‘మార్ష్ గ్యాస్’ అని ఏ వాయువును పిలుస్తారు?
పర్యావరణ పరిరక్షణ
62. ‘పొల్యుటోనియం’ అనే పదానికి అర్థం?
1) శుభ్రత 2) అపరిశుభ్రత
3) అందవిహీనం 4) కాంతి విహీనం
63. నీటి కాలుష్య నివారణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
1) 1974 2) 1972
3) 1980 4) 1982
64. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం?
1) సెప్టెంబర్ 16 2) నవంబర్ 16
3) జూన్ 5 4) మార్చి 23
65. ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు
1) నైట్రోజన్ ఆక్సైడ్ 2) సల్ఫర్ ఆక్సైడ్
3) కార్బన్ డైయాక్సైడ్ 4) 1, 2
66. ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అనే విజ్ఞాన పత్రిక ఎక్కడ ప్రచురించారు?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) లక్నో 4) జైపూర్
67. ఏ దశాబ్ద కాలాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా గుర్తించారు?
1) 1992-2002 2) 2002-2012
3) 2011-2020 4) 2012-2022
68. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడినేలల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
1) బ్రంట్‌లాండ్ కమిషన్
2) రామ్ సార్ కన్వెన్షన్
3) మాంట్రియల్ 4) యునెస్కో
69. ప్రపంచంలో జీరో కార్బన్ పట్టణం ఏది?
1) జైపూర్ (భారతదేశం)
2) ఆక్లాండ్ (న్యూజిలాండ్)
3) న్యూయార్క్ (అమెరికా)
4) మస్టర్డ్ (అబు ధాబి)
70. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1984, డిసెంబర్ 3
2) 1982, నవంబర్ 6
3) 1985, డిసెంబర్ 4
4) 1986, జూన్ 5
71. ‘జీవ వైవిధ్య సదస్సు (COP-11)’ ఏ నగరంలో జరిగింది?
1) లక్నో 2) చెన్నై
3) హైదరాబాద్ 4) ఢిల్లీ
72. భోపాల్ గ్యాస్ సంఘటనకు కారణమైన వాయువు?
1) కార్బన్ డైయాక్సైడ్ 2) ఆక్సిజన్
3) హీలియం
4) మిథైల్ ఐసోసైనైట్
73. భారతదేశంలోని హాట్ స్పాట్స్ ఏవి?
1) తూర్పు హిమాలయాలు
2) పడమటి కనుమలు
3) 1, 2 4) పైవేవీ కాదు
74. ఏ సంవత్సరంలో వన్యప్రాణి పరిరక్షణ చట్టం ఏర్పడింది?
1) 1970 2) 1972
3) 1975 4) 1980
75. ఏ సంవత్సరంలో జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం ఏర్పడింది?
1) 1990 2) 1995
3) 2000 4) 2002
76. ‘సెంటర్ ఫర్ సైంటిఫిక్, ఎన్విరాన్మెంట్ రిసెర్చ్’ సంస్థ ఎక్కడ ఉంది?
1) లక్నో 2) బెంగళూరు
3) ముంబై 4) న్యూఢిల్లీ
77. ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఎక్కడ ఉంది?
1) నాగ్‌పూర్ 2) సిమ్లా
3) మేఘాలయ 4) కోల్‌కతా
78. భారతదేశంలోని అతిపెద్ద బయోస్పియర్ రిజర్వు ?
1) రాణ్ ఆఫ్ కచ్ 2) గల్ఫ్ ఆఫ్ మున్నార్
3) నీలగిరి బయోస్పియర్
4) సిమ్లిపాల్ బయోస్పియర్
79. భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన బయోస్పియర్?
1) సిమ్లిపాల్ 2) నందాదేవి
3) నీలగిరి 4) నాక్రెక్
80. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ‘రాజీవ్ గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్’ ఎక్కడ ఉంది?
1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
2) తెలంగాణ, కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్, ఒడిశా 4) ఏదీకాదు
81. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్’ ఎక్కడ ఉంది?
1) సిమ్లా 2) భోపాల్
3) డెహ్రాడూన్ 4) కలకత్తా
82. నేషనల్ పార్క్‌లు లేని రాష్ట్రం?
1) అసోం 2) మణిపూర్
3) పంజాబ్ 4) ఉత్తరాఖండ్
83. అధిక అభయారణ్యాలు ఉన్న రాష్ట్రం ?
1) మధ్యప్రదేశ్ 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
84. ‘బ్రంటలాండ్ కమిషన్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1983 2) 1985
3) 1989 4) 1990
85. భారత పర్యావరణ కాలుష్య చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1986 2) 1987
3) 1988 4) 1989
86. పొల్యూషన్ అనే పదాన్ని పొల్యుటోనియం అనే ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు?
1) స్పానిష్ 2) ఇంగ్లిష్
3) లాటిన్ 4) ఫ్రెంచ్
87. గాలిలో ఉండే కొన్ని పదార్థాల గాఢతలు మానవునికి, అతని పరిసరాలకు హానిచేసే స్థాయిని మించి ఉండటమే వాయు కాలుష్యం అని పేర్కొన్నవారు?
1) ప్రపంచ వాతావరణ సంస్థ
2) ఐక్యరాజ్య సమితి
3) ప్రపంచ మానవవనరుల అభివృద్ధి సంస్థ
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
88. ఏ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అడవి జంతువులకు లీగల్ రైట్స్‌ని ఇచ్చింది?
1) నార్వే 2) బ్రెజిల్
3) ఈక్వెడార్ 4) కాంగో
89. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు విచ్ఛిన్నం చెందడానికి పట్టేకాలం ?
1) 1000 సంవత్సరాలు
2) 10,000 సంవత్సరాలు
3) లక్ష సంవత్సరాలు
4) 100 సంవత్సరాలు
90. ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి ఎన్ని టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి?
1) 5 2) 2 3) 1 4) 10
91. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఏ వ్యాధి వస్తుంది?
1) సిలికోసిస్ 2) న్యుమోనియాసిస్
3) బెరీలియాసిస్ 4) ఆస్బెస్టోసిస్
92. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ జీవిత కాలం ఎంత?
1) 3 2) 4 3) 1 4) ఒక నెల
93. కార్బన్ మోనాక్సైడ్ అత్యధికంగా 59.5% వేటి నుంచి విడుదలవుతుంది?
1) మోటారు వాహనాలు 2) రైళ్లు
3) విమానాలు 4) పరిశ్రమలు
94. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మానవుడి రక్తంలో కార్బాక్సి హీమోగ్లోబిన్ పరిమాణం ఎంతశాతం మించకుండా ఉండేటట్లు కార్బన్‌మోనాక్సైడ్‌ను తగ్గించాలని సూచించారు?
1) 10% 2) 8% 3) 3% 4) 5%
95. అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ ఎన్నో స్థానంలో ఉంది?
1) 20 2) 18 3) 15 4) 11
96. Global Ambient Air Pollution Data Base నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరం?
1) ఇరాన్‌లోని జబోల్
2) ఖతార్‌లోని దోహా
3) నార్వేలోని స్టాక్ హోం
4) దక్షిణాఫ్రికాలోని కింబర్లీ
97. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం?
1) మే 1 2) మే 22
3) జూన్ 5 4) ఏప్రిల్ 22
98. ఈ-వేస్ట్ ఉత్పాదనలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
99. కంప్యూటర్లలో వలయాన్ని శుభ్రపరచడానికి వేటిని ఉపయోగిస్తారు?
1) క్లోరోఫ్లోరో కార్బన్ 2) హైడ్రోజన్ సల్ఫైడ్
3) సల్ఫ్యూరిక్ ఆమ్లం 4) అమ్మోనియం
100. ఒక క్లోరోఫ్లోరో కార్బన్ అణువు సుమారుగా ఎన్ని ఓజోన్ అణువులను విఘటనం చెందించగలుగుతుంది?
1) లక్ష 2) వెయ్యి
3) పది లక్షలు 4) వంద
101. ‘కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) ముంబై
3) హైదరాబాద్ 4) న్యూఢిల్లీ
102. ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి వాతావరణం, అభివృద్ధిల మీద ‘ప్రపంచ కమిషన్’ను ఏర్పాటు చేసింది?
1) 1985 2) 1984
3) 1983 4) 1982
103. ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించింది ?
1) రాబర్ట్ ఆంగ్రోస్ స్మిత్
2) ఎర్నెస్ట్ హెకెల్
3) ఆర్.డి.మిశ్రా 4) హెమిల్టన్
104. ఆమ్ల వర్షాలు వర్షపు నీటితో కలవటం వల్ల ఆమ్ల వర్షాల PH విలువ ఎంత?
1) 5 2) 4 3) 4.5 4) 5.5
105. చారిత్రక కట్టడాలను ఆమ్లవర్షాల నుంచి కాపాడటానికి ఏ విధమైన కుండీలను ఏర్పాటు చేయాలి?
1) క్షార జల 2) స్వచ్ఛమైన జల
3) ఆమ్ల జల 4) 1, 2
106. కింది వాటిలో ఏవి ఓజోన్ పొరను క్షీణింపజేస్తున్నాయి?
1) క్లోరోఫ్లోరో కార్బన్స్
2) నైట్రిక్స్ ఆక్సైడ్, ధ్రువ స్ట్రాటోస్పియరిక్ మేఘాలు
3) టెట్రాక్లోరో మీథేన్, మిథైల్ బ్రోమైడ్
4) పైవన్నీ
107. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
1) జోధ్‌పూర్ 2) డెహ్రాడూన్
3) అలహాబాద్ 4) ఢిల్లీ
108. మాంట్రియల్ ప్రొటోకాల్ క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని ఏ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాలని పేర్కొంది?
1) 2005 2) 2000
3) 2010 4) 2009
109. మాంట్రియల్ ఒప్పందం జరిగిన ఏ తేదీని ‘ఓజోన్ దినం’గా ప్రకటించారు?
1) సెప్టెంబర్ 16 2) అక్టోబర్ 16
3) నవంబర్ 16 4) డిసెంబర్ 16
110. 2022 జనవరి నాటికి భారతదేశంలో ఎన్ని నేషనల్ పార్క్‌లు ఉన్నాయి?
1) 110 2) 120
3) 106 4) 104
111. మానవుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాతావరణంలోనికి గ్రీన్హౌస్ వాయువులు విడుదల పెరిగి భూగోళ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఏమంటారు?
1) ఆమ్ల వర్షం 2) క్షార వర్షం
3) ఓజోన్ క్షీణత 4) గ్లోబల్ వార్మింగ్
112. గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధానంగా కారణమయ్యే వాయువు?
1) నైట్రోజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) ఆర్గాన్ 4) ఆక్సిజన్
113. గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం?
1) అధిక ఉష్ణోగ్రత
2) వాయువుల ప్రభావం
3) అడవుల నరికివేత
4) వర్షాలు పడకపోవడం
114. ‘మార్ష్ గ్యాస్’అని ఏ వాయువును పిలుస్తారు?
1) మీథేన్ 2) నైట్రోజన్
3) ఆక్సిజన్ 4) ఆర్గాన్
115. గ్రీన్హౌస్ వాయువుల విడుదల తగ్గింపునకు సంబంధించిన మార్పులు చేయడాన్ని ఏమంటారు?
1) కార్బన్ ట్రేడింగ్ 2) పల్వరైజేషన్
3) కార్బన్ ట్యాక్స్ 4) యుట్రిఫికేషన్
116. ఓజోన్ మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు?
1) డాబ్సన్ 2) వాట్సన్
3) సెంటీగ్రేడ్స్ 4) మిల్లీగ్రేడ్స్
117. చారిత్రక కట్టడాల గోడలపై పగుళ్లు, గుంతలు ఏర్పడటం, అందవిహీనంగా పసుపు లేదా నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు?
1) పల్వరైజేషన్ 2) యుట్రిఫికేషన్
3) కార్బన్ ట్రేడింగ్ 4) స్టోన్ లెప్రసీ
118. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘Inter Government Pannel On Climate Change’ (IPCC) ఈ దశాబ్దం చివరికి భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎంతవరకు పెరగవచ్చని అంచనా వేసింది?
1) 1.4 – 5.8 డిగ్రీస్ సెల్సియస్
2) 1.5 – 4 డిగ్రీస్ సెల్సియస్
3) 1.9 – 5.5 డిగ్రీస్ సెల్సియస్
4) 1.8 – 4 డిగ్రీస్ సెల్సియస్
119. ఆమ్ల వర్షాల ఫలితంగా చెరువులు, సరస్సుల్లో నీటి ఆమ్లత్వం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) స్థిరం 4) 1, 2
120. ఆమ్ల వర్షాల ప్రభావం వేటిపై ఎక్కువగా ఉంటుంది?
1) సముద్రాలు 2) అడవులు
3) కట్టడాలు 4) జంతువులు
121. ఏ పరికరంతో ఓజోన్ను కొలుస్తారు?
1) డాబ్సన్ స్పెక్టోమీటర్
2) హెలెన్ స్పెక్టోమీటర్
3) విల్సన్ స్పెక్టోమీటర్
4) ఎర్నెస్ట్ స్పెక్టోమీటర్
122. ‘భూమి రక్షణ కవచం’ అని ఏ వాయువుకు పేరు?
1) ఓజోన్ 2) ఆక్సిజన్
3) ఆర్గాన్ 4) క్రిప్టాన్
123. ఓజోన్ రంధ్రం ఏయే ప్రాంతాల్లో ఏర్పడుతుంది.
1) ఆర్కిటిక్ 2) అంటార్కిటికా
3) ఆఫ్రికా 4) 1, 2
124. ఆర్గానిక్ ఏరోసాల్స్కు గల మరొక పేరు?
1) బ్రౌన్ కార్బన్ 2) బ్రౌన్ ఏరోసాల్
3) గ్రీన్ కార్బన్ 4) గ్రీన్ ఏరోసాల్
125. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘స్టాక్‌హోం’లో జరిగిన పర్యావరణం అభివృద్ధి అనే సదస్సు తరువాత భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌ను అనుసరించి కొన్ని చట్టాల సవరణలను ప్రవేశపెట్టారు?
1) ఆర్టికల్ 253 2) ఆర్టికల్ 254
3) ఆర్టికల్ 255 4) ఆర్టికల్ 256
126. తాగునీటి నైట్రేట్స్ కాలుష్యాలు ఎక్కువగా చేరినప్పుడు వచ్చే వ్యాధి?
1) హీమోగ్లోబియీ
2) మిథైల్ హీమోగ్లోబియా
3) మినిమేటా 4) ఎనీమియా
జవాబులు
62.2 63.1 64.1 65.4 66.1 67.3 68.2 69.4 70.1 71.3 72.4 73.3 74.2 75.2 76.4 77.1 78.1 79.3 80.1 81.2
82.3 83.3 84.1 85.1 86.3 87.4 88.3 89.3 90.2 91.2 92.1 93.1 94.3 95.4 96.1 97.2 98.3 99.1 100.1 101.4
102.3 103.1 104.2 105.1 106.4 107.2 108.2 109.1 110.3 111.4 112.2 113.3 114.1 115.1 116.1 117.4
118.1 119.1 120.2 121.1 122.1 123.4 124.1 125.1 126.2
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు