ఎగిరే ఉడుతలు.. సీ సీ ఈగలు ( ఆఫ్రికా ఖండం) పోటీ పరీక్షల ప్రత్యేకం
జనాభా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ఖండాలన్నింటిలో రెండో అతిపెద్ద ఖండం ఆఫ్రికా. దీన్ని చీకటి ఖండం అని కూడా పిలుస్తారు. మానవాళి మనుగడ కూడా ఇక్కడి నుంచే ఆరంభమైంది. 19వ శతాబ్దం చివరి వరకు ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా ఎవ్వరికి తెలియక పోవడం వల్ల దీన్ని యూరోపియన్లు చీకటి ఖండంగా పిలిచేవారు. క్రీ.శ 1840లో స్కాటిష్ మిషనరీ అన్వేషకుడు లివింగ్స్టన్ మొదటగా ఆఫ్రికా గురించి ఆన్వేషణ మొదలుపెట్టాడు. 54 సార్వభౌమ దేశాలు ఉన్న ఈ ఖండం అనేక వింతలకు నిలయం. ఈ ఖండం గురించి నిపుణ పాఠకులకు సంక్షిప్తంగా మరిన్ని విషయాలు….
# ఆఫ్రికా ఖండం నైసర్గిక స్వరూపాలు ప్రధానంగా 3 కలవు. అవి.
#పర్వతాలు, పీఠభూములు, మైదానాలు
# ఆఫ్రికా ఖండం ‘పీఠభూమి స్వరూపం’తో ఆవరించి ఉంది.
# ఆఫ్రికా ఖండ పీఠభూమి సగటు ఎత్తు- 200 మీ – 1000 మీ.
పీఠ భూములు
# ఆఫ్రికా పీఠభూమి స్వరూపాన్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవి.
1 పశ్చిమ పీఠభూములు
2 తూర్పు పీఠభూమి ఇవి 1000 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో కలవు.
3 దక్షిణ పీఠభూమి
# 0 మీ- 200 మీ. మైదానాలు
# 200 మీ- 1000మీ. పీఠభూములు
#1000 మీటర్లకు పైగా పర్వతాలు
మైదానాలు
# సమతలమైన నైసర్గిక స్వరూపాన్ని మైదానం అంటారు.
# ఆఫ్రికాలో పీఠభూమి అంచున మైదానాల వెడల్పు తక్కువ.
#నదులు.. సముద్రంలో కలిసే ప్రాంతంలో మైదానాల వెడల్పు ఎక్కువగా ఉంటుంది.
#ఆఫ్రికాలోని మైదానాలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి.
# ఉత్తర మైదానం ( నైలు నది వల్ల ఏర్పడింది)
# పశ్చిమ మైదానం (నైజర్ నది వల్ల ఏర్పడింది)
#తూర్పు మైదానం (జాంబేజ్ నది వల్ల ఏర్పడింది)
# ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉష్టమండల ఎడారి.
#ఇది మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్టు, చాద్మారిటేనియా, మాలి, నైగర్, సూడాన్.(ఈ దేశాల్లో
‘సహారా ఎడారి’ విస్తరించి ఉంది)
#కలహరి ఎడారి- అంగోలా, నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్ దేశాల్లో విస్తరించి ఉంది.
ఆఫ్రికాలో కర్కటరేఖ తాకుతు ఉన్న దేశాలు
# పశ్చిమ సహారా, మొరాకో, అల్జీరియా, లిబియా, ఈజిప్టు దేశాల నుంచి కర్కటరేఖ వెళుతుంది.
భూమధ్యరేఖ తాకుతూ వెళ్లే దేశాలు
# గబాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ప్రజాస్వామిక కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా దేశాల నుంచి భూమధ్య రేఖ వెళుతుంది.
మకరరేఖ తాకుతూ వెళ్లే దేశాలు
# నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మడగాస్కర్ నుంచి మకరరేఖ వెళుతుంది.
నదులు
నైలు నది
#ఆఫ్రికాలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన నది (6670కి.మీ)
# నైలు నది విక్టోరియా సరస్సు నుంచి జన్మించింది.
#నైలు నది ఉగాండా, దక్షిణ సూడాన్, సూడాన్, ఈజిప్టు గుండా ప్రవహించి అలెగ్జాండ్రియా రేవు పట్టణం సమీపాన మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
# దక్షిణ సూడాన్ నుంచి వైట్ నైలు, ఇథియోపియా నుంచి బ్లూ నైలు ఉపనదులు నైలునదిలో కలుస్తాయి.
నైజర్ నది
#నైజర్ నది గినియాలో జన్మించి మారిటేనియా, మాలి, చాడ్, నైజర్, బెనిన్, నైజీరియా గుండా ప్రవహించి గినియా సింధూ శాఖలో కలుస్తుంది. (అట్లాంటిక్ మహాసముద్రం)
కాంగో నది
#ఈ నది ప్రజాస్వామ్యక కాంగోలో జన్మించి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రవేశించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.
#భూమధ్యరేఖను రెండుసార్లు ఖండించుకుంటూ ప్రవహించేనది- కాంగో నది
కాంగో నది పాత పేరు- జైరీ నది.
జాంబేజీ నది
#అంగోలాలో జన్మించి బోట్స్వానా సరిహద్దును తాకుతూ జాంబియా, జింబాబ్వే మధ్యగా ప్రవహిస్తూ మొజాంబిక్ దేశంలో ప్రవేశించి హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. (మొజాంబిక్ ఛానల్లో కలుస్తుంది).
శీతోష్ణస్థితి
#భూమధ్యరేఖ నుంచి ఎగువన కర్కటరేఖ వరకు, దిగువన మకరరేఖ వరకు ఉన్న ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ‘ఉష్ణమండల శీతోష్ణస్థితి మండలం’ అంటారు.
సమశీతోష్ణస్థితి మండలం
# కర్కటరేఖకు ఎగువన, మకరరేఖకు దిగువన ఉన్న ప్రాంతాల్లో సమశీతోష్ణస్థితి కలదు.
#ఈ ప్రాంతంలో శీతాకాలం, వేసవికాలం రెండు రుతువులు ఏర్పడుతాయి.
# శీతాకాలంలో చిరుజల్లులు కురుస్తాయి.
#వేసవికాలం పొడిగా ఉంటుంది.
# వర్షపాతం ఆధారంగా ఆఫ్రికాను 3 భాగాలుగా విభజించారు.
అత్యధిక వర్షపాతం
# భూమధ్యరేఖకు ఎగువ, దిగువ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వర్షపాతం నమోదు అవుతుంది. దీన్ని అత్యధిక వర్షపాత ప్రాంతం అంటారు.
# అత్యధిక వర్షపాత ప్రాంతాలు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం, మధ్య ఆఫ్రికా ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు కలవు.
# ఈ ప్రాంతంలో కోతులు, చింపాంజీలు, ఎగిరే ఉడుతలు, ఎగిరే పాములు, పెద్ద పెద్ద అనకొండలు, సీ సీ ఈగలు, విషపూరితమైన ఈగలు కలవు.
మధ్యస్థ వర్షపాత ప్రాంతాలు
#అత్యధిక వర్షపాత ప్రాంతానికి, అల్ప వర్షపాత ప్రాంతానికి మధ్యస్థంగా విస్తరించిన ప్రాంతాలను మధ్యస్థ వర్షపాత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతాలు తేమ, పొడి వాతావరణం కలిగి ఉంటాయి. ఇక్కడ ఏనుగు కూడా కనిపించనంతా ఎత్తులో గడ్డి పెరుగుతుంది. వీటిని ఉష్ణమండల గడ్డిభూములు అని పిలుస్తారు.
ఉదా: సవన్నాలు
నోట్: ఆఫ్రికాలోని సమశీతోష్ణ మండల గడ్డిభూములు- వెల్డులు (దక్షిణాఫ్రికా)
ఆఫ్రికాతో యూరోపియన్లు, అరబ్బులు, భారతీయులకు ఉన్న సంబంధాలు
#ఉత్తర ఆఫ్రికా గురించి యూరోపియన్స్కు తెలుసు. తూర్పు ఆఫ్రికా గురించి అరబ్బులకు, భారతీయులకు పరిచయం ఉన్నది. మిగిలిన ఆఫ్రికా ప్రాంతాల గురించి తెలియదు. 500 సంవత్సరాలకు పూర్వమే యూరోపియన్లు ఆఫ్రికా గురించి అన్వేషణలు జరిపారు.
#యురోపియన్ నావికులు పశ్చిమ యూరప్ తీరం నుంచి బయలుదేరి అట్లాంటిక్ సముద్రానికి, దక్షిణం వైపు పయనించి ఆఫ్రికా వాయవ్య ప్రాంతంలో సెయింట్ వందీనా, అజోస్ దీవుల్లో నౌకలు నిలుపుకొనేవారు. ఈ దీవులకు దక్షిణ భాగంలో మరుగుతున్న నీరు కలిగి ఉండటం వల్ల తమ ప్రయాణాన్ని నిలిపివేసేవారు.
సముద్ర మార్గాల అన్వేషణ
# ఇటలీ దేశానికి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ 1485లో పశ్చిమ యూరప్ తీరం గుండా అట్లాంటిక్ సముద్రం మీదుగా పశ్చిమం వైపు పయనించి 1492లో పశ్చిమ ఇండీస్ దీవులను కనుగొన్నాడు.
# పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కోడిగామా 1498లో భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. (కేరళ రాష్ట్రంలోని కాలికట్ రేవు పట్టణం)
అమెరికన్ యూరోపియన్లు
#యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నవారిని అమెరికన్ యూరోపియన్లు అంటారు. అమెరికాలో సేద్యపు భూమి అత్యధికంగా ఉంది. కాని కార్మికుల కొరత ఎక్కువ ఉంది.
# అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకున్న యూరోపియన్లు అట్లాంటిక్ సముద్రం మీదుగా పయనించి ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఆఫ్రికా నీగ్రో జాతి ప్రజలు వారి దాడులను ఎదిరించి వారి ప్రయత్నాన్ని విఫలం చేశారు.
ఆఫ్రికా గుండా వెళ్లే రేఖలు
కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ
సరిహద్దులు
ఉత్తరం మధ్యధరా సముద్రం
దక్షిణం అంటార్కిటికా, దక్షిణ మహాసముద్రం
పశ్చిమం అట్లాంటిక్ మహాసముద్రం
తూర్పు ఎర సముద్రం, హిందూ మహాసముద్రం
సరస్సులు
ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా 5 సరస్సులు కలవు.
మంచినీటి సరస్సులు విక్టోరియా సరస్సు
న్యాసా సరస్సు టాంగాన్యకా సరస్సు
ఉప్పునీటి సరస్సులు చాద్ సరస్సు
గామి సరస్సు
ఆఫ్రికాలో అతిపెద్ద మంచినీటి సరస్సు- విక్టోరియా (భూమధ్య రేఖ ఈ సరస్సు మధ్యగుండా వెళుతుంది)
పర్వతాలు
# ఆఫ్రికాలో ప్రధానంగా 5 రకాల పర్వతాలు ఉన్నాయి.
# అట్లాస్ పర్వతాలు
#డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు
#కిలిమంజారో పర్వతాలు
#కెన్యా పర్వతాలు
# రువెంజరీ పర్వతాలు
# మొరాకో, అల్జీరియా, ట్యునీషియాల్లో అట్లాస్ పర్వతాలు ఉన్నాయి.
#ఆఫ్రికాలో ముడత పర్వతాలు- అట్లాస్ పర్వతాలు.
#టాంజానియా దేశంలో కిలిమంజారో పర్వత శిఖరం ఉంది. దీని ఎత్తు- 5895 మీటర్లు. ఆఫ్రికాలో ఎత్తయిన పర్వత శిఖరం. ఇది అగ్నిపర్వత విస్పోటనం వల్ల ఏర్పడిన పర్వత శిఖరం.
# దక్షిణాఫ్రికాలోని ఆగ్నేయ భాగాన డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఉంది. ఇవి ఖండ పర్వతాలు.
# కెన్యాలో కెన్యా పర్వత శిఖరం కలదు. దీంతో పాటు రువేంజరి పర్వత శిఖరం కూడా ఉంది.
అల్ప వర్షపాత ప్రాంతాలు
#సంవత్సరం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు, అల్పవర్షపాతం గల ఈ ప్రాంతాలను శుష్కప్రాంతాలు అంటారు. వీటినే ఎడారులు అని కూడా పిలుస్తారు.
# ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలోని సహారా ఎడారి, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని కలహరి ఎడారిలో సంవత్సరం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు, అల్పవర్షపాతం నమోదు అవుతాయి.
# ఈ ప్రాంతాల్లో ముళ్ల పొదలతో కూడిన అరణ్యాలు ఉంటాయి. ఈ ఆరణ్యాల్లో నాగజెముడు, బ్రహ్మజెముడు, కలబంద వృక్షసంపదతో పాటు ముళ్లతో కూడిన అనేక వృక్షాలు ఉంటాయి. పొడవైన మెడ కలిగిన జిరాఫీ, ఒంటెలు, చిరుతపులి, ఏనుగులు మొదలైన మాంసాహార, శాఖాహార జంతువులు ఉంటాయి.
మస్తాన్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
- Tags
- competitive exams
- TSPSC
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?