కార్నియా గోళాకారంలో లేనపుడు సంభవించే లోపం? (టెట్ ప్రత్యేకం)
# బరువైన యానకాన్ని సాంద్రతర యానకం అని తేలికైన యానకాన్ని విరళయానకం అని అంటారు.
# కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు లంబానికి దూరంగా జరుగుతుంది.
# విరళయానకం నుంచి సాంద్రతర యానకానికి ప్రయాణిస్తున్నప్పుడు లంబం వైపుగా వక్రీభవన కిరణం జరుగుతుంది.
#శూన్యంలో కాంతివేగం 3x 108m/sec దీనిని ‘C’తో సూచిస్తారు. మరే ఇతర పారదర్శక పదార్థంలో నైనా కాంతివేగం C తక్కువగా ఉంటుంది.
#ఏదైనా యానకంలో కాంతివేగం ‘V’ అయితే శూన్యంలో కాంతి వేగానికి యానకంలోని కాంతి వేగానికి గల నిష్పత్తిని వక్రీభవన గుణకం అని అంటారు. దీనినే పరమ వక్రీభవన గుణకం అంటారు.
# పరమ వక్రీభవన గుణకం = శూన్యంలో కాంతివేగం / యానకంలో కాంతివేగం
n=c/v
#వక్రీభవన గుణకానికి ప్రమాణాలు లేవు.
#ఒక యానకంలో కాంతి ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో వక్రీభవన గుణకం తెలుపుతుంది.
#శూన్యంలో కాంతివేగంలో ’n’వ వంతు యానకంలో కాంతివేగం అవుతుంది.
పదార్థం వక్రీభవన గుణకాలు
గాలి – 1.0003
మంచు – 1.31
నీరు – 1.33
కిరోసిన్ – 1.44
క్వార్ట్ – 1.46
టర్పంటైన్ ఆయిల్ – 1.47
క్రౌన్ గాజు – 1.52
బెంజీన్ – 1.50
కెనడా బాల్సం – 1.53
రాతి ఉప్పు – 1.54
కార్బన్ డై సల్ఫైడ్ – 1.63
సాంద్రతర ప్లింట్ గాజు -1.65
కెంపు (రూబి) – 1.71
సఫైర్ – 1.77
వజ్రం – 2.42
# గుణకం ఎక్కువగా ఉండే యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది.
# వక్రీభవన గుణకం రెండు అంశాలపై ఆధారపడుతుంది.
1. పదార్థ స్వభావం
2. ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యం
#సాపేక్ష వక్రీభవన గుణకం = రెండోయానక వక్రీభవన గుణకం / మొదటి యానక వక్రీభవన గుణకం = n2/ n1
# పతన కోణం(i), వకీభవన కోణం(r)ల సైన్ విలువల నిష్పత్తిని వక్రీభవన గుణకం అంటారు.
# n2/n1 = Sin i / Sin r (or)
u = Sini/ Sin r
# పతన కిరణం, వక్రీభవన కిరణం రెండు యానకాలను వేరుచేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి.
# వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది.
# నిర్దిష్ట పతనకోణం వద్ద సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోనికి ప్రయాణించే కాంతి కిరణం యానకాన్ని విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సందిగ్దకోణం అంటారు.
# పతనకిరణం, వక్రీభవన కిరణం, పతన బిందువు వద్ద సరిహద్దు తలానికి గీసిన లంబాలన్నీ ఒకే తలంలో ఉంటాయి.
#పతనకోణం సైన్ విలువకు, వక్రీభవన కోణం సైన్ విలువకు ఉన్న నిష్పత్తి స్థిరాంకం. Sin i/ Sin r = n21
#n21 ఒక స్థిరరాశి దీనిని మొదటి యానకం పరంగా రెండవ యానకం వక్రీభవన గుణకం అంటారు.
#n21>1 అయితే x<1 వకీభవన కిరణం లంబం వైపు వంగుతుంది.
## n21<1 అయితే x>1 వకీభవన కిరణం లంబానికి దూరంగా జరుగుతుంది.
#సాంద్రతర యానకంలోని పతన కిరణం విరళయానకంలోకి వక్రీభవనం చెందినపుడు ఈ విధంగా జరుగుతుంది.
#n12=1/n21 అవుతుంది.
#మానవుడు ఒక వస్తువును స్పష్టంగా చూడాలంటే మానవుడి కంటికి వస్తువుకు మధ్య కనీస దూరం 25 సెం.మీ. ఉండాలి. దీనిని ‘స్పష్టదృష్టి కనీస దూరం’ అంటారు.
# ఈ దూరం పిల్లల్లో 7 -8 సెం.మీ. వరకు, వృద్ధుల్లో 200 సెం.మీ. వరకు ఉంటుంది.
# స్పష్టదృష్టి దూరాన్ని సమీప బిందువు అనికూడా పిలుస్తారు.
# వయోవృద్ధులకు వయస్సుతోపాటు వచ్చే అంధత్వాన్ని జరాదృష్టి లేదా చత్వారం అంటారు.
# జరాదృష్టిని నివారించడానికి అభిసారి కటకాన్ని ఉపయోగిస్తారు.
# దూరంగా ఉన్న వస్తువు నుంచి కంటి కటకం వద్దకు వచ్చే కాంతి అంతఃపటలం(రెటీనా) ముందుభాగంలో ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతుంది. ఈ రకపు దృష్టి దోషాన్ని హ్రస్వదృష్టి (myopia) అంటారు. దీని నివారణకు అపసారి కటకం అవసరం
# కంటి కటకం తనపై పడిన కాంతిని అంతఃపటలం వెనుకభాగంలోని ఒక బిందువు కేంద్రీకరింపజేసిన ఆ దోషాన్ని దూరదృష్టి అంటారు. (Hypermetropia)#కార్నియా గోళాకారంలో లేనపుడు సంభవించే లోపాన్ని అసమదృష్టి (Astig matism) అంటారు.
# దీన్ని నివారించడానికి స్థూపాకార కటకాన్ని ఉపయోగిస్తారు.
కటక సూత్రం:
# 1/f =1/v-1/u
# f = నాభ్యాంతరం
# u = వస్తుదూరం
# v = ప్రతిబింబదూరం
కటక తయారీ సూత్రం
# 1/ f = (n-1) [ 1/R1 – 1/R2
# n : పరమ వక్రీభవన గుణకం
#f = నాభ్యాంతరం
#R1, R2 = వక్రతా వ్యాసార్థాలు
#కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వకీభవన గుణకం గల యానకంలో ఉంచినపుడు కేంద్రీకరణ కటకం వలె, వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినపుడు వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది.
ఉదా: నీటిలోని గాలి బుడగ వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది.
# వక్రీభవన గుణకం n= 1.5 గా గల ద్విపుటాకార కటకం గాలిలో ఉంచిన కటకం రెండు వకతా వ్యాసార్థాలు 30 సెం.మీ., 6 సెం.మీ. అయిన నాభ్యాంతరం ఎంత?
#ఒక వ్యవస్థలో f1 f2 నాభ్యాంతరాలు గల రెండు కటకాలు
# i) ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నపుడు 1/F= 1/f1 + 1/f2
#ii) రెండు ఒకే ప్రధానాక్షంపై d దూరంలో ఉన్నపుడు
# 1/F= 1/f1+ 1/f2- d/f5c2 అవుతుంది.
# 20 సెం.మీ గల నాభ్యాంతరం గల కేంద్రీకరణ కటకం ముందు 60 సెం.మీ. దూరం లో వస్తువు ఉంది. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది.
# F=20 cm ; u= -60cm ==> VZ?
# 1/f = 1/u + 1/v
# 1/v = 1/f – 1/u = 1/20 + 1/60
= 3-1/60 = 2/60 = 1/30
#1/v=1/30 ==> V = 30cm
#ఒక ద్వికుంభాకార కటకం రెండు వక్రతల వ్యాసార్థాలు సమానం. కటకం వక్రీభవన గుణకం 1.5 అయిన నాభ్యాంతరం
# 1/v = (n-1) [1/R1 -1/R2]
#1/f = (n-1) [1/R – 1/-R]
# 1/f = (n-1) [1/R + 1/-R]
==> 1/f = (1.5-1) [Z/R]
#1/f = (0.5) [2/R] l 1/f
= 1/2 2/R ===> f=R
#కటక నాభ్యాంతరం. వక్రతా వ్యాసార్థాలు సమానమైన దాని వక్రీభవన గుణకం 1.5
కటక సామర్థ్యం: (Power of lens)
#కటక కేంద్రం నుంచి ఏకాంక దూరంలో పతనమైన కాంతి పుంజాన్ని కటకం ఏ కోణంతో అభిసరణం/ అపసరణం చెందిస్తుందో ఆ కోణం టాంజెంట్ విలువను కటక సామర్థ్యం అంటారు.
# tan 8 = h/f h=1 అయిన tan 8 =1/f అవుతుంది
# P=1/f
#కటక సామర్థ్యానికి ఎస్ఐ ప్రమాణం డయాప్టర్లు 10=1m-1
#1m నాభ్యాంతరం కలిగిన కటక సామర్థ్యం 1 డయాప్టర్
# అభిసారి కటకం (Converging) సామర్థ్యం ధనాత్మకం, అపసారి కటకం (Divier ging) సామర్థ్యం రుణాత్మకం
#+D అయిన కుంభాకార కటకం, -D అయిన పుటాకార కటకం
#ఒక గాజు కటకం f=0.5m అయిన దాని సామర్థ్యం ఎంత?
P = 1/f =1/1/2 =+2D 2 డయాప్టర్లు
#ఒక మాంత్రికుడు (గారడి చేసేవాడు) తన ప్రదర్శన n=1.47 గల ఒక గాజు కటకాన్ని తొట్టెలో ఉంచి ఒక ద్రవాన్ని దానిలో నింపి కటకం అదృశ్యమయ్యేట్టు చేశాడు. ద్రవం వక్రీభవన గుణకమెంత?
# ద్రవం అదృశ్యమవ్వాలంటే ద్రవం వక్రీభవన గుణకం 1.47 తప్పక అయి ఉండాలి.
# n1=n2 అపుడు 1/f = 0 (or) f =a
అవుతుంది.
# ఆ ద్రవం నీరుకాదు గ్లిజరిన్ అయి ఉండవచ్చు.
వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం
# ఒక తొట్టెలో కరను ముంచినట్లయితే వంగినట్లు కనిపిస్తుంది.
#నక్షత్రాలు మెరవడం, తొట్టెలోని నాణెం పైకి వచ్చినట్లు కనిపించడం.
#ఆకాశంలోని పక్షకి నీటిలోని చేప పెద్దదిగాను, నీటిపై ఉన్నట్లు కనిపించడం
#చేపకు ఆకాశంలోని పక్షి ఉన్న సైజు కంటే చిన్నదిగాను, ఎక్కువ ఎత్తులో ఉన్నట్లు కనిపించడం వంటివన్నీ వక్రీభవనం అనువర్తనాలు.
# n2/v- n1/u = 0 —> n2/v=n1/u
# —> 1/v – 1/u = (n1-n2)
#(n1-n2) = 1/v – 1/u
# ఒక పారదర్శక గోళ కేంద్రం వద్ద ఒక చిన్న అపారదర్శక బిందువు ఉంది. గోళం బయట నుండి చూసినపుడు ఆ బిందువు యథాస్థానంలో కనిపిస్తుంది.
#వక్రీభవనం కటకాలలో జరుగుతుంది.
# C1 C2 లను కలిపే రేఖను ప్రధానాక్షం అంటారు.
# కటకం మధ్య బిందువును కటక దృక్ కేంద్రం P అని అంటారు.
#1) అనంతదూరంలో వస్తువు ఉన్నపుడు కటకంపై పడే కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకృతమవుతాయి.
# 2) వక్రతా కేంద్రానికి అవతల ప్రధానాక్షంపై వస్తువును ఉంచినపుడు ప్రతిబింబం తలకిందులుగా ఉన్న నిజ ప్రతిబింబం.
# ఇది ప్రధానాక్షంపై నాభికి వక్రతా కేంద్రానికి మధ్య ఏర్పడుతుంది.
# 3) వక్రతాకేంద్రం వద్ద వస్తువును ఉంచినపుడు C1 వద్ద నిజప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువు పరిమాణంతో సమాన పరిమాణం గల ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది.
# 4) వక్రతా కేంద్రం నాభిమధ్య వస్తువును ఉంచినపుడు నిజప్రతిబింబం తల కిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. C1 కు అవతల ప్రతిబింబం ఏర్పడుతుంది.
# 5) నాభివద్ద వస్తువును ఉంచినపుడు ప్రతిబింబం అనంతదూరంలో ఏర్పడుతుంది.
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?