సిమోర్గ్ సూపర్ కంప్యూటర్
ఇరాన్ 2021 మే నెలలో సిమోర్గ్ అనే సూపర్ కంప్యూటర్ను విడుదల చేసింది. ఇది అంతకుముందు ఇరానియన్ సూపర్ కంప్యూటర్ల కంటే వంద రెట్లు అధిక శక్తివంతమైనది. సిమోర్గ్ సూపర్ కంప్యూటర్ సామర్థ్యం 0.56 పెటాఫ్లాప్స్. తర్వాతి స్థాయిలో ఇది 10 పెటాఫ్లాప్‌ల వేగాన్ని చేరుకుంటుంది. ఇది 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 42 రాక్లను కలిగి ఉంటుంది. భవిష్యత్తులో దీనిని 400 చదరపు మీటర్లకు అప్‌గ్రేడ్ చేస్తారు. దీనికి వెచ్చించిన మొత్తం 9 మిలియన్ డాలర్లు. దీనిని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అమీర్కాబీర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది ఇరానియన్ హైపెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రీసెర్చ్ సెంటర్లో ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వర్క్‌లోడ్ , ట్రాఫిక్, వాతావరణ డేటాతో పాటు స్థానిక ప్రైవేట్ సంస్థలకు క్లౌడ్ హోస్టింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు