అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం? ( టెట్ ప్రత్యేకం)
సైకాలజీ మోడల్ టెస్ట్ (నిన్నటి తరువాయి)
35. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో లక్ష్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థిని శారీరకంగా దండించడం, చులకన చేసి మాట్లాడటం వల్ల విద్యార్థి ఏ అంశంపై వ్యతిరేక ప్రభావాన్ని కలుగజేస్తూ దానిని కుంటుపడేలా చేస్తుంది?
1) ప్రజ్ఞ 2) మూర్తిమత్వం
3) సహజ సామర్థ్యం 4) సృజనాత్మకత
36. విద్యార్థి మూర్విమత్వంపై ప్రభావం చూపే గ్రంథుల స్రావాలకు సంబంధించి కింది వాటిని జతపర్చండి?
1. ఉద్వేగం ఎ. పీయూష గ్రంథి
2. జైగాంటిజమ్ బి. థైరాయిడ్ గ్రంథి
3. క్రిటినిజమ్ సి. అధివృక్క గ్రంథి
4. టిటాని డి. పారాథైరాయిడ్ గ్రంథి
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
37. తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాలకు విలువను ఇచ్చి, ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు, పిల్లలు ఒకరితో ఒకరు కూలంకషంగా చర్చించుకొనే విధానమే?
1) అతి గారాల పెంపకం
2) జోక్యరహిత పెంపకం
3) నిరంకుశ పెంపకం
4) ప్రజాస్వామిక పెంపకం
38. ఒక ఉపాధ్యాయుడిగా నీవు తరగతి గదిలో మానసిక ఆరోగ్యం సరిగా లేని విద్యార్థిని సమూహం నుంచి ఎలా గుర్తిస్తావు?
1) సాంఘిక పరిపక్వతను పొంది ఉండటం
2) తన పరిమితులు గురించిన అవగాహన కలిగి తదనుగుణంగా వ్యవహరించడం
3) ఉద్వేగాలను నియంత్రణలో ఉంచకపోవడం
4) స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండడం
39. ఒక విద్యార్థి, ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహిస్తున్న జట్టు/ సామూహిక కృత్యాల్లో పాల్గొనకుండా నిరంతరం తలప్పి, నడుము ప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి మానసిక స్థిమితాన్ని పొందడం?
1) దౌర్బల్య ప్రతిచర్యలు
2) అనియంత్రిత-నిర్బంధక నాడీరుగ్మత
3) అవసారం 4) హిస్టీరియా
40. ఆటోలో వెళితే కాలం కలిసి వచ్చినా, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయని బస్సులో వెళితే డబ్బులు తక్కువ ఖర్చయినా సకాలంలో వెళ్లలేమోనని భయపడే సంఘర్షణ స్థితి?
1) ఉపగమ- పరిహార
2) ఉపగమ- ఉపగమ
3) ద్విఉపగమ-పరిహార
4) పరిహార- పరిహార
41. ఇంజినీరింగ్‌లో సీటు రాని అమ్మాయి, ఇంజినీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దాని కన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సు మంచిదని సమర్థించుకోవడం?
1) పరిహారం 2) ప్రక్షేపణం
3) హేతుకీకరణం 4) విస్తాపనం
42. కల్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తర్వాత అతడు కవిత్వం రాసేందుకు తన ఆలోచనలు లగ్నంచేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం?
1) ప్రక్షేపణం 2) హేతుకీకరణ
3) ఉదాత్తీకరణ 4) దమనం
43. సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడే పద్ధతి?
1) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి
2) అంతఃపరిశీలనా పద్ధతి
3) పరిశీలనా పద్ధతి
4) తిర్యక్ ఉపగమ పద్ధతి
44. ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి వారు పొందే మార్కులకు మధ్యగల సంబంధాన్ని కనుక్కోవాలని అనుకుంటున్నాడు. కానీ పిల్లల ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది?
1) పరతంత్ర చరం
2) స్వతంత్ర చరం
3) జోక్యం చేసుకొనే చరం
4) ప్రయోగ రచన
45. వికాస కృత్యాలు అనే పదాలు ప్రతిపాదించినది ఎవరు?
1) కోల్బర్గ్ 2) వైగాట్స్కీ
3) పీయాజే 4) హావిగ్ హ్యూరిస్ట్
46. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం?
1) లక్ష్య నిర్దేశం కాదు
2) అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు
3) జీవిత పర్యంత ప్రక్రియ
4) అభ్యసనం నిశ్చల ప్రక్రియ
47. అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా కింది ప్రవచనాల్లో ఒకటి సరైనది కాదు?
1) ప్రేరణ అభ్యసనానికి రాచబాట
2) వ్యక్తి ఆరోగ్యం అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు
3) స్మృతి అభ్యసనాన్ని పెంచుతుంది
4) పరిపక్వత, అభ్యసనాల మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది
48.అక్షయ్ అనే విద్యార్థి తెలివైనవాడు. అయినప్పటికీ తరగతి విద్యాసాధనలో వెనుకబడటాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు అతనికి ప్రేరణ, ఆసక్తిని కలిగించడం ద్వారా అభ్యసనం తిరిగి వేగాన్ని పుంజుకోవడం ద్వారా ఎక్కువ మార్కులను సాధించడం అనే దానిని సూచించే దశ?
1) శారీరక అవధి/ హద్దు
2) పీఠభూమి దశ
3) చాంచల్య దశ
4) పీఠభూమి తర్వాత స్ఫూర్తి
49. కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. కుంభాకార వక్రరేఖ- ఆరోహణ వక్రరేఖ-తిరోగమన వక్రరేఖ
బి. పుటాకార వక్రరేఖ-అవరోహణ వక్రరేఖ-పురోగమన వక్రరేఖ
సి. కుంభాకార వక్రరేఖ- అవరోహణ వక్రరేణ- తిరోగమన వక్రరేఖ
డి. పుటాకార వక్రరేఖ- ఆరోహణ వక్రరేఖ- పురోగమన వక్రరేఖ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, డి 4) సి, డి
50. వివిధ అంశాలు, సన్నివేశాల మధ్య బేధాన్ని గుర్తించడం, సమాచార నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, వివిధ వస్తువుల ఉపయోగాలు తెలపడం వంటివి కింది వాటిలో దేన్ని సూచిస్తున్నాయి?
1) అభ్యసన ఉత్పాదితాలు
2) అభ్యసన సాధకాలు
3) అభ్యసన ప్రక్రియ 4) పైవన్నీ
51. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు కింది సిద్ధాంతం ఫలితం?
1) అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం
2) యత్న-దోష అభ్యసన సిద్ధాంతం
3) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
4) కార్యసాధక నిబంధన సిద్ధాంతం
52. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్ధంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది?
1) నిబంధిత ఉద్దీపన
2) నిబంధిత ప్రతిస్పందన
3) నిర్నిబంధిత ఉద్దీపన
4) నిర్నిబంధిత ప్రతిస్పందన
53. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది?
1) నిబంధిత ఉద్దీపన
2) నిర్నిబంధిత ఉద్దీపన
3) నిబంధిత ప్రతిస్పందన
4) నిర్నిబంధిత ప్రతిస్పందన
54. ‘ఒక విద్యార్థి తన అన్నయ్య పదవ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్న కంప్యూటర్ బమతిగా ఇచ్చాడు. కాబట్టి నేను కూడా 10/10 సాధించి మంచి బమతి తీసుకుంటాను’ అనుకునే సందర్భంలోని పునర్బలనం?
1) పరోక్ష 2) ప్రత్యక్ష
3) స్వీయ 4) శూన్య
55. లత విజ్ఞానశాసా్త్రనికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి అయిదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు. ఇక్కడ పునర్బలన నియమం?
1) స్థిర నిష్పత్తి పునర్బలన నియమం
2) స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం
3) నిరంతర పునర్బలన నియమం
4) చరశీల పునర్బలన నియమం
56. శిశువు స్వతంత్రంగా చేయాల్సిన సామర్థ్యానికి, ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్యగల తేడాను ఎలా పిలుస్తారు?
1) సామీప్య వికాస మండలం
2) దూరస్థ వికాస మండలం
3) మధ్యస్థ వికాస మండలం
4) తాత్కాలిక వికాస మండలం
57. అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించిన అన్వయానికి వ్యతిరేక భావన?
1) డ్రిల్లింగ్‌ను ప్రోత్సహించాలి
2) విద్యార్థుల్లో జ్ఞాననిర్మాణం జరిగేలా చేయాలి
3) విద్యార్థులను అభ్యసనం వైపు ప్రేరేపించాలి
4) భాగాల కన్నా అంశాల మొత్తానికి ప్రాధాన్యతలు
58. శాస్త్రీయ నిబంధనలకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది?
1) దీనిని S-రకం అభ్యసనం అంటారు
2) ఇక్కడ ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడుతుంది
3) ప్రతిస్పందన తెప్పించడానికి ఉద్దీపన ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు
4) అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకం
59. సెల్‌ఫోన్ కొన్న తర్వాత రిస్ట్‌వాచీ వాడకం మానేసిన కీర్తి అనే అమ్మాయి, ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టుపై చూడటాన్ని సూచించే నియమం ఏది?
1) పునర్బలనం
2) ఉన్నత క్రమ నిబంధనలు
3) సామాన్యీకరణం
4) అయత్న సిద్ధస్వాస్థ్యం
60. ఉపాధ్యాయుడు రాము దస్తూరీని మెచ్చుకోవడంతో మిగిలిన పిల్లలు కూడా రాములాగే పునర్బలనం పొందాలనే ఉద్దేశంతో వారు కూడా మంచి దస్తూరి అభివృద్ధిపరుచుకోవడానికి ప్రయత్నించారు. బందురా ప్రకారం ఇక్కడ పిల్లలు అధిగమించిన పునర్బలనం?
1) స్వీయ పునర్బలనం
2) పరోక్ష పునర్బలనం
3) నిరంతర పునర్బలనం
4) స్థిర నిష్పత్తి పునర్బలనం
61. 5వ తరగతికి బోధిస్తున్న ఉపాధ్యాయుడు, పిల్లలు ఒక ప్రాజెక్టు పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి?
1) నిరంతర పునర్బలనం
2) స్థిర నిష్పత్తి పునర్బలనం
3) స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం
4) చరశీల పునర్బలన నియమం
62. ఒక అమ్మాయి బీదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఈ పునర్బలనం వల్ల బీదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యసనం జరిగిన విధానం?
1) శాస్త్రీయ నిబంధనం
2) పరిశీలనా అభ్యసం
3) అంతరదృష్టి అభ్యసనం
4) కార్యసాధక నిబంధనం
63. ఒక ఉపాధ్యాయుడిగా కింది వాటిలో థారన్‌డైక్ ప్రతిపాదించిన సింసిద్ధతా సూత్రాన్ని సూచించే అంశాన్ని గుర్తించండి?
1) సమ వయస్కులైన పిల్లలందరికీ ఒకే మాదిరి అభ్యసన అనుభవాలు కల్పించాలి
2) ఉపాధ్యాయుడు పిల్లవానికి అభ్యసన అనుభవాలను కల్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయకూడదు
3) పిల్లలు 5 సంవత్సరాల వయస్సులో పాఠశాలకు సంసిద్ధులవుతారు
4) ఉపాధ్యాయుడు పిల్లవాడికి మానసిక స్థితిని గుర్తించే సంవేదన శీలత
64. చరణ్ అనే విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఆ బాలుడిని మెచ్చుకున్నాడు. ఆ విద్యార్థి తర్వాత అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యసన సిద్ధాంత ఆధారంగా వివరించవచ్చు?
1) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
2) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
3) అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం
4) కార్యసాధక నిబంధన సిద్ధాంతం
65. ఇంటికి సైకిల్‌పై వెళ్తున్న నరేష్ అనే విద్యార్థి తరగతి గదిలో రోడ్డు నియమాలు పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం ద్వారా అంబులెన్స్ వాహనం నుంచి వచ్చే శబ్దానికి పక్కకి తప్పుకొన్నాడు. అయితే కిరణ్‌లో జరిగిన అభ్యసనం ఏ సిద్ధాంతాన్ని సూచిస్తుంది?
1) పరిశీలన అభ్యసన సిద్ధాంతం
2) విజయపథ వరణరీతి సిద్ధాంతం
3) నిబంధిత అభ్యసన సిద్ధాంతం
4) గెస్టాల్ట్ సిద్ధాంతం
66. వైగోట్స్కీ విశ్వాసం ప్రకారం?
1) భాషా సముపార్జన, సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది
2) సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా వికాసానికి వీలు కల్పిస్తుంది
3) సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు
4) భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్రలేదు
67. 8వ తరగతిలో ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ఉపాధ్యాయుని ప్రశంసకు గురయిన ప్రభాస్ అనే విద్యార్థి అన్ని అంశాలు బాగా నేర్చుకుంటే అతనిలో కనిపించే థారన్‌డైక్ ప్రధాన నియమాల్లో ఒకటి?
1) సింసిద్ధాతా నియమం
2) అభ్యాస నియమం
3) ఫలిత నియమం
4) బళ ప్రతిస్పందన నియమం
సమాధానాలు
35-2, 36-3, 37-4, 38-3, 39-1, 40-3, 41-3, 42-3, 43-1, 44-3, 45-4, 46-3, 47-2, 48-4, 49-4, 50-1, 51-2, 52-4, 53-3, 54-1, 55-2, 56-1, 57-1, 58-3, 59-4, 60-2, 61-1, 62-4, 63-4, 64-4, 65-3 66-1, 67-3,
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు