కశ్మీర్ లోయలో వరదలకు కారణం?
పోటీ పరీక్షల్లో భూగోళశాస్త్ర విభాగానికి ఎనలేని ప్రాధాన్యం నిపుణ పాఠకులు భూగోళశాస్త్ర అధ్యయనంలో తమ అధ్యయనాన్ని పరీక్షించుకొనేందుకు ఉపయోగపడేలా ఈ బిట్స్‌ను అందిస్తున్నాం..
1. IN-SOL-ATION అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అని అర్థం. భూమి గ్రహిస్తున్న సౌరశక్తి (కేలరీలు) ఉష్ణోగ్రత (డిగ్రీలు) కాదు. ఈ సౌరశక్తిని పగలంతా హ్రస్వతరంగాల రూపంలో భూమి గ్రహించి, రాత్రంతా దీర్ఘతరంగాల రూపంలో కోల్పోతుంది. సౌర వికిరణం (పగలు) వేడెక్కడం, భూ వికరణం (రాత్రి) చల్లారడం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తారు? (4)
1) ఉష్ణ సంవహనం 2) సౌర స్థిరాంకం
3) ఉష్ణోగ్రతా సమతౌల్యం 4) ఉష్ణోగ్రత బడ్జెట్
3. ఒక రోజులో భూమి గ్రహించే సరాసరి సౌరపుటాన్ని సౌర దినం అంటారు. ఇది భూమధ్యరేఖ వద్ద ఎక్కువగా, ధృవాల వద్ద తక్కువగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత ఆధారంగా భూమధ్యరేఖ వద్ద, ధృవాల వద్ద సౌరదినాల సంఖ్య ఎంత? (2)
1) 300, 200 2) 350, 150
3) 200, 300 4) 400, 100
4. శీతల ప్రాంతాల్లో ఆల్కహాల్‌ను వాడే ఫారెన్ హీట్ స్కేల్‌ను ఎందుకు ఉపయోగిస్తారు? (4)
1) ఆ దేశాల్లో పాదరసం దొరకదు
2) సారాయి అధికంగా పండుతుంది కాబట్టి
3) మంచు ప్రాంతాల్లో దాంతోనే కొలవాలి
4) గడ్డకట్టదు
6. భారత వాతావరణ సంస్థ ఏ నగరంలో ఉంది? (1)
1) పుణె 2) ఢిల్లీ 3) కోల్‌కతా 4) విశాఖపట్నం
7. భూమిని చేరుతున్న సౌరపుటం/రేడియేషన్ స్థిరంగా ఉండదు. దాన్ని మార్పులకు గురిచేయని అంశం? (4)
1) అక్షాంశాలు/పగటికాలం 2) సముద్ర సామీప్యత
3) సూర్యునికి మధ్య దూరం 4) ఎత్తు
8. సరికానిది ఏది? (2)
1) ఒకే రేఖాంశంపై అన్ని ప్రాంతాల్లో ఒకే సమయం
2) ఒకే అక్షంపై ఉన్న అన్ని ప్రాంతాల్లో ఒకటే ఉష్ణోగ్రత
3) లోతట్టు ప్రాంతాలు వేడిగా ఉంటాయి
4) తీర ప్రాంతాలు చల్లగా ఉంటాయి
kashmir1
10. మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్. దీన్ని కింది విధంగా కూడా పిలువవచ్చు? (4)
1) ఊర్థ ఉష్ణోగ్రతా విస్తరణ 2) ఉష్ణోగ్రతా విస్తరణ
3) సంపీడన ఉష్ణోగ్రత 4) ఉష్ణోగ్రతా విలోమం
12. ఒక ప్రదేశంపై వాయువుల పొర బరువు ఆ ప్రదేశ పీడనం, ఎత్తు, ఉష్ణోగ్రత, నీటి ఆవిరిపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు అంశాలతో పీడనానికి విలోమ సంబంధం ఉంది. ఎత్తు పెరిగినా, ఉష్ణోగ్రత అధికమైనా, నీటి ఆవిరి పెరిగినా పీడనం తగ్గుతుంది. అయితే గాలికి బరువుందని చెప్పిన వ్యక్తి? (4)
1) వెసూవియస్ 2) న్యూటన్
3) ఆర్కిమెడిస్ 4) గెలీలియో
13. భూమి నుంచి 160 కి.మీ. ఎత్తువరకు పీడనం ఉంటుంది. సముద్ర మట్టం వద్ద సగటు పీడనం 76 సెం.మీ./760 మి.మీ. ప్రతి 10 మీ. ఎత్తుకు వెళ్తున్నకొద్ది పీడనం 1 మి. బార్ తగ్గుతుంది. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక పీడనం 1083 మి. బార్స్ (అగాటా/సైబీరియా). అయితే ఈ పీడన బరువు మన శరీరంపై ఎంత ఉంటుంది? (1)
1) 20 టన్నులు 2) 1 టన్ను
3) 50 కిలోలు 4) 200 గ్రాములు
14. పీడనాన్ని కొలిచే పాదరస బారమితిని టారిసెల్లి (ఇటలీ) కనుగొన్నారు. బారమితిలో పాదరస మట్టం అకస్మాత్తుగా పడిపోవడం దేన్ని సూచిస్తుంది? (3)
1) ధృవాలు తలకిందులు కావడం 2) తుఫాన్లు
3) వర్షాలు 4) సునామీ లేదా భూకంపం
kashmir2
16. అశ్వ లేదా గుర్రపు అక్షాంశాలు అని వేటినంటారు? (3)
1) 100 N – 100 S 2) 100 – 250 N&S
3) 250 – 350 N&S 4) 180 – 380 N&S
17. 24 గంటల్లో రెండు అధిక పీడనాలు, రెండు అల్పపీడనాలు ఎక్కడో ఒక దగ్గర భూగోళం చుట్టూ ఏర్పడుతూనే ఉన్నాయి. విషవత్తుల సమయంలో (మార్చి, సెప్టెంబర్) అధిక పీడనాలు ఉదయం 10 గం.లకు ఒకటి, రాత్రి 10 గం.లకు మరొకటి సంభవిస్తాయి. అల్పపీడనాలు ఉదయం 6 గ.లకు, సాయంత్రం 4 గ.లకు సంభవిస్తాయి. మరి వాతావరణ పీడనం ఎక్కువగా ఎక్కడుంటుంది? (3)
1) సముద్రతలంపై 2) సముద్ర మట్టంపై
3) భూమికి సమీపంలో 4) పైకి వెళ్తున్న కొద్ది
18. పీడన వ్యత్యాసం సమబార రేఖలు దగ్గర దగ్గరగా ఉంటే తక్కువని, దూరం దూరంగా ఉంటే అధికమని అర్థం. రెండు ప్రదేశాల మధ్య పీడన భేదం పెరిగేకొద్ది గాలి వేగం కూడా అధికమవుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు? (3)
1) పీడన సమతౌల్యం 2) పీడన సంతులనం
3) పీడన పవణత 4) పీడన డోలాయం
19. వివిధ అక్షాంశాల మధ్య పీడన విస్తరణ (అడ్డంగా)ను క్షితిజ సమాంతర విస్తరణ అంటారు. భూమిపై క్షితిజ సమాంతరంగా పయనించే గాలిని పవనం అంటారు. భూమిపై నిటారుగా (పైకి/కిందికి) కదిలే గాలిని ప్రవాహం అంటారు. కొరియాలిస్ శాస్త్రవేత్త ప్రకారం భూభ్రమణం వల్ల జనించే శక్తితో ఈ పవనాలు, ప్రవాహాలు ఉత్తరార్ధగోళంలో వాటి కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపు వంగి వీస్తాయి. వీటి ప్రభావం భూమధ్యరేఖ వద్ద సున్నా, ధృవాల వద్ద అత్యధికం. అయితే భూమండలంపై పీడనం ఆధారంగా ఎన్ని మండలాలు/మేఖలలు/బెల్ట్‌లు ఏర్పడ్డాయి? (2)
1) 5 2) 7 3) 9 4) 13
20. గాలుల నిమజ్జనం ఏ మండలంలో జరుగుతుంది? (3)
1) భూమధ్య రేఖ 2) ఆయన రేఖ
3) ఉప ఆయన రేఖ 4) ఉపధృవ మండలం
21. డోల్డ్రమ్స్ అంటే? (2)
1) గాలులు
2) ఒక మండలం
3) భూమధ్య రేఖా ప్రాంతంలో తుఫానులు
4) అల్పపీడనాలు
22. భూమధ్యరేఖ మేఖల కాకుండా అటు ఉత్తరం వైపు, ఇటు దక్షిణం వైపు ఉన్న పీడన మేఖలను వరుసగా గుర్తించండి. (1)
1) అధిక, అల్ప, అధిక పీడన మేఖలలు
2) అల్ప, అధిక, అల్ప పీడన మేఖలలు
3) అధిక, సమభార, అత్యున్నత మేఖలలు
4) అల్ప, సమభార, సమోన్నత మేఖలలు
23. వాస్కోడిగామాను ఇండియాకు తెచ్చింది? (1)
1) అధికం నుంచి వీచే అల్ప పీడన గాలులు
2) అల్పం నుంచి వీచే అధిక పీడన గాలులు
3) సమభార, సమోన్నత గాలులు
4) డోల్డ్రమ్స్
24. వ్యాపార పవనాలు సముద్రాల నుంచి భూభాగాల వైపు వీస్తాయి. నీటి ఆవిరిని మోసుకొచ్చి కింది అంచుల్లో వర్షాలనిచ్చి, నీటి ఆవిరిని కోల్పోతాయి. వంగి వీస్తుండటం వల్ల థార్ ఎడారి లాంటి ప్రాంతాలకు వర్షాన్ని ఇవ్వలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం? (3)
1) ఖండాల అమరిక సరైన విధంగా లేకపోవడం
2) పర్వతాల దిశ గాలుల్ని అడ్డుకునే విధంగా లేకపోవడం
3) కొరియాలిస్/పెరెల్ సూత్రం
4) అధిక బాష్పీభవనం
25. కిందివాటిలో సరికానిది? (1)
1) ట్రీమింగ్ 300 2) రోరింగ్ 400
3) ఫ్యూరియస్ 500 4) స్ట్రీమింగ్ 600
26. జెట్ స్ట్రీములు ఎక్కడ ఉంటాయి? (1)
1) ట్రోపో ఆవరణంలో
2) భూమధ్యరేఖ దక్షిణ ప్రాంతంలో
3) మధ్యధరా ఉత్తర సరిహద్దుల్లో
4) గర్జించే నలభైలలో
27. కశ్మీర్ లోయలో వరదలకు కారణం? (2)
1) లోయ అడుగు భాగం కంటే పై భాగం తొందరగా వేడెక్కి, చల్లారడం వల్ల
2) లోయ కింది భాగం త్వరగా వేడెక్కి వేగంగా చల్లారడం వల్ల
3) లోయ కింది భాగం భూ వికిరణం వల్ల వేడెక్కిడం
4) లోయ ఉపరితలం వేగంగా వేడెక్కి వేగంగా చల్లబడటం వల్ల
28. సిరాకో, లూ, చినూక్, డాక్టర్ మొదలైనవి? (2)
1) సినిమాలు 2) వేడి పవనాలు
3) శీతల ప్రవాహాలు 4) వేడి ప్రవాహాలు
29. వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్థ్రత అంటారు. ఉష్ణోగ్రతలో అంతర్భాగం ఉదాహరణ. 400C ఉష్ణోగ్రత అంటున్నాం. మిగతా 60 శాతం ఆర్థ్రత. భూమి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచేది ఆర్థ్రత. నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అని, ఘనీభవనం, మేఘాలు వర్షరూపంలో కాక నేరుగా వాయు రూపంలోకి మారడం ఉత్పతనం, నీరుగా లేదా వర్షంలా భూమిపై రాలడాన్ని అవపాతం అని పిలుస్తారు. అయితే ఉష్ణోగ్రత పెరిగితే నీరు ఆవిరిగా మారే రేటు లేదా బాష్పీభవనం పెరుగుతుంది. కానీ ఆవిరిని భరించే శక్తి గాలికి ….? (1)
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) విశిష్ట ఆర్థ్రతకు చేరుకుంటుంది
4) బరువు పెరుగుతుంది
31. ఒక కిలో గాలిలో ఉన్న నీటి ఆవిరి బరువు విశిష్ట ఆర్థ్రత. ఒక క్యూబిక్ లేదా ఘనపు సెం.మీ. గాలిలో నీటి ఆవిరి బరువు నిరపేక్ష ఆర్థ్రత. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలోని నీటి ఆవిరి బరువుకు, అదే ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా గాలి నిలుపుకోగల నీటి ఆవిరి బరువుకు గల తేడా లేదా నిష్పత్తిని సాపేక్ష ఆర్థ్రత అంటారు. భూమధ్యరేఖ, ఆయన రేఖలపై సాపేక్ష ఆర్థ్రత తక్కువ, 300 – 900ల మధ్య చాలా ఎక్కువ. అయితే ఉదయం, సాయంత్రాల్లో ఇది ఎలా ఉంటుంది? (2)
1) చాలా తక్కువ 2) ఎక్కువ
3) నిలకడగా ఉంటుంది 4) ఉష్ణోగ్రతను బట్టి ఉంటుంది
37. మిస్ట్ = పల్చటిపొర, ఫాగ్= దొడ్డు పొర, స్మాగ్ = కాలుష్య పొర, హేజ్= దుమ్ముధూళి. ఇందులో అతి ఎక్కువ దృశ్యత కలిగిందేది? (4)
1) మిస్ట్ 2) ఫాగ్ 3) స్మాగ్ 4) హేజ్
38. ఉన్నత మేఘాలు (6000 మీ) మధ్యస్థ మేఘాలు (2000 మీ.), నిమ్న మేఘాలు (2000 మీ.)- ఈకల మాదిరిగా ఉండేవి సిర్రస్. సూర్యచంద్రుల చుట్టు కిరణాల పరివేషం సృష్టించేవి సిర్రోస్ట్రాటస్, బారులు, బారులుగా ఉండేవి సిర్రోక్యుములస్ మేఘాలు. కాలిఫ్లవర్ లేదా గుమ్మటం ఆకారాలు కల్గినవి స్ట్రాటో క్యుములస్ మేఘాలు. నల్లగా ఉండి ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి సృష్టించేవి నింబోస్ట్రాటస్ లేదా క్యుములోనింబస్ మేఘాలు. ఈ భూమిపై మేఘాల విస్తరణ గురించి సరైనది ఏది? (1)
1) 00 ఎక్కువ, 231/20 తక్కువ, 900 ఎక్కువ
2) 00 తక్కువ, 231/20 ఎక్కువ, 900 తక్కువ
3) 00 సామాన్యం, 231/20 అత్యధికం, 900 అత్యల్పం
4) 00 అత్యధికం, 231/20 సామాన్యం, 900 అత్యధికం
39. వాతావరణంలో ఉష్ణోగ్రత 00C కన్నా తక్కువగా ఉన్నప్పుడు అవపాతం స్నో లేదా హిమం రూపంలో భూమిని చేరుతుంది. దీనికి ఎన్ని ముఖాలు? (4)
1) 3 2) 4 3) 5 4) 6
40. స్లీట్ లేదా హిమశకం అంటే భూమిని చేరకముందే మంచుగా మారడం, గేజ్ అంటే భూమిని చేరిన తర్వాత మంచుగా మారడం, హెయిల్స్ లేదా వడగండ్లు అంటే మేఘాల నుంచే రాళ్లు పడటం, డ్రిజిల్ లేదా తుంపర్లు అంటే తుఫాను ఆగిన తర్వాత గాలిలో తేలుతూ/వేలాడుతూ కనిపించే నీటి బిందువులు. అయితే వడగండ్లు బాగా పడే భౌగోళిక ప్రాంతాన్ని గుర్తించండి. (3)
1) మధ్యధరా ప్రాంతం
2) అంటార్కిటికా
3) 300 – 600ల మధ్య ప్రాంతాలు
4) 200- 400 మధ్య ప్రాంతాలు
41. క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షాలు రాబట్టుకునే పద్ధతి. అందుకోసం మేఘాలపై విమానాల ద్వారా వెళ్లి చల్లే పదార్థం?(2)
1) సిల్వర్ బ్రోమైడ్ 2) సిల్వర్ అయోడైడ్
3) జిరంటోరియం 4) క్లోరియం పాస్ఫేట్
42. నీటిఆవిరితో వస్తున్న గాలులకు అడ్డంగా పర్వతాలుంటే పర్వతీయ వర్షం అంటారు. భూమి, నీరు వేడెక్కుతూ కురిసే సంప్రదాయ వర్షాన్ని సంవహన వర్షం అంటారు. శీతల, ఉష్ణ వాయువుల కలయిక వల్ల ఏర్పడిన కల్లోల వర్షాన్ని చక్రవాత వర్షం అని పిలుస్తారు. వేసవిలో అధిక వర్షాలు, శీతాకాలంలో తుఫాన్లు, భూ మధ్యరేఖపై అధిక వర్షపాతం, ధృవాల వైపు వెళ్తున్న కొద్ది తగ్గుతుంది. ఎత్తయిన ప్రాంతా ల్లో, అల్ప పీడన ప్రాంతాల్లో, పవనాలకు అభిముఖంగా ఉన్న పర్వత శ్రేణుల్లో, ఉష్ణ ప్రవాహాలకు సమీపంలో ఉన్న తీర ప్రాంతాల్లో అధిక వర్షపాతాలు నమోదవుతాయి. ప్రపంచ సగటు వర్షపాతం ఎంత? (1)
1) 975 మి.మీ. 2) 1075 సెం.మీ.
3) 689 సెం.మీ. 4) 1236 మి.మీ.
43. వర్షాచ్ఛాయ ప్రాంతాన్ని గుర్తించండి? (3)
1) లడక్ 2) విదర్భ 3) మహబూబ్‌నగర్ 4) జైపూర్
44. రుతుపవన ఆరంభపు జల్లులకు ప్రాంతీయ నామం కానిది ఏది? (4)
1) కర్ణాటక- చెర్రీబ్లాసమ్స్
2) కేరళ లేదా మహారాష్ట్ర- మ్యాంగో షవర్స్
3) అసోం- నార్వెస్టర్స్ 4) బెంగాల్- తొండుబైశాఖీలు
45. చక్రవాత వర్షాల ద్వారా ఏ మహాసముద్రం కల్లోల సముద్రంగా మారుతుంది? (3)
1) హిందూ- పశ్చిమభాగం
2) పసిఫిక్- దక్షిణ భాగం
3) అట్లాంటిక్- ఉత్తరభాగం
4) అంటార్కిటిక్- ఉత్తరభాగం
46. కొరియాలిస్ ప్రభావాన్ని అనుసరించి చక్రవాతంలోని గాలులు. ఉత్తరార్ధగోళంలో కేంద్రకం వైపు అపసవ్యదిశలో కదులుతాయి. దక్షిణార్ధగోళంలో మాత్రం చక్రవాతంలో గాలులు దాని కేంద్రకం వైపు సవ్యదిశలో కదులుతాయి. భూమధ్య రేఖ ప్రాంతంలో కవోష్ణ/ఉష్ణ వాయు రాశిని, శీతల వాయు రాశులు ఢీకొట్టడం వల్ల చక్రవాతాలు ఏర్పడితే. దీనికి వ్యతిరేకంగా కర్కటకరేఖ/మకరరేఖ ప్రాంతా లు/సమశీతోష్ణ మండలాల్లో శీతల వాయు రాశిని ఉష్ణవాయు రాశి ఢీకొట్టడం వల్ల ఈ ఉత్పాతాలు సంభవిస్తాయి. ఉష్ణమండల చక్రవాతాలు వేసవికాలంలో సముద్రాలపై ఏర్పడితే, సమశీతోష్ణ మండల చక్రవాతాలు శీతాకాలంలో భూభాగాలపై సంభవిస్తాయి. చక్రవాతాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది? (2)
1) ఉష్ణమండల చక్రవాతాలకు ఎక్కువ వ్యాసార్థం, సమశీతోష్ణ మండల చక్రవాతాలకు తక్కువ వ్యాసార్థం
2) చక్రవాతానికి కేంద్రకంలో అధిక పీడనం ప్రతి చక్రవాతానికి కేంద్రకంలో అల్పపీడనం ఏర్పడాలి
3) ఇవి V ఆకారంలో ఉండొచ్చు. గరాటు ఆకారంలో, దీర్ఘవృత్తాకారంలో కూడా ఉండవచ్చు
4) చక్రవాతం/ప్రతి చక్రవాతపు కేంద్రకంలో ఆకాశం నిర్మలంగా ఉండాలి. ప్రశాంత వాతావరణం నెలకొని ఉండాలి.
47. ఇది ఒక ప్రతి చక్రవాతం? (1)
1) టోర్నడో 2) హరికేన్ 3) ట్రఫ్స్ 4) టైఫూన్స్
48. కింది ప్రాంతీయ పేర్లు- చక్రవాత జాబితాలో సరైనది కానిది ఏది? (3)
1) టైపూన్లు- చైనా, జపాన్, ఫిలిప్పైన్స్, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు
2) విల్లీవిల్లీలు- ఆస్ట్రేలియా, పసిఫిక్ తీరాలు
3) టోర్నడోలు- ఫ్లోరిడా, మెక్సికో, కరేబియన్ దీవులు
4) సైక్లోన్లు లేదా తుఫాన్లు- హిందూ మహాసముద్రం, అరేబియా, బంగాళాఖాతం
49. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, మిసిసిపి-మిస్సోరి నది పరివాహ ప్రాంతాల్లో ఏర్పడే చక్రవాతాలు గరాటు ఆకారంలో ఉంటాయి. వాటిని జల స్తంభాలు అని కూడా పిలుస్తారు. వాటి ఉపయోగం ఏమిటి? (1)
1) క్రీడలు
2) సినిమాలు
3) సెలవులు ఇవ్వడం
4) రాకెట్లు లేదా ఉపగ్రహాలు పంపడానికి సరైన సమయం
50. కొరియాలిస్ ప్రభావం లేదా పెరెల్స్ ప్రభావం భూమధ్యరేఖపై సున్నా ధృవాలవైపు వెళ్లేకొద్ది పెరుగుతాయి. దానివల్ల భూమధ్య రేఖ చుట్టు అధిక వర్షపాతం, ధృవాల వైపు పోతుంటే అల్ప వర్షపాతం కురుస్తుంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం వయలిలీ శిఖరం, భారత్‌లో మాసిన్రామ్. ప్రపంచ వార్షిక సగటు వర్షపాతం 975 మి.మీ., భూమి పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుంది. కాబట్టి వర్షాలు, గాలులు తూర్పు తీరాలను తాకుతాయి. దీంతో ఖండాల పశ్చిమ తీరాలు ఎడారులగా మారుతున్నాయి. ప్రపంచాన్ని మొత్తంగా తీసుకొని చూస్తే వర్షాలు ఏ కాలంలో అధికంగా కురుస్తున్నాయి? (3)
1) వర్షాకాలం
2) శీతాకాలం
3) ఎండాకాలం
4) విషవత్తులు, ఆయనాంతాల కాలంలో
53. ఉత్తర అమెరికా ఖండ భూభాగంలో లోతైన ప్రదేశం? (1)
1) మృతలోయ 2) అస్పాయ్ సరస్సు
3) వాల్టెస్ పెనిస్ 4) ఐరి సరస్సు
54. కింది సముద్రాలను వాటి వైశాల్యంలో అవరోహణ క్రమాన్ని గుర్తించండి. (2)
1) దక్షిణ చైనా, కరేబియన్, బేరింగ్, మెక్సికో
2) దక్షిణ చైనా, కరేబియన్, మధ్యధరా, బేరింగ్
3) దక్షిణ చైనా, బేరింగ్, కాస్పియన్, కరేబియన్
4) దక్షిణ చైనా, మధ్యధరా, బేరింగ్, కాస్పియన్
55. ఉత్తరార్ధగోళంలో భూభాగం, జల భాగం కంటే అధికం. దక్షిణార్ధగోళంలో జలభాగం అధికం. అయితే దక్షిణార్ధగోళంలో భూభాగ శాతం ఎంత? (2)
1) 21 2) 19 3) 17 4) 15
56. భాభాగం కన్నా జలభాగంపై 21/2 రెట్ల అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. సముద్రాల లోతును సోనార్ అనే ప్రతిధ్వని మాపనం ద్వారా కొలుస్తారు. లోతుకు ప్రమాణం పాథమ్. ఒక పాథమ్ = 1.8 మీ. పసిఫిక్‌లో అతిలోతైన ప్రదేశం మేరియానా ట్రెంట్. అట్లాంటిక్‌లో పోర్టోరికో, హిందూలో జావా ట్రెంట్ అతి లోతైనవి. మహాసముద్రాల సగటు లోతు? (3)
1) 9.6 కి.మీ. 2) 6 కి.మీ. 3) 3.8 కి.మీ. 4) 8.4 కి.మీ.
57. సముద్ర జలాల్లో కరిగి ఉన్న లవణాల పరిమాణాన్ని లవణీయత అంటారు. సగటు 35 గ్రా./1000 గ్రా. ప్రతి ఏడాది 3,30,000 ఘనపు కి.మీ. ప్రతి ఘనపు కి.మీ.కు 41 మిలియన్ టన్నుల లవణాలు ఉన్నాయి. ముఖ్యమైన లవణం సోడియం క్లోరైడ్. మూలకం-క్లోరిన్. అధిక లవణీయత మృత సముద్రం, అధిక శాతం ఎర్రసముద్రం, మరి ఉష్ణోగ్రత పెరిగితే లవణీయత ఏమవుతుంది? (1)
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) అక్కడి నుంచి నీటి శాతాన్ని బట్టి మారుతుంది
4) సముద్రంలో కలిసే నదుల సంఖ్యను బట్టి మారుతుంది
58. ఎబైసల్ మైదానం ఎక్కడ ఉంది? (3)
1) హవాయి దీవుల్లో టైడర్ వుడ్స్ కట్టుకున్న పోలో గ్రౌండ్
2) మాజిలాన్ జలసంధి, పనామా కలువ పసిపిక్, అట్లాంటిక్లను కలుపుతాయి. దానికి గుర్తుగా అమెరికా చంద్రునిపై నిర్మించిన బేస్ బాల్గ్రౌండ్
3) పసిఫిక్ సముద్రం అడుగున
4) అంగారక గ్రహం పైన
59. మెలనేషియా, మైక్రోనేషియా, పోలినేషియా అనేవి? (4)
1) పోలియో ఇంజక్షన్లు
2) అమెరికా రాష్ర్టాల్లో ఎబోలా వ్యాప్తిని అరికట్టే వ్యాక్సిన్లు
3) అగ్ని పర్వతాలు
4) దీవుల సముదాయాలు
60. పసిఫిక్‌తో సంబంధం లేనిది?
1) ఇండోనేషియా 2) ఫిలిప్పైన్స్
3) జపాన్ 4) కొరియా
61. రియూనియన్ దీవులు ఎక్కడుంటాయి? (3)
1) పసిపిక్- హవాయి దీవుల కింది భాగంలో
2) అట్లాంటిక్- బెర్ముడా ట్రయాంగిల్లో
3) హిందూ మహాసముద్రం
4) అంటార్కిటికా
62. టెలిగ్రాఫ్ పీఠభూమి అనేది? (3)
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాథ సముద్ర మైదానం
4) మహాసముద్రపు అగాథం
63. ఎల్‌నినో అనేది స్పానిష్ భాషా పదం. సముద్ర గర్భం నుంచి ప్రతి పదేండ్లకు ఒకసారి వేడినీరు పైకి ఉబికి రావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు సంభవిస్తాయి. అయితే ఎల్‌నినో పదానికి అర్థం? (3)
1) మాతృగర్భం 2) క్రీస్తు జననం
3) క్రీస్తు శిశువు 4) అకాల మృత్యువు
64. భూ పరివేష్టిత సముద్రం కానిది ఏది? (2)
1) మధ్యధరా సముద్రం 2) నల్ల సముద్రం
3) ఎర్రసముద్రం 4) బాల్టిక్ సముద్రం
65. ఉష్ణోగ్రతలు, సముద్ర లవణీయత- ధనాత్మక సంబంధం. వర్షపాతం, లవణీయత- రుణాత్మక సంబంధం కలిగి ఉంటాయి. సూర్యకిరణాలు 200 పాథమ్స్ వరకు వెళ్తాయి. కాబట్టి 200 పాథమ్ వరకు అధిక లవణీతయ అనంతర లోతుల్లో అల్ప లవణీయత ఉంటుంది. భూ మధ్య రేఖవద్ద అల్పంగా ఉంటుంది. ధృవాల వైపు వెళ్లేకొద్ది లవణీయత ఏమవుతుంది? (3)
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) ఆయన రేఖా ప్రాంతం వరకు పెరిగి తగ్గుతుంది
4) ఆయన రేఖా ప్రాంతం వరకు తగ్గుతూ వెళ్లి ఆ తర్వాత పెరుగుతుంది
66. భూమధ్యరేఖా ప్రవాహాలు, గల్ఫ్ స్ట్రీం, బ్రెజిల్ ప్రవాహం, ఎంటిలీస్, కురోషినో ప్రవాహాలు వేడినీటి ప్రవాహాలు. లాబ్రడార్, కానరి, బెంగ్యుల్లా, పాక్లాండ్, అంటార్కిటికా, అలస్కా, పెరు, కాంచెట్కా మొదలైనవి శీతల ప్రవాహాలు. భూమధ్యరేఖా ప్రాంతంలో జనించి ధృవాలవైపు కదులుతూ ఖండాల తూర్పు అంచుల్లో వర్షాలనిస్తాయి వేడి ప్రవాహాలు. ఇక శీతల ప్రవాహాలు ధృవాల వద్ద పుట్టి ఖండాల పశ్చిమ తీరాల నుంచి భూమధ్య రేఖవైపు కదులుతూ ఉంటాయి. వేడి ప్రవాహాలు అధిక వర్షాలనిస్తే, శీతల ప్రవాహాలు తక్కువ వర్షాలనిచ్చి పశ్చిమ తీరాల్లో ఎడారులను సృష్టిస్తున్నాయి. మరి నైరుతి రుతుపవనాలు ఏ గ్రూపులోకి వస్తాయి? (1)
1) వేడి 2) శీతల
3) వ్యాపార పవనాలు 4) సంవహన పవనాలు
67. సూర్య కిరణాలు ఎక్కడ ఎక్కువగా పరావర్తనం చెందుతాయి? (1)
1) సముద్రాలపై 2) మంచుకొండలపై
3) మేఘాలపై 4) దుమ్ముధూళిపై
68. ఉన్నత అక్షాంశాల్లో శీతాకాలంలో ఓడరేవులన్నీ గడ్డకట్టి నౌకాయానానికి పనికిరావు. కానీ పశ్చిమ యూరప్ దేశాల నౌకాశ్రయాలు ఏడాది పొడవునా నిరంతరం పనిచేస్తూ ఆ దేశాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో అన్నింటికన్నా ముందుంటాయి ఎందుకు? (2)
1) లాబ్రడార్ 2) గల్ఫ్‌స్ట్రీమ్ 3) బ్రెజిల్ 4) ఎంటలీస్
69. నార్త్ అట్లాంటిక్‌లో పడవ ప్రమాదాలు అధికమెందుకు?(3)
1) గ్రీన్‌ల్యాండ్ తీరంలో ఐస్‌బర్గ్‌ల పుట్టుక
2) కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఐస్
3) గల్ఫ్‌స్ట్రీమ్, లాబ్రడార్ల కలయిక
4) మిడ్ అట్లాంటిక్ ఓషియన్ రిడ్జ్ వల్ల
70. కల్లోల సముద్రం లేదా హేరింగ్ అనదగిన అట్లాంటిక్ మధ్యభాగంలో బుద్ధుడి యోగముద్రలా ప్రశాంతంగా ఉండేది?(2)
1) సాన్ జువాన్ 2) సార్గోసా 3) అజోరస్ 4) మడీరా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు