తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు?
-తెలంగాణ బిల్లుపై జనవరి 10న అసెంబ్లీలో ఈటల రాజేందర్ ప్రసంగించారు. జనవరి 30న ఘర్షణల మధ్య మూజువాణి ఓటు నిర్వహించారు.
-ఫిబ్రవరి 19న కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా, ఫిబ్రవరి 28 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రపతి పాలన విధింపు.
-ఫిబ్రవరి 14న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. లగడపాటి సభలో పెప్పర్ స్ప్రేతో దాడిచేశాడు.
-ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది.
-మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు. 2న గెజిట్‌లో పొందుపర్చారు. 4న జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినంగా ప్రకటించారు.
ఏపీఆర్బీ- 2014
-12 విభాగాలు. ప్రవేశిక, ఏపీ పునర్వ్యవస్థీకరణ, శాసనసభలో ప్రాతినిధ్యం, వ్యయానికి, అధికారం-పంపిణీ, ఆస్తులు-అప్పులు, కార్పొరేషన్ల నియమాలు, అఖిల భారత సర్వీసులు, జలవనరులు, మౌలిక వనరులు, విద్య, న్యాయసంబంధ నియమాలు.
ప్రవేశిక విభాగం-2
-పది జిల్లాలు, పదేండ్లు హైదరాబాద్ ఉమ్మడిరాజధాని, గవర్నర్‌కు విచక్షణాధికారాలు, జిల్లాల మార్పునకు స్వేచ్ఛ.
విభాగం-3
-రాజ్యసభ స్థానాలు తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్‌కు 11. లోక్‌సభ స్థానాలు తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 25. తెలంగాణకు 119, ఏపీకి 175 ఎమ్మెల్యే సీట్లు.
-శాసనమండలి సభ్యులు తెలంగాణకు 40, ఆంధ్రకు 50.
-రాబోయే కాలంలో ఎమ్మెల్యేల సంఖ్య తెలంగాణ 119 నుంచి 153కు, ఏపీ 175 నుంచి 225కు పెంచుకోవచ్చు.
విభాగం-4
-కొత్త రాజధాని ఏర్పడేవరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్.
విభాగం-5
-సంచిత నిధి, ఆస్తి-అప్పులు జనాభా ప్రాతిపదికన. వివాదాలు, సంప్రదింపులు వీలుకాకపోతే సీఏజీ/కేంద్రాన్ని సంప్రదించాలి.
విభాగం-6
లాభ-నష్టాల పంపకం
-భూమి, స్థిరాస్తులు, వస్తువులు, నోట్లు, నాణేలు బదిలీ అయిన ప్రదేశంలో ఉంటే తెలంగాణవి. ఇతర సందర్భాల్లో ఏపీవి.
-సరిహద్దు అవతల ఏమున్నా జనాభా ప్రాతిపదికన పంపకం. సచివాలయం, నిధులు, నిల్వలు, అప్పులు జనాభా ప్రాతిపదికన పంపకం.
విభాగం-7
-స్టేటస్ కో- ఆర్టీసీ, విద్యుత్, పన్నుల కోసం కొత్త నిబంధనలు. ఏడాదిలోపు ఏదైనా సంస్థను కేంద్రం 10వ షెడ్యూల్లో చేర్చవచ్చు.
విభాగం-8
-స్థానిక/జిల్లా/జోనల్/మల్టీ జోనల్ క్యాడర్ అలానే ఉంటుంది.
-ఏపీఎస్సీ ఏపీకి. తెలంగాణకు కొత్తగా టీఎస్పీఎస్సీ.
విభాగం-9
-కృష్ణా-గోదావరి జలాల యాజమాన్యానికి అపెక్స్ కౌన్సిల్- జలవనరుల మంత్రి, ఇద్దరు సీఎంలు సభ్యులు. కేడబ్ల్యూఓటీ కిందికి రాని అంశాల చర్చ.
-గోదావరి బోర్డు ప్రధాన కార్యాలయం- తెలంగాణలో, కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం ఏపీలో ఉండాలి.
-ఎగువ గట్టు, దిగువ గట్టు కాలువల పర్యవేక్షణ కోసం తుంగభద్ర బోర్డు.
-ప్రతికూల ప్రభావం లేనంతవరకు అనుమతులు, తక్కువ నీటి ప్రవాహాల సమయంలో ఆపరేషనల్ ప్రొటోకాల్ పాటించాలి.
విభాగం-10
-బొగ్గు, నూనె, సహజవాయువు, విద్యుచ్ఛక్తి పంపిణీ-సరఫరాకు కేంద్రం మార్గదర్శకాలు.
విభాగం-11
-371 డి ప్రకారం విద్య విషయంలో పదేండ్లు యథాతథస్థితి.
విభాగం-12
-168/161 (1) (ఎ) – టీఎన్, టీఎస్.
-ఉమ్మడి రాజధానిలో తప్ప మిగతా కేసులన్నీ ఆయా రాష్ర్టాలకు బదిలీ. ఎల్ఆర్ స్టేటస్ కో ఉన్న చట్టాల్లో మార్పులు రెండేళ్లలోపు న్యాయవాదులకు స్వేచ్ఛ.
-ఏదైనా ఇబ్బంది తలెత్తితే రాష్ట్రపతి జోక్యం 3 ఏళ్లలోపు మాత్రమే, 3 ఏళ్ల తరువాత ఎవరూ జోక్యం చేసుకోరాదు.
కొన్ని వివాదాస్పద అంశాలు
-7 మండలాల బదలాయింపు.
-300 కి.మీ. దూరంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడం ఆంధ్రాప్రజలను శిక్షించడమే.
-జల వివాదాలకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు 1956 చట్టానికి విరుద్ధం.
ప్రతిభకు పరీక్ష
1. దేశంలోని మధ్యయుగ పాలకుల్లో మొదటిసారి వ్యవసాయ శాఖను ప్రారంభించినవారు ఎవరు?
1.మహ్మద్ బిన్ తుగ్లక్ 2. అల్లా ఉద్దీన్ ఖిల్జీ
3. బాబర్ 4. షేర్‌ఖాన్
2. శత్రియ నృత్యం ఏ రాష్ర్టానికి చెందినది?
1. కేరళ 2.గోవా 3. రాజస్థాన్ 4.అసోం
3. దేశంలోని అటవీ సంపదలో అత్యంత ముఖ్యమైనది?
1. గంధపు చెక్కలు 2. ఎర్రచందనం
3. వంటచెరకు 4. రబ్బర్
4. 2016 ఫిబ్రవరి 13 నాటికి 100 ఏండ్లు పూర్తిచేసుకొన్న భారతీయ విశ్వవిద్యాలయం ఏది?
1. బనారస్ హిందు విశ్వవిద్యాలయం
2. నలంద విశ్వవిద్యాలయం
3. ఢిల్లీ విశ్వవిద్యాలయం
4. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం
5. దేశంలో నలుపు విప్లవం దేనికి సంబంధించినది?
1. కర్రబొగ్గు 2. ముడి పెట్రోలియం
3. వజ్రాలు 4. బ్లాక్‌గ్రామ్
6. ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
1. న్యూఢిల్లీ 2. వాషింగ్టన్ 3. చికాగో 4 కాన్బెర్రా
7. దేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న ప్రాంతం?
1. మధుర 2. మీరట్
3. రాణిగంజ్ 4. రాజ్‌కోట్
8. భారతదేశ క్రికెట్జట్టు మొదటి కెప్టెన్ ఎవరు?
1. సీకే నాయుడు
2. కపిల్‌దేవ్
3. బిషన్‌సింగ్ బేడీ
4. మొహిందర్ అమర్నాథ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు