స్వదేశీ పరిశ్రమలు స్థాపించేందుకు ఏ ఉద్యమం కారణం?
జాతీయోద్యమం-తొలిదశ-మలిదశ (1885-1947)
భారత్‌లోని సమస్యలను చర్చించేందుకు 1886లో లండన్ కేంద్రంగా ‘East Indian Association’ని దాదాభాయ్నౌరోజీ స్థాపించాడు.
లక్ష్యాలు
రాష్ర్టాల్లో భారతీయులు ఎదుర్కొం టున్న సమస్యలు.
మేథావులందరని ఒక దగ్గరకు తీసుకురావడం.
ప్రజలు సార్వభౌమాధికారం కలిగి ఉండాలి.
కలకత్తా – పుణె – బొంబాయి – మద్రాస్ (1885-1947)
ప్రెసిడెన్సీ అసోసియేషన్లను స్థాపించారు. వీటిని ఎస్ఎన్ బెనర్జీ, ఎంజీ రనడే, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేసీ తెలంగ్, జీ సుబ్రమణ్యం మొదలైన వారు స్థాపించారు.
భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1885
డిసెంబర్ 28-31 మధ్య ‘బొంబాయిలోని సర్ గోక్ దాస్ తేజ్‌పాల్ సంస్కృత కాలేజీలో సమావేశం ఏర్పాటు చేసినది- A.O. హ్యూమ్.
అధ్యక్షత వహించింది-W.C. బెనర్జీ.
హాజరైన వారు 72 మంది.
అప్పటి వైశ్రాయ్- లార్డ్ డఫ్రిన్.
INC లక్ష్యాలు
ప్రజలందరిలో జాతీయ భావాలు కలిగించి వారిని సమైక్యం చేయడం, ఐక్యతను సాధించడం.
రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనేలా ఉమ్మడి రాజకీయ వేదిక తయారుచేయడం.
ప్రజాస్వామ్య భావనలు, పని విధానాన్ని ప్రోత్సహించడం.
ప్రజల మధ్య విభజన ఏర్పడు తుందన్న ఉద్దేశంతో ‘సామాజిక సంస్కరణల’ జోలికి పోవద్దని INC నిర్ణయం.
రెండో సమావేశం
1886 డిసెంబర్ 28-31- కలకత్తా
అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజీ
హాజరైన వారు 436మంది
ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అనే పదాన్ని వాడారు.
హాజరైన మహిళ గ్రాడ్యుయేట్- కాదంబరి గంగూలీ (కలకత్తా)
1885-1947 మధ్య జాతీయోద్యమాన్ని 3 దశలుగా విభజించవచ్చు
మితవాదులు (1885-1905)
రాస్ బిహారీ బోస్
గోపాలకృష్ణ గోఖలే
దాదాభాయ్ నౌరోజీ
ఫిరోజ్‌షా మెహతా
ఎస్ఎన్ బెనర్జీ
డబ్ల్యూసీ బెనర్జీ
అతివాదులు (Extremists) (1905-20)
బాలగంగాధర్ తిలక్
లాలాలజపతి రాయ్
బిపిన్ చంద్రపాల్
అరవింద్ ఘోష్
గాంధీ యుగం (1920-47 )
గాంధీ
రాజాజీ
బాబూ రాజేంద్రప్రసాద్
మితవాద దశ (1885-1905)
డిమాండ్లు
బాధ్యతాయుత ప్రభుత్వం కావాలి.
వయోజన ఓటింగ్ హక్కు కావాలి.
ఇంపీరియల్ విధాన సభల్లో భారతీయులకు ప్రాతినిధ్యం.
సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్‌లో కాకుండా భారత్‌లో నిర్వహించాలి.
పద్ధతులు
ప్రార్థన, అభ్యర్థన, నిరసన
ఇతర మార్గాల ద్వారా ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకుంటు న్నారని మితవాదులు పేర్కొన్నారు.
బ్రిటిష్ పరిపాలన ఆర్థికంగా భారత్‌కు నష్టం కలుగజేస్తుందని R.C.దత్, నౌరోజీ, రనడే తెలిపారు.
పేదరికాన్ని అంతం చేసేందుకు ‘జాతీయ పారిశ్రామిక అభివృద్ధి’ తప్పనిసరి అని మితవాదులు నిర్ణయించారు.
నోట్ : మితవాదుల పద్ధతులను బిక్షమెత్తుకోవడం అని వర్ణించింది- బాలగంగాధర్ తిలక్
1907 సూరత్ సమావేశంలో అతివాదులు-మితవాదులుగా విడిపోయారు.
1916 లక్నో సమావేశంలో మళ్లీ కలిశారు.
అతివాద దశ (1905-20)
ప్రధాన లక్ష్యం- స్వరాజ్యం లేదా స్వతంత్ర సముపార్జన.
అతివాదుల కాలంలో జరిగిన సంఘటనలు
వందేమాతర ఉద్యమం
హోంరూల్ ఉద్యమం
వందేమాతరం ఉద్యమం ( 1905-11)
- స్వదేశీ ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం- 1903
- ఇతర పేర్లు- విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ ఉద్యమం.
- కారణం – బెంగాల్ విభజన (1905 అక్టోబర్ 16)
- పరిపాలన సౌలభ్యం కోసం ‘లార్డ్ కర్జన్’ బెంగాల్‌ను రెండుగా విభజించాడు.
- తూర్పు బెంగాల్ – ఢాకా
- పశ్చిమ బెంగాల్-కలకత్తా
- ఉద్యమ నాయకులు- బాలగంగాధర్ తిలక్. ఇతన్ని మాండలే జైలులో వేశారు. (1908-15 మధ్య)
- అక్టోబర్ 16న కలకత్తాలో ‘హర్తాళ్’ ప్రకటించి గంగానదిలో స్నానం చేసి వందేమాతరం పాడుతూ వీధుల్లో ఊరేగారు.
- బెంగాల్ ఐక్యతకు చిహ్నంగా ఒకరికొకరు ‘రాఖీలు’ కట్టుకోవాలని ఠాగూర్ పిలుపునిచ్చారు..
- అదే రోజు సాయంత్రం 75,000 మంది ప్రజలు హాజరైన రెండు బహిరంగ సభల్లో ఆనంద మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యాసం ఇచ్చారు.
- వందేమాతర గేయాన్ని రచించినది- బంకించంద్ర ఛటర్జీ. (ఆనంద్‌మఠ్ గ్రంథం)
స్వదేశీ ఉద్యమ ఉద్దేశాలు
- స్వదేశీ వస్తువులు మాత్రమే ఉపయోగించడం.
- విదేశీ వస్త్ర, ఉప్పు బహిష్కరణకు పిలుపు.
- స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపించడం.
- స్వదేశీ ఉప్పు, పంచదార, అగ్గిపెట్టెల తయారీ.
- స్వదేశీ పరిశ్రమలు ఎక్కువగా స్థాపించేందుకు ఈ ఉద్యమం ప్రధాన కారణం.
- ఉదాహరణ: బెంగాల్ కెమికల్ వర్క్స్- పీసీ.రే
- టాటా ఐరన్ స్టీల్ కంపెనీ- జంషెడ్ టాటా (1907) (జార్ఖండ్)
- స్వదేశీ ఉద్యమం వల్ల దేశంలో ‘వస్త్ర పరిశ్రమ’ అభివృద్ధి చెందింది.
- ఉద్యమ కాలంలో ఠాగూర్ రెండు గీతాలు రచించాడు.
- జనగణమన అధినాయక (భారత్)
- అమర్ సోనార్ బంగ్లా ( బంగ్లాదేశ్)
- 1911 లో అప్పటి వైస్రాయ్ అయిన ‘2వ హార్డింజ్’ బెంగాల్ విభజనను రద్దుచేసి, బెంగాల్‌ను కలిపాడు.
కృష్ణాపత్రిక
- 1902 లో మచిలిపట్నంలో స్థాపించారు.
- స్థాపించినది – కొండా వెంకటప్పయ్య (ఆయన బిరుదు దేశభక్త)
- 1902 లో ఈ పత్రిక ఉపసంపాదకుడు- ముట్నూరి కృష్ణారావు.
- 1907-1945 మధ్య వరకు కృష్ణారావు సంపాదకుడు.
- పట్టణ విద్యావంతులనే కాకుండా, పల్లెల్లో సామాన్య జనాన్ని కూడా ఈ పత్రిక ప్రభావితం చేసింది.
- వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణ శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాలను ఈ పత్రిక ప్రచారం చేసింది.
హోంరూల్ ఉద్యమం (1916)
- హోంరూల్ అంటే స్వపరిపాలన.
- స్థాపకులు – అనీబిసెంట్ (ఐర్లాండ్), తిలక్ (మహారాష్ట్ర)
- 1916 ఏప్రిల్‌లో పుణెలో తిలక్, సెప్టెంబర్‌లో అఢయార్లో అనీబిసెంట్ ప్రారంభించారు.
- ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ నినాదాన్ని తిలక్ ఈ ఉద్యమ సమయంలోనే ఇచ్చాడు.
- ఈ స్వాతంత్య్రం కోరుతూ ఈ ఉద్య మాన్ని ప్రారంభించారు.
తక్షణ కారణం
ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను బోస్నియా రాజధాని ‘సెరాయెవో’లోని గావ్రిలో ప్రిన్సిప్ హత్యచేయడం.
యుద్ధంలో భాగంగా ఏర్పడిన రహస్య కూటములు.
త్రైపాక్షిక కూటమి: జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ (1882)
త్రిర్యాజ సంధి: బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా (1907)
యుద్ధానంతరం ఏర్పడిన సమావేశం- పారిస్ శాంతి సమావేశం.
వర్సెయిల్స్ సంధి- (1919 జూన్ 28)
నానాజాతి సమితి/లీగ్ ఆఫ్ నేషన్స్ ( 1920 జూన్ 10)-జెనీవా
జెనీవాకు చెందిన 75,000 మంది సైనికులు ఇంగ్లండ్ తరపున పోరాడి మరణించారు.
జాతీయోద్యమ మలిదశ (గాంధీ యుగం) (1920-47)
మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు రావడంతో మలిదశ ప్రారంభమైంది.
1893 లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన గాంధీ 1915 జనవరి 9న గోఖలే పిలుపు మేరకు భారత్‌కు వచ్చాడు.
l మొదటి సత్యాగ్రహాన్ని దక్షిణాఫ్రికాలో ప్రారంభించాడు. (1906)
గాంధీ ఉద్యమాలు (1917 నుంచి 1942 వరకు)
- చంపారన్ 1917-18 బీహార్‌లో నీలి మందు రైతులకు మద్దతుగా ఉద్యమం.
- ఖేడా / ఖైడా 1917-18 (అహ్మదాబాద్) నూలు మిల్లు కార్మికుల జీతభత్యాల కోసం
- ఖిలాఫత్ 1919-23
- సహాయ నిరాకరణ 1920-22
- శాసనోల్లంఘన ఉద్యమం- 1930-34
- క్విట్ ఇండియా- 1942 ఆగస్టు
జలియన్ వాలాబాగ్ సంఘటన (1919 ఏప్రిల్ 13)
- పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో జరిగిన సంఘటన. కారణం- రౌలత్ చట్టం (1919 ఏప్రిల్ 6)
చట్టం ముఖ్యాంశాలు - మొదటి ప్రపంచ యుద్ధకాలంలో చేసిన చట్టాలు.
- ఎలాంటి కారణం లేకుండా 2 సంవత్సరాలు ఎవరినైనా జైలులో పెట్టవచ్చు.
- ఇంగ్లండ్ న్యాయస్థానాల్లోనే హాజరుపరచాలి.
- ఈ చట్టాన్ని గాంధీ, జిన్నా వ్యతిరేకించారు.
- ‘నిరంకుశత్వ రాక్షస చట్టం అని విమర్శించారు.
- జలియన్‌వాలా బాగ్ సంఘటన కాలంలో అమృత్‌సర్‌లో బ్రిటన్ అధికారి జనరల్ డయ్యర్. ఇతడు జరిపిన కాల్పుల వల్ల 400 మంది మరణించారు. దీనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘నైట్ హౌడ్’ బిరుదును వదులుకున్నాడు.
- రౌలత్ సత్యాగ్రహంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి పోరాడేలా గాంధీ పిలుపునిచ్చాడు.
ఖిలాఫత్ ఉద్యమం (1919-23)
- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దను ‘ఖలీఫా’ అనేవారు. ఈ పదవి ‘టర్కీ సుల్తాన్’ కు వంశపారంపర్యంగా మారింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోవడంతో బ్రిటన్ ఖలీఫా పదవిని రద్దు చేసింది.
- ఖలీఫా పదవి పునరుద్ధరణకు ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమయింది.
- భారత్‌లో ఖలీఫా ఉద్యమానికి నాయకులు అలీ, మహ్మద్ అలీ
- 1923 అక్టోబర్ 22న టర్కీ అధ్యక్షునిగా ఎన్నికైన ‘ముస్తఫా కెమల్ పాషా’ ఈ పదవిని రద్దు చేశాడు.
టర్కీ పితామహుడు-అటీ టర్క్
సహాయ నిరాకరణోద్యమం (1920 ఆగస్టు 1-1922 ఫిబ్రవరి 11)
1920 లో ‘నాగ్‌పూర్’ సమావేశంలో ‘గాంధీ’ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించబడ్డాడు.
ఈ సమావేశంలో స్వరాజ్యస్థాపనకు సహాయ నిరాకరణను మార్గంగా ఆమోదించారు.
ఈ ఉద్యమాన్ని గాంధీ 4 దశలుగా వ్యాప్తిచేశాడు.
మొదటి దశ
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాల యాలను బహిష్కరించి ఉద్యోగాలకు రాజీనామా చేయాలి.
ఉదా: మోతీలాల్ నెహ్రూ, సీఆర్దాస్, రాజాజీ, అసఫ్ అలీ న్యాయవాద వృత్తిని వదిలారు.
గాంధీ తన బిరుదు ‘కైజర్-ఎ-హింద్’ వదిలివేశాడు.
రెండో దశ
గాంధీజీ విజయవాడ(ఏపీ)కి వచ్చాడు.
‘చరఖా’ను స్వదేశీ చిహ్నంగా గాంధీ ఎన్నుకున్నాడు.
జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య తయారుచేసి గాంధీజీకి అప్పగించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు