సరోగసీ బిల్లుకు లోక్సభ ఆమోదం పోటీ పరీక్షల ప్రత్యేకం
2021 డిసెంబర్ 17న సరోగసీ (నియంత్రణ) బిల్లు -2019కు లోక్సభ ఆమోదం తెలిపింది. 2019 ఆగస్టులోనే ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. డిసెంబర్ రెండోవారంలో రాజ్యసభ సవరణలు చేయడంతో మరోసారి దిగువసభ సమ్మతి అవసరమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రకారం చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదేండ్లు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు. భార్యకు 25-30 ఏండ్ల లోపు వయసు, భర్తకు 26-55 ఏండ్ల వయస్సు ఉండి వారికి సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఆ దంపతులు సరోగసీ విధానంలో బిడ్డను పొందవచ్చు. నైతికత, నిస్వార్థంతో సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ఈ చట్టం ఎలాంటి అడ్డంకులు సృష్టించదు.
‘ఆర్ట్’ బిల్లుకు ఆమోదం
సంతాన సాఫల్య కేంద్రాలు, మహిళల అండాలు, పురుషుల వీర్యాన్ని భద్రపరిచే కేంద్రాల నియంత్రణ, పర్యవేక్షణతో పాటు సంబంధిత సాంకేతికతల దుర్వినియోగాన్ని అడ్డుకొనే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు లోక్సభ 2021 డిసెంబర్ 1న, రాజ్యసభ డిసెంబర్ 8న ఆమోదం తెలిపాయి. ఈ రంగంలో ఆస్పత్రులు వినియోగించే సాంకేతికత పర్యవేక్షణతో పాటు నియంత్రణకు అధికార సంస్థ, జాతీయ రిజిస్ట్రీ ఏర్పాటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఆర్ట్) బిల్లును రూపొందించింది. ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రవేశపెట్టిన ఈ బిల్లు మూజువాణి పద్ధతిలో ఆమోదం పొందింది.
ఈ బిల్లు ప్రకారం పునరుత్పత్తి సాంకేతికత వినియోగంలో అనైతిక పద్ధతులను అనుసరించే వారికి రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు జరిమానా, 8 నుంచి 12 ఏండ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు. సహజ పద్ధతుల్లో సంతానం కలగని దంపతుల్లో మహిళల నుంచి అండాన్ని, పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి ప్రయోగశాలలో ఫలదీకీరించి ఆ పిండాన్ని మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఇలాంటి సేవలు అందించే సంతాన సాఫల్య కేంద్రాలు.. అండం, వీర్యాన్ని భద్రపరిచే బ్యాంకులను నియంత్రిచడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు వీలు కల్పిస్తూ ఏఆర్టీ బిల్లును తెచ్చారు.
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?