భిన్నత్వంలో ఏకత్వ భారతీయం
భారతదేశానికి సుమారు 5 వేల ఏండ్లకుపైగా చరిత్ర ఉంది. వివిధ మతాలు, వివిధ జాతులు, కులాలు, సంస్కృతులు మిళితమైన సమాజం మనది. మరో విశిష్ట లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికే సొంతం. ఇతర సమాజాల మాదిరిగా కాకుండా భారతీయ సమాజం సజాతీయ లక్షణాలు కలిగినది కాకుండా ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉంది. అత్యధిక జనాభాలో ప్రపంచంలోనే రెండోస్థానం ఆక్రమించింది. భారతదేశం సువిశాలమైన వివిధ విభిన్న పరిస్థితులను కలిగి ఉంది. ఆ వైవిధ్యమైన లక్షణాలు పరిశీలిద్దాం.
1. భౌగోళిక వైవిధ్యం : ఉత్తరాన హిమాలయాలు మొదలుకొని దక్షిణాన కన్యాకుమారి, తూర్పున ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ నుంచి పశ్చిమాన గుజరాత్ వరకు తీసుకుంటే భౌగోళిక లక్షణాలే కాకుండా వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. దేశంలో హిమాలయాలు, గంగా సింధూమైదానం, పీఠభూములు, పర్వతాలు, తీరమైదానాలను కలిగి విభిన్న అంశాలతో ముడిపడి ఉంది.
2. గ్రామీణ జీవనాధారం : ఇప్పటికీ 67శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. గ్రామీణంలో చాలా మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడి లేదా వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్నారు. అలాగే సంప్రదాయ వృత్తులను నమ్ముకొని జీవించేవారు ఇంకా చాలామంది ఉన్నారు. భారత గ్రామీణంలో ప్రధానంగా వృత్తికి, కులానికి మధ్య సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
3. కుల వ్యవస్థ : భారతీయ సమాజానికి విలక్షణమైన ప్రత్యేకత కులవ్యవస్థ. ఆచారాలు, సంప్రదాయాలు, జీవనవిధానం, ఆహార అలవాట్లు కులవ్యవస్థతో ముడిపడి ఉన్నవే. దేశ ప్రజలంతా కలిసే జీవిస్తున్నా, కులాలను క్రమానుగతంగా అమర్చి వృత్తి, ఆచారాలు, సంస్కృతిపరంగా, సామాజికంగా వే రు చేశారు. కాగా ఆధునిక పోకడల ఫలితంగా సంప్రదాయ భారత కులవ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.
4. మత వ్యవస్థ : భారత సమాజంలో వివిధ మతాల వారు జీవిస్తున్నారు. ఇందులో ప్రధానమైనవి హిందూ, ఇస్లాం, బౌ ద్ధం, జైనం, క్రైస్తవం, సిక్కు, పార్శీ తదితర మతాలు ఉన్నా యి. ఈ మతాల ప్రజలంతా భారతీయ సమాజంలో సమ్మిళితమైన, వినూత్నమైన భారతీయ సాంస్కృతిక ఆవిర్భావానికి దోహదం చేశారు. వేటికి అవే మత సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ భిన్నత్వంలో ఏకత్వ లక్షణాన్ని అనునిత్యం అనుసరిస్తూనే ఉన్నాయి.
5. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ : భారతీయ సమాజంలో మరో విలక్షణ అంశం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇది గ్రామీణ ప్రాంతా ల్లో ఎక్కువగా కన్పిస్తుంది. రెండు, మూడు తరాలకు చెంది న కుటుంబంలోని వ్యక్తులు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. ఆస్తిని కూడా సమష్టిగా కలిగి ఉన్న కుటుంబాన్ని సమష్టి కుటుంబ వ్యవస్థగా పేర్కొన్నారు. కాగా ఆధునిక కాలంలో ప్రపంచీకరణ నేపథ్యంలో నగరీకరణ, పారిశ్రామికీకరణ చెందగా విద్యా వ్యాప్తి, జీవనోపాధి కోసం ప్రజలు వలస వెళ్తుండడంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతూ వస్తున్నది.
6. భాషా పరమైన వర్గీకరణ : దేశంలో ప్రస్తుతం సుమారు 1652 భాషలు వాడుకలో ఉన్నట్లు సమాజ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలను 5 సమూహాలు గా వర్గీకరించారు. వీటిని జాతి సమూహాల్లాగానే భాషా సమూహాలుగా కూడా విభజించారు. అవి..
1) ఆస్ట్రిక్ భాషా సమూహం
2మధ్య భారత్‌లోని గిరిజన తెగలు మాట్లాడే భాషలు ఈ సమూహం కిందికి వస్తాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో ని సంతాల్, జార్ఖండ్‌లోని ముండాలు, బీహార్‌లోని హో తెగతో పాటు ఇతర తెగలు ఉన్నాయి.
-ఇండో -ఆర్యన్ భాషా సమూహం
-దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషలకు చెందిన వారు ఈ సమూహం కిందకు వస్తారు. ఉదాహరణకు హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, బీహారీ, రాజస్థానీ, అస్సామీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, కాశ్మీరీ తదితర భాషలు. సుమారుగా మూడింట రెండొంతుల మంది ప్రజలు ఈ భాషా సమూహం కిందకే వస్తారు.
3) ద్రవిడియన్ భాషా సమూహం
-దక్షిణాది రాష్ర్టాల్లో తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలు మాట్లాడే ప్రజలు దీని కిందకు వస్తారు.
4) సైనో టిబెటన్ భాషా సమూహం
-ఈశాన్య రాష్ర్టాల్లో ఖాసా, నాగా, ఖాసీ, మిజో తదితర భాష లు మాట్లాడే తెగల ప్రజలు ఈ సమూహం కిందకు వస్తారు.
5) ఇండో – యూరోపియన్ భాషా సమూహం
-మనదేశంలో చాలామంది బ్రిటిష్, పోర్చుగీసు, ఫ్రెంచి భాషలను మాట్లాడే ప్రజలు ఉన్నారు. వారంతా ఈ భాషా సమూహం కిందకు వస్తారు.
భారత సామాజిక శాస్త్రవేత్తలు :
1. జీఎస్ ఘుర్యే
12 డిసెంబర్, 1893లో మహారాష్ట్రలోని మాలవాన్లో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
ఇతను భారత్‌లో సంక్లిష్ట అంశాలైన భారతీయ సమాజం, సంస్కృతిని అధ్యయనం చేశారు.
గ్రామీణ, నగర, సముదాయాలను పరిశోధించారు.
1930లో బొంబాయి నగరంలోని మధ్యతరగతి ప్రజల్లో శారీరక సంబంధాలపై సర్వే చేయగా, ఆ ఫలితాలు 1938 లో ప్రచురితమయ్యాయి.
ఇతని కృషితో బొంబాయి యూనివర్సిటీలో సమాజ శాస్త్రశాఖ ఏర్పాటైంది. 1924లో సమాజశాస్త్రశాఖకు అధిపతిగా నియమితులయ్యారు.
సమాజ శాస్త్రంలో ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా భారతీయ సమాజశాస్త్ర పితామహుడిగా పేర్కొన్నారు.
ఇండియన్ సోషియాలజికల్ను స్థాపించి, దీని పరిశోధక జర్నల్ను సోషియాలజికల్ బులెటిన్‌ను ప్రచురించారు.
ఇతని రచనలు : క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, ది అబోరిజన్స్- సోకాల్డ్ అండ్ దెయిర్ ఫ్యూచర్, సోషియల్ టెన్షన్స్ ఇన్ ఇండియా, ఇండియా రిక్రూమేట్స్ డెమోక్రసీ.
తన రచనల్లో కులం సనాతన సమాజానికి చెందినదని, ఇది దానంతట అదే అదృశ్యమవుతుంది అనే భావనను వ్యక్తం చేశారు.
దేశంలో రెండోతరం సమాజ శాస్త్రవేత్తలైన ఎంఎన్ శ్రీనివాస్, ఐరావతి కార్వే, కేపీ దేశాయి, ఎంసీ కులకర్ణి, కేపీ మర్చెంట్, ఎంఏ శర్మ, ఏఆర్ దేశాయి తదితర సామాజిక శాస్త్రవేత్తలను తయారు చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
2. డి.పి ముఖర్జీ
5 అక్టోబర్,1894లో బెంగాల్లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.
-భారతదేశ వ్యవస్థాపిక సమాజ శాస్త్రవేత్తల్లో ఒకరు.
-సామాజిక తత్వవేత్తగా ప్రసిద్ధి చెందారు.
-భారతీయ సంప్రదాయాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించి అర్థం చేయుటను పరిశోధించారు.
-ఎక్కువగా ఇతను మార్క్సిజంపై శ్రద్ధ కలిగి ఉండి, మార్క్సి జం మానవ సమాజ అభివృద్ధిలో ఉన్నతదశను ఇస్తుందని అధ్యయనం చేశారు.
-ఇతని రచనలు : మోడ్రన్ ఇండియన్ కల్చర్ (ఎ సోషియాలాజికల్ స్టడీ), మాన్ ఇండియన్ హిస్టరీ(ఎ స్టడీ ఇన్ మెథ డ్), డైవర్సిటీస్, టాగోర్ (ఎస్టడీ), ఇంట్రడక్షన్ టు మ్యూజిక్, బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ యూ త్.
-భారతీయ సమాజశాస్త్రవేత్త విధి ఏమిటంటే భారతీయ సంప్రదాయాలను అధ్యయనం చేయడం. ఆర్థిక అంశాల కారణంగా భారతీయ సంప్రదాయాల్లో వచ్చిన పరివర్తనను కూడా తెలుసుకోవడం అని పేర్కొన్నారు.
ప్రతిభకు పరీక్ష
1. ఏ భారత సైనిక దళం ఆపరేషన్ మేఘ ప్రహార్ యుద్ధ విన్యాసాలను చేపట్టింది?
1) ఇండియన్ ఆర్మీ 2) ఇండియన్ ఏయిర్ ఫోర్స్
3) ఇండియన్ నేవీ 4) ఇండియన్ కోస్టల్ గార్డ్
2. తులుని ఫెస్టివల్ – 2016ని ఏ రాష్ట్రం నిర్వహించింది?
1) నాగాలాండ్ 2) జమ్ముకశ్మీర్
3) అరుణాచల్ ప్రదేశ్ 4) సిక్కిం
3. ఏ భారతీయ కార్పొరేట్ బ్యాంక్ మొదటిసారిగా మసాలా బాండ్ ను లండన్ స్టాక్ ఎక్చేంజ్‌లో ప్రారంభించింది?
1) యస్ బ్యాంక్ 2) హెచ్డీఎఫ్సీ
3) ఐసీఐసీఐ 4) యాక్సిస్‌బ్యాంక్
4. కాలాఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ నగరానికి సంబంధించినది?
1) మైసూర్ 2) కొచ్చి 3) ముంబై 4) ఢిల్లీ
5. సోకోట్రా ద్వీపం కింది ఏ దేశంలో ఒక భాగంగా ఉంది?
1) ఒమన్ 2) యూఏఈ
3) సౌదీ అరేబియా 4) యెమెన్
6. మహ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ ఎవరికి జీవితకాల సభ్యత్వం కల్పించినది?
1) రాహుల్‌ద్రావిడ్ 2) అమితాబ్ బచ్చన్
3) అమీర్‌ఖాన్ 4) సచిన్ టెండూల్కర్
7. కింది ఏ కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య గరిష్టంగా ఉంది?
1) బాంబే హైకోర్టు 2) అలహాబాద్ హైకోర్టు
3) కలకత్తా హైకోర్టు 4) ఢిల్లీ హైకోర్టు
8. బ్రిటిష్ పాలన కాలంలో దేశంలో అనుబంధ కూటమి వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు?
1) లార్డ్ కానింగ్ 2) లార్డ్ వెస్లి
3) రాబర్ట్ క్లైవ్ 4) కన్నింగ్‌హామ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు