ఎస్కిమోల జీవితాల్లో శిల అంటే..?(TET Special)
- ధృవ ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉండదు.
- ఉత్తర ధృవ ప్రాంత సరిహద్దును ‘ఆర్కిటిక్ వృత్తం’ అంటారు.
- ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను ‘టండ్రా ప్రాంతం’ అంటారు.
- టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం
- టండ్రా ప్రాంతాల్లో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సూర్యుడు ఉదయించడు. ఈ కాలం ఇక్కడ చలికాలం. చీకటిగా ఉంటుంది.
- టండ్రా ప్రాంతాల్లో మే నుండి జూలై నెల వరకు సూర్యుడు అస్తమించడు.
- భూమి, ఆకాశం కలిసినట్లు ఉండే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు.
- పెద్దపెద్ద మంచుగడ్డలు విడిపోయి నీటిపై తేలుతూ సముద్రంలోకి ప్రవేశించే వాటిని ‘ఐస్బర్గ్’ అంటారు.
- టండ్రా ప్రాంతాల్లో చలికాలంలో నేల పై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డకట్టుకొని ఉండే దానిని ‘పర్మాఫ్రాస్ట్’ శాశ్వతంగా గడ్డకట్టుకుపోవడం అంటారు.
- ‘ఎస్కిమో’ అనే పదానికి అర్థం ‘మంచుబూట్ల వ్యక్తి’ వీరిలో ఇన్యుయిట్, యుపిక్ అనే బృందాలు ఉన్నాయి. వీరి భాషలో ఇన్యుయిట్ అంటే ప్రజలు.
- ఎస్కిమోలు మాట్లాడే భాషలు అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్ ఎస్కిమోలు సైబీరియా, అలెస్కా, కెనడా, గ్రీన్లాండ్లో ఉన్నారు.
- 5 వేల సంవత్సరాల క్రితం ఎస్కిమోలు బేరింగ్ జలసంధి ద్వారా ఉత్తర అమెరికాలో ప్రవేశించారు.
ఎస్కిమోలు రవాణా కోసం కుక్కలు లాగే మంచు బండ్లను (స్లెడ్జ్), నీటిపైన ఉమియాక్ అనే పడవలను ఉపయోగిస్తారు. - జంతువుల చర్మంతో చేసిన చెక్కచట్రం ‘కయాక్’లతో నీటి మీదుగా వెళ్తూ ‘హర్పూన్’ పరికరంతో సీల్ జంతువులను వేటాడుతుంటారు.
- ‘ఇగ్లూ’ అనే ఎస్కిమో పదానికి ‘ఆశ్రయం’ అని అర్థం.
- అలెస్కాలో శీతాకాలంలో వాల్రాస్ చర్మాన్ని వాడి పెద్దపెద్ద గుడారాలు తయారు చేస్తారు.
- వీరు జంతు చర్మాలతో చేసిన ముక్లుక్లనే బూట్లు, ప్యాంట్లు, తలను కప్పేటోపి ఉండే కోట్లను ‘పర్కాలు’ అంటారు.
- ఎముక, దంతం, కొయ్య, సోప్స్టోన్(మెత్తటిరాయి)లతో జంతువులు, మనుషుల బొమ్మలు, ఆయుధాలు, పరికరాలు తయారు చేస్తారు.
- ఎస్కిమో బృందాలు శిల అనే అతీత శక్తిని, ఆత్మలను సెడ్నా(జీవనం, ఆరోగ్యం, ఆహారదేవత) వంటి దేవతలను నమ్ముతారు.
- ప్రతి బృందానికి నిషిద్ధమైనది (టాబూ) ఉంటుంది. దీని ప్రకారం వారు టాబూను తినకూడదు.
- జీవన మరణాల సమయాల్లోనూ, వేట బాగా దొరికినప్పుడు లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతిబృందం ‘షమాన్లు’ నాయకత్వంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. టండ్రా ప్రాంతం అంటే? (1)
1) ధృవ ప్రాంతం
2) సమశీతోష్ణ మండల ప్రాంతం
3) ఉష్ణ మండల ప్రాంతం
4) భూమధ్యరేఖ ప్రాంతం
2. టండ్రా ప్రాంతంలో చీకటిగా ఉండే నెలలు? (2)
1) జనవరి, ఫిబ్రవరి
2) నవంబర్, డిసెంబర్, జనవరి
3) జూన్, జూలై
4) సెప్టెంబర్
3. టండ్రా ప్రాంతంలో సూర్యుడు అస్తమించని కాలం/నెలలు? (3)
1) ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు
2) నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు
3) మే నుంచి జూలై వరకు
4) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
4. దిగ్మండలం అంటే ఏంటి? (3)
1) సూర్యుడు ఉదయించని ప్రదేశం
2) సూర్యుడు అస్తమించని ప్రదేశం
3) భూమి ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశం
4) సూర్యుడు నడినెత్తికి వచ్చే ప్రదేశం
5. ఎస్కిమోలు మాట్లాడని భాష (4)
1) అల్యుయిట్ 2) యుపిక్
3) ఇన్యూపిక్ 4) మండారిన్
6. ఎస్కిమోలు ధరించే కోటులను ఏమంటారు? (2)
1) ఫర్ కోటులు 2) పర్కాలు
3) ముక్లుక్లు 4) శేర్వానీలు
7. ఎస్కిమోలకు సంబంధించి కింది అంశాలను (సరైనది) పరిశీలించండి. (3)
ఎ) గ్రీన్లాండ్, కెనడా, అలెస్కా, సైబీరియా దేశాల్లోని చిన్నచిన్న నివాస ప్రాంతాల్లో ఉంటారు
బి) వీరిలో ఇన్యూయిట్, యుపిక్ రెండు బృందాలు ఉన్నాయి
సి) వీరు స్థిర నివాసం గడుపుతారు
డి) వీరు మాట్లాడే భాషలు అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) సి, డి
8. ఎస్కిమోల జనాభా వివరాలను జతపరచండి (2)
నివాస ప్రాంతం జనాభా
ఎ) సైబీరియా 1) 43,000
బి) అలెస్కా 2) 22,500
సి) కెనడా 3) 30,000
డి) గ్రీన్లాండ్ 4) 2,000
5) 16,000
1) ఎ-4, బి-3, సి-1, డి-5
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-5, డి-3
9. ఎస్కిమోల జీవనానికి సంబంధించి కింది వాటిని జతపరచండి (3)
ఎ) స్లెడ్జ్ 1) ఆవాసం
బి) ఉమియాక్స్ 2) ఆయుధం
సి) హర్పూన్ 3) కుక్కలు లాగే మంచు బండ్లు
డి) ఇగ్లూ 4) పడవలు
5) పర్కాలు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-5
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-5, డి-1
10. అయిదు వేల సంవత్సరాల క్రితం ఎస్కిమోలు ఏ ఖండం నుంచి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. (4)
1) ఆఫ్రికా 2) ఆస్ట్రేలియా
3) దక్షిణ అమెరికా 4) ఆసియా
11. కయాక్ అంటే? (1)
1) ఒక రకమైన పడవ
2) ఒక రకమైన ఆయుధం
3) ఒక రకమైన దుస్తులు
4) ఒక రకమైన ఆహారం
12. ప్రతివ్యక్తి, కుటుంబం లేదా బృందానికి టాబూ ఉంటుంది. ‘టాబూ’ అంటే ? (1)
1) నిషిద్ధమైంది 2) ఇష్టమైంది
3) అమూల్యమైంది 4) అందరికి చెందింది
13. కింది వాటిలో ఎస్కిమోల వినోద కార్యక్రమాల్లో లేనిది? (4)
1) కుస్తీ 2) పరుగు
3) హర్పూన్ విసరడం 4) జూదం
14. ఎస్కిమోలు వేటాడే జంతువుల్లో లేనిది ఏది? (4)
1) వాల్స్ 2) కారిబో
3) సీల్ జంతువు 4) ధృవపు కుక్క
15. ఎస్కిమోల జీవితాల్లో ‘శిల’ అనేది (3)
1) నిషిద్ధమైనది 2) ప్రియమైనది
3) అతీత శక్తి 4) ఆహార దేవత
16. సెడ్నా దేవతకు సంబంధం లేని అంశం (1)
1) ఆత్మ 2) జీవనం
3) ఆరోగ్యం 4) ఆహారం
17. ‘షమాన్లు’ కింది విధుల్లో వేటిని నిర్వహిస్తారు?(2)
ఎ) ఎస్కిమో ప్రజల ఆచారాలు నిర్వహిస్తారు
బి) ఆత్మల ప్రపంచంతో అనుసంధానానికి సహాయం చేస్తారు
సి) ఎస్కిమోల తరఫున బయటి ప్రపంచంతో సంబంధాలు నెరపుతారు
డి) వేటాడేటప్పుడు ఎస్కిమోల బృందానికి నాయకత్వం వహిస్తారు
1) ఎ, డి 2) ఎ, బి
3) సి, డి 4) ఎ, బి, సి
18. 1576-78 కాలంలో బాఫిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ సముద్ర యాత్రికుడు? (1)
1) మార్టిన్ ఫ్రొబిషర్ (martin frobishor)
2) లివింగ్ స్టన్ 3) స్టాన్లీ
4) అముడ్సన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు