ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
-నూతన సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు.. రెండ్రోజుల వర్క్‌షాప్ పూర్తి
– తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం.. ఈ సంవత్సరమే అందుబాటులోకి
ఓపెన్ ఇంటర్‌కు ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త కరిక్యులం, సరికొత్త సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు ముమ్మరం చేసింది. తొలిదశలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, అరబిక్, ఉర్దూ పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నారు. రెండో విడతలో గణితం, జీవశాస్త్రం సహా ఇతర సబ్జెక్టులకు కొత్త కరిక్యులాన్ని రూపొందిస్తారు. కొత్త పుస్తకాలు ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందిన వారికి అందుబాటులోకి వస్తాయి. కరిక్యులం రూపకల్పనలో తెలంగాణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మన చరిత్ర, సంస్కృతి, భాష, సాహితీవేత్తలు, రచయితలకు చోటు కల్పిస్తున్నారు. ఈ పుస్తకాల తయారీకి ఎస్సీఈఆర్టీ ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వహించింది. వర్సిటీల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీల అధ్యాపకులు, ఎస్సీఈఆర్టీ విషయ నిపుణులతో మొత్తం ఎనిమిది కమిటీలు వేశారు.
ఎన్సీఈఆర్టీ ప్రమాణాల మేరకు..
ఇంటర్ విద్యార్థుల కోసం రాష్ట్రంలో 935 స్టడీ సెంటర్లున్నాయి. ఏటా 35 వేల నుంచి 40 వేల మంది వీటి ద్వారా ప్రవేశాలు పొందుతున్నారు. వీరికి ఇన్నాళ్లుగా నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ పుస్తకాల ఆధారంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. పూర్తిగా ప్రశ్నలు, సమాధానాలతో కూడిన ఈ మెటీరియల్‌పై ఆధారపడటం వల్ల విద్యార్థులకు పాఠ్యాంశాలపై సమగ్ర అవగాహన ఉండటంలేదు. పైగా అవి విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదం చేయడం లేదన్న వాదనలున్నా యి. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండ లి (ఎన్సీఈఆర్టీ) కరిక్యులం మార్గదర్శకాల ప్రకారం పాఠ్యపుస్తకాల తయారీకి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిరుడు ఎస్సెస్సీ వారికి కొత్త పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటర్ పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు.
ఓపెన్‌లోనూ తెలుగు తప్పనిసరి
తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018 ద్వారా రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో తెలుగు బోధన అనివార్యమైంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల స్కూళ్లల్లో 1 -10 తరగతి వరకు తెలుగును బోధించాల్సిన పరిస్థితి ఈ చట్టం ద్వారా ఏర్పడింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు