రెండో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు
జాతీయాదాయంలో ప్రతి ఏటా 5 శాతం వృద్ధిని సాధించడం.
-మౌలిక, భారీ పరిశ్రమల స్థాపన, విస్తరణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పారిశ్రామికీకరణ వేగాన్ని పెంచడం.
-ఉపాధికల్పన, సౌకర్యాలను విస్తృతంగా కల్పించటం.
-ఆదాయం-సంపద పంపిణీల్లోని వ్యత్యాసాలను గణనీయంగా తగ్గించటం.
-గ్రామీణ ప్రాంతాల్లో కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాపన, గ్రామాల్లో జీవన ప్రమాణాలను పెంచడం.
రెండో పంచవర్ష ప్రణాళిక సాధించిన విజయాలు
-ప్రభుత్వరంగ ఆధీనంలో 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యం గల మూడు ఉక్కు కర్మాగారాలను స్థాపించారు. అవి
1) పశ్చిమ జర్మనీ సహకారంతో ఒడిశాలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం
2) యూఎస్ఎస్ఆర్ సహకారంతో మధ్యప్రదేశ్
(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్)లో భిలాయ్ ఉక్కు కర్మాగారం
3) యూకే సహాయంతో పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్ ఇనుము ఉక్కుకర్మాగారాలను ఏర్పాటు చేశారు. నైవేలిలో లిగ్నైట్ కార్పొరేషన్, పెరంబుదూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రాంచీలో ఇంజినీరింగ్ పరికరాల పరిశ్రమ, భోపాల్‌లో హెవీఎలక్ట్రికల్స్ను, 1957లో ఆటమిక్ ఎనర్జీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
-1958లో రక్షణరంగంలో కీలకమైన డీఆర్డీవోను ఏర్పాటు చేశారు.
-1960లో Intensive Agriculture District Programme (IADP)ని ప్రారంభించారు.
రెండో పంచవర్ష ప్రణాళిక వైఫల్యాలు
-జనాభా పెరుగుదల, ప్రకృతి ఉపద్రవాలు, ద్రవ్యోల్భణం తలెత్తటం, సాధారణ ధరల స్థాయి ఏటా 6 శాతం పెరగటం, పారిశ్రామిక రంగానికి పునాది పడి భారీ పరిశ్రమలు స్థాపించిన వెంటనే ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, వ్యవసాయరంగానికి ప్రాధాన్యాన్ని తగ్గించటం, రుతుపవనాలు అనుకూలించక పోవటంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడం, అమెరికాతో PL-480 ఆహారధాన్యాల ఒప్పందం చేసుకొని ఆహారధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. సూయజ్ కాలువ సంక్షోభం కూడా విదేశీ వర్తకంపై ప్రభావం చూపింది.
మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66)
-రెండో పంచవర్ష ప్రణాళిక దీర్ఘదర్శి ప్రణాళిక. మూడో పంచవర్ష ప్రణాళిక 1961, ఏప్రిల్ 1న ప్రారంభమై 1966, మార్చి 1తో ముగిసింది. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించలేని లక్ష్యాలను ఈ ప్రణాళిక ద్వారా సాధించాలనే కృషి ప్రారంభమైంది. మౌలిక, భారీ పరిశ్రమలు, రవాణా, కమ్యూనికేషన్ల వంటి రంగాల అభివృద్ధితో పాటుగా, వ్యవసాయరంగ అభివృద్ధిని కూడా సాధించేందుకు ఈ ప్రణాళికలో వ్యూహ రచన జరిగింది. స్వయంపోషకమైన, స్వావలంబన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ఈ ప్రణాళిక దీర్ఘకాలిక వ్యూహ రచన చేసింది.
మూడో పంచవర్ష ప్రణాళిక సాధించిన విజయాలు
-1962లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు.
-1963లో (Agricultural Refinance Development Corporation- ARDC) ఏర్పాటు చేశారు.
-1964-65లో (Integrated Child Development Programme – ICDP)ను ప్రారంభించారు.
-1964లో రష్యా సహకారంతో బీహార్ (జార్ఖండ్)లో ఇనుము, ఉక్కు కర్మాగారం స్థాపించారు.
-18.6 మిలియన్ల హెక్టార్ల భూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు.
-1965లో (Export Processing Zone -EPZ ) ప్రారంభించారు.
మూడో పంచవర్ష ప్రణాళిక వైఫల్యాలు
-1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం, 1964లోప్రధాని నెహ్రూ, 1966లో లాల్ బహదూర్‌శాస్త్రీ మరణించడం, గుల్జారిలాల్నందా తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం, అనంతరం ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా అధికారంలోకి రావటం వంటి ఘటనలు జరిగాయి. అనావృష్టి కారణంగా ఆశించినంతగా విదేశీ మారకద్రవ్యం అందకపోవడం, ద్రవ్యోల్బణం పెరుగుదల తదితర సమస్యలతో పాటు ఈ కాలంలో ధరలు 36.4 శాతం పెరిగాయి. అందువలన ఈ ప్రణాళికను అత్యంత విఫలమైన ప్రణాళిక, జబ్బునపడ్డ ప్రణాళిక, వాషౌట్ ప్రణాళికగా చరిత్రలో మిగిలిపోయింది.
వార్షిక ప్రణాళికలు (1966-69)
-మూడో ప్రణాళిక అనంతరం నాలుగో ప్రణాళిక ప్రారంభించటానికి కావల్సిన ప్రోత్సాహక వాతావరణం లేకపోవటంతో మూడు వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలుపర్చారు. మూడో ప్రణాళిక విఫలం, నిధుల కొరత, ద్రవ్యోల్బణం ఒత్తిడి కారణంగా వార్షిక ప్రణాళికలను అమలుపర్చారు. ఈ కాలాన్ని ప్రణాళిక విరామం, ప్రణాళిక సెలవు కాలంగా పరిగణిస్తారు. ఈ వార్షిక ప్రణాళిక కాలంలో 1966 ఖరీఫ్‌లో నూతన వ్యవసాయ వ్యూహం పేరుతో హరిత విప్లవం/సస్య విప్లవం 1966-67లో ప్రారంభించారు. ఈ ప్రణాళిక కాలంలో తీసుకున్న నిర్ణయాలు నాలుగో ప్రణాళికను ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దేశంలో తొలిసారిగా 1966 లో రూపాయిని మూల్యహీనికరణం చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు