1 నుంచి ‘ఐబీపీఎస్’కు బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ
ఐబీపీఎస్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయ్యి మంది అభ్యర్థులకు 45 రోజుల పాటు ఆన్లైన్ కోచింగ్ ఇస్తామన్నారు. జిల్లాకు 30 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఆన్లైన్ తరగతులు జూలై 1 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in నుంచి దరఖాస్తు చేయాలని కోరారు. అభ్యర్థులకు పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో 60 శాతం మార్కులు తప్పనిసరని, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. వివరాలకు 040-24071178, 27077929 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Previous article
హెచ్సీయూలో కాంట్రాక్టు టీచర్లకు దరఖాస్తులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






