షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే టెట్
# ట్విట్టర్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి
# జూన్ 6 నుంచి హాల్‌టికెట్ల డౌన్ లోడింగ్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (టెట్) షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జూన్ 12న ఆర్ఆర్బీ కూడా ఉన్నందున టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ పవన్‌కుమార్ అనే అభ్యర్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తిచేశారు. ఇదే అంశంపై మంత్రి సబితాఇంద్రారెడ్డికి రీట్వీట్ చేసిన కేటీఆర్ ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
దీనిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి.. ఈ అంశంపై తాను అధికారులతో మాట్లాడానని, వాయిదా వేయలేమని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సారి టెట్‌కు 3.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేశామని, ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని పేర్కొన్నారు. టెట్ హాల్‌టికెట్లను జూన్ ఆరు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. టెట్ పేపర్-1కు 1,480, పేపర్-2కు 1,171 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు