విభిన్న పండుగల వసంతం
భూచలనాలు-రుతువులు
– సంవత్సరంలో కాలం గడిచేకొద్ది పరిసరాల్లో నిరంతరం మార్పులు ఏర్పడుతుంటాయి. కొన్ని నెలలు చాలా వేడిగా, కొన్ని నెలలు చాలా చల్లగా ఉంటాయి. ప్రపంచంలో ఉపధృవ, సమశీతోష్ణ ప్రాంతాల్లో మాత్రం సాధారణంగా గ్రీష్మ, వసంత, శరత్, హేమంత అనే నాలుగు రుతువులు సంభవిస్తాయి.
– భారత ఉపఖండంలో చాలా వరకు వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఉంటాయి. దక్షిణాన తమిళనాడు, కేరళ, అండమాన్ల్లో చలికాలం అంత చల్లగా ఉండదు. ఈశాన్య రాష్ట్రాల్లో వేసవికాలం చాలా వేడిగా ఉండదు. అయితే ఉత్తరభారతదేశంలో ఎక్కువ భాగం వెచ్చని వేసవికాలం, చల్లటి శీతాకాలం, వర్షపు రుతుపవనాలు ఉంటాయి.
-నార్వే దేశాన్ని అర్ధరాత్రి సూర్యుని దేశం అంటారు.10డిగ్రీల రేఖాంశం ఈ దేశం మధ్యగా వెలుతుంది.
-భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలను దక్షిణాది దేశాలు అంటారు.
-ఉత్తరార్థగోళంలో వేసవికాలం ఉంటే దక్షిణార్థగోళంలో శీతాకాలం ఉంటుంది. ఉత్తరార్థగోళంలో శీతాకాలం ఉంటే దక్షిణార్థగోళంలో వేసవికాలం ఉంటుంది.
-ప్రాచీన సంస్కృత సాహిత్యం ఒక సంవత్సరాన్ని మూడు ప్రధాన కాలాల్లో ప్రతి రెండింటి మధ్య ఒక కాలాన్ని జోడిస్తూ మొత్తం ఆరు కాలాలుగా విభజిస్తుంది. వీటిని వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర రుతువులుగా విభజిస్తారు.
వసంత రుతువు : చెట్లు కొత్త చిగుళ్లతో నిండి ఉండి శీతాకాలపు పంట చేతికి రావటంతో చలికాలం ముగిసిపోయి వసంత రుతువు వస్తుంది.
-ఈ రుతువులో భారతదేశంలో అనేక వర్గాల ప్రజలు తమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలి, ఉగాది, గుడిపడ్వా, విషు, బి, బైశాఖి, పుల్నందు పండుగలు జరుపుకొంటారు.
గ్రీష్మ రుతువు : దేశంలో ఈ కాలం అనేక ప్రాంతాలు అత్యంత వేడిగా ఉంటాయి.
వర్ష రుతువు : దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
శరదృతువు : ఆకాశం నిర్మలంగా ఉండి వర్షకాలపు పంట సిద్ధమవుతుంది. ఈ రుతువులో దసరా, దీపావళి పండుగలు జరుపుకొంటారు.
హేమంత రుతువు : దేశ వ్యాప్తంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
శిశిర రుతువు : అధికంగా చలి ఉండే కాలం. ఈ కాలంలో హిమాలయ ప్రాంతంలో అధికంగా మంచు కురుస్తుంది.
-లోహ్రి, పొంగల్, మకర సంక్రాంతి వంటి అనేక పండుగలు ఈ రుతువుల్లో జరుపుకొంటారు.
కాలాల క్రమాన్ని ప్రభావితం చేసే అంశాలు:
1. భూమి గోళాకారంగా ఉండటం, దాని ఉపరితల ఒంపు తిరిగి ఉండటం
2. భూభ్రమణం
3. భూమి కక్ష్యాతలంతో పోలిస్తే భూమి అక్షం ఒంపు తిరగి ఉండటం 4.భూపరిభ్రమణం
– భూమి గోళాకారంగా ఉన్నందున వేర్వేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలు ఉంటాయి.
– ధృవాలతో పోల్చితే భూమధ్యరేఖ ప్రాంతా లు బాగా వేడెక్కుతాయి.
– భూమి తనచుట్టూ తాను తిరగకపోతే సూర్యునికి ఎదురుగా ఉన్న సగభాగం ఎల్లప్పుడు పగలు వేడిగా ఉంటుంది. రెండవ భాగం ఎల్లప్పుడూ చీకటిగా చలిగా ఉంటుంది. అప్పుడు రెండు ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండవు.
– భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దానితో పాటు దానిపై ఉన్న గాలిమబ్బులు, పక్షులు అన్ని తిరుగుతాయి. అందుకే మనం బస్సు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కలగదు.
భూమి మీద ఉష్ణోగ్రత మేఖలలు
-సూర్యుని కిరణాలు నిటారుగాపడే ప్రాంతం లో వేడిగా, కోణంలో పడే ప్రాంతంలో తక్కువ వేడి ఉంటుంది.
-తన అక్షం మీద భూమి వంగి ఉండటం, భూ పరిభ్రమణం కారణంగా సూర్యుని నిటారు కిరణాల ప్రసరణ మారుతూ ఉంటుంది.
సూర్యుని నిటారు కిరణాలు
-జూన్ 21- కర్కాటకరేఖ (23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం)
– సెప్టెంబర్ 23- భూమధ్యరేఖ (0డిగ్రీల అక్షాంశం)
– డిసెంబర్ 22 -మకరరేఖ (23 1/2 డిగ్రీల దక్షిణ అక్షాంశం)
-మార్చి 21- భూమధ్యరేఖ
-సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిటారుగా ప్రసరించే మార్చి 21, సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ రెండు రోజులను విషవత్తులు (Equinoxes) అంటారు.
– కర్కటరేఖ, మకరరేఖ మధ్య ప్రాంతాన్ని ఉష్ణమండలం అని అంటారు. ఈ ప్రాంతంలో సంవత్సరంలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి.
– భూమి మీద అత్యధికంగా ఉష్ణోగ్రత గ్రహించే ప్రాంతం ఇదే.
-ఉష్ణమండలం నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే వేసవిలో వేడిగా, శీతాకాలంలో చలిగా ఉండే సమశీతోష్ణ మండలం వస్తుంది.
-సమశీతోష్ణ మండలాలు నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తే ధృవప్రాంతం వస్తుంది.
– ధృవప్రాంతాల్లో శీతాకాలం సూర్యుడు (6 నెలలు) అస్సలు కనిపించడు. మిగతా 6 నెలలు (వేసవి) ఆకాశంలోనే ఉంటాడు. అంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి.
– అయితే పగటి కాలంలో (6నెలలు) సూర్యుడు ఆకాశంపైకి అస్సలు రాడు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి (దీన్ని క్షితిజరేఖ లేక దిగ్మండలం అని పేరు) కొద్దిగా ఎత్తులోకి వస్తాడు. కాబట్టి ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు బలహీనంగా ఉండి ఈ ప్రాంతాన్ని వేడెక్కించలేవు.
-మిగిలిన 6నెలల కాలం అత్యంత చలిగా ఉంటుంది. ఆ చలికి మట్టికూడా రాయిలాగా గడ్డకట్టుకుని చెట్ల వేర్లను కూడా చొచ్చుకుపోనియకుండా చేస్తుంది. అందుకే ధృవప్రాంతంలో చెట్లు పెరగవు.
-6 నెలల పాటు సూర్యుడు ఉంటాడు కాబట్టి మంచు కరుగుతుంది. సముద్రం కూడా కరుగుతుంది. నాచువంటి మొక్కలు, పూలజాతి మొక్కలు పెరుగుతాయి.
భూమధ్య రేఖను అనుసరించి ఖండాల విస్తరణ
దిశ/దిక్కు ఖండాలు
భూమధ్యరేఖకు మొత్తం ఉత్తరాన ఉన్న ఖండాలు ఉత్తర అమెరికా, ఐరోపా
భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న ఖండాలు ఆస్ట్రేలియా, అంటార్కిటికా
భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలుగా విస్తరించిన ఖండాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో వసంత రుతువులో జరగని పండగ?
1) హోలి 2) గుడి పడ్వా
3) సంక్రాంతి 4) పుల్నందు
2. దసరా దీపావళి పండుగలు జరిగే రుతువు?
1) శరదృతువు 2) వర్ష రుతువు
3) శిశిర రుతువు 4) హేమంత రుతువు
3. శిశిర రుతువులో జరుపుకొనే పండుగ?
1) విషు 2) బి
3) లోహ్రి 4) బైశాఖి
4. అర్ధరాత్రి సూర్యుని దేశంగా దేన్ని పిలుస్తారు?
1) జపాన్ 2) కొరియా
3) నార్వే 4) ఆస్ట్రేలియా
5. భూమి అక్షం ధృవ నక్షత్రం వైపు వంగి తిరుగుటకు గల పేరు?
1) పొలారిటీ ఆఫ్ ఎర్త్
2) పొలారిటీ ఆఫ్ ఏక్సిస్
3) పొలారిటీ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్
4) పొలారిటీ ఆఫ్ ఈక్వేటర్
6. ఉత్తరార్థగోళంలో వేసవి అయితే దక్షిణార్థ గోళంలో శీతాకాలం ఉండటానికి కారణం?
1) భూమి తన చుట్టూ తాను తిరగడం
2) భూమి 23 1/2 డిగ్రీలు వంగి తన చుట్టూ తాను తిరగడం
3) భూమి సూర్యుని చుట్టు తిరగడం
4) భూమి 23 1/2 డిగ్రీలు వంగి తిరగడం
7. ఉత్తరార్థగోళంలో శరదృతువు ఏర్పడే కాలం?
1) మార్చి 21 2) సెప్టెంబర్ 23
3) జూన్ 21 4) డిసెంబర్ 22
8. భూమి అక్షం ఎన్ని డిగ్రీలు వంగి ఉంటుంది?
1) 15 1/2 డిగ్రీలు 2) 23 1/2 డిగ్రీలు
3) 31 1/2 డిగ్రీలు 4) 33 1/2 డిగ్రీలు
9. భూమిపై సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమించడానికి కారణం?
1) భూమి తూర్పు నుంచి పడమరకు తిరగడం
2) భూమి సూర్యుని చుట్టూ తిరగడం
3) భూమి పడమర నుంచి తూర్పుకి తిరగడం
4) భూమి సౌరకుటుంబంలో తూర్పువైపుకి ఉండటం
10. కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు?
1) మార్చి 21 2) జూన్ 21
3) సెప్టెంబర్ 23 4) డిసెంబర్ 22
11. మకరరేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడేరోజు?
1) మార్చి 21 2) సెప్టెంబర్ 23
3) డిసెంబర్ 22 4) జూన్ 21
జవాబులు
1-3, 2-1, 3-3, 4-3,
5-2, 6-4, 7-2, 8-2,
9-3, 10-2, 11-3,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు