ఎంఈవో కార్యాలయాల్లోనూ ఆధార్
– పాఠశాల విద్యార్థుల కోసం విద్యాశాఖ ఏర్పాట్లు
పాఠశాల విద్యార్థుల ఆధార్ నమోదుపై విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కార్యాలయాల్లో విద్యార్థుల ఆధార్ నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం 449 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను ఎంఈవో కార్యాలయాలకు అందజేసింది. ఈ కిట్లలో ఆధార్ నమోదు ప్రక్రియకు అవసరమైన ల్యాప్‌ట్యాప్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, జీపీఎస్ పరికరం, కెమెరా, స్కైప్, పెన్‌డ్రైవ్ తదితర పరికరాలు ఉంటాయి. పాఠశాల విద్యార్థులు ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి, తమ ఆధార్‌ను ఉచితంగానే నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మండల కేంద్రాల్లోనే ఆధార్ నమోదు చేస్తున్నప్పటికీ, త్వరలో పాఠశాలల్లోనూ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందుకోసం 500 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను తెప్పిస్తున్నారు.
పాఠశాలలోనే ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభించడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. విద్యార్థుల ఉచిత ఆధార్ నమోదులో పాల్గొనే సిబ్బందికి సోమవారం నుంచి జూలై 7 వరకు హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో ఆర్డినేటర్, టెక్నికల్ పర్సన్స్, (ఎంఐఎస్ కో ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్)కు శిక్షణ ఇస్తారు. విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయడానికి, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫాం పంపిణీకి ఆధార్ నంబర్ తప్పనిసరి కావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఆధార్ నమోదుతో పాటు ఐదేండ్లు నిండిన విద్యార్థుల ఆధార్ వివరాలను కూడా ఉచితంగానే అప్డేట్ చేయనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు