టకాటక్ కోర్సు.. ఫటాఫట్ నౌకరీ
– ఇంటర్మీడియట్ కళాశాలల్లో షార్ట్ టర్మ్ నొకేషనల్ కోర్సులు
– 3 నుంచి 6 నెలల కాలవ్యవధి
– మొత్తం 53 కోర్సుల నిర్వహణ
-జాబ్‌మేళాలతో ప్లేస్మెంట్లు
ఫ్యాషన్ డిజైనింగ్.. గార్మెంట్ మేకింగ్.. ఫ్యాబ్రిక్ డిజైన్ పెయింటింగ్.. ఇటీవల డిజైనింగ్ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులు. ఈ కోర్సుల్లో చేరాలంటే సాధారణంగా ఎంట్రెన్స్ రాయాలి. వేల మంది పోటీని తట్టుకోవాలి. నిఫ్ట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అడ్మిషన్ పొందాలి. కానీ, ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా.. పోటీ పడకుండానే ఇలాంటి కోర్సులను పూర్తిచేసే అవకాశాన్ని మన తెలంగాణ ఇంటర్ విద్య అధికారులు కల్పిస్తున్నారు. షార్ట్ టర్మ్ నొకేషనల్ కోర్సు (ఎస్ఐవీఈ)ల్లో భాగంగా 53 రకాల కోర్సులను 47 జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్, పైథాన్ అండ్ కోడింగ్, క్యాడ్, ల్యాండ్ సర్వేయర్, లీగల్ అసిస్టెంట్, ట్యాక్సేషన్, డెంటల్ సిరామిక్ అసిస్టెంట్, డెంటల్ హైజీన్ అసిస్టెంట్, డయాలసిస్ అసిస్టెంట్, మిడ్వైఫ్రీ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ప్లెబాటమీ (శాంపిల్ కలెక్షన్) వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు. వీటిని అతి తక్కువ కాలంలో టకాటక్ పూర్తిచేసి, ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ఫటాఫట్ ఉద్యోగం పొందవచ్చు. ఇటీవల అనేక మంది యువకులు ఇలాంటి స్వల్పకాల కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మార్కెటింగ్ అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యాసంవత్సరం అధికారులు కొత్తగా మరో 11 కోర్సులను తీసుకొచ్చారు. కోర్సులు, ఇతర వివరాలకు www.sive.telangana.gov.in వెబ్సైట్ చూడాలని అధికారులు సూచించారు.
స్పల్పకాలిక వృత్తివిద్యా కోర్సులను నిర్వహణకు కాలేజీలకు ఇంటర్మీడియట్ విద్య కమిషనరేట్ అఫిలియేషన్ ఇవ్వనున్నది. ఇందుకు యాజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీలు, ఎన్జీవోలు, సొసైటీలు, సహకార సంస్థలు సోమవారం నుంచి జూలై 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, అధికారులతో తనిఖీలు నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు www.sive.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
విభాగాలవారీగా కోర్సులు
విభాగం కోర్సులు
ఇంజినీరింగ్ 11
ఐటీ 05
కామర్స్ అండ్ రిటైల్ 06
హోం సైన్స్ 07
యానిమల్ హస్బెండరీ 01
పారామెడికల్ 13
సర్వీస్ సెక్టార్ 04
కంప్యూటర్ సైన్స్ 03
ఫైన్ ఆర్ట్ 02
కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 01
మొత్తం 53
ప్రత్యేకతలు..
# కోర్సులను బట్టి 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న వారు వీటిల్లో చేరవచ్చు.
# కోర్సుల కాల వ్యవధి 3 నుంచి గరిష్ఠంగా 9 నెలలు. అధికంగా 3 నెలల కోర్సులే ఉన్నాయి.
# రిజిస్ట్రేషన్ ఫీజులు రూ. 600 నుంచి గరిష్ఠంగా రూ.1800 మాత్రమే.
# తరగతి బోధన 120 గంటల నుంచి 450 గంటలు ఉంటుంది. ప్రాక్టికల్స్ ఉంటాయి.
# కోర్సు పూర్తయ్యాక జాబ్‌మేళా ద్వారా ఉపాధి కల్పిస్తారు. లేదా సొంతంగా ఉపాధి పొందవచ్చు.
- Tags
- jobs
- SIVE
- Vocational courses
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు