10 వరకు టీశాట్లో ఎంసెట్, నీట్, జేఈఈ కోచింగ్
ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షలకు టీశాట్ ద్వారా గురువారం నుంచి ఉచిత శిక్షణ ఇవ్వాలని ఇంటర్విద్య కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. జూలై 10 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయి. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రం సబ్జెక్టుల్లో నిపుణులైన ఇంటర్ అధ్యాపకులచే రికార్డు చేసిన పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు. ఈ డిజిటల్ పాఠ్యాంశాలను ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ లర్నింగ్ తెలంగాణ’ యూట్యూబ్ చానల్లోనూ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
జేఈఈ మెయిన్-2, నీట్, ఎంసెట్ పరీక్షలు జూలైలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు అందజేస్తున్న ఉచిత ఆన్లైన్ కోచింగ్ అవకాశాన్ని 12 వేల మంది విద్యార్థులు వినియోగించుకొంటున్నారని అధికారులు తెలిపారు. పోటీ పరీక్షలు ముగిసేలోగా మొత్తం నాలుగు గ్రాండ్ టెస్టులను నిర్వహిస్తామని వెల్లడించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు