శరీరానికి రక్షణ.. పదార్థాల రవాణా ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
రక్తం ద్రవరూప సంధాయక కణజాలం. రక్త కణజాలం ఇతర కణజాలాల కంటే భిన్నమైనది. ఇది ద్రవరూపంలో ఉంటుంది. రక్తంలో వివిధ రకాల కణాలుంటాయి. ప్రతిదీ భిన్నమైన నిర్ధిష్టమైన పనిని నిర్వర్తిస్తుంది. రక్తంలో ప్లాస్మా, రక్త కణాలు అనే రెండు భాగాలుంటాయి. రక్త కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. రక్తం మన శరీర ఆరోగ్య స్థితిని తెలుపుతుంది.
రక్తం- నిర్మాణం- రక్త వర్గాలు
# రక్తం గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని హిమటాలజీ అంటారు.
#ఆరోగ్యవంతమైన మానవుడిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది.
# మానవ శరీరం మొత్తం రక్తం పంపు చేయడానికి గుండె అనే అత్యంత శక్తిమంతమైన యంత్రాంగం ఉంటుంది. గుండె 24 గంటల్లో 36వేల లీటర్ల రక్తాన్ని 20వేల కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది.
ప్లాస్మా
#రక్తంలో ప్లాస్మా 55 శాతం ఉంటుంది.
#ప్లాస్మా అనేది ప్రొటీన్లు, ఉప్పును కలిగిఉన్న రక్తంలోని సజల భాగం.
# ఇది ఎండు గడ్డి రంగులో 90-92 శాతం నీరు కలిగి ఉంటుంది.
#ప్లాస్మాలో 6-8 శాతం ప్రొటీన్లు ఉంటాయి.
# సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్టోలైట్లు, అదనంగా ఎమైనో ఆమ్లాలు ఉంటాయి.
#0.85-0.9 శాతం లవణాలు ఉంటాయి.
రక్త కణాలు
# మొత్తం రక్తంలో రక్త కణాలు 45 శాతం ఉంటాయి.
#ఇందులో ఎరరక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు ఉంటాయి.
# తెల్ల రక్త కణాల్లో మళ్లీ రెండు రకాల కణాలుంటాయి. అవి కణికాభ సహిత కణాలు (గ్రాన్యులోసైట్స్), కణికాభ రహిత కణాలు (ఎగ్రాన్యులోసైట్స్).
# గ్రాన్యులోసైట్స్ మూడు రకాలు అవి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్.
#ఎగ్రాన్యులోసైట్స్ రెండు రకాలు అవి లింఫోసైట్లు, మోనోసైట్లు.
ఎర్రరక్తకణాలు
# వీటినే ఎరిత్రోసైట్లు అని కూడా అంటారు.
#వీటిలో హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండటం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది.
#హీమోగ్లోబిన్ రక్తంలో ఆక్సిజన్, కార్బన్‌డై ఆక్సైడ్ రవాణాలో తోడ్పడుతుంది.
# ఒక మిల్లీ లీటర్ మానవ రక్తంలో దాదాపు 5 మిలియన్ల ఎర్రరక్త కణాలు ఉంటాయి.
# ఎర్రరక్తకాణాల జీవితకాలం 120 రోజులు.
# మన రక్తంలో ఉన్న ఎర్రరక్త కణాలన్నింటినీ ఒక గొలుసులా అమర్చితే దాని పొడవు భూమధ్యరేఖ చుట్టూ ఏడుసార్లు చుట్టి వస్తుంది.
# శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాలు కాలేయం, ప్లీహంలో ఏర్పడతాయి. ప్రౌఢ మానవుల్లో ఎముక మజ్జలో ఏర్పడతాయి. అందువల్ల కాలేయాన్ని ‘ఎర్ర రక్తకణాల ఊయల’ అంటారు.
# ఇవి ప్లీహంలో నశిస్తాయి కాబట్టి ప్లీహాన్ని ‘ఎర్ర రక్తకణాల శ్మశానవాటిక’ అంటారు.
# ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ప్రక్రియను ‘ఎరిత్రోపాయిసిస్’ అంటారు.
# క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం ఉండదు. కానీ ఒంటె, లామా వంటి క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది.
# క్షీరదాల్లో ఎర్రరక్తకణాల అమరికను ‘రోలెక్స్’ అంటారు.
# మలేరియా వ్యాధిలో అధిక ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తి జరుగుతుంది. అందువల్ల ప్లీహం వాపునకు గురవుతుంది.
# ప్రతిరోజు 10X1012 సంఖ్యలో ఎర్ర రక్తకణాలు విచ్ఛిత్తి చెంది అదే సంఖ్యలో కొత్త కణాలు ఏర్పడతాయి.
# ఎర్ర రక్తకణాలు ఏర్పడే విధానాన్ని ‘ఎరిత్రోపాయిసిస్’ అంటారు.
#ఎర్ర రక్తకణాలు అసాధారణంగా పెరగడాన్ని ‘పాలీ సైథీమియా’ అంటారు.
# వీటి తగ్గుదలను ‘ఎరిత్రోపీనియా’ అంటారు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
#ఎర్ర రక్తకణాలు నాశనమయ్యే ప్రక్రియను ‘ఎరిత్రో క్లేసియా’ అంటారు.
#హీమోగ్లోబిన్‌లో గ్లోబిన్ అనే ప్రొటీన్, హీమ్ అనే కర్బన అణువులతో కూడిన ‘ఫోర్ఫిరిన్’ నిర్మాణం ఉంటుంది.
#ప్రతి హీమ్ మధ్యలో ఫెరస్ రూపంలో ఐరన్ ఉంటుంది.
# ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 15 గ్రాముల హీమోగ్లోబిన్ ఉంటుంది.
#ఎర్ర రక్తకణాల పరిపక్వతకు ఫోలిక్ ఆమ్లం (B9), సయనోకోబాలమిన్ (B12) విటమిన్లు అవసరం.
తెల్ల రక్తకణాలు
# వీటినే ల్యూకోసైట్లు అని కూడా అంటారు.
#వీటిలో హీమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి.
#ఎర్ర రక్తకణాలతో పోలిస్తే వీటి సంఖ్య తక్కువ.
#రక్తంలోని తెల్ల, ఎర రక్తకణాల నిష్పత్తి 1:500.
#వీటిని భక్షక కణాలు లేదా శరీరానికి సూక్ష్మ రక్షకభటులు అంటారు.
# తెల్ల రక్త కణాల జీవితకాలం 12-13 రోజులు.
#చనిపోయిన ఎర్ర రక్తకణాలు చీము రూపంలో బయటకు వస్తాయి.
# అవసరానికి మించి అధిక సంఖ్యలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)కు దారితీస్తుంది.
#తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ‘ల్యూకోపాయిసిస్’ అంటారు.
గ్రాన్యులోసైట్స్
# తెల్ల రక్తకణాల్లో గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్ అనే రెండు రకాల కణాలుంటాయి.
# వీటి జీవ పదార్థంలో ప్రొటీన్ నిర్మితమైన అనేక రకాల కణికలు (గ్రాన్యూల్స్) ఉంటాయి.
#ఇవి తెల్ల రక్తకణాల్లో 70 శాతం వరకు ఉంటాయి.
# ఇవి రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
గ్రాన్యులోసైట్లు మూడు రకాలు
#. ఎసిడోఫిల్స్/ ఇసినోఫిల్స్
#ఇవి ఆమ్ల రంజకాలతో రంగును సంతరించుకుంటాయి.
#వీటి ముఖ్యవిధి ఎలర్జీ నుంచి శరీరాన్ని రక్షించడం. ఎలర్జీ సమయంలో వీటి సంఖ్య పెరుగుతుంది. ఈ స్థితిని ‘ఇస్నోఫీలియా’ అంటారు.
2. బేసోఫిల్స్
#ఇవి క్షార రంజకాలతో రంగును సంతరించుకుంటాయి.
# ఇవి గాయాలు మానడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
#ఇవి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు.
3. న్యూట్రోఫిల్స్
#ఇవి తటస్థ రంజకాలతో రంగును సంతరించుకుంటాయి.
#ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్తకణాలు.
# ఇవి బ్యాక్టీరియాల నుంచి శరీర రక్షణకు మొదటి వరుసలో ఉంటాయి. అందుకే వీటిని సూక్ష్మ రక్షకభటులు అంటారు.
# వీటి జీవపదార్థంలో కణికలు ఉండవు.
ఎగ్రాన్యులోసైట్స్
# రక్తంలోని బాహ్య పదార్థాలను ఎదుర్కొంటాయి.
#ఇవి రెండు రకాలు అవి లింఫోసైట్లు, మోనోసైట్లు.
లింఫోసైట్లు
#ఇవి అతిచిన్న తెల్ల రక్తకణాలు.
#వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
#ఇవి రెండు రకాలు అవి T-లింఫోసైట్లు, B-లింఫోసైట్లు.
మోనోసైట్లు
# ఇవి అతిపెద్ద తెల్ల రక్తకణాలు.
#ఇవి దేహంలో చనిపోయిన బ్యాక్టీరియాలు, ఇతర కణాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి.
రక్తఫలకికలు
#రక్తఫలకికలను త్రాంబోసైట్లు అంటారు.
#వీటిలో కేంద్రకం ఉండదు.
#ఇవి సాధారణంగా 1 క్యుబిక్ మిల్లీమీటర్‌కు 2.5-4.5 లక్షలు ఉంటాయి.
#ఇవి రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
# డెంగీ వ్యాధి వచ్చినప్పుడు వ్యాధికారక వైరస్ రక్తఫలకికలపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల వీటి సంఖ్య తగ్గుతుంది.
రక్త వర్గాలు
# రక్త వర్గాలను (A, B, O) కారల్ లాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు.
# కారల్ లాండ్ స్టీనర్ను రక్త వర్గాల పితామడిగా (Father of Blood Groups) పిలుస్తారు. ఇతడి జన్మదినమైన జూన్ 14ను ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకొంటారు.
#ఎర్ర రక్తకణాల మీద 2 రకాల ప్రతిజనకాలుంటాయి. అవి ప్రతిరక్షకం A, ప్రతిరక్షకం B.
#ప్లాస్మాలో రెండు రకాల ప్రతిరక్షకాలు ఉంటాయి. అవి ప్రతిరక్షకం A, ప్రతిరక్షకం B.
#O రక్తవర్గం గల వ్యక్తుల రక్త కణాల మీద ప్రతిజనకాలు ఉండవు. అందువల్ల O రక్త వర్గం గల వ్యక్తులను విశ్వదాతలు అంటారు.
# AB రక్తవర్గం గల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉండవు. అందువల్ల AB రక్తవర్గం గలవారిని విశ్వగ్రహీతలు అంటారు.
#ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గం- B+
#ప్రపంచంలో తక్కువగా ఉండే రక్తవర్గం-AB-
# ఒక వ్యక్తి నుంచి రక్తాన్ని ధమని నుంచి తీసి మరో వ్యక్తి సిర ద్వారా ఎక్కించడాన్ని రక్త ప్రవేశనం అంటారు.
# రక్త ప్రవేశనంలో ఇద్దరి బ్లడ్ గ్రూప్ సరిపోకుంటే రక్తకణాలు గుంపులుగా ఏర్పడి రక్త ప్రసరణకు అవాంతరం ఏర్పడి గుచ్ఛీకరణం జరిగి ఆ వ్యక్తి మరణించవచ్చు.
Rh కారకం
# మానవుడు, రీసస్(Rhesus) కోతుల్లో Rh కారకాన్ని కారల్ లాండ్ స్టీనర్, అలెగ్జాండర్ వీనర్ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు.
# Rhesus పేరులోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని Rh అని పేరుపెట్టారు.
# ఈ కారకం ఎర రక్తకణాల పైన ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
# ఒకవేళ Rh కారకం ఉంటే వారి రక్తాన్ని Rh+ అని లేకపోతే Rh- అని అంటారు.
రక్తవర్గం ఎర్ర రక్తకణాలపై ప్రతిజనకం ప్లాస్లాలో ప్రతిరక్షకం ఎవరికి ఇన్వొచ్చు
A A B A,AB
B B A B,AB
AB AB ఉండవు AB
O ఉండవు AB O,A,B,AB
ప్రాక్టీస్ బిట్స్
1. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే పదార్థం
1) ప్రోథ్రాంబిన్
2) హీమోసయనిన్
3) హెపారిన్
4) సోడియం సిట్రేట్
2. జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టని స్థితిని ఏమంటారు?
1) సిప్టిసిమియా 2) హీమోఫీలియా
3) తలసేమియా 4) ల్యుకేమియా
3. ఎరరక్తకణాల శ్మశానవాటిక అని దేనినంటారు?
1)కాలేయం 2) ప్లీహం
3) ఎముక మజ్జ 4) క్లోమం
5. నత్త, పీతల్లో రక్తం నీలిరంగులో ఉండటానికి కారణమైన వర్ణకం?
1) హీమోగ్లోబిన్ 2) హీమోఎరిత్రిన్
3) హీమోసయనిన్ 4) క్లోరోక్రూవరిన్
6. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకొంటారు?
1) విలియం హార్వే
2) కారల్లాండ్ స్టీనర్
3) అలెగ్జాండర్ వీనర్
4) విలియం బెకాఫ్
7. O రక్త వర్గంలో ఎర రక్తకణాలపై ఉండే ప్రతిజనకాలు
1)A 2)B
3)AB 4) ఏమీ ఉండవు
8. రక్తం Ph విలువ ఎంత?
1)8.2 2) 7.4 3) 6.8 4) 5.9
9. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
1) ప్రౌఢ దశలో ఎర రక్తకణాలు ఎముక మజ్జలో ఏర్పడతాయి
2) ఎర రక్తకణాల పరిపక్వతకు ఫైరిడాక్విన్ అవసరమవుతుంది
3) ఎర రక్తకణాల సంఖ్యలో తగ్గుదలను ఎరిత్రోపీనియా అంటారు
4) క్షీరదాల ఎర రక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది
1) 1, 4 సరైనవి 2) 1,3 సరైనవి
3) 1, 2, 3 సరైనవి 4) అన్నీ సరైనవే
10. కింది వాటిలో వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే తెల్లరక్త కణాలు ఏవి?
1) మోనోసైట్లు 2) బేసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్ 4) లింఫోసైట్లు
సమాధానాలు
1.3 2.2 3.2 4.4 5.3 6.2 7.4 8.2 9.2 10.4
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?