26 నుంచి ప్రైమరీ టీచర్లకు శిక్షణ
-ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి
రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఈ నెల 26 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) డైరెక్టర్ ఎం రాధారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో ఈ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడం, సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం, సులభ పద్ధతిలో గణితం అర్థమయ్యేలా బోధించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈ తరగతులకు ప్రతిజిల్లా నుంచి తెలుగు, ఇంగ్లిష్ మీడియం టీచర్లు నలుగురు, ఉర్దూలో నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ నెల 21లోపు పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. వివరాలకు tgscertct@gmail.comలో సంప్రదించాలని సూచించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు