సూర్యుడిని అనుసరించే వర్షపాతం ఏ ఖండంలో ఉంది?
ఆసియా ఖండం
1. ఆగ్నేయాసియాలోని ఏకైక భూపరివేష్టిత దేశం?
1) వియత్నాం 2) కాంబోడియా
3) లావోస్ 4) థాయిలాండ్
2. ఆగ్నేయాసియాలోని ‘గోల్డెన్ ట్రయాంగిల్’ కింది వాటిలో దేనికి ప్రసిద్ధి?
1) కోకో 2) ఓపియం తయారీ
3) ఓట్స్ 4) తగరం
3. మధ్య ఆసియాలోని అఫ్గానిస్థాన్‌లోని ‘గోల్డెన్ క్రిసెంట్’ దేనికి ప్రసిద్ధి
1) కోకో 2) ఓపియం తయారీ
3) కొకైన్ 4) తగరం
4. వలసరాజ్య స్థాపన జరుగని ఆగ్నేయాసియా దేశం?
1) ఇండోనేషియా 2) థాయిలాండ్
3) లావోస్ 4) మలేషియా
5. ఉత్తరం నుంచి దక్షిణానికి విస్తరించి ఉన్న పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని సముద్రాల వరుస క్రమాన్ని గుర్తించండి?
1) సీ ఆఫ్ ఒకాట్స్కా, తూర్పు చైనా సముద్రం, జపాన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రం
2) సీ ఆఫ్ ఒకాట్సా, తూర్పు చైనా సముద్రం, జపాన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రం
3) తూర్పు చైనా సముద్రం, సీ ఆఫ్ ఒకాట్స్కా, జపాన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రం
4) జపాన్ సముద్రం, సీ ఆఫ్ ఒకాట్స్కా, తూర్పుచైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం
6. సముద్రాలన్నింటిలో అతిపెద్ద సముద్రం?
1) మధ్యధరా 2) బాల్టిక్
3) తూర్పు చైనా 4) దక్షిణ చైనా
7. తూర్పు ప్రాచ్యంలో ఏకైక క్రిస్టియన్ దేశం?
1) మయన్మార్ 2) ఫిలిప్పైన్స్
3) జపాన్ 4) థాయిలాండ్
8. కింది వాటిలో జపాన్‌కు, రష్యాకు మధ్య వివాదాస్పద దీవి?
1) స్పార్లీ 2) కురైల్
3) వ్రాంగల్ 4) టోంగా
9. ఆసియా, ఉత్తర అమెరికాను వేరుచేస్తున్న జలసంధి?
1) మలక్కా 2) బాస్పరస్
3) బేరింగ్ 4) హార్మోజ్
10. ప్రపంచంలో పొడవైన జలసంధి?
1) మలక్కా 2) బాస్పరస్
3) బేరింగ్ 4) టాటార్
11. చైనాలోని తక్లమకాన్ ఎడారి పీఠభూమి ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
1) కున్లున్-హిమాలయాలు
2) కారకోరం- హిమాలయాలు
3) జాగ్రోస్- ఎలబ్రిజ్
4) టియాన్వోన్- కున్లున్
12. కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లో అముదార్య, సిరదార్య నదుల నిక్షేపణ వల్ల ఏర్పడిన మైదానం?
1) మెసపటోమియా 2) ఏషియామైనర్
3) తురానియన్ 4) తారీమ్
13. దుస్త్- కవిర్ ఎడారి ఏ దేశంలో ఉంది?
1) ఇరాన్ 2) సౌదీ అరేబియా
3) ఇరాక్ 4) కువైట్
14. మెసపటోమియా మైదానం ఏ దేశంలో ఉంది?
1) ఇరాన్ 2) సౌదీ అరేబియా
3) ఇరాక్ 4) కువైట్
15. ప్రపంచ జనాభాలో ఆసియా జనాభా ఎంత శాతం ఉంది?
1) 50 శాతం 2) 70 శాతం
3) 60 శాతం 4) 80 శాతం
1-3, 2-2, 3-2, 4-2, 5-1, 6-4, 7-2, 8-2, 9-3, 10-4 11-4, 12-3, 13-1, 14-3, 15-3
ఆఫ్రికా ఖండం
1. భూమధ్య రేఖ, కర్కటరేఖ, మకరరేఖ వెళ్తున్న ఏకైక ఖండం?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా 4) ఉత్తర అమెరికా
2. నాలుగు అర్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండం?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా 4) ఉత్తర అమెరికా
3. ఆసియా ఖండంతో ఏ భూ సంధి ద్వారా ఆఫ్రికా ఖండం అనుసంధానం అవుతుంది?
1) సూయజ్ 2) విస్తమస్
3) క్రా 4) లెస్త్
4. ఏ భూస్వరూపాలు ఆఫ్రికా ఖండాన్ని యురేషియా నుంచి వేరుచేస్తున్నాయి?
1) జిబ్రాల్టర్ జలసంధి
2) సూయజ్ కాలువ
3) జాబ్-ఎల్-మాండెబ్ జలసంధి
4) పైవన్నీ
5. దక్షిణాఫ్రికా భూభాగంతో పరివేష్టితమై ఉన్న దేశం?
1) బోట్సానా 2) అంగోలా
3) లెథో 4) కెన్యా
6. ఆఫ్రికా ఖండంలో మధ్యధరా శీతోష్ణస్థితి గల దేశాలు ఏవి?
1) మొరాకో 2) ట్యునీషియా, అల్జీరియా
3) దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్
4) పైవన్నీ
7. మధ్యధరా సముద్రపు తాళపుచెవి అని ఏ జలసంధిని పిలుస్తారు?
1) జిబ్రాల్టర్ 2) బాబ్-ఎల్-మాండేబ్
3) ఏడెన్ 4) హార్మోజ్
8. గోల్డ్‌కోస్ట్ అని ఏ దేశ తీరాన్ని పిలుస్తారు?
1) లైబీరియా 2) నైజీరియా
3) ఐవరీ కోస్ట్ 4) ఘనా
9. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం?
1) కెన్యా శిఖరం 2) కిలిమంజారో
3) రువెంజరో 4) కేమరూన్
10. గేట్ వే ఆఫ్ టియర్స్ అని దేన్ని పిలుస్తారు?
1) జిబ్రాల్టర్ 2) బాబ్- ఎల్ -మాండేబ్
3) ఏడెన్ 4) హార్మోజ్
1-2, 2-2, 3-1, 4-4, 5-3, 6-4, 7-1, 8-4, 9-2, 10-2.
ఉత్తర అమెరికా ఖండం
1. ఉత్తర అమెరికా ఖండాన్ని నిలువుగా రెండు భాగాలుగా విభజిస్తున్న రేఖాంశం ఏది?
1) 100 డిగ్రీల తూర్పు రేఖాంశం
2) 100 డిగ్రీల పశ్చిమ రేఖాంశం
3) 110 డిగ్రీల తూర్పు రేఖాంశం
4) 110 డిగ్రీల పశ్చిమ రేఖాంశం
2. యూఎస్ఏ, కెనడాను వేరుచేస్తున్న సరిహద్దు ఏది?
1) 39 డిగ్రీల ఉత్తర అక్షాంశం
2) 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం
3) 49 డిగ్రీల ఉత్తర అక్షాంశం
4) 59 డిగ్రీల ఉత్తర అక్షాంశం
3. అట్లాంటిక్, పసిఫిక్ తీరరేఖ కలిగిన దేశం?
1) పనామా 2) బెలిజె
3) నికరాగ్వ 4) హొండూరస్
4. ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం?
1) చిలీ 2) చైనా
3) కెనడా 4) అమెరికా
5. సిలికాన్ వ్యాలి, గోల్డెన్ సిటీగా పిలిచే నగరం ఏది?
1) లాస్ఏంజిల్స్ 2) శాన్ ఫ్రాన్సిస్కో
3) కాలిఫోర్నియా 4) సియాటెల్
6. ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాప్ట్ అసెంబ్ల్లింగ్ కేంద్రం ఎక్కడ ఉంది?
1) లాస్ ఏంజిల్స్ 2) శాన్ ఫ్రాన్సిస్కో
3) కాలిఫోర్నియా 4) సియాటెల్
7. ప్రపంచంలో అతిపెద్ద సింథటిక్ రబ్బరు, టైర్ల తయారీ కేంద్రం ఎక్కడ ఉంది?
1) లాస్ ఏంజిల్స్ 2) శాన్ ఫ్రాన్సిస్కో
3) ఆక్రాన్ 4) సియాటెల్
8. కెనడాలోని ‘సడ్బరీ’ ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
1) నికెల్ 2) ఇనుము
3) కాపర్ 4) ప్లాటినం
9. ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఏ ప్రాంతాల మధ్య ఉంది?
1) బెర్ముడా దీవి, ఫ్లోరిడా, పోర్టోరికా దీవుల మధ్య
2) బెర్ముడా, జమైకా, పోర్టోరికా దీవుల మధ్య
3) బెర్ముడా, ఏంటలీస్, పోర్టోరికా దీవుల మధ్య
4) బెర్ముడా, ఏంటలీస్, కరోలినా దీవుల మధ్య
10. ప్రపంచంలో పొడవైన సాండ్ బార్ / ఇసుక తిన్నె ఏది?
1) ఫండి 2) బఫిన్
3) చెస్పాక్ 4) ఏదీకాదు
11. ప్రపంచ పరిమాణంలో పెద్ద జలసంధి?
1) బేరింగ్ 2) హార్నోజ్
3) డేవిస్ 4) జిబ్రాల్టర్
12. ప్రపంచంలో ఆటోమొబైల్ తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) న్యూయార్క్ 2) డెట్రాయిట్
3) పిట్స్బర్గ్ 4) ఆక్రాన్
1-2, 2-3, 3-4, 4-3, 5-2, 6-4, 7-3, 8-4, 9-1, 10-3 11-3, 12-2
ఐరోపా ఖండం
1. ‘డెట్రాయిట్ ఆఫ్ ఇటలీ’ అని దేన్ని పిలుస్తారు?
1) మిలాన్ 2) ఫిలాండ్
3) రెక్టావిక్ 4) టూరిన్
2. కింది వాటిలో ఐరోపాలోని భూపరివేష్టిత దేశం?
1) ఇటలీ 2) జర్మనీ
3) పోలెండ్ 4) స్విట్జర్లాండ్
3. పచ్చల ద్వీపం (ఎమరాల్డ్ ఐలాండ్) అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) ఐర్లాండ్ 2) ఇటలీ
3) స్విట్జర్లాండ్ 4) క్రిమియా
4. ఐరోపా క్రీడా మైదానంగా ఏ దేశాన్ని పిలుస్తారు?
1) బోస్నియా 2) ఇటలీ
3) స్విట్జర్లాండ్ 4) కిమియా
5. కాక్ పిట్ ఆఫ్ యూరప్ (యుద్ధరంగ దేశం) అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ
3) బెల్జియం 4) ఇటలీ
6. ఐరోపాలోని లొరైన్ బొగ్గుక్షేత్రం ఏ దేశంలో ఉంది?
1) పోలెండ్ 2) ఫ్రాన్స్
3) ఉక్రెయిన్ 4) రష్యా
7. లొంబార్డి నౌకా నిర్మాణ పరిశ్రమ ఏ దేశంలో ఉంది?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ
3) బెల్జియం 4) ఇటలీ
8. బ్రిస్కే అఖాతం ఏ దేశాలను వేరుచేస్తుంది?
1) స్వీడన్, ఫిన్లాండ్
2) బ్రిటన్, ఫ్రాన్స్
3) ఫ్రాన్స్, స్పెయిన్
4) ఫిలాండ్, ఎస్టోనియా
9. ఇంగ్లిష్ ఛానల్ ఏ దేశాల మధ్య ఉంది?
1) స్వీడన్, ఫిన్లాండ్
2) బ్రిటన్, ఫ్రాన్స్
3) ఫ్రాన్స్, స్పెయిన్
4) ఫిలాండ్, ఎస్టోనియా
10. యూరప్‌ను, ఆఫ్రికాను వేరుచేస్తున్న సముద్రం?
1) మధ్యధరా సముద్రం
2) బాల్టిక్ సముద్రం
3) ఏడ్రియాటిక్ సముద్రం
4) నల్లసముద్రం
1-4, 2-4, 3-2, 4-3, 5-3, 6-2, 7-4, 8-3, 9-2, 10-1
ఆస్ట్రేలియా
1. ద్వీపఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
1) ఐరోపా 2) ఆఫ్రికా
3) ఆసియా 4) ఆస్ట్రేలియా
2. ఆస్ట్రేలియాను కనుగొన్న నావికుడు?
1) లివింగ్స్టన్ 2) హెన్రీస్టాన్లీ
3) కెప్టెన్ కుక్ 4) వెస్పూచి
3. కింబర్లీ పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
1) ఆఫ్రికా 2) ఆసియా
3) ఆస్ట్రేలియా 4) ఐరోపా
4. సిమన్స్ ఎడారి ఆస్ట్రేలియాలోని ఏ ప్రాంతంలో ఉంది?
1) ఉత్తర ఆస్ట్రేలియా
2) దక్షిణ ఆస్ట్రేలియా
3) పశ్చిమ ఆస్ట్రేలియా
4) తూర్పు ఆస్ట్రేలియా
5. ఆస్ట్రేలియా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం?
1) మౌంట్ ఈసా 2) బ్రోకెన్ హిల్స్
3) క్వాసియాస్కో 4) ఏదీకాదు
6. ఆస్ట్రేలియా ఖండ ముఖద్వారం అని దేన్ని పిలుస్తారు?
1) కాన్బెరా 2) బ్రిస్బేన్
3) సిడ్నీ 4) డార్విన్
7. ఆస్ట్రేలియా, న్యూగినియాను వేరుచేస్తున్న జలసంధి?
1) బాస్ 2) టోరస్ 3) ఐర్ 4) బార్బరస్
8. ఆస్ట్రేలియా, టాస్మానియాను వేరుచేస్తున్న జలసంధి?
1) బాస్ 2) టోరస్
3) ఐర్ 4) బార్బరస్
9. న్యూజిలాండ్‌లోని ఉత్తర, దక్షిణ దీవులను వేరుచేస్తున్న జలసంధి?
1) బాస్ 2) టోరస్
3) ఐర్ 4) బార్బరస్
10. ప్రపంచంలోని అతిపెద్ద ప్రవాళ బిత్తిక ఏది?
1) గ్రేట్ బారియర్ రీఫ్2) ఇండోనేషియా
3) గ్వాలపాగస్ 4) ఏదీకాదు
1-4, 2-3, 3-3, 4-1, 5-3, 6-4, 7-2, 8-1, 9-3, 10-1
దక్షిణ అమెరికా
1. పక్షి ఖండం, ఆకు ఆకారంలో ఉన్న అందమైన ఖండం అని దేన్ని పిలుస్తారు?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) ఆఫ్రికా 4) ఐరోపా
2. దక్షిణ అమెరికాలో అతి పెద్ద భూపరివేష్టిత దేశం?
1) బొలీవియా 2) పరాగ్వే
3) వెనిజులా 4) ఉరుగ్వే
3. దక్షిణ అమెరికాలో మధ్యధరా శీతోష్ణస్థితి ఎక్కువగా ఉన్న నగరం ఏది?
1) సావోపాలో 2) లాపాస్
3) సాంటియాగో 4) ఆరికా
4. ‘ఘోస్ట్ టౌన్’ అని దేన్ని పిలుస్తారు?
1) సావోపాలో 2) లాపాస్
3) సాంటియాగో 4) ఆరికా
5. ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతం?
1) ఆరికా 2) ఆల్ అజీజియా
3) మృతలోయ 4) ఏదీకాదు
6. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సరస్సు?
1) బైకాల్ 2) విక్టోరియా
3) కాస్పియస్ 4) టిటికా
7. పెరూ తీర ప్రాంతాల్లో పక్షులు వేసే రెట్టలను ఏమని పిలుస్తారు?
1) గుయానో 2) కానుంగో
3) మిలాప్ 4) ఏదీకాదు
8. సూర్యున్ని అనుసరించే వర్షపాతం ఏ ఖండంలో ఉంది?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) ఆసియా 4) ఐరోపా
9. దక్షిణ అమెరికా ఖండంలో ‘ఓరినాకో బేసిన్’ దేనికి ప్రసిద్ధి?
1) కాంపోలు 2) లానోలు
3) వెల్డులు 4) పంపాలు
10. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న జలపాతం?
1) ఏంజిల్స్ 2) నయాగారా
3) ఇగ్వాజో 4) విక్టోరియా
1-2, 2-1, 3-3, 4-4, 5-1, 6-4, 7-1, 8-2, 9-2, 10-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు