తెలంగాణ ఘనతలు
తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం -2022
పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి తెలంగాణ రాష్ట్రానికి సరిగ్గా నప్పుతుంది. 2014లో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. అంచనాలకు మించి దేశంలో అగ్రగామిగా నిలబడింది. సర్వేలు, నివేదికలు ఏదైనా సరే తెలంగాణ పథకాలకు స్థానం సుస్థిరం. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన పథకాలు, సాధించిన విజయాలు SEO (Socio Economic Outlook) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, నీతి ఆయోగ్, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీరియాడిక్ లేబర్ సోషల్ సర్వే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే సమాచారం ఆధారంగా నిపుణ పాఠకుల కోసం..
#ఇ-నామ్ కింద వెయింగ్ ఇంటిగ్రేషన్, పేమెంట్స్‌ను అమలు చేయడంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉంది.
# SDG-7 సరసమైన, శుభ్రమైన శక్తి అందివ్వడంలో 100/100 సాధించి అచీవర్‌గా తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది.
#2020 బ్యూరో ఆఫ్ పోలీస్ రిసర్చ్ అండ్ గవర్నమెంట్ రిపోర్టు ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం సీసీ టీవీ కెమెరాల్లో 61.3 శాతం కలిగి ఉంది.
#దేశంలోని 300 క్లస్టర్స్‌లో రాయికల్ (సంగారెడ్డి), జుక్కల్ (కామారెడ్డి) మొదటి, రెండో స్థానాలు పొందాయి.
#శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమల్లో అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
#సంసద్ ఆచార్య గ్రామ యోజన కింద అత్యంత మెరుగైన పనితీరుని కనబరిచిన మొదటి 10 గ్రామాల్లో 7 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే.
కేసీఆర్ కిట్‌కు Scotch and Merit అవార్డు లభించింది.
#తెలంగాణ దేశంలోని 65 శాతం విత్తన అవసరాలను తీరుస్తుంది. 18 దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తుంది. తెలంగాణ ‘సీడ్ బౌల్ ఆఫ్ ది వరల్డ్’గా ప్రసిద్ధి పొందింది.
#2019-20 ప్రపంచ బుక్ వ్యాపారం చేసుకోవడానికి అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో 3వ రాష్ట్రంగా తెలంగాణను గుర్తించింది.
#TASK భారతదేశ గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ సమ్మిట్ 2021లో అత్యుత్తమ యూత్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్ అవార్డును అందుకుంది.
#2021లో గ్లోబల్ ఇగ్నైట్ ఎక్సలెన్స్ అవార్డు అందుకుంది.
#F-Tech 2.O ప్రోగ్రామ్స్ ద్వారా ఏకకాలంలో శిక్షణ ఇవ్వడం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సాధించింది.
#2019-20 మధ్యకాలంలో klmpl, tsrtc పెట్రోలియం కన్జర్వేషన్ రిసెర్చ్ అసోసియేషన్స్ నుంచి జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా అవార్డు గెలుచుకుంది.
2021లో UN, WTO పోచంపల్లి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామం గా గుర్తించింది.
# ఇబ్రహీంపట్నం మంగళంపల్లిలో 22 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం పీపీపీ నమూనాలో దేశంలోని మొట్టమొదటి లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేసింది.
# 2020లో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ క్వాలిటీ సర్వేలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా RGIA నిలిచింది.
# 2020లో ‘వరల్డ్ టాయిలెట్ డే’లో భాగంగా సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు దేశంలోనే అత్యుత్తమ జిల్లాలుగా అవార్డు పొందాయి.
# గంధగి ముక్త్ భారత్ కార్యక్రమం కింద గరిష్ఠ శ్రమదానానికి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
#దేశంలో 26 లక్షల వ్యవసాయ వినియోగదారులకు 24/7 ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
#2014-15లో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం- 9,470 మెగావాట్స్.
#2020-21లో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం- 17,218 మెగావాట్స్.
# 5 సంవత్సరాల్లో 82 శాతం గణనీయమైన వృద్ధిని సాధించాం. సంచిత వార్షిక వృద్ధిరేటు 10.78%.
దేశంలో డిజిటల్ వాలెట్ కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2017లో T-Wa llet ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. T-Wallet ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. దీన్ని నో ఫోన్ మోడ్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు.
# 2019-20, 2020-21 మధ్య వ్యవస్థాపిత సామర్థ్యం వృద్ధిరేటు పరంగా తెలంగాణ నాన్స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో 3వ స్థానం లభించగా.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం లభించింది.
#2014-15, 2020-21 మధ్యకాలంలో తలసరి విద్యుత్ లభ్యతలో 10.43%తో బీహార్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 8.74% CAGRలో రెండో స్థానంలో నిలిచింది. భారతదేశ తలసరి విద్యుత్ లభ్యత CAGR 3.24% మాత్రమే.
#2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్ లభ్యత 1152 KWH కాగా జాతీయ సగటు 852 KWH మాత్రమే. 2020-21లో తెలంగాణ తలసరి విద్యుత్ లభ్యత 1905 KWH గా నమోదు కాగా, దేశంలో 1031 KWH గా నమోదైంది.
2021లో రామప్పను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశంగా ప్రకటించింది. దేశంలో 39వది. (40వది ధోలవీర).
#2018-19 నాటికి దేశంలో అతితక్కువ విద్యుత్ ప్రసరణ.. నష్టాలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది.
1. హిమాచల్‌ప్రదేశ్ (14.29%)
2. పంజాబ్ (14.73%)
3. తెలంగాణ (14.85%)
#విద్యుత్‌శక్తి ప్రసరణ, పంపిణీ నష్టంలో దేశంలో 20.66% గా నమోదైంది.
#SDG ఇండియా ఇండెక్స్ 2020-21 స్కోర్‌లో తెలంగాణ రాష్ట్రం SDG 6 పరిశుభ్రమైన, పారిశుద్ధ్యంలో 96 మార్కులు సాధించి దేశంలో 2వ ర్యాంక్ పొందింది.
#రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
#తెలంగాణ రాష్ట్రం 19.1 మిలియన్ గొరెల జనాభాతో దేశంలో మొదటి స్థానంలో ఉంది.
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 4 యూనిట్స్ గుర్తించగా దక్షిణాది నుంచి తెలంగాణలోని అంతర్గాం పసుపు తయారీ యూనిట్ ఎంపికైంది. మహిళా సంఘాల ఉత్పత్తుల తయారీలో జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలో ఉన్న పసుపు, కారంపొడి తయారీ యూనిట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
#నేషనల్ జియోగ్రాఫికల్ ట్రావెలర్ మేగజీన్ వార్షిక గైడ్లో ప్రచురించిన Best of the World- 20 Places you should see in 2015 జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
#మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే 2018 ప్రకారం దేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్, పుణె మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
# హైదరాబాద్‌లో 600 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న జీనోమ్ వ్యాలీ భారతదేశపు మొదటి, అతిపెద్ద జీవశాస్త్ర తయారీ R&D సమూహం. భారతదేశంలో అతిపెద్ద టీకా తయారీదారుల్లో 3 జీనోమ్ వ్యాలీలు ఉన్నాయి.
#తెలంగాణలో ఇసుక ఆన్లైన్ అమ్మకాల నిర్వహణ, మానిటరింగ్ సిస్టమ్ 2020లో స్కోచ్ గ్రూప్ నుంచి డిజిటల్ ఇండియాగోల్డ్ అవార్డు అందుకుంది.
రైతుబంధు ICRIER (Indian Council for Research on International Economic Relations) రూపొందించిన నివేదికలో రైతుబంధు ప్రత్యక్ష పెట్టుబడి మద్దతు పథకం ఇతర ప్రత్యామ్నాయాలతో పోలిస్తే మెరుగైనది, అమలుచేయడం సులభం, మరింత పారదర్శకం, సమ్మిళితంగా ఉందని ప్రశసించింది.
#2020-21 సంవత్సరానికి PLF (Plant Load Factor) నివేదికలో కేంద్ర విద్యుత్ శాఖ ప్రకారం విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. టీఎస్ జెన్కో- (72 శాతం) మొదటి స్థానం.
# సింగరేణి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం- రెండో స్థానం.
#నీతి ఆయోగ్ 2019-20లో వైద్య, ఆరోగ్య సేవలకు రాష్ట్రాల ర్యాంకులను విడుదల చేసింది. మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానం తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి.
# నర్చరింగ్ నైబర్డ్ చాలెంజ్ పోటీలో దేశంలోని టాప్-10 నగరాల్లో బెంగళూర్ మొదటి ప్లేస్‌లో నిలువగా, వరంగల్ టాప్ టెన్‌లో చోటు దక్కించుకొంది (2022 జనవరి 17న ఢిల్లీలో జరిగింది).
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపూర్ మండలం పుట్టపాక ప్రాంతం హ్యాండ్లూమ్స్ ఆఫ్ ఇండియాలో నమోదైంది. తేలియా రుమాల్కి 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది (ది బెటర్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించారు).
#అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థను ప్రారంభించారు.
#ఇది దేశంలో రెండో సంస్థ. మొదటిది తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉంది.
#అభివృద్ధి, సుస్థిరపాలనలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని బెంగళూర్‌కి చెందిన పబ్లిక్ అఫైర్స్ సెంటర్ విడుదల చేసిన సూచీ వెల్లడించింది. తెలంగాణ వృద్ధిరేటులో నంబర్ వన్ స్థానంలో ఉంది.
#వీధి వ్యాపారులకు రుణాన్ని అందించే విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
#ఆర్బీఐ 2021లో విడుదల చేసిన హ్యాండ్‌బుక్ నివేదికలో తెలంగాణ విజయాలు.
ఎ) 2013-14లో ప్రస్తుత ధరలతో GSDP రూ.45,580 కోట్లు ఉండగా 2020-21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది.
బి) తలసరి ఆదాయం 211 శాతం పెరిగింది.
సి. పెట్టుబడి వ్యయం 2014-15లో రూ. 11,583 కోట్లు ఉండగా 2020-21 నాటికి రూ.44,145 కోట్లకు చేరింది.
Medicine From the Sky: దేశంలోనే తొలిసారిగా మెడిసిన్స్‌ను డ్రోన్ ద్వారా పంపించడం. వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టారు.
l 40 కిలోమీటర్ల దూరం వెళుతుంది. l 15 కేజీల బరువు మోసుకెళ్లే సామర్థ్యం. (500-700మీటర్ల ఎత్తులో)
#గ్రామీణ బ్యాంకుల్లో డిపాజిట్స్ 2015-16లో రూ.10,700 కోట్లు ఉండగా 2020- 21 నాటికి రూ.20,712 కోట్లకు పెరిగాయి.
# 2014-15లో వ్యవసాయ ఆదాయం రూ. 41,700 కోట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.80,574 కోట్లకు పెరిగింది.
#2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు ఉండగా, 2020-21 నాటికి 2012 యూనిట్లకు పెరిగింది.
# రాష్ట్ర అవతరణ నుంచి నేటి వరకు పన్ను ఆదాయంలో 29 శాతం వృద్ధి నమోదయ్యింది.
# సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ ర్యాంకుల్లో తెలంగాణ 2వ స్థానం సాధించింది.
# 2014-15లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు రూ.66,276 కోట్లు ఉండగా, 2020-21కు రూ.1,45,000 కోట్లకు
పెరిగింది.
2015-19 మధ్య కాలంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధించింది.
# సంసద్ ఆదర్శ గ్రామయోజన మొదటి 20 ర్యాంకుల్లో 19 తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయి. జాతీయ అవార్డుల్లో ఇది రికార్డ్.
# స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్ర మున్సిపాలిటీలకు 12 అవార్డులు వచ్చాయి.
# ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని భారత ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించింది.
# 2021 సంవత్సరానికి గ్రామీణ విభాగంలో ఉత్తమ ఠాణాగా ఆలేరు పోలీస్ స్టేషన్ ఎంపికైంది. నేషనల్ కైమ్ రికార్డ్ బ్యూరో ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీస్ స్టేషన్లను ప్రాథమికంగా ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రకటించిన మొదటి 10 ర్యాంకుల్లో ఆలేరుకు స్థానం దక్కింది.
#2021 రాష్ట్రాల వారీగా సగటు మండల జనాభా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం 64,050 సగటు జనాభాతో దేశంలోనే అత్యల్ప సగటును నమోదు చేసింది. అత్యధిక సగటు జనాభా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర (3,53, 515)
ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జికి అవుట్ స్టాండింగ్, కాంక్రీట్ స్ట్రక్చర్ విభాగాల్లో 2021 జాతీయస్థాయి అవార్డు లభించింది.
# తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో దేశంలోనే 3వ స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించింది. 2019-20లో వైద్య, ఆరోగ్య రంగాల్లో 100 పాయింట్లకు 69.5 పాయింట్లు సాధించి ఉత్తమ పనితీరును కనబరిచింది. మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానంలో తమిళనాడు నిలిచాయి.
#వనప్తరి జిల్లాలోని చందాపూర్ గ్రామానికి దేశంలోనే బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ (బాలనేస్తం) విలేజ్‌గా గుర్తింపు పొందింది.
#వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి సమైక్యతకు జాతీయస్థాయి ఆత్మనిర్భర్ సంఘటన్ అవార్డు లభించింది. మహిళా సంఘాల బలోపేతానికి ఉత్తమ పనితీరు కనబరిచినందుకు నర్సంపేట ఈ అవార్డును కైవసం చేసుకొంది.
రాష్ట్రంలో 8 సంవత్సరాల్లో 6302 కి.మీ. రహదారులు పెరిగాయి. కొత్తగా సాధించిన జాతీయ రహదారులు 2460 స్వరాష్ట్రంలో డబుల్, 4 లేన్లు, 6 లేన్ల రోడ్లు రెట్టింపు
# శిశు, బాలికలు, మహిళలు, గర్భిణులు, బాలింతల పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్ అభియాన్ అమల్లో 2021 సంవత్సరానికి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపికయ్యింది.
#సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPC) 100 శాతం ఫ్లెయాష్ వినియోగించిన ప్లాంట్‌గా గుర్తింపు లభించింది.
#2020-21 ఆర్థిక సంవత్సరానికి యాదాద్రి ప్లాంట్‌కు Best Plant for Diversfied Activities అవార్డు లభించింది.
# అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో తెలంగాణ అటవీశాఖ స్టాలుకు ప్రథమ బమతి లభించింది.
#2019, 2020, 2021 సంవత్సరాల్లో దేశంలో కెల్లా తెలంగాణ 1000 మంది జనాభాకు అత్యధికంగా E- Transact ions సంచిత సంఖ్యను కలిగి ఉంది.
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు