మీకు తెలుసా? 10-06-2022
నాంపల్లి రైల్వే స్టేషన్
#1907 వ సంవత్సరంలో నిజాం నవాబు నాంపల్లి రైల్వేస్టేషన్ నిర్మించారు.
#దీన్ని హైదరాబాద్ దక్కన్ రైల్వేస్టేషన్ అని కూడా ప్రజా వాడుక భాషలో పిలుస్తారు.
#తడితడిగా ఉన్న బురద ప్రాంతంలో కట్టడం వల్ల దీనికి నాంపల్లి అని పేరు వచ్చింది.
# ఉర్దూ భాషలో ‘నామ్’ అంటే తడితడిగా ఉన్న భూభాగం. ‘పల్లి’ అంటే ప్రాంతం.
# నాంపల్లి పబ్లిక్‌గార్డెన్ (బాగే ఇ ఆమ్) నిర్మించే సమయంలోనే ఈ స్టేషన్ నిర్మించారు. ముఖ్యంగా వస్తువులను రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించారు.
కాచిగూడ రైల్వే స్టేషన్
# నిజాం రాజులు కట్టించిన మూడో ముఖ్యమైన రైల్వేస్టేషన్ కాచిగూడ స్టేషన్.
# 1916లో నిర్మించిన ఈ రైల్వేస్టేషన్ 1950 వరకు నిజాం రాజ్య గ్యారెంటీడ్ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్‌గా కొనసాగింది. దీని కంటే ముందు 1916 వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్స్‌గా ఉండేది.
#కాచిగూడ రైల్వేస్టేషన్ సెంట్రల్, సైడ్ డోములతో పాటు మినరేట్సును కలిగి ఉండి గోథిక్ ఆర్కిటెక్చర్‌తో అందంగా నిర్మించారు.
# 1950లో నిజాం స్టేట్రైల్వేను జాతీయం చేసి 1951లో సెంట్రల్ రైల్వేగా పేరు మార్చారు.
#1966 అక్టోబర్ 2న సెంట్రల్ రైల్వేను సౌత్‌సెంట్రల్ రైల్వేగా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది.
# దక్షిణ మధ్య రైల్వే..తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొంతభాగం ఈ జోన్ కింద సేవలను అందిస్తుంది.
#దక్షిణ మధ్య రైల్వే 6 డివిజన్లను కలిగి ఉంది. అవి.
#సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్. మొత్తం దక్షిణమధ్య రైల్వే 5,951 కి.మీ రైల్వేలైన్లు ఉండగా తెలంగాణలో 1,753 కి.మీ నిడివి కలిగిన రైల్వే లైన్లు ఉన్నాయి.
#1978 ఫిబ్రవరి 17న సికింద్రాబాద్ డివిజన్, హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్‌గా విడిపోయింది.
# రాష్ట్రంలో మొత్తం రైల్వే లైన్లు దక్షిణ మధ్యరైల్వే మండలం కింద ఉన్నాయి.
# 1957 నవంబర్ 24 న IRISET (Indi an Railway Institute of Signal Engineering and tele Communi cations) ను ఏర్పాటు చేశారు.
#తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వర్క్‌షాప్ లాలాగూడ (సికింద్రాబాద్)లో కలదు.
#రైల్వే డీజిల్ లోకో షెడ్లు వరంగల్ జిల్లాలోని ఖాజీపేట, సికింద్రాబాద్‌లోని మౌలాలి దగ్గర కలవు.
# సౌత్ సెంట్రల్ రైల్వే నినాదం. Service with Commitment Progress with Pride.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు