SAMETI దేనికి సంబంధించింది?
1. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
1.రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ప్రారంభించారు
2. ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాల్లో రైతుబంధు ఒకటిగా నిలిచింది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
2. తెలంగాణ పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం ఎప్పుడు జరిగింది?
ఎ) 2022 జూన్ 3 నుంచి జూన్ 18
బి) 2022 జూన్ 4 నుంచి జూన్ 19
సి) 2022 జూన్ 2 నుంచి జూన్ 17
డి) 2022 జూన్ 5 జూన్ 20
3. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 19,472 గ్రామాల్లో ‘పల్లె ప్రకృతి వనం’ ఏ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ) పంచాయతీ రాజ్ శాఖ
బి) గ్రామీణాభివృద్ధి శాఖ
సి) అటవీశాఖ డి) ఏదీకాదు
4. తెలంగాణకు హరితహారానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
1. తెలంగాణ వ్యాప్తంగా 5 ఏండ్లలో 230 కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించడం
2. అటవీ ప్రాంతాల్లో 100 కోట్ల మొక్కలు సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటాలి
3. ఇప్పటివరకు హరితహారం కార్యక్రమం 6 విడతలు పూర్తిచేసుకుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
5. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
1. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్ర ప్రభుత్వం కానుకగా ఆహార భద్రత కార్డులో నమోదయిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందిస్తుంది.
2. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆడబిడ్డలకు చిరుకానుక అందించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 2018 నుంచి ప్రభుత్వం ప్రారంభించింది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
6. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
1. ఆడపిల్లల వివాహం భారమైన నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని 2014 అక్టోబర్ 2 న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి వర్తించే విధంగా అమల్లోకి తీసుకువచ్చారు
2. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.1, 00,111 ఆర్థిక సహాయం అందిస్తుంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
7. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి?
1. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో 2017 జూన్ 20న ప్రారంభించారు
2. ఈ పథకంలో ప్రభుత్వ సబ్సిడీ 75 శాతం, లబ్ధిదారుని వాటా 25శాతం
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
8. తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సర కాలానికి ‘తెలంగాణ టెక్స్టైల్ ’ అపెరల్ పాలసీ’ ని ప్రకటించింది?
ఎ) 2018-2022 బి) 2017-2022
సి) 2019-2023 డి) 2016-2023
9. T-Pride అనే కార్యక్రమం దేనికి సంబంధించింది?
ఎ) మత్స్ కారుల అభివృద్ధికి సంబంధించింది
బి) నాయీ బ్రాహ్మణుల ఆర్థిక సహాయానికి సంబంధించింది
సి) చేనేత రంగ అభివృద్ధికి సంబంధించింది
డి) ఎస్సీ, ఎస్టీకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించింది
10.‘భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పటిమ గొప్పది’ అయితే అనేక విమర్శల మూలంగా సామూహిక ఐక్యత ఆశించినంత లేకపోవడం వల్ల సామాజిక అభివృద్ధి ఆశించినంతగా జరగటం లేదు’ అని ఏ పథకం గురించి సీఎం కేసీఆర్ పేర్కొన్నారు?
ఎ) రైతుబంధు బి) దళితబంధు
సి) రైతుబీమా డి) ఏదీకాదు
11. కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) మెదక్ జిల్లా తూప్రాన్
బి) నల్లగొండ జిల్లా హాలియా
సి) యాదాద్రి భువనగిరి జిల్లా టుప్పల్
డి) మెదక్ జిల్లా నర్సాపూర్
12. తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా ‘షెడ్యూల్ కులాల/తెగల యాజమాన్యంలోని పరిశ్రమల’ కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లో సరైనవి గుర్తించండి?
1. భూమి/ షెడ్డు/భవనాల లీజు, తాకట్టుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లిస్తారు
2. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్థిరమూలధన పెట్టుబడిలో 35 శాతం సబ్సిడీ (రూ. 75లక్షల పరిమితికి లోబడి) అందజేస్తారు
3. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తేదీ నుంచి 5 ఏండ్ల వరకు 100శాతం రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్జీఎస్టీ) ని తిరిగి చెల్లిస్తారు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3
డి) 1, 2, 3
13. తెలంగాణ విద్యుత్ వాహన విధానం 2020-30కి సంబంధించి సరైనది గుర్తించండి?
1. ఈ విధానాన్ని 2020 అక్టోబర్ 30న హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ విడుదల చేశారు
2. రూ. 200 కోట్ల పెట్టుబడితో ఎలక్టిక్ వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు రూ. 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ
3. 5 ఏండ్ల పాటు రూ. 5 కోట్ల పరిమితితో 25శాతం విద్యుత్ సబ్సిడీ అందిస్తుంది
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3
డి) 1, 2, 3
14. తెలంగాణ ఐటీ పరిశ్రమకు సంబంధించి హైదరాబాద్ గ్రిడ్ (Growth in Dispe rsion) పాలసీకి సంబంధించి సరైనది గుర్తించండి?
1. ఈ గ్రిడ్ మార్గదర్శకాలను 2021 డిసెంబర్ 10న విడుదల చేశారు
2. 2025 నాటికి IT ఎగుమతులను 25 బిలియన్ డాలర్లకు పెంచాలి
3. ఐటీని పశ్చిమ కారిడార్ కు మాత్రమే పరిమితం చేయకుండా నగరం చుట్టూ విస్తరించాలన్నది గ్రిడ్ పాలసీ ఉద్దేశం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
15. WE-HUB (వి-హబ్ ) ఎవరికి సంబంధించింది?
ఎ) దివ్యాంగులు బి) ఎస్సీ, ఎస్టీ
సి) మహిళలు డి) అన్ని వర్గాలు
16. తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ పాలసీని ఏ కాలానికి ప్రకటించారు?
ఎ) 2020-25 బి) 2021-26
సి) 2019-24 డి) 2018-23
17. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
ఎ) వనపర్తి బి) మహబూబ్ నగర్
సి) నాగర్ కర్నూల్ డి) నారాయణపేట
18. తెలంగాణ క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్ విజేతలకు అందించే నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి సరైనది గుర్తించండి?
1. స్వర్ణవిజేతలకు రూ. 2కోట్ల నగదు ప్రోత్సాహకం
2. రజత విజేతలకు రూ. 1.5 కోట్ల నగదు ప్రోత్సాహకం
3. కాంస్య విజేతలకు రూ. 1కోటి నగదు ప్రోత్సాహకం
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
19. సామాజిక భద్రతా పింఛన్ ను పొందడానికి సంబంధించి నిబంధనల్లో సరైనది గుర్తించండి?
1. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.5లక్షల కన్నా ఎక్కువ వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న వారు అర్హులు
2. 3 ఎకరాలకు పైగా మాగాణి లేదా 7.5 ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉన్నవారు అర్హులు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీ కాదు
20. E-POS దేనికి సంబంధించింది?
ఎ) విద్యా విధానానికి సంబంధించింది
బి) NREGS కి సంబంధించింది
సి) ప్రజాపంపిణీ విధానానికి సంబంధించింది
డి) భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించింది
21. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
1. జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ 2020 అక్టోబర్ 31న రైతువేదికను ప్రారంభించారు
2. రైతుల సాగు సమస్యలపై చర్చించడం, అధిక దిగుబడులు, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధ్దతులపై అవగాహన పెంచుకునేందుకు రైతు వేదికలను నిర్మించారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీ కాదు
22. రాష్ట్రంలో రైతుబీమా పథకం కింద నమోదైన సభ్యుడు లేదా పట్టాదారుకు ఉండాల్సిన వయస్సు?
ఎ) 18 ఏండ్ల నుంచి 62 ఏండ్ల వరకు
బి) 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకు
సి) 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వరకు
డి) వయస్సుతో సంబంధం లేదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది
23. రైతుబంధు పథకం లబ్ధిదారుల అర్హతలకు సంబంధించి సరైనది గుర్తించండి?
1. పట్టాదారు పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతు అర్హుడు
2. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది
3. ఎన్ని చోట్ల, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా రైతుబంధు పథకం సహాయం అందిస్తారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
24. SAMETI దేనికి సంబంధించింది?
ఎ) గ్రామీణ యువతకు ఉపాధి నైపుణ్యం
బి) మహిళల సాధికారత
సి) వ్యవసాయ శిక్షణ
డి) దివ్యాంగుల చేయూత సంస్థ
25. రాష్ట్రంలో ఆయిల్ పామ్ పంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది?
ఎ) 5 లక్షల ఎకరాలు
బి) 6 లక్షల ఎకరాలు
సి) 7 లక్షల ఎకరాలు
డి) 8 లక్షల ఎకరాలు
26. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘దళిత బంధు’ కార్యక్రమానికి ఆదర్శమైన కార్యక్రమం? (కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమం)
ఎ) దళిత జ్యోతి బి) దళిత చైతన్యం
సి) దళిత సాధికారత
డి) దళిత చైతన్య జ్యోతి
27. ఆసరా పథకం వివిధ లబ్ధిదారులకు అందించే కార్డు రంగుల్లో సరైన జతను గుర్తించండి?
వృద్ధులు- గులాబీ
వితంతువులు- నీలం
కల్లుగీత కార్మికుడు- గులాబీ
వికలాంగులు- గులాబీ
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
28. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో రైతుబంధు ప్రారంభించిన తర్వాత ఇదే తరహాలో వివిధ రాష్ట్రాలు ప్రారంభించిన పథకాలు జతపర్చండి?
1. రైతు భరోసా ఎ. ఆంధ్రప్రదేశ్
2. కాళియా బి. ఒడిశా
3. కృషక్ బంధు సి. పశ్చిమ బెంగాల్
4. ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన డి. జారండ్
ఎ) 1-ఎ, 2-బి,3-సి,4-డి
బి) 1-డి, 2-సి,3-బి,4-ఎ
సి) 1-బి, 2-డి,3-సి,4-ఎ
డి) 1-సి, 2-డి,3-ఎ,4-బి
29. మాతా శిశు సంరక్షణ, బాలింతల సంరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కేసీఆర్ కిట్ పథకం లోగోలోని నినాదం ఏమిటి?
ఎ) అమ్మకు అండగా…బిడ్డకు తోడుగా
బి) అమ్మకు ఆత్మీయతతో..బిడ్డకు ప్రేమతో
సి) అమ్మకు అండతో…బిడ్డకు దీవెన
డి) ఏదీకాదు
30. తెలంగాణ భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన ‘ధరణి’ వెబ్ పోర్టల్ ను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2020 అక్టోబర్ 27
బి) 2020 అక్టోబర్ 28
సి) 2020 అక్టోబర్ 29
డి) 2020 అక్టోబర్ 31
31. ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకం కింద ఎస్సీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం మంజూరు చేస్తుంది?
ఎ) రూ.4 లక్షలు బి) రూ. 7 లక్షలు
సి) రూ.20 లక్షలు డి) రూ. 14 లక్షలు
32. రాష్ట్ర ప్రభుత్వం 2015-16 విద్యాసంవత్సరం నుంచి టీఎస్ ఫారిన్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్/ తెలంగాణ ఓవర్సీస్ స్టడీ స్కీమ్ ను ప్రారంభించింది. దీనిలో లిస్ట్ చేసిన దేశాలు ఏవి?
ఎ) యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ , కెనడా
బి) యూఎస్ఏ, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా
సి) యూఎస్ఏ, యూకే, కెనడా, ఫ్రాన్స్, న్యూజిలాండ్
డి) యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ , నెదర్లాండ్స్
33. కింది వివరణలను చదవండి?
1. శిశు మరణరేటును తగ్గించడమే కేసీఆర్ కిట్ పథకం ఉద్దేశం
2. కేసీఆర్ కిట్ పథకం కింద గర్భిణీలకు ఆసుపత్రుల్లో ప్రసవాన్ని ప్రోత్సహించడానికి రూ. 10,116 విత్త సహాయం అందుతుంది
కింది ఐచ్ఛికాల నుంచి సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ) 1, 2 సరైనవి బి) 1, 2 సరైనవి కాదు
సి) 1 మాత్రమే సరైనది
డి) 2 మాత్రమే సరైనది
34. తెలంగాణ ప్రభుత్వ ‘ఇన్నోవేషన్ పాలసీ’కు కింది వాటిలో ఏది ప్రాతిపదిక కాదు?
ఎ) పారిశ్రామిక రంగంతో ప్రోత్సాహక
సాన్నిహిత్యం
బి) మానవ పెట్టుబడి అభివృద్ధి
సి) పట్టణ సంస్థల్లో అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం
డి) ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయడం
35. ‘నవకల్పన, నియంత్రిత పరిణామ, చేర్పు’?
ఎ) విద్యా విధానం
బి) పారిశ్రామిక విధానం
సి) పాడి పరిశ్రమ విధానం
డి) వ్యవసాయక విధానం
జవాబులు
1-సి, 2-ఎ, 3-బి, 4-ఎ,
5-ఎ, 6-ఎ, 7-సి, 8-బి, 9-డి, 10-బి 11-ఎ, 12-డి, 13-బి, 14-డి, 15-సి, 16-బి, 17-ఎ, 18-ఎ, 19-బి, 20-సి, 21-సి, 22-సి, 23-సి, 24-సి, 25-డి, 26-డి , 27-ఎ, 28-ఎ, 29-బి, 30-సి 31.సి. 32.డి
33.బి 34.సి 35.బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?