సర్దార్ సర్వాయి పాపన్నను హతమార్చిన మొఘల్ సైనికుడు ఎవరు?
1. సురవరం ప్రతాపరెడ్డి రాసిన ప్రథమ సంకలన గ్రంథం?
1) గోలకొండ కవుల చరిత్ర
2) రామాయణ విశేషాలు
3) రెడ్డి రాజుల సాంఘిక చరిత్ర
2. కాకతీయుల కాలంలో వెలసిన మొదటి వ్యవసాయ గ్రంథం?
1) పరాశర స్మృతి 2) కృషి పరాశరం
3) నవవ్యవసాయం 4) వృక్షాయుర్వేదం
3. కాకతీయుల కాలంలో జలశాస్త్ర రహస్యాలు, ఉద్యానవన కృషి వంటి ప్రధాన అంశాలతో కూడిన గ్రంథం
‘వృక్షాయుర్వేదం’. దీని రచయిత?
1) విద్యాధరుడు
2) రెండో ప్రతాపరుద్రుడు
3) సారంగధరుడు 4) వల్లభరాముడు
4. ‘గిజిగాడు’ పక్షి ఏ దిక్కులో తన గూటి ద్వారం నిర్మించుకుంటుందో.. దానికి వ్యతిరేక దిక్కులో వర్షం పడుతుందని తెలిపిన మొదటి గ్రంథం?
1) ప్రతాపరుద్ర యశోభూషణం
2) నీతిసారం 3) అహల్య చరిత్ర
4) సస్యానందము
5. కాకతీయుల కాలంలో గొప్ప పరిపాలనా విధానం ఉండేదని తెలిపే ఆంగ్ల గ్రంథం ‘వండర్స్ ఆఫ్ ది ఈస్ట్’. దీని రచయిత?
1) టాల్‌స్టాయ్ 2) జార్జ్ ఆర్వెల్
3) థామస్ మన్రో 4) ఫ్రాయర్ జోర్డాన్స్
6. జాయపసేనాని రాసిన ‘నృత్యారత్నావళి’ని తెనిగించిన కవి?
1) కట్టమంచి రామలింగారెడ్డి
2) సురవరం ప్రతాపరెడ్డి
3) రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
4) ముద్దుపళని
7. సర్దార్ సర్వాయి పాపన్నను హతమార్చిన మొఘల్ సైనికుడు ఎవరు?
1) నిజాం ఖాన్ 2) దిలావర్ ఖాన్
3) అజాంఖాన్ 4) రష్మీ
8. ఏ శాసనం ప్రకారం ‘బండిపోత గౌడ, పాఖ్రిలా గౌడ’ అనే బిరుదుల సర్వాయి పాపన్నకు ఉన్నాయని తెలుస్తుంది?
1) ధూళిమిట్ట 2) ధూళికట్ట
3) దూపాడు 4) బయ్యారం
9. ‘నా ఎద లోపల ఎద’ అని సినారె ఏ ప్రముఖ కవిని గురించి వ్యాఖ్యానించారు?
1) ఆత్రేయ 2) దాశరథి
3) ఆరుద్ర 4) వడ్డేపల్లి కృష్ణ
10. కొన్ని వందల ఏండ్ల క్రితం థాయిలాం డ్కు తీసుకెళ్లిన బుద్ధుని ధాతువు (అస్థికలు)లను తిరిగి భారత్‌కు తెప్పించి సికింద్రాబాద్‌లోని మహాబోధి బౌద్ధ విహార్‌లో ఉంచడానికి కారణమైన వ్యక్తి?
1) మరి చెన్నారెడ్డి 2) రంగారెడ్డి
3) మాజీ డీజీపీ చెన్నూరి ఆంజనేయరెడ్డి
4) కడప కోటిరెడ్డి
11. 2019 కాళోజీ నారాయణ రావు అవార్డు అందుకున్న కవి?
1) కోట్ల వెంకటేశ్వర రెడ్డి (వనపర్తి)
2) కోమటిరెడ్డి లచ్చిరెడ్డి (నల్లగొండ)
3) రామకవచం సత్యనారాయణ (సాగర్)
4) కోదాటి సుధాకర్
12. గణపతి దేవ చక్రవర్తి తన బావమరిది జాయప సేనానికి ‘వైరిగోధుమ ఘరట్ట’ అనే బిరుదును ఎందుకు ఇచ్చాడు?
1) కుతుబ్‌షాహీల దాడిలో సహాయ సహకారాలందించినందుకు
2) కళింగ దాడిపై సాయపడినందుకు
3) తిరుగుబాట్లను అణచినందుకు
4) అంబదేవుడి తిరుగుబాటుకు సహకరించినందుకు
13. తొలి తెలుగు దండకం రాసిన కవి, దాని పేరు?
1) తిక్కన- హరిహర శతకం
2) విద్యానాథుడు- పంచదశ
3) పోతన-భోగినీ దండకం
4) నన్నయ- శేజి దండకం
14. సీఎం కేసీఆర్ 2020, జూన్ 28న ఏ ప్రముఖ వ్యక్తి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు?
1) కాళోజీ 2) దాశరథి
3) సినారే 4) పీవీ నర్సింహారావు
15. ఒకప్పుడు కూలీ.. టీచర్, ప్రొఫెసర్ అయి అమెరికా లాంటి విదేశాల్లో సాహిత్య ప్రసంగాలు ఇచ్చిన మహిళ?
1) త్రివేణి 2) పున్నమి
3) సంధ్య 4) హంపి
16. 1859లో హైదరాబాద్ నుంచి ఉర్దూలో వెలువడిన ‘తొలి తెలంగాణ వైద్య’ పత్రిక?
1) మదర్సా 2) తబ్బీర్
3) తక్ధీర్ 4) రిసాలతబ్బి
17. దేశంలోనే మొట్టమొదటి గోండు రాజ్య సంస్థానంగా ఉన్న సిర్పూర్ కోట (కుమ్రం భీం జిల్లా) పూర్వ నామం?
1) రంగాపురం 2) కొండాపురం
3) సూర్యాపురం 4) వెల్దండపురం
18. నవల పేరే ఇంటిపేరుతో పిలుస్తున్న అంపశయ్య నవీన్ తెలుగులో ఒక కవి జీవితా (చలం)న్ని నవలగా చిత్రించారు. ఆ నవల పేరు?
1) తీరని దాహం 2) జీవన తీరాలు
3) దృక్కోణాలు 4) ప్రేమకు ఆవలితీరం
19 ఆ మధ్య వార్తల్లోకి వచ్చిన జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరు?
1) రామకోటయ్య 2) సదాశివయ్య
3) కోదండ రామయ్య 4) ఎవరూకాదు
20. నిజాం రాజు ద్వారా ‘దర్జీ అవ్వల్ (నిజాం రాజ్య చందమామ)’ బిరుదు పొందిన వరంగల్‌కు చెందిన గొప్ప దాత?
1) చందా కాంతయ్య 2) కృష్ణకాంత్
3) రవికాంత్ 4) ఏదీకాదు
21. రాణి రుద్రుమదేవి ప్రధాన పాత్రలో ‘హృదయశల్యం’ కథను రాసినది?
1) బూర్గుల రామకృష్ణారావు
2) దాశరథి రంగాచార్య
3) మాడపాటి హనుమంతరావు
4) ఎవరూకాదు
22. కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ తెలుగులో శతకం రాసినది ఎవరు?
1) శ్రీరంగాచార్యులు 2) రంగాచార్యులు
3) శ్రీపెరంబుదూరు లక్ష్మణాచార్యులు
4) శ్రీపెరంబుదూరు లక్ష్మణమూర్తి
23. 1940లో నిజాం కాలేజీ నుంచి ప్రముఖ సాహితీవేత్తలు కురుంగంటి సీతారామాచా ర్యులు, రామిప్రోలు సుబ్బారావు, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి వంటివారు 15 ఏండ్లు నడిపిన పత్రిక?
1) విద్యార్థి 2) త్రివేణి
3) తెలంగాణ 4) మిసిమి
24. దిజ్ఞాగుడు అనే బౌద్ధ తార్కిక పండితుడు తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లాలోని పాశిగాం గ్రామవాసి అని చెప్పినచరిత్రకారుడు?
1) బీఎన్ శాస్త్రి 2) వీవీ కృష్ణశాస్త్రి
3) పీవీ పరబ్రహ్మ శాస్త్రి 4) సర్ జాన్ మార్షల్
25. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ తాలుకాలోని ధూళికట్ట స్థూపం నిర్మాత?
1) నాగముని 2) మిళిందుడు
3) నాగముచిళింద 4) నాగవర్మ
26. ఇంటర్లో తెలుగు పాఠంగా వెలువడిన ‘శాంతిపథము’ అనే బౌద్ధ నాటకం రచయిత?
1) శాంతిశ్రీ 2) శాతకర్ణి
3) మలయశ్రీ 4) శ్రీశ్రీ
27. ‘తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్- 2020’ సదస్సు ఎక్కడ జరిగింది?
1) కరీంనగర్ 2) నడిగూడెం
3) వరంగల్ 4) మునగాల
28. ‘భావరి’ అనే బ్రాహ్మణ గురువు 16 మంది శిష్యులు మగధలో బుద్ధుడిని కలిసి సంభాషించినట్లుగా తెలిపే ఆధార గ్రంథం?
1) ధమ్మపథం 2) దీపవంశ
3) మహావంశ
4) సుత్తనిపాత-పారాయుళవగ్గ (పాళీ)
29. క్రీ.పూ. 6వ శతాబ్దంలోని షోడశ మహారాజ జానపదాల్లోని తెలంగాణకు చెందిన రెండు రాజ్యాలు ఏవి?
1) అవంతి, మగధ 2) అశ్మక, ములక
3) కురు, పాంచాల 4) విరాట, మత్స్య
30. తెలంగాణలో పంచలోహ విగ్రహాలకు నుదుటన తిలకం ఉన్నట్లుగా బయల్పడిన అతిపెద్ద బౌద్ధస్థూపం?
1) ధూళికట్ట 2) సాగర్
3) నేలకొండపల్లి 4) ఫణిగిరి
31. ప్రపంచంలోనే రెండో ఏకశిలా విగ్రహం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహం.ఈ విగ్రహ శిల్పి?
1) శివనాగిరెడ్డి 2) వడ్డె హనుమంతు
3) సిరికొండ లక్ష్మణ్ 4) ఎవరూకాదు
32. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ 2020, జనవరిలో పాల్గొన్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ ఎక్కడ జరిగింది?
1) సింగపూర్ 2) జర్మనీ-బెర్లిన్
3) స్విట్జర్లాండ్‌లోని దావోస్
4) బర్మా-రంగూన్
33. తొలి దళిత కావ్యం? రచయిత?
1) హరిజన శతకం- కుసుమ ధర్మన్న
2) హరిజన్- రావిపూడి వెంకటాద్రి
3) గబ్బిలం- జాషువా
4) నిరుద్ధ భారతం- మంగిపూడి వెంకటశర్మ
34. 1969లో ఇంటర్ బోర్డు ఏర్పాటై 1969-70లో కింది ఒక వ్యక్తి చేతులమీ దుగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది?
1) సురవరం 2) రామానంద తీర్థ
3) కాళోజీ 4) పీవీ నర్సింహారావు
35. నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో 1890లో ‘హైదరాబాద్ రికార్డర్’ అనే పత్రికను స్థాపించినది ఎవరు?
1) రాబర్ట్ మ్యూల్ 2) రొనాల్డ్ రాస్
3) జాన్ సాల్మన్ 4) పై ఎవరూ కారు
36. దేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్క్ (కేసీఆర్ పార్క్) విస్తీర్ణం ఎన్ని ఎకరాలు?
1) 118 2) 2020 3) 2087 4) లక్ష
37. తెలంగాణలో వెయ్యి మసీదులు కట్టిం చిన ఘనత ఏ కుతుబ్‌షాహీ వంశ రాజుకు దక్కుతుంది?
1) మహ్మద్ కులీకుతుబ్‌షా
2) తానీషా
3) సుల్తాన్ కులీకుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా
38. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం తుంగపాడు గ్రామం వద్ద శాసనం వేయించిన కాకతీయ రాజు?
1) రుద్రమదేవి 2) రెండో ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు 4) మొదటి రుద్రదేవుడు
39. ఓరుగల్లును కాకతీయుల కాలంలో ఆంధ్రపురిగా పేర్కొన్న గ్రంథం?
1) మార్కోపోలో ట్రావెల్స్
2) విద్యానాథుని ప్రతాపరుద్రీయం
3) రుద్రదేవుని నీతిసారం
4) కల్నల్ టాడ్ రాజస్థాన్ కథావళి
40. సర్దార్ జమలాపురం కేశవరావు, పర్చా శ్రీనివాసరావు, మందుముల నరసింగ రావు, కొండా వెంకటరంగారెడ్డి కలిసి నిజాంకు వ్యతిరేకంగా విజయవాడ నుంచి నడిపిన పత్రిక?
1) నిజాం 2) తెలంగాణ
3) హైదరాబాద్ 4) కాకతీయ
41. వరంగల్ భద్రకాళి ఆలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో ఎవరు నిర్మించారని ఆధారాలు ఉన్నాయి?
1) రుద్రదేవుడు 2) గుండ్యన
3) బేతరాజు 4) ఎరభూపాలుడు
42. బూర్గుల రామకృష్ణారావు కుమారుడు రంగనాథరావు నడిపిన పత్రిక?
1) ప్రతిధ్వని 2) ప్రత్యూష
3) మితవాది 4) ప్రగతి
43. కాకతీయుల కాలంలో నిర్మించిన పాకాల సరస్సు వరంగల్‌కు 55 కి.మీ. దూరంలో ఉంది. దీనిని ఏ సంవత్సరంలో నిర్మించారు?
1)1213 2)1215 3)1300 4)1323
44. ‘అలిమేలు మంగా పరిణయం’ రాసిన తూము రామచంద్రారెడ్డి (1830-35) పాలమూరు జిల్లాకు చెందినవారు. ఈయన ఏ సంస్థానానికి అధిపతి?
1) హన్మాజీపేట 2) మానాజీపేట
3) గద్వాల 4) దేవరకొండ
45. శ్రీకృష్ణ తులాభారంను ప్రప్రథమంగా ద్విపదలో రాసిన రచయిత?
1) శ్రీ రంగాచార్య
2) దాశరథి రంగాచార్య
3) ఆసూరి మరింగంటి వెంకట రంగాచార్యులు- అనంతగిరి
4) మరింగంటి రంగాచార్యులు-కన్నెకల్లు
46. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఎప్పుడు ఏర్పడింది?
1) 2017, ఆగస్టు 20
2)2018,ఆగస్టు 15
3) 2020, జనవరి 1
4) 2019, డిసెంబర్ 1
47. 1952లో తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన కవి?
1) దాశరథి రంగాచార్య
2) దాశకథి కృష్ణమాచార్య
3) శ్రీరంగ సూర్య
4) శ్రీనివాస అయ్యంగార్
48. తెలుగు సినీ సాహిత్యంలో మొట్టమొదటి ‘ఖవ్వాలి’ పాటను రాసినది?
1)ఆరుద్ర 2)ఆత్రేయ 3)దాశరథి 4)సినారె
49. జాతీయోద్యమ కాలంలో తెలంగాణలో సామాన్యులను చైతన్యపరిచిన కథల్లో ‘మనమే నయం’ అనే కథను రాసినది?
1) శ్రీరంగాచార్యులు 2) భద్రిరాజు
3) కోదాటి 4) కాళోజీ
50. ‘ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి’ అనే గ్రంథం ద్వారా ‘కాళేశ్వరం’ ఏ పురాణ కాలం నుంచి చరిత్రలో ఉందని తెలుపుతున్నది?
1) అగ్నిపురాణం
2) భవిష్య పురాణం
3) బ్రాహ్మణ పురాణం
4) బ్రహ్మాండ పురాణం
Answers
1-1, 2-2, 3-3, 4-4, 5-4, 6-3, 7-2, 8-1, 9-2, 10-3, 11-1, 12-2, 13-3, 14-4, 15-1, 16-4, 17-3, 18-4, 19-2, 20-1, 21-3, 22-4, 23-1, 24-2, 25-3, 26-3, 27-2, 28-4, 29-2, 30-3, 31-2, 32-3, 33-4, 34-4, 35-3, 36-3, 37-3, 38-4, 39-2, 40-3, 41-4, 42-2, 43-1, 44-2, 45-4, 46-1, 47-2, 48-3, 49-4, 50-4,
సిలివేరు లింగమూర్తి
ప్రభుత్వ జూనియర్ కాలేజీ
హాలియా
9951061289
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు