ప్రపంచ పవన దినోత్సవ థీమ్ ఏంటోతెలుసా? (అంతర్జాతీయం) 22-06-2022
అల్బునిజం డే
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వరల్డ్ అల్బునిజం (వర్ణహీనత) డేని జూన్ 13న నిర్వహించారు. అల్బునిజం అంటువ్యాధి కాదని, జన్యుపరంగా సంక్రమించే వ్యాధి అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘యునైటెడ్ ఇన్ మేకింగ్ అవర్ వాయిస్ హియర్డ్’.
రక్తదాతల దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14న నిర్వహించారు. కార్ల్ ల్యాండ్‌స్టీనర్ జన్మదినం అయిన జూన్ 14ని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004లో ప్రకటించింది. ఎ, బి, ఒ రక్త గ్రూపుల వ్యవస్థను కనుగొన్న ల్యాండ్స్టీనర్కు నోబెల్ బమతి లభించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘డొనేటింగ్ బ్లడ్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ సాలిడరిటీ’.
పవన దినోత్సవం
ప్రపంచ పవన దినోత్సవం (వరల్డ్ విండ్ డే) జూన్ 15న నిర్వహించారు. భవిష్యత్తు కోసం పవన శక్తి ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని మొదటగా 2007లో యూరోపియన్ విండ్ ఎనర్జీ అసోసియేషన్ (ఈడబ్ల్యూఈఏ) నిర్వహించింది. 2009 నుంచి ఈడబ్ల్యూఈఏ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూఈసీ) కలిసి గ్లోబల్ ఈవెంట్‌గా చేపడుతుంది. ఈ ఏడాది దీని థీమ్ ‘సెలబ్రేట్ టు ఎంజాయ్ ది బెనిఫెట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ అండ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ది ఇండివిడ్యువల్స్ అబౌట్ ది పవర్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ విండ్ ఎనర్జీ టు ఛేంజ్ ది వరల్డ్’.
డబ్ల్యూటీవో మినిస్టీరియల్ సమావేశం
12వ ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ (డబ్ల్యూటీవో మినిస్టీరియల్) సమావేశం జూన్ 16న ముగిసింది. జూన్ 12న ప్రారంభమైన ఈ సమావేశం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగింది.
పోటీతత్వ సూచీ
ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) వరల్డ్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ (ప్రపంచ పోటీతత్వ సూచీ)ను జూన్ 15న విడుదల చేసింది. ఈ జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలువగా.. స్విట్జర్లాండ్ 2, సింగపూర్ 3, స్వీడన్ 4, హాంకాంగ్ 5, నెదర్లాండ్స్ 6, తైవాన్ 7, ఫిన్లాండ్ 8, నార్వే 9, యూఎస్ఏ 10వ స్థానాల్లో నిలిచాయి. ఈ సూచీలో భారత్ 37, చైనా 17, ఆస్ట్రేలియా 19వ స్థానంలో ఉన్నాయి.
- Tags
- Blood Donor
- International
- WTO
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు