ఆపరేషన్ పోలో సమయంలో భారత రక్షణశాఖ మంత్రి? (తెలంగాణ హిస్టరీ)
130. ‘వృషాధిప శతకం’ ఎవరి రచన?
1) మారన 2) గౌరన
3) కేతన 4) పాల్కురికి సోమనాథుడు
131. తెలంగాణలో మొదటి రాజకీయ పత్రికగా దేన్ని పేర్కొంటారు?
1) ఆంధ్రమాత 2) నీలగిరి పత్రిక
3) గోల్కొండ పత్రిక
4) ఆధునిక సాంఘిక చరిత్ర
132. మత్స్య పురాణాన్ని క్రోడీకరించింది ఎవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) పులోమావి
3) మొదటి శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
133. ‘దశరథ రాజ నందన చరిత్ర’ అనే తెలుగు నిరోష్ఠ్య కావ్య రచయిత ఎవరు?
1) నేబది కృష్ణయామాత్యుడు
2) శాకల్యమల్ల
3) పొన్నగంటి తెలగనాచార్యుడు
4) మరింగంటి సింగనాచార్యులు
134. ‘ధ్వజమెత్తిన ప్రజ’ ఎవరి రచన?
1) దాశరథి రంగాచార్య
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) దాశరథి కృష్ణమాచార్య
4) కాళోజీ
135. సురవరం ప్రతాపరెడ్డి నడిపిన పత్రిక?
1) నీలగిరి 2) రయ్యత్
3) మీజాన్ 4) గోల్కొండ
136. ఎస్సార్సీ కమిషన్ చైర్మన్ ఎవరు?
1) ఏఎన్‌కే థార్ 2) కేఎన్ వాంఛూ
3) జస్టిస్ జగన్మోహన్ రెడ్డి
4) సయ్యద్ ఫజల్ అలీ
137. రాష్ట్రాల పునర్ విభజన కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది?
1) 1968 డిసెంబర్ 24
2) 1963 డిసెంబర్ 29
3) 1963 డిసెంబర్ 23
4) 1963 డిసెంబర్ 26
138. హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఎప్పడు జరిగాయి?
1) 1950 ఫిబ్రవరి 2) 1950 మార్చి
3) 1952 ఫిబ్రవరి 4) 1953 ఫిబ్రవరి
139. ఆపరేషన్ పోలో సందర్భంగా ‘భారతదేశం కడుపులో ఏర్పడ్డ క్యాన్సర్ పుండును తొలగించినట్లు అయ్యింద’ని వ్యాఖ్యానించింది ఎవరు?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) వల్లభాయ్ పటేల్
3) రామానంద తీర్థ
4) రాజగోపాలాచారి
140. 1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ దగ్గర పోలీసు కాల్పులు జరపడానికి ఏ మేజిస్ట్రేట్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు?
1) అబ్దుల్ బషీర్ ఖాన్
2) మహ్మద్ ఖాసీం
3) షేక్ మహబూబ్
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
141. ఆపరేషన్ పోలో సమయంలో లండన్‌లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు?
1) నవాబ్ దీన్ యార్ జంగ్
2) మీర్ నవాజ్ జంగ్
3) ముస్తాక్ అహ్మద్ ఖాన్
4) అబ్దుల్ అహ్మద్
142. జస్టిస్ వాంఛూ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు నివేదించింది?
1) 1953 జనవరి 15
2) 1953 జనవరి 9
3) 1953 జూన్ 15
4) 1953 జూన్ 9
143. హైదరాబాద్‌లోని ‘ఫతేమైదాన్’లో విద్యార్థుల సమావేశం ఎప్పుడు జరిగింది?
1) 1952 సెప్టెంబర్ 3
2) 1962 ఆగస్టు 28
3) 1962 సెప్టెంబర్ 4
4) 1952 ఆగస్టు
144. జేవీపీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?
1) 1948 డిసెంబర్ 18
2) 1948 డిసెంబర్ 19
3) 1949 డిసెంబర్ 18
4) 1949 డిసెంబర్ 19
145. స్వామి సీతారాం నిరాహార దీక్షను ఎవరి ఆధ్వర్యంలో విరమించాడు?
1) ఆచార్య జయశంకర్
2) ఆచార్య వినోబా భావే
3) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
4) ఎవరూ కాదు
146. జేఎన్ దరి దురాగతాలపై నియమించిన కమిటీ?
1) భార్గవ కమిటీ
2) కేఎన్ వాంఛూ కమిటీ
3) పండిట్ సుందర్‌లాల్ కమిటీ
4) జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ
147. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్?
1) నవాబ్ అహ్మద్ ఖాన్
2) మీర్ నవాజ్ జంగ్
3) నవాబ్ దీన్ యార్ జంగ్
4) సిద్దిఖీ దీన్ దార్
148. ‘పండిట్ సుందర్ లాల్ కమిటీ’ కి సంబంధించి సరికానిది?
ఎ. పోలీస్ చర్య అనంతరం జేఎన్ దరి నాయకత్వంలోని భారత సైన్యం హైదరాబాద్‌లో ముస్లిం ప్రజలను, అనేకమంది కమ్యూనిస్టులను బలిగొన్నది అనేది నివేదిక సారాంశం
బి. ఈ కమిటీ హైదరాబాద్ ప్రాంతంలో పర్యటన- 1948 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 21వరకు
సి. కమిషన్ అధ్యక్షుడు- పండిట్ సుందర్‌లాల్, సభ్యులు ఖాజీ అబ్దుల్ గఫార్, యూనస్ అలీ
డి. 2013లో ఈ కమిటీ నివేదికను యూపీఏ ప్రభుత్వం బహిర్గతపర్చింది
1) ఎ, బి, సి, డి సరైనవి కావు
2) 1 సరైనది, 2, 3, 4 సరైనవి కావు
3) 1, 2, 4 సరైనవి, 3 సరికాదు
4) పైవన్నీ సరైనవే
149. హైదరాబాద్ స్టేట్‌లో పోలీస్ చర్య అనంతరం జరిగిన మారణహోమాన్ని భారత ప్రభుత్వానికి తెలిపిన ఖాజీ అబ్దుల్ గఫార్ పత్రికలో పనిచేశాడు?
1) రయ్యత్ 2) ఇమ్రోజ్
3) హైదరాబాద్ క్రానికల్
4) పాయమ్
150. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించినది?
1) పంపన గౌడ సక్రియప్ప
2) వీడీ దేశ్‌పాండే
3) కాశీనాథరావు వైద్య
4) కొండా వెంకటరంగారెడ్డి
151. బూర్గుల రామకృష్ణారావు స్మారక అవార్డు మొదటి గ్రహీత?
1) కాళోజీ నారాయణరావు
2) భూపతి కృష్ణమూర్తి
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు
152. డా. బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ కోసం తన అభిప్రాయాలను తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాసినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షడు ఎవరు?
1) డీకే బారువా
2) హెచ్ఎన్ బగుణ
3) జేబీ కృపలాని
4) యూఎన్ దేబర్
153. మరి చెన్నారెడ్డి ముందస్తు (పీడీ) చట్టం ప్రకారం 1969 జూలై నెలలో అరెస్టయిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి కింద ఉద్యమాన్ని కొనసాగించిన నాయకురాలు ఎవరు?
1) దుర్గా భక్తవత్సలం 2) సదాలక్ష్మి
3) రోడా మిస్త్రీ 4) సంగెం లక్ష్మిబాయి
154. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తక రచయిత ఎవరు?
1) ఎన్జీ రంగా 2) గద్దె లింగయ్య
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) రావి నారాయణ రెడ్డి
155. ‘అణా గ్రంథమాల’ పుస్తక సంస్థను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు?
1) వెల్దుర్తి మాణిక్యరావు
2) కేసీ గుప్తా
3) కొమరాజు లక్ష్మణరావు
4) నాయిని వెంకట రంగారావు
156. జతపర్చండి?
ఎ. సత్యార్థి ప్రకాశిక
1. ప్రెగడ వెంకటేశ్వరరావు
బి. దక్షిణ ఇండియా
2. రెవరెండ్ ఆల్ఫ్రెడ్ బన్సన్
సి. మన వ్యవసాయం 3. హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం
డి. వెలుగు వార పత్రిక 4. డవరం
విశ్వనాథ్
ఇ. గౌడ పత్రిక 5. కక్కేర్ల కాశీనాథం
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-2, బి-1, సి-3, డి-4 , ఇ-5
3) ఎ-1, బి-2, సి-4, డి-3 , ఇ-5
4) ఎ-1, బి-2, సి-5, డి-4 , ఇ-3
157. కింది వాటిలో సరైంది?
ఎ. నా తెలంగాణ కోటిగాయాల వీణ- కాళోజీ
బి. బండెనక బండికట్టి- బండి యాదగిరి
సి. ఈ నేల మనదిరా-ఈ ఊరు మనదిరా- గూడ అంజయ్య
1) బి, సి 2) ఎ, సి
3) ఎ, బి 4) పైవన్నీ సరైనవే
158. ఆపరేషన్ పోలో సమయంలో భారత రక్షణ శాఖ మంత్రి?
1) బల్దేవ్ సింగ్ 2) కేఎం మున్షీ
3) రాయ్ బుచానన్ 4) మీర్ లాయక్ అలీ
159. పోలీస్ చర్య అనంతరం మిలిటరీ, పౌర ప్రభుత్వం కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరికానిది?
ఎ. హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ, పోలీస్ , ఎక్సైజ్ శాఖల్లో పనిచేసే వేలాదిమంది ముస్లింలను తొలగించారు
బి. తొలగించిన వారి స్థానంలో నాన్-ముల్కీలను నియమించారు?
సి. జేఎన్ దరి ఆధ్వర్యంలో మిలిటరీ ప్రభుత్వం ‘హైదరాబాద్ సివిల్ సర్వీసెస్’ కు 1949 నవంబర్ 1న నిజాం చేత ఫర్మానా జారీ చేయించారు. ఈ ఫర్మానాలో మరోసారి ఆర్టికల్ 39ని సవరించారు?
1) 1 సరైనది, 2, 3 సరైనవికావు
2) 2 సరైనది, 1, 3 సరైనవికావు
3) పైవన్నీ సరైనవే
4) ఏదీకాదు
160. హైదరాబాద్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించకుండా స్టేట్స్-రీ-ఆర్గనైజేషన్ కమిటీకి దానికి అనుగుణంగా విజ్ఞాపనను అందించింది ఎవరు?
1) పండిత్నరేంద్రజీ
2) పండిత్ వినాయక రావు
3) గోపాల్ రావు ఎక్బోటె
4) కొత్తూరు సీతయ్య గుప్తా
161. బి. శ్యామ్‌సుందర్‌కి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) 1954లో ఆల్ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు
2) దళితులు తమ ఆత్మగౌరవ చిహ్నాలుగా అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించే కార్యక్రమాన్ని బీదర్‌లో ప్రారంభించాడు
3) ఇతను రచించిన గ్రంథం- దేబర్న్ (ఆనాటి హైదరాబాద్ దళితుల స్థితిగతులను తెలుపుతుంది)
4) ఏదీకాదు
162. ‘మన తెలంగాణం’ గ్రంథ రచయిత ఎవరు?
1) శేషాద్రి రమణ కవులు
2) కొమరాజు లక్ష్మణ రావు
3) ఆదిరాజు వీరభద్రరావు
4) మాడపాటి హన్మంతరావు
163. వేయిపడగలను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించినది?
1) బూర్గుల రామకృష్ణారావు
2) సి.నారాయణ రెడ్డి
3) విశ్వనాథ సత్యనారాయణ
4) పీవీ నరసింహారావు
164. ఆధునిక కాలంలో వెలువడిన ‘మొట్టమొదటి తెలుగు కవితా సంకలనం’ (తెలంగాణ కవులకు సంబంధించింది) ఏది?
1) గోల్కొండ కవుల సంచిక
2) హితబోధిని
3) బాలసరస్వతి సంచిక 4) కనకతార
165. ‘వీర తెలంగాణ- నా అనుభవాలు, జ్ఞాపకాలు’ గ్రంథ రచయిత?
1) రావి నారాయణ రెడ్డి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) దేవులపల్లి రామానుజరావు
4) మేల్కొటే
166. పల్లె పల్లెనా పల్లేరు మొలిసే.. పాట రచయిత?
1) గోరటి వెంకన్న 2) అందెశ్రీ
3) వందేమాతరం శ్రీనివాసరావు
4) మిత్ర
167. ‘జై బోలో తెలంగాణ’ సినిమా దర్శకుడు ఎవరు?
1) వంశీ పైడిపల్లి
2) ఎన్. శంకర్
3) ఆర్. నారాయణ మూర్తి
4) అల్లాణి శ్రీధర్
168. జతపర్చండి?
ఎ. కాళోజీ నారాయణరావు 1.సారస్వత వ్యాస ముక్తావళి
బి. బూర్గుల రామకృష్ణారావు 2. శాలివాహన గాథాసప్తశతి
సి. రాళ్లపల్లి అనంత కృష్ణశాస్త్రి 3. వైతాళిక సమితి
డి. దివాకర్ల వెంకట అవధాని 4. సాహిత్య సోపానాలు
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-3, సి-2, డి-4
169. జతపర్చండి?
ఎ. సురవరం ప్రతాపరెడ్డి 1. త్యాగమూర్తులు
బి. పాశం నారాయణ రెడ్డి 2. గోల్కొండ కవుల సంచిక
సి. దేవులపల్లి రామానుజరావు 3. మిఠాయి చెట్టు
డి. ఆదిరాజు వీరభద్రరావు 4. మనదేశం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
170. కింది వాక్యాల్లో సరైనది?
ఎ. చందాల కేశవదాసు ‘కనకతార’ అనే నాటకాన్ని రచించి ఆధునిక నాటకరచనకు పునాది వేశారు ( 1911లో)
బి. రత్నమాంబ దేశాయి ‘హితబోధిని’ పత్రికలో స్త్రీలు విద్యలోనూ, కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధం కావాలని అద్భుతమైన పద్యాలను రాసింది
సి. కోదాటి నారాయణ రావు ‘ప్రగతి, బాలసరస్వతి’ అనే పత్రికలను నడిపాడు
1) ఎ మాత్రమే 2) బి, సి సరైనది
3) ఎ, సి సరైనది 4) పైవన్నీ సరైనవే
సమాధానాలు
129-3, 130-4, 131-2, 132-4, 133-4, 134-3, 135-4, 136-4, 137-2, 138-3, 139-3, 140-1, 141-2, 142-2, 143-1, 144-1, 145-2, 146-3, 147-3, 148-4, 149-4, 150-1, 151-1, 152-4, 153-2, 154-3, 155-2, 156-1, 157-1, 158-1, 159-3, 160-4, 161-4, 162-3, 163-4, 164-1, 165-1, 166-4, 167-2, 168-1, 169-1, 170-4.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు