వినియోగదారుల హక్కుల చట్టం-2019
# వినియోగదారుల హక్కులపై భారత ప్రభుత్వం 2019లో నూతన చట్టాన్ని రూపొందించింది. దీన్ని ‘వినియోగ దారుల హక్కుల చట్టం-2019’ పేరుతో పిలుస్తున్నారు. ఈ చట్టం 2020 జూలై 20 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం వల్ల వినియోగదారుడు మరింత బలవంతుడు అవుతాడు. వినియోగదారుల రక్షణ మండలాలు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, తయారీ దారులకు శిక్షణ, కల్తీ వస్తువుల అమ్మకం లాంటి విషయాల్లో అనేక నిబంధనలు ఈ చట్టంలో పొందుపరిచారు.
# ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటవుతుంది. ఇది వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అమలు చేయడానికి పనిచేస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగినా, అనుచిత వ్యాపార విధానాలు అవలంబించినట్లు తెలిసినా, తప్పుదారి పట్టించే ప్రకటనలు వెలువరించినా దర్యాప్తు జరిపి ఆ తయారీదారులు లేదా అమ్మకందారులు లేదా ప్రకటనల ప్రచురణ, ప్రసారకర్తల మీద జరిమానాలు విధిస్తుంది.
# ఈ కామర్స్ వేదికలు అనుచిత వ్యాపార విధానాలు అవలంబించకుండా అడ్డుకోవడానికి కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి.
#ఈ చట్టం ప్రకారం కేసు పరిశీలనా పరిధి జిల్లా స్థాయిలో రూ. కోటి, రాష్ట్రస్థాయిలో రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు, జాతీయ స్థాయిలో రూ. 10 కోట్ల కంటే ఎక్కువ జరిమానా విధిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు