ఇవి మన సాహితీ సమాజాలు
సమాచార విప్లవంతో ప్రజల జీవితాల్లో నేడు అనూహ్య మార్పులు చోటుచేసుకొంటున్నాయి. వినోదం, విజ్ఞానం పంచే అనేకానే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ప్రజల వ్యాపకాలు వేరు. వినోదానికైనా, విజ్ఞానానికైనా ఆటలు, నాటకాలు, ఇతర కళారూపాలే ప్రముఖ సాధనాలు. ముఖ్యంగా సామాజిక సమస్యలను ఎత్తిచూపటంలో, పోరాటాలకు ప్రజలను కార్యోన్ముఖులను చేయటంలో నాటకానిదే కీలక పాత్ర. తెలంగాణలో నిజాంల పాలనాకాలం నుంచి అనేక మంది నాటకకర్తలు వివిధ రకాల సమస్యలను కథావస్తువులుగా తీసుకొని నాటకాలను రూపొందించి ప్రజలను చైనవంతులను చేశారు. ఈ ఒరవడిలో అనేక నాటక సమాజాలు కూడా ఏర్పడ్డాయి.
1920లో స్వాతంత్య్ర పోరాట కాలంలో సంఘ సంస్కరణోద్యమం ప్రముఖ పాత్ర వహించింది. కాళ్లకూరి నారాయణరావు రచించిన వరవిక్రయం ఈ నేపథ్యంలో వచ్చిన నాటకమే. అలాగే సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం గల శేషాద్రి, రమణ కవులు రాసిన విచిత్ర వివాహం అనే నాటకం ఒకటి. చంద్రరేఖ నాటకంలో అస్పృశ్యత, నిరుద్యోగం, దారిద్య్రం, బాల వితంతువుల బాగోగులు, రైతుల శ్రమను దోచుకొనే దొరల పెత్తనం మొదలైన అంశాలు ఉన్నాయి. 1924లో సురవరం ప్రతాపరెడ్డి రాసిన భక్తతుకారం నాటకం గాంధీజీ అహింస, హరిజనోద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని రాశారు. అంతకుముందే 1921లో రెడ్డి ఉచ్చల విషాదం రాశారు. తెలంగాణ నాటక రంగం లో తొలి ప్రయోగాత్మక నాటకం భిషగ్విజయం. దీన్ని రచిం చింది డాక్టర్ చొల్లేటి నృశింహరామశర్మ. ఈ నాటకంలో 32 పాత్రలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో మహరాజ కిషన్ ప్రసాద్ దేవుడిలో ప్రదర్శించారు. తెలుగులో తెలంగాణలో తొలి నాటకం ఇది. వానమామలైన వరదాచార్యులు-రాజ్యశ్రీ, దాశరథి-వాసని లేని పూలు, తూము రామదాసు- కాళిదాసు నాటకం, పాములపర్తి సదాశివరావు – ఆత్మగౌరవం, కర్తవ్యం, గోవాపోరాటం, ఒద్దిరాజు సీతారామచంద్రరావు-మైత్రి పరిణితి, మేనరికం, మేనత్త, ఆడపెత్తనం, మగ సంసారం, పొట్టపల్లి రామారావు తెలంగాణలో భూస్వాముల, ప్రభుత్వాధికారుల అక్రమ వసూళ్లను తూర్పార బట్టే రీతిలో పగ, సరబరాహి, న్యాయం అనే నాటికలను రచించారు. ఆవాల దామోదర్‌రెడ్డి పేదగుండెలు, డాక్టర్ వనం మధుసూదన్ అయ్యయ్యో గాంధీ బతికాడు, రుణం తీరిపోయింది, జీర్ణ జీవితాలు, అంటరానివాళ్లు, భారతి కళ్లు తెరిచింది. అతకని బతుకులు, గుడుంబాసురుడు, వల్లంపట్ల నాగేశ్వర్రావు మాయాజూదం, కళాకారులారా కళ్లు తెరవండి, రాతిబొమ్మ, ఎలచ్చన్లచ్చినయ్ నాటకాలను రాశారు. డాక్టర్ పీవీ రమణగారు ఆకురాలిన వసంతం, దేవతలెత్తిన పండుగ, వెంటాడే నీడలు మొదలైన నాటకాలు రాశారు. ఎం.మధుసూదన్‌రావు రాసిన సార్థకజీవి నాటకం మొదలైనవి.
-1947లో తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక నవచైతన్యం వెల్లివెరిసింది. ఉదాహరణకు సుంకిరెడ్డి, వాసిరెడ్డిలు రాసిన మా భూమి నాటకం.
-ఇదేవిధంగా చిల్లర భావనారాయణ రాసిన కళాభిమాని, దేశద్రోహం, ఉప్పెన కాముందు, పరిణామం, కొత్త మనిషి, పదవులు-పెదవులు, ఏఆర్ కృష్ణ రాసిన అరగంటలో అదృష్టం, ఎక్కడికి, దేశంకోసం చేసిన నేరం, గుండాల నరసింహారావు రాసిన మారుతున్న తరం, ఎర్రబస్సు, అంకం లింగమూర్తి రాసిన జలతారు, చక్రశీల, అగ్నిదీపం, పితృదేవోభవ, ఎంవీ సుబ్రమణ్యం రాసిన చదరంగం, జెండాపై కపిరాజు మీరు మారాలి, నంది రాజారెడ్డి రాసిన సబల, మా మతం మానవత్వం, డా. నాంపల్లి మధుబాబు రాసిన మేడిపండు, దూరపుకొండలు, తక్కెళ్ల బాలరాజు రాసిన నవతరానికి నాంది, చైతన్యపథంలో మరో పొద్దుపొడుపు, వేల్పుల శామ్యూల్ రాసిన ఇది తప్పంటారా, చందర్రావు రాసిన అక్షర పద్దులు, డా. వీ వీరాచారి రాసిన ఓట్లు-నోటు సమాంతర రేఖలు, వర్ణమాల, ఆషాఢమాసం, డా. పెద్ది వెంకటయ్య రాసిన చైతన్యరథం, అంబేద్కర్ మళ్లీ పుట్టాడు, మేలుకొలుపు, చెమట బిందువులు, నేను సైతం, ఏవీ నరసింహారావు రాసిన అభ్యుదయపదం, మలయ సమీరం, నీలిరాగం, జీవన సమరం, వల్యపైడి రాసిన ఆచార్య దేవోభవ మొదలైనవి.
గేయ నాటికలు: డా. సి.నా.రె రాసిన సుగాత్రి, గోకుల విహారం, నవ్వనిపువ్వు, రామప్ప, అజంతా సుందరి, రుతువుల రాణి, వెన్నెలవాడ, ఊర్మిళ, వడ్డేపల్లి కృష్ణ రాసిన కల్యాణం, వల్లంపట్ల నాగేశ్వరరావు రాసిన అడవితల్లి వేట, నారుపోసినోడే, దళిత భారతం.
-తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఏదో సాహిత్య సంస్థ కనిపించింది. అప్పుడు అది ప్రజలను చైతన్యవంతం చేసి మార్గనిర్దేశం చేసింది.
-ఆదిలాబాద్: 1) మిత్రకళాసమితి (1970), జన్నారం 2) చైతన్య భారతి (1981), నిర్మల్ 3) మిత్రమండలి (198 6), 4) ప్రత్యూష సాహితీ కుంజం (1989), ఇచ్చోడ 5) ఆదిలాబాద్ జిల్ల రచయితల సంఘం, ఆదిలాబాద్ 6) దళిత సాహితీ కళావేదిక (1992).
-కరీంనగర్: 1) భారతీయ సాహిత్య సమితి (1971) కోరుట్ల 2) సాహితీ మిత్రబృందం (1972), ధర్మపురి 3) వికాస సమితి (1979), కమాన్‌పూర్ 4) సృజన చైతన్య సాహితీ సమాఖ్య (1979), బోయినపల్లి 5) జనసాహితీ సాహిత్య సమితి (1980), కాశ్మీర్‌గడ్డ 6) త్రివేణి సాహితి 1(1982), కరీంనగర్ 7) ఉదయ సాహితి (1987), గోదావరిఖని 8) సమతా సాహితి (1989), కరీంనగర్ 9) శేషప్ప సాహితి (1990), ధర్మపురి 10) సాహితీ గౌతమి (1990), కరీంనగర్ 11) సారస్వత జ్యోతి మిత్రమండలి , కరీంనగర్ 12) కరీంనగర్ జిల్లా రచయితల సంఘం, కరీంనగర్ 13) నవసాహితీ వికాసవేదిక, సుల్తానాబాద్ 14) సాహితీ మిత్రమండలి, మంథని 15) గంగాతరంగిణి, మంథని 16) మానేరు సాహిత్య సాహితీ, ముత్తారం 17) సార్వస్వత సమితి, తాడిచర్ల 18) ఆదిత్య సాహితి , కాటారం 19) వనవాణి, మహాముత్తారం 20) చైతన్య సాహితీ, మెట్పల్లి 21) సాహితీమిత్రులు, సిరిసిల్ల 22) బొమ్మనపల్లి సాహితీ,బొమ్మనపల్లి 23) వికాస సాహితీ సాంస్కృతిక మిత్రమండలి, హుస్నాబాద్ 24) నటరాజ సాహితి, వేములవాడ 25) స్ఫూర్తి సాహితి, ఓదెల 26) రచన సాహితి, వేములవాడ 27) రవళి సాహితి, హుజురాబాద్ 28) సాంస్కృతిక సమాఖ్య, గోదావరిఖని 29) విశ్వవిజ్ఞాన వికాసవేదిక, గోదావరిఖని 30) నవసాహితి, గోదావరిఖని 31) సాహితీసాంస్కృతిక సమాఖ్య, వీణవంక 32) బోయినపల్లి సాహితీ సమితి, బోయినపల్లి 33) సాహితీ మిత్రబృందం, వేములవాడ 34) విద్యార్థి సాహితీ సంస్థ, వేములవాడ 35) రసధుని సాహితీ సంస్థ,రుద్రంగి.
-ఖమ్మం: 1) ఖమ్మం జిల్లా రచయితల సంఘం (1942), ఖమ్మం 2) ఆంధ్రప్రజాపరిషత్తు (1960), ఖమ్మం 3) రమ్మ సాహితి (1978), ఖమ్మం 4) గౌతమి నవ్యసాహితి (1980), సత్యనారాయణపురం 5) రవళి సాహిత్య సమా ఖ్య (1985), సాహితి (1980), ఖమ్మం 6) శృతి సాహితీసంస్థ (1991), సత్తెనపల్లి 7) నవ్యకళాసమితి, కొత్తగూడెం. ఖమ్మం కవులకు గుమ్మం అని దాశరథి అన్నారు.
-నల్లగొండ: 1) చండూరు సాహితీ మేఖల (1934), చుండూరు 2) యువ రచయితల సమితి (1968) 3) పరిశోధన మండలి (1985) 4) కృష్ణవేణి సాహితీ సమితి (1990) 5) నీలగిరి సాహితి (1991) 6) నల్లగొండ సారస్వత పరిషత్ 7) నల్లగొండ జిల్లా రచయితల సంఘం 8) శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషా నిలయం (1901) 9) ఆంధ్రవిజ్ఞానం ప్రకాశిని గ్రంథాలయం (1919) 10) సరస్వతీగ్రంథ నిలయం (1920) 11) వర్తక సంఘం (192 2-2-12), సూర్యాపేట 12) శ్రీలక్ష్మీనరసింహ మనోహర బాలభారతి గ్రంథాలయం, రేపాల 13) వీరేశలింగం కం ఠాభరణ గ్రంథమాల 14) కృషి ప్రచారిణి గ్రంథమాల (1924) 17) వైదిక ధర్మమండలి 18) సీతారామ గ్రంథాలయం (1925) 19) బాలసరస్వతీ ఆంధ్రభాషా నిల యం (1925) 20) వివేక వికాసిని గ్రంథాలయం 21) అణాగ్రంథమాల (1939) 22) గ్రామవెలుగు గ్రంథాలయం, రేపాల 23) జనతాకళామండలి, రేపాల 24) నవోదయ కళామండలి, హనుమాన్ సాహితీ సంస్థ, తరుల కల్ప సంచయం, నల్లగొండ 25) నీలగిరి సారస్వత సమితి (1945), నల్లగొండ 26) విజయభాను కళాసమితి, భానుపురి సాహితీమండలి, భానుపురి కళామండలి, రాఘవ ఆర్ట్స్, రవీంద్ర సాహిత్య సమితి, సాహిత్య మిత్రమండలి, గ్రామాభ్యుదయ నాటక మండలి, నాగార్జున డ్రమెటికల్ క్లబ్, సూర్యాపేట 27) యువ రచయితల సమితి, కొలనుపాక (మురళీధరరావు) 28) సాహితీలహరి, స్పందన సాహితి, మిర్యాలగూడెం 29) యువ రచయితల సమితి, నాగార్జునసాగర్ 30) సాంస్కృతిక సాహితీ సమాఖ్య, దేవరకొండ 31) సాహితీ స్నేహితులు, సాహితీ సాంస్కృతిక మిత్రమండలి, చైతన్య కళాస్రవంతి ,రామన్నపేట 32) ప్రమోద సాహితి, సాహితీమిత్రులు, చిట్యాల 33) గురజాడ కళాసమితి (1987) కూరాకుల చందన 34) స్పందన జానపదకళా సమితి, చండూరు 35) యువ రచయిత సంఘం (మూర్తిగారి జనార్దన్) జనార్దన్ 35) కల్చరల్ అసోసియేషన్, నేతాజీ అసోసియేషన్, భువనగిరి 36) నవోదయ కళానిలయం, నవజ్యోతి కళానిలయం, యువస్వరాలు, సాహిత్యవేదిక, యాదగిరిగుట్ట 37) సాహితీకళావేదిక (రామోజ్ హరగోపాల్) ఆలేరు 38) మల్లికార్జున నాట్యమండలి, బొల్లేపల్లి 39) కళానిలయం, ముస్తాపురం 40) కళాభారతి (మురళీధరశర్మ), దత్తాయిపల్లె 41) స్నేహకళాసమితి (ఆలేటి శంకర్), తిరుమలగిరి 42) పండిత సన్మాన పరిషత్తు (వేదాంతం రామాజనుచార్యు లు, కండ్లకుంట శేషాచార్యులు), పాలెం.
-నిజామాబాద్ : 1) నిజామాబాద్ జిల్లా తెలుగు రచయితల సంఘం (1968), ఇందూరు భారతి (1969), చేతన సాహితి (1972), హిత సాహితీ సంస్థ (1975), ప్రజాసాహితి (1975), చైతన్య యువ సాహితీ సాంస్కృతిక సమైక్య (1977), జనసంస్కృతి (1979) నిజామాబాద్ 2) ఆదర్ష కళాసమితి (1972) కామారెడ్డి 3) సాహితీమిత్ర (1956), నవయుగ సాహితి, సిద్ధార్థ కళాసమితి కామారెడ్డి 4) సాహిత్య తరంగిణ (1987) ఎల్లారెడ్డిపల్లె సమైక్య సాహితి నాగిరెడ్డిపేట 5) నవత, ఆర్మూర్.
-మహబూబ్‌నగర్ : 1) జ్యోతిర్మయి సాహిత్య సాంస్కృతిక సమితి (1966), మహబూబ్‌నగర్ సాంస్కృతిక వేదిక (19 67), మహబూబ్‌నగర్ సారస్వత సేవాసమితి (1974), మహబూబ్‌నగర్ సాహిత్య వేదిక (1981) మహబూబ్‌నగర్ 2) అభిలాష (1989), అచ్చంపేట 3) గద్వాల సాహిత్య సమితి, గద్వాల 4) స్నేహలతా కవితా సంఘం, కొల్లాపూర్
-మెదక్: 1) సాహితీ వికాస మండలి (1960), మెదక్ జిల్లా రచయితల సంఘం (1964), నవసాహిత్య భారతి (1969), మంజీర రచయితల సంఘం (1986), భారతీయ రచయితల సమితి (పరాశరం గోపాలకృష్ణమూర్తి) (1960), నవచైతన్య భారతి (1970), సాహితీ మంజీర (కస్తూరి ఆనందాచారి), జాతీయ సాహిత్య పరిషత్తు (1986) సిద్దిపేట 2) నారాయణఖేడ్ సాహిత్య సమితి (1966) 3) మెదక్ మండల సాహిత్య పరిషత్ (1976), రమ్యభారతి (1982), మంజీర కళానికేతన్ (1986), సమైక్య సాహితి మెదక్ 4) సాహిత్య రంజని (1997) సంగారెడ్డి.
-రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా సాహితీ సమితి దీని శాఖలు 27.
-వరంగల్: 1) సాహితీ బంధుబృందం (1955), మిత్రమండలి (1957), సాహితీమిత్రమండలి (1957), చైతన్య సాహితి (1978), సాంస్కృతిక సమాఖ్య (19 80), సాహితీసమితి (1980), శ్రీలేఖ సాహితి (1984), మానవ వికాస రచయితల సంఘం (1990), యువసాహితీ కళాసమితి (1990), ఓరుగల్లు వికాసవేదిక, ప్రజ్ఞాభారతి, భారతీయ వికాసవేదిక, రసతరంగిణి, సహృదయ (1966), హన్మకొండ 2) సాహితీసంసద్ (1957), స్ఫూర్తి సాహితీకళాసమితి, ప్రబోధ సాహితి, జనగాం 3) కులపతి సమితి (1960), విశ్వసాహితి (1986), ఆరెజనపద వాజ్ఞయ పరిశోధన మండలి (1986), కాకతీయ కళాసమితి వరంగల్ 4) కాకతీయ యువ సాహితి (19 57), స్పందన కళానికేతన్, మడికొండ 5) సాహితీసమితి (1969) ముప్పారం 6) సారస్వత మేఖల (1972), మహబూబాబాద్ 7) సారస్వత మిత్రమండలి (1978) 8) సారస్వత వికాస మండలి (1980), ఖిలాషాపురం 9) సాహితీ మిత్ర మండలి (1981), సాహిత్య భారతి (19 85) పరకాల 10) సాహితీసుధ (1985), ఘన్పూర్ 11) సాహితీ మిత్రులు (1989) నర్సంపేట 12) విశ్వభారతి, కాజీపేట 13) యువ సాహితి, కేసముద్రం 14) ప్రగతి కళాసాహితి, డోర్నకల్ 15) సాహితీవేదిక, ఆరెపల్లి 16) పాలకుర్తి సోమన సాహిత్య సాంస్కృతిక సమితి, పాలకుర్తి 17) సారస్వత మిత్రమండలి, భీమారం
-హైదరాబాద్: 1) సాధన సమితి (1939) 2) ఆంధ్రసారస్వత పరిషత్ (1940) 3) విజ్ఞానవర్ధినీ పరిషత్ (1941) 4) ఆంధ్రసారస్వత పరిషత్ (1943) 5) తెలుగు భాషాసమితి (1947) 6) తెలంగాణ రచయితల సంఘం (1951) 7) నవ్యసాహితీ సమితి (1952) 8) ఆంధ్ర రచయితల సంఘం (1956) 9) ఆంధ్రవిశ్వ సాహితి (19 60) 10) రంజని సాహితీసమితి (1961) 11) యువ భారతి (1963) 12) ఫ్రీవర్స్ ఫ్రంట్ (1967) 13) విప్లవ రచయితల సంఘం (1970) 14) శ్రీనివాస సాహితీసమాఖ్య (1982) 15) సప్తగిరి సమితి (1991) 16) రసమయి ప్రజ్ఞాసమితి 17) వైతాళిక సమితి 18) హృదయభారతి 19) ఆంధ్రకేసరి సాహితీ సంస్థ 20) సాధన సాహితీ స్రవంతి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు