ఆపరేషన్ పోలో సమయంలో భారత సైన్యాధిపతి ? ( తెలంగాణ చరిత్ర)
గత తరువాయి
89. ముల్కీ లీగ్ ప్రధాన లక్ష్యాలకు సరికానిది?
1) బ్రిటిష్ వారిని, నాన్ ముల్కీలను ప్రత్యర్థులుగా భావించింది
2) నిజాం సార్వభౌమత్వం, రాజ్యాంగ బద్ధమైన పరిపాలన, పూర్వం అమల్లో ఉన్న జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలి
3) దక్కన్ సంస్కృతి, భాష పరిరక్షణకు పాటుపడింది
4) బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు ఉద్యమించలేదు
90. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు?
1) జేఎన్ దరి 2) ఎంకే వెల్లోడి
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) మీర్ నవాబ్ యార్జంగ్
91. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది?
1) 1952 డిసెంబర్ 28
2) 1953 డిసెంబర్ 28
3) 1954 డిసెంబర్ 28
4) 1955 డిసెంబర్ 28
92. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు చెందిన వారిని జతపర్చండి?
1. పరిశ్రమలు, వాణిజ్యమంత్రి ఎ. ఫూల్ చంద్ గాంధీ
2. పబ్లిక్‌వర్క్ మంత్రి బి. సీ జగన్నాథరావు
3. న్యాయశాఖ మంత్రి సి. మెహదీ నవాబ్ జంగ్ బహదూర్
4. విద్య, ఆరోగ్యమంత్రి డి. కొరాట్క వినాయకరావు
1) 1-డి, 2-బి, 3-సి,4-ఎ 2) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
3) 1-డి, 2-సి, 3-బి,4-ఎ 4) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
93. వరంగల్ జిల్లాలో ముల్కీ ఉద్యమంపై ఏర్పడిన ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ ఏ రోజున తీర్మానం చేశారు?
1) 1952 జూలై 28 2) 1952 జూలై 26
3) 1952 జూలై 31 4) 1952 ఆగస్టు 1
94. నాన్ ముల్కీలను తొలగించి ముల్కీరూల్స్ అమలుకు మంత్రివర్గ సబ్‌కమిటీని నియమించాలని బుచ్చయ్య ఆధ్వర్యంలో బూర్గులను ఎప్పుడు కలిశారు?
1) 1952 ఆగస్టు 6
2) 1952 ఆగస్టు 16
3) 1952 ఆగస్టు 3
4) 1952 ఆగస్టు 28
95. 1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ దగ్గర జరిగిన కాల్పుల్లో ఎంతమంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి కమిషన్ పేర్కొన్నది?
1) 8 మంది 2) 4 గురు
3) 16 మంది 4) 26 మంది
96. ఆపరేషన్ పోలోలో వైమానిక దళానికి నాయకత్వం వహించింది ఎవరు?
1) ఎరిక్ గొడార్డ్ 2) జేఎన్ దరి
3) సుబ్రతో ముఖర్జీ 4) మహరాజ్ సింగ్
97. 1952 హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో ఏ పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేసింది?
1) సోషలిస్ట్ పార్టీ
2) పీజంట్ అండ్ వర్కర్క్ పార్టీ
3) పీడీఎఫ్ 4) ఏదీకాదు
98. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సరికానిది?
1) కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య-93, ఓట్ల శాతం 41.86శాతం
2) పీడీఎఫ్ గెలిచిన స్థానాల సంఖ్య- 42, ఓట్ల శాతం 25.76శాతం
3) సోషలిస్టు పార్టీ 12, ఇతరులు 29
4) పైవన్నీ సరైనవే
99. ముల్కీ ఉద్యమం సమయంలో ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఏ రోజున ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు?
1) 1962 సెప్టెంబర్ 3
2) 1962 సెప్టెంబర్ 4
3) 1952 సెప్టెంబర్ 2
4) 1, 2
100. ఆపరేషన్ పోలో ఎప్పటినుంచి ఎప్పటి వరకు జరిగింది?
1) 1948 సెప్టెంబర్ 10-17
2) 1948 సెప్టెంబర్ 13-16
3) 1948 సెప్టెంబర్ 13-18
4) 1948 సెప్టెంబర్ 13-17
101. వరంగల్‌లో జరిగిన ‘విశాలాంధ్ర మహాసభ’ను సమర్థించిన తెలంగాణ కవి?
1) వట్టికోట ఆళ్వార్‌స్వామి
2) కాళోజీ నారాయణరావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు
102. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థానం సైన్యాధిపతి ఎవరు?
1) కాశీం రజ్వీ
2) మీర్ దిన్ యార్ జంగ్
3) ఈఎల్ ఎండ్రూస్
4) మీర్ నవాజ్ జంగ్
103. కింది ఏ సమస్యలు 1953లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేశాయి?
1) తెలంగాణ సాయుధ పోరాట ప్రతిఫలం
2) నాన్-ముల్కీ వ్యతిరేక ఉద్యమం
3) ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, వ్యాపారులపై వ్యతిరేకత, జరిగిన ఘర్షణలు
4) పైవన్నీ
104. తెలంగాణ ప్రాంతంపై మొదటిసారిగా ఆంధ్రుల దాడి మొదట దేనిపై జరిగింది?
1) భాష 2) సంస్కృతి
3) వేషధారణ 4) పైవన్నీ
105. అపరేషన్ పోలో ప్రణాళిక సృష్టికర్త ఎవరు?
1) జేఎన్ దరి 2) మహరాజ్ సింగ్
3) ఎరిక్ గొడార్డ్ 4) డీఎస్ బ్రాగ్
106. జతపర్చండి?
1. జేఎస్ దరి ఎ. హైదరాబాద్ రెట్రో
2. వీపీ మీనన్ బి. ఆపరేషన్ పోలో
3. అలీ యావర్జంగ్ సి. హైదరాబాద్ రుఫాన్
4. రమేష్ థాపర్ డి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్
1) 1-బి, 2-డి, 3-ఎ,4-సి 2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
3) 1-డి, 2-సి, 3-బి,4-ఎ 4) 1-బి, 2-డి, 3-ఎ,4-సి
107. ‘దశబోధ’ గ్రంథ రచయిత ఎవరు?
1) సంకుసాల నృసింహ కవి
2) సారంగు తమ్మయ్య
3) వాజిహీ 4) కంచర్ల గోపన్న
108. ‘కవికర్ణ రసాయనం’ గ్రంథకర్త ఎవరు?
1) సారంగు తమ్మయ్య
2) సంకుసాల నృసింహ కవి
3) అద్దంకి గంగాధర కవి
4) కంచర్ల గోపన్న
109. అచ్చ తెలుగు గ్రంథం ‘యయాతి చరిత్ర’ రచయిత?
1) తెలగనార్యుడు
2) కందుకూరి రుద్రకవి
3) గంగాధరుడు
4) సారంగు తమ్మయ్య
110. జతపర్చండి?
ఎ. హైదరాబాద్ సంచిక 1. మర్రిచెన్నారెడ్డి
బి. హైదరాబాద్ పత్రిక 2. భాగ్యరెడ్డి వర్మ
సి. దేశబంధు 3. తెలంగాణ లిటరరీ అసోసియేషన్
డి. దేశ వాజ్మయ 4. బెల్లంకొండ నరసింహాచార్యులు
1) ఎ-2, బి-1, సి-3, డి-4 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3 4) ఎ-2, బి-1, సి-4, డి-3
111. కింది వాటిలో సరైన జత ఏది?
1. పండితారాధ్య చరిత్ర ఎ. బద్దెన
2. భోగినీ దండకం బి. పాల్కురికి సోమనాథుడు
3. నృసింహ పురాణం సి. ఎర్రన
4. రంగనాథ రామాయణం డి. ళక్కి భాస్కరుడు
112. ‘దక్షిణ భారతదేశపు నాణేలు’ గ్రంథం రచయిత ఎవరు?
1) ఇలియట్ 2) అబ్దుల్ వాలీ
3) శేర్వాణి 4) రాంప్సన్
113. ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ గ్రంథ రచయిత?
1) వెల్లోడి 2) కేఎం మున్షీ
3) లాయక్ అలీ 4) జేఎన్ దరి
114. కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది?
1) క్రీడాభిరామం
2) సకలనీతి సమ్మతం
3) సుమతీ శతకం
4) భోగినీ దండకం
115. తెలంగాణలో ‘అభ్యదయ కవిత్రయం’ గా ఎవరిని పేర్కొంటారు?
1) కాళోజీ, దాశరథి, ధవళ శ్రీనివాసరావు
2) కాళోజీ, సినారె, వట్టికోట ఆళ్వార్ స్వామి
3) కాళోజీ, దాశరథి, సినారె
4) ఏదీకాదు
116. కవులు-వారి రచనలు జతపర్చండి?
1. పులిపాటి గురుస్వామి ఎ. బొక్కెన లొల్లి
2. హరగోపాల్ బి. ఎన
3. దొడ్డి రామ్మూర్తి సి. మూలకం
4. ఎన్ వెంకట్ డి. జీవిగంజి
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
117. ‘దేశోద్ధారక’ గ్రంథమాలను స్థాపించినది ఎవరు?
1) వట్టికోట ఆళ్వార్‌స్వామి
2) కాళోజీ
3) బూర్గుల రామకృష్ణారావు
4) మాడపాటి హన్మంతరావు
118. జతపర్చండి?
ఎ. నవ్యసాహితీ సమితి 1. దేవుళ్లపల్లి రామానుజరావు
బి. వైతాళిక సమితి 2. రావి నారాయణ రెడ్డి
సి. ఆంధ్ర సాహిత్యపరిషత్ 3. కాళోజీ నారాయణరావు
డి. విజ్ఞానవర్ధిని పరిషత్ 4. సురవరం ప్రతాపరెడ్డి
1) ఎ-2, బి-3, సి-1, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4 4) ఎ-1, బి-2, సి-3, డి-4
119. విజ్ఞానచంద్రిక మండలి గ్రంథాలయం నుంచి ‘చిలుకూరి వీరభద్రరావు’ నాయకత్వంలో ప్రచురించిన గ్రంథం?
1) ఆంధ్రుల చరిత్ర
2) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
3) ఆంధ్రుల చరిత్ర సంస్కృతి
4) ఏదీకాదు
120. తెలుగులో తొలి లక్షణ గ్రంథం ఏది?
1) నీతిశాస్త్ర ముక్తావళి- బద్దెగుడు
2) సమతీ శతకం- బద్దెన
3) విక్రమార్జున విజయం- పంపడు
4) కవిజనాశ్రయం- మల్లియ రేచన
121. జతపర్చండి?
ఎ. రైతు గ్రంథాలయం
1. రావి నారాయణ రెడ్డి
బి. ఆది-హిందూ లైబ్రరీ
2. బీఎస్ వెంకట్రావు
సి. గాంధీ గ్రంథాలయం
3. బండారు నాగభూషణ్ రావు
డి. ఆర్మూర్ సంచార గ్రంథాలయం
4. టీకే బాలయ్య
ఇ. సార్వజనిక గ్రంథాలయం
5. ముదిగొండ శంకరాధ్యులు
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-2, బి-3, సి-1, డి-4, ఇ-5
3) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
4) ఎ-1, బి-2, సి-4, డి-3 , ఇ-5
122. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి…అనే గేయాన్ని రచించింది ఎవరు?
1) గద్దర్ 2) బండి యాదగిరి
3) దాశరథి 4) దొడ్డి కొమురయ్య
123. భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై శ్వేతపత్రాన్ని ఎప్పుడు విడుదల చేసింది?
1) 1948 జూలై 20 2) 1948 జూలై 26
3) 1948 జూన్ 30 4) 1948 జూన్ 25
124. పార్లమెంటులో భారత ప్రధాని నెహ్రూ హైదరాబాద్ భారతదేశంలో భాగమే అని ఎప్పుడు పేర్కొన్నాడు?
1) 1948 సెప్టెంబర్ 7
2) 1948 సెప్టెంబర్ 8
3) 1948 సెప్టెంబర్ 9
4) 1948 సెప్టెంబర్ 10
125. భారత్‌పై యూఎన్వో లో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు నిజాం.. కేబుల్ ద్వారా భద్రతా మండలికి ఎప్పుడు తెలియజేశాడు?
1) 1948 సెప్టెంబర్ 18
2) 1948 సెప్టెంబర్ 20
3) 1948 సెప్టెంబర్ 21
4) 1948 సెప్టెంబర్ 22
126. ఆపరేషన్ పోలో సమయంలో భారత సైన్యాధిపతి ఎవరు?
1) బల్దేవ్సింగ్ 2) రాయ్ బుచర్
3) వల్లభాయ్ పటేల్ 4) జేఎన్ దరి
127. జతపర్చండి?
ఎ. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర 1. హైదరాబాద్ (కింగ్ కోఠి) భాషా నిలయం (1901)
బి. రాజరాజనరేంద్ర ఆంధ్ర 2. హన్మకొండ భాషా నిలయం (1904)
సి. ఆంధ్ర సంవర్ధిని (1905) 3.సికింద్రాబాద్
డి. విజ్ఞాన చంద్రిక మండలి 4. హైదరాబాద్ (1906) (చాదర్‌ఘాట్)
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-1, బి-4, సి-2, డి-3
128. కవులు-వారిని పోషించిన రాజుల ఆధారంగా కింది వాటిలో సరికాని జత?
1) పంపడు- రెండో హరికేసరి
2) సోమదేవసూరి- మూడో హరికేసరి
3) పొన్నడు- మూడో కృష్ణుడు
4) రన్నడు- రెండో సోమేశ్వరుడు
129. ‘మొఘల్ చెరువు’ శాసనం ఎవరి కాలం నాటిది?
1) కాకతీయులు
2) తూర్పు చాళుక్యులు
3) ముదిగొండ చాళుక్యులు
4) వేములవాడ చాళుక్యులు
సమాధానాలు
89-4, 90-2, 91-1, 92-3, 93-1, 94-1, 95-2, 96-4, 97-3, 98-4, 99-4, 100-4, 101-2, 102-3, 103-4, 104-1, 105-3, 106-1, 107-1, 108-2, 109-1, 110-4, 111-3, 112-1, 113-3, 114-2, 115-3, 116-1, 117-1, 118-1, 119-1, 120-4, 121-1, 122-2, 123-2, 124-1,
125-4, 126-2, 127-1, 128-4, 129-3,
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు