దేశంలో ఆర్థిక సంస్కరణలు
ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కోవటం, నివారించటం సంస్కరణ ప్రథమ కర్తవ్యం. సంస్కరణలు రోగ నివారణుల వంటివి. రోగం రాకుండా జాగ్రత్త పడొచ్చు. వచ్చిన తర్వాత తగిన మందుల ద్వారా దశల వారీగా నయం చేయవచ్చు. కానీ ప్రోటోకాల్ పాటించకుండా సడన్ అండ్ షాక్ ట్రీట్మెంట్ మంచిదికాదు. దానివల్ల రోగం నయంకాదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ పుట్టుకొస్తాయి.
-ఆర్థిక వ్యవస్థలు మూడు రకాలు 1) పెట్టుబడిదారీ విధానం 2) సామ్యవాద వ్యవస్థ 3) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ.
-మనకు ఈజీగా అర్థం కావడానికి ఆర్థిక వ్యవస్థను ఒక చెరువుతో పోల్చి, దాని కింద ఓ వందమంది రైతులు పొలం పండిస్తున్నారనుకుందాం.
-చెరువు కట్టకు ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ గండి కొట్టుకొని కాలువ తవ్వుకుని నీళ్లను వాడుకుంటూ వ్యవసాయం చేస్తే అది పెట్టుబడిదారీ వ్యవస్థ. చెరువు కట్టకు ఎవరూ కావలి ఉండరు. నీటిపై పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రైతుల కు నీళ్లు కావాలి, లాభం కావాలి అంతే. ఎవరేమైనా పట్టించుకోరు.
-ఇక సామ్యవాదం అంటే ఒకే పెద్ద కాలువ. దానిపై ప్రభుత్వం కాపలా. ఎవరూ ఏ పంట వేయాలి. నీళ్లను అందరూ ఎలా సమానంగా పంచుకోవాలి అనేది ప్రభుత్వం ముందుండి నడిపిస్తుంది.
-మిశ్రమ వ్యవస్థలో చెరువుకు నాలుగు వైపులా నాలుగు కాలువలు, కాపలాగా ప్రభుత్వం. ఎవరు ఏ పంటనైనా వేసుకోవచ్చు. నీళ్లు మాత్రం అందరికీ దక్కాలి.
-సంక్షోభాలకు నెలవు : పెట్టుబడిదారీ వ్యవస్థను మార్కెట్ శక్తులకు వదిలివేయటం, ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో వనరుల వినియోగం సక్రమంగా లేక వర్తకం, వాణిజ్యం, ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయిలు ఈ దేశాల్లో ఎప్పుడైనా ఉన్నతస్థాయిని చేరవచ్చు. అంతేవేగంగా అథమస్థాయికి పడిపోయి సంక్షోభాలకు నెలవు అవుతున్నాయి. ఉన్నత, అథమస్థాయి కదలికలను వ్యాపార చక్రాలు అంటారు.
వ్యాపార చక్రాలు
-Peak = ఉన్నతస్థాయి, Trough = అథమస్థాయి, RC = రికవరి, PR = ప్రాపర్టీ, RS = రెసిషన్, DIP = డిప్రెషన్ = ఆర్థికమాంద్యం.
-జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త, పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుంటే సంక్షోభాలు పుట్టవచ్చని హెచ్చరికలు చేసిన నేపథ్యంలోనే ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం కూడా తోడవటంతో పెట్టుబడిదారీ వ్యవస్థలను నడిపే నాయకులు కళ్లు తెరిచారు.
-కీన్స్ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఎలాగో లా గండం నుంచి బయటపడ్డారు. 1970ల నాటికి మార్కెట్ శక్తులు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
– అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్‌లు వ్యవస్థల ప్రక్షాళన మొదలుపెట్టారు. వారు చేపట్టిన సంస్కరణల నుంచి పుట్టినవే ఎల్పీజీ మోడల్.
– వ్యాపార చక్రాలను వేరే దేశాలకు బదిలీ చేయాలి. నష్టం అందరిదీ కానీ ఎక్కడ లాభం పుట్టినా అందులో మాకు వాటా ఉందనే కొత్త విధానానికి తెరలేపారు. ఇది శాశ్వతం కాకపోవచ్చు.
సంస్కరణలకు ముందు..
– స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థకు కనీస అవసరాలు కూడా అందుబాటులో లేని దుర్భిక్ష పరిస్థితి దాపురించింది.
– చెల్లాచెదురైన వ్యవస్థను ప్రభుత్వం మాత్రమే చక్కది ద్దగలదని గట్టిగా నమ్మిన నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు సృష్టించి ఒక్కో రంగాన్ని క్రమంగా అభివృద్ధి చేస్తూ దేశాన్ని ముందుకు నడిపించారు.
– వ్యవసాయం, నీటి పారుదల, భారీ పరిశ్రమలు స్థాపించి పేదరికం, నిరుద్యోగం తగ్గించవచ్చని నెహ్రూ నిరూపించారు. ఆయన అనంతరం 1970ల వరకు కూడా అది కొనసాగింది. అన్నిరంగాలు ప్రగతి పథం వైపు నడిచాయి.
– ఆదేశిక సూత్రాలు సామ్యవాద విధానానికి, ప్రాథమిక హక్కులు పెట్టుబడిదారీ విధానానికి ప్రతీకలు.
– నెహ్రూ ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేశారు. ఒకవైపు పెట్టుబడిదారీ వ్యవస్థను అనుసరించేవారి ఒంటెత్తు పోకడలను నిరోధిస్తూ, ప్రభుత్వ ఆధిక్యతను, అజమాయిషీని కాపాడుకుం టూ మరోవైపు ప్రజాసంక్షేమం కోసం పరిమిత స్థాయిలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.
– ఒకవైపు కేంద్రీకృత ప్రణాళికలు, రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు, మరోవైపు 1948, 1956, పారిశ్రామిక విధానాలు, లైసెన్సింగ్, జాతీయీకరణ, భూ సం స్కరణలు, MRTP మొదలైన విధానాలు దేశాన్ని ప్రజా స్వామ్యయుత సామ్యవాదంవైపు నడిపించాయి.
– 1980ల నాటికి పరిస్థితులు అదుపు తప్పాయి. అభివృద్ధి కుంటుపడింది. PSUలు నష్టాల బాట పట్టాయి. ద్రవ్యలోటు అధికమైంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగసాగాయి. ఉత్పాదకత పూర్తిగా అడుగంటింది.
– IMF, IBRDలు థాచరిజం, రీగనిజంపై ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా దేశాలను ప్రయోగశాలగా వాడుకొని దెబ్బతిన్నాయి.
– IMF, IBRDలు చెప్పినట్టు సబ్సిడీల్లో కోతలు, పన్నుల పెంపుదల, ప్రభుత్వ వ్యయ నియంత్రణ లాంటివి కాకుండా దీర్ఘకాలిక నిర్మితీయ సర్దుబాట్లు చేసుకుంటూ వాటికి మానవీయ కోణాన్ని జోడించాలని యూనిసెఫ్ చేసిన సిఫారసు బాగా నచ్చి కొన్ని ప్రాథమిక సంస్కరణలు మొదలు పెట్టారు అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ.
– ప్రైవేటీకరణ ద్వారా ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించడం/సమకూర్చుకోవడం. అందుకే రాజీవ్‌గాంధీ ఐటీ పిత.
– ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ కోసం SICA చట్టం-1985 తెచ్చారు.
– ఎంఎన్సీ, ఎఫ్‌డీఐల ఆకర్షణకు నూతన విదేశీ వ్యాపార విధానం.
– ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు లైసెన్సింగ్ విధానం సరళీకరణ.
– ఈ చర్యలు సత్ఫలితాలివ్వలేదు.
– 1990ల నాటికి రాజకీయ, ఆర్థిక, సంక్షోభాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
నూతన ఆర్థిక సంస్కరణలు రెండు విభాగాలు
– స్వల్పకాలిక – స్థిరీకరణ చర్యలు (డిమాండ్ వైపు)
– దీర్ఘకాలిక – నిర్మితీయ/వ్యవస్థాగత సర్దుబాట్లు (సప్లయ్ వైపు)
– త్వరగా ఫలితాలు రాబట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం స్వల్పకాలిక చర్యలు తీసుకోవడమైంది.
ద్రవ్య విధానం
-ఎస్ఎల్ఆర్-సీఆర్ఆర్/ బ్యాంకురేట్లు పెంచి ద్రవ్య సప్లయ్‌ని నియంత్రించి ద్రవ్యోల్బణం తగ్గించుడం
– ఆర్బీఐకి మరింత స్వతంత్ర ప్రతిపత్తి
– న్యూనీకరణ (22 శాతం)
– రూపాయి పాక్షిక మార్పిడి
కోశ విధానం – సర్దుబాట్లు
– కోశలోటు తగ్గించేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం – 2003
– పన్ను రాబడి పెంచేందుకు రాజా చెల్లయ్య కమిటీ -1991
– పన్నేయేతర రాబడి పెంచుకునేందుకు విద్యుత్, రోడ్లు, నీటి పారుదల మొదలైన వాటిపై యూజర్ చార్జీల విధింపు.
-ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకొనేందుకు గీతాకృష్ణన్ కమిటీ – 2000
BOPలో సర్దుబాటు
– రూపాయి మూల్యన్యూనీకరణ
– ఎల్ఈఆర్ఎంఎస్ – 1992-93 (Liberalised Exchange Rate….. Management System)
ధరల విధానం
– సబ్సిడీలు తగ్గించారు.
– ధరలు ప్రభుత్వం నిర్ణయించడం కాక ఓపెన్ మార్కెట్‌కు వదిలిపెట్టారు.
– పన్ను రాబడి మించి, ఖర్చులు తగ్గించుకుని లోటును పూడ్చటానికి ధరల యంత్రాంగాన్ని వాడుకున్నారు.
సామాజిక రంగ విధానం
– విద్య, ఆరోగ్యం, బీమా, నీరు, విద్యుత్, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు
నిర్మితీయ సర్దుబాట్లు
– ఈ విధానం లక్ష్యం ఎల్పీజీ అమలు
– Liberalisation – సరళీకరణ విధానాలు
– Privatisation – ప్రభుత్వం తన పాత్ర తగ్గించుకోవడం
– Globalisation = ప్రపంచీకరణ
– వ్యవస్థను ప్రపంచంతో అనుసంధానం చేయడం
– ఇవి రెండు దశలుగా అమలుచేయుట
– మొదటితరం సంస్కరణలు
– రెండోతరం సంస్కరణలు
మొదటితరం సంస్కరణలు
– నూతన పారిశ్రామిక విధానం
– విదేశీ వ్యాపార విధానం
– బ్యాంకింగ్ సంస్కరణలు
– పన్ను సంస్కరణలు
– మూలధన మార్కెట్ సంస్కరణలు
– ఇన్సూరెన్స్ విధానం
– విదేశీ మారక సంస్కరణలు
– మూల్యన్యూనీకరణ
– రూపాయి మార్పిడి మొదలైనవి.
విదేశీ వ్యాపార విధానం
– మరింత సరళీకృతం
– నేరుగా దిగుమతులు
– భారీగా సుంకాల తగ్గింపు
– 10 శాతం బ్యాంకు పరపతి నిబంధన
– దిగుమతి ప్రత్యామ్నాయాలకు ప్రోత్సాహకాలు
– విదేశీ మారక ద్రవ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసుకునే అవకాశం
బ్యాంకింగ్ సంస్కరణలు
– నరసింహం కమిటీ అనేక సిఫారసులు చేసింది.
– ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాకులకు అనుమతి
– వడ్డీరేటు మార్కుటుకు వదిలివేయడం
– ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ల తగ్గింపు
– బ్రాంచీల స్థాపనకు లైసెన్సింగ్ రద్దు
ఆర్థిక సంక్షోభం – కారణాలు
– రాజకీయ అస్థిరత్వం
– సంకీర్ణ ప్రభుత్వాలు – ఐక్యత లేమి
– నిర్లక్ష్య పూరిత ఆర్థిక నిర్వహణ
– ఓట్ల కోసం ప్రజాకర్షక పథకాలు
– అప్పులు
– ఆదాయానికి మించి ఖర్చులు
– ద్రవ్యలోటు విదేశీ – వ్యాపార చెల్లింపుల శేషం రుణాత్మకం
– ఎగుమతుల తగ్గుదల
– జాతీయాదాయం అంతా వడ్డీకి, అప్పులు దిగుమతి చెల్లింపులకే సరిపోయేది
– బ్లాక్ మార్కెటింగ్ – ద్రవ్యోల్బణం
– గల్ఫ్ సంక్షోభం – చమురు ధరలు పెరగడం
– స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పరపతి రేటింగ్ ఊహించని విధంగా పడిపోయింది.
– సంక్షోభాలు తట్టుకునే వ్యవస్థను కోల్పోవటం.
– ఉద్యోగులకు జీతాలు, వడ్డీ చెల్లింపులు సమయానికి చెల్లించలేని పరిస్థితికి వ్యవస్థ చేరింది.
– ఎన్ఆర్ఐ డిపాజిట్లు, ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా పోవటం.
– రెవెన్యూ లోటు – 3.3 శాతం (జీడీపీలో)
– కోశలోటు – 7.8 శాతం
– రుణాలు – 5.0 శాతం
వడ్డీలు
– 22 శాతం మొత్తం ఖర్చులో
– 3.8 శాతం జీడీపీలో
– 39 శాతం ఆదాయంలో
– విదేశీ రుణం – 23 శాతం జీడీపీలోకరెంటు ఖాతాలోటు
(BOP) – (9.7 యూఎస్ డాలర్లు 3.69 శాతం of GDP
ద్రవ్యోల్బణం – (WPI – 10.3 శాతం CPI – 11.2 శాతం
1991 ఆగస్టులో ఇది 17 శాతం
– ఆర్థిక వ్యవస్థ Default స్థాయికి కూరుకుపోతున్న తరుణంలో రావ్+సింగ్ ఫార్ములా పట్టాలెక్కింది.
భారత నూతన పారిశ్రామిక విధానం
– లైసెన్సింగ్ విధానాలు రద్దు
– విదేశీ పెట్టుబడిపై నియంత్రణ
– ఎంఆర్టీపీ – చట్టం సమూల మార్పులు
– ప్రభుత్వరంగ పరిశ్రమల కుదింపు
– పీఎస్‌యూల్లో వాటాలు విక్రయించడం.
– ఎస్ఐసీఏ-1985 (Sick Industries COmpanies Act.) ప్రకారం బీఐఎఫ్ఆర్-1987 (Board of Industrial Finance and Reconstruction) ఏర్పాటు.
– పీఎస్‌యూ/పీఎస్‌ఈల తీరుతెన్నులు ఈ బోర్డుకు సమర్పిస్తారు. దాని సూచన ప్రకారం పటిష్టపర్చడం లేదా మూసివేయడం చేస్తారు.
– దీన్ని ఎగ్జిట్ విధానం అంటారు. ఇప్పటివరకు 52 పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికుల/ఉద్యోగుల భద్రత, నష్టపరిహారం చెల్లింపు కొరకు పునర్ నిర్మాణ నిధి ఏర్పాటు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు