడు
3) నాగభట్టుడు 4) కుమారిలభట్టు
117. భారతదేశంలోని బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో ఏ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని చివరగా స్థాపించారు?
1) నలందా 2) తక్షశిల
3) నాగార్జునకొండ 4) విక్రమశిల
118. భారతదేశంలో కొన్ని బౌద్ధ శాఖలు తాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయని పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరు?
1) యన్త్సాంగ్ 2) ఇత్సింగ్
3) ఫాహియాన్ 4) వాంగ్ ంగ్ సే
119. జైన మత సిద్ధాంతం/సిద్ధాంతాలు
1) పంచ సూత్రములు 2) త్రిరత్నములు
3) జైన తత్వం 4) పైవన్నీ
120. బ్రాహ్మణ మత రక్షకుడుగా బౌద్ధావలంబకుల పీడకుడుగా పేర్కొన్న చక్రవర్తి?
1) అగ్నిమిత్రుడు
2) పుష్యమిత్ర శుంగుడు
3) పుష్యగుప్తుడు 4) సముద్రగుప్తుడు
121. అజీవకమత స్థాపకులు?
1) పకుధ కాత్యాయన 2) స్థూలబా
3) మక్కలి గోసాల 4) సుధర్మ
122. జైనమతంలో పోసద అంటే?
1) మతంలోకి నూతన సభ్యుని చేర్చుకొనే కార్యక్రమం
2) మత నియమాలను అతిక్రమించిన వారికి విధించే శిక్ష
3) తమ పాపపరిహారానికి జైనులు విధించుకునే శిక్షలు
4) సాధారణ జైనులు పూర్ణచంద్రుని రోజున ఉపవాసం చేయడం
123. జైన సంప్రదాయం ప్రకారం 23వ తీర్థంకురుడైన పార్శనాథుడు ఏ రాజవంశానికి చెందిన వాడు?
1) మగధ 2) కోసల
3) విదేహ 4) కాశి
124. కుషాణుల కాలానికి చెందిన బౌద్ధ స్థూపం ఇటీవలి కాలంలో ఏ ప్రదేశంలో బయటపడింది?
1) సంఘోల్ 2) బేస్‌నగర్
3) అమరావతి 4) లుంబిని
125. గౌతమబుద్ధుని ప్రప్రథమంగా మానవ రూపంలో ప్రకటించింన శిల్పకళ?
1) గాంధార 2) మధుర
3) పాల 4) గుప్త
126. బౌద్ధమతం హీనయాన, మహాయాన శాఖలుగా ఎన్నవ సంగీతిలో విడిపోయింది?
1) మొదటి 2) రెండవ
3) మూడవ 4) నాలుగవ
127. గుజరాత్‌లోని వల్లభిలో క్రీ.శ. 453లో జరిగిన రెండవ జైన సంగమానికి అధ్యక్షత వహించింది?
1) స్థూలబా 2) భద్రబా
3) దేవార్థి శ్రమణుడు 4) కౌవలీనుడు
128. కింది వాటిలో మహావీరుని బిరుదు కానిది?
1) జీన 2) దేవాదిన్న
3) కేవలీనుడు 4) శాక్యముని
129. పార్శనాథుని నాలుగు సూత్రాలకు 24వ జైన తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు కలిపిన అయిదవ సూత్రం?
1) అహింస 2) సత్యం
3) అస్థేయం 4) బ్రహ్మచర్యం
130. 7వ శతాబ్దంలో తాంత్రిక నమ్మకాలతో ఆవిర్భవించిన బౌద్ధమత శాఖ?
1) థేరవాదం 2) హీనయానం
3) మహాయానం 4) వజ్రయానం
131. 6వ శతాబ్దంలో వెలసిన షోడశ జనపదాల్లో మొట్టమొదటి మహాసామ్రాజ్యంగా రూపొందిన జనపదం?
1) మగధ 2) అంగ
3) వంగ 4) వత్స
132. వివాహ సంబంధాల ద్వారా మగధ రాజ్యాన్ని విస్తరించిన బుద్ధుని సమకాలికుడైన హర్యాంక వంశ రాజు?
1) అజాత శత్రువు 2) ఉదయనుడు
3) బింబిసారుడు 4) శిశునాగుడు
133. మగధ రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చిన హర్యాంక వంశస్థుడైన రాజు ఎవరు?
1) బింబిసారుడు 2) శిశునాగుడు
3) ఉదయనుడు 4) అజాత శత్రువు
134. క్రీ.పూ. 326లో భారతదేశంపై దండెత్తిన అలెగ్జాండర్ సేనలు ఏ నదిని దాటి మగధపై దండెత్తడానికి నికారరించాయి?
1) జీలం 2) బియాస్
3) సట్లెజ్ 4) గంగ
135. కర్టియస్, అగ్రేమ్స్ అని గ్రీకు రచయితలు పిలిచిన, అలెగ్జాండర్‌కు సమకాలికుడైన నందవంశ చిట్టచివరి పాలకుడు ?
1) మహాపద్మనందుడు 2) కాలాశోకుడు
3) శిశునాగుడు 4) ధననందుడు
136. బృహద్రధ వంశాన్ని కూలదోసి ఏ వంశం మగధ సింహాసనాన్ని ఆక్రమించింది?
1) హర్యాంక 2) నంద
3) శిశునాగ 4) మౌర్య
137. 6వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన పట్టణాల్లో వర్తకశ్రేణి నాయకుడిగా సమాజంలో గౌరవాన్ని పొందింది ఎవరు?
1) భిషక 2) శ్రేష్ఠి
3) కంచుక 4) కులాల
138. గంగా, సోన్ నదీ సంగమ ప్రాంతంలో పాటలీపుత్రాన్ని నిర్మించిన పితృహంతుకు-డైన హర్యాంక వంశ స్థాపకులు ఎవరు?
1) కాలాశోకుడు 2) బింబిసారుడు
3) పద్మనందుడు 4) శిశునాగుడు
139. హర్యాంక వంశం తర్వాత అధికారంలోకి వచ్చిన శిశునాగ వంశ స్థాపకులు?
1) కాలాశోకుడు 2) బింబిసారుడు
3) పద్మనందుడు 4) శిశునాగుడు
140. నందులను ఓడించడానికి చంద్రగుప్తమౌర్యుడు చాణక్యుడి సహాయాన్ని పొందాడని తెలియజేసే గుప్తుల కాలంనాటి గ్రంథం ‘ముద్రారాక్షసం’ను ఎవరు రచించారు?
1) విశాఖదత్తుడు 2) చాణుక్యుడు
3) విష్ణుగుప్తుడు 4) రాధాగుప్తుడు
141. క్రీ.పూ. 362లో నంద వంశాన్ని స్థాపించిన మహా పద్మనందుని బిరుదు ఏది?
1) అగ్రేమ్స్ 2) ఏక్రాట్
3) విరాట్ 4) మహాసేనుడు
142. కోసలరాజు ప్రసేనజిత్తు తన కుమార్తె వజీరాను అజాత శత్రువుకిచ్చి వివాహం చేసేటప్పుడు కట్నంగా ఇచ్చిన ప్రాంతమేది?
1) చంప 2) కాశి
3) వైశాలి 4) మహిష్మతి
143. అంగరాజైన బ్రహ్మదత్తుని ఓడించి అంగ రాజ్యాన్ని మగధలో కలిపిన హర్యాంక వంశజుడు ఎవరు?
1) బింబిసారుడు 2) అజాత శత్రువు
3) ఉదయనుడు 4) బృహద్రదుడు
144. మగధ సామాజ్య రాజధానుల గురించి సరైనది గుర్తించండి
1) వన రాజధాని- గిరివ్రజ
2) స్థల రాజధాని – రాజగృహం
3) జల రాజధాని – పాటలీపుత్రం
4) పైవన్నీ
145. పాటలీపుత్రాన్ని మగధ సామ్రాజ్యానికి రాజధానిగా చేసిన రాజు ఎవరు?
1) అజాత శత్రువు 2) బింబిసారుడు
3) శిశునాగుడు 4) ఉదయనుడు
146. మహాపద్మనందుడి బిరుదు/బిరుదులు
1) ఉగ్రసేనుడు 2) సర్వక్షత్రాంతక
3) ఏకవీర 4) పైవన్నీ
147. 6వ శతాబ్దంలో విలసిల్లిన 16 మహా జనపదాల్లో శక్తిమంతమైన నాలుగు జనపదాల్లో ఒకటైన అవంతి రాజధాని ఏది?
1) పాటలీపుత్రం 2) ఉజ్జయిని
3) కురుక్షేత్ర 4) తక్షశిల
148. సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించిన మొదటి భారతీయ చక్రవర్తి?
1) పద్మనందుడు 2) అజాతశత్రువు
3) బింబిసారుడు 4) చంద్రగుప్తుడు
149. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించారని తెలిపిన జైన గ్రంథం?
1) పరిశిష్ఠపర్వాన్ 2) దివ్య సమగ్రహ
3) రత్న మాలిక 4) జయధేల
150. బిందుసారుని మరణ సమయంలో అశోకుడు ఏ ప్రాంతానికి గవర్నరుగా ఉన్నారు?
1) పాటలీపుత్రం 2) కోసల
3) సువర్ణగిరి 4) ఉజ్జయిని
151. సన్యాసి దుస్తుల్లో ఉన్న అశోకుని విగ్రహాన్ని దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు?
1) ఇత్సింగ్ 2) ఫాహియాన్
3) యన్త్సాంగ్ 4) వాంగ్ సీ
జవాబులు
90.2 91.2 92.3 93.3 94.2 95.2 96.2 97.2 98.1 99.1 100.2 101.3 102.2 103.1 104.2 105.3 106.4 107.2 108.2 109.2 110.1 111.2 112.3 113.3 114.2 115.3 116.1 117.4 118.1 119.4 120.2 121.3 122.4 123.4 124.1 125.1
126.4 127.3 128.4 129.4 130.4 131.1 132.3 133.3 134.2 135.4 136.1 137.2 138.2 139.4 140.1 141.2
142.1 143.1 144.4 145.3 146.4 147.2 148.3 149.1 150.4 151.1
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు