అతి పెద్ద అగ్నిపర్వత దీవి ఏది?
భారతదేశం ఒక ద్వీపకల్పం. ఒకవైపు భూమి ఉండి మూడువైపులా సముద్రం ఉండటం వల్ల అతిపొడవైన తీరరేఖను కలిగి ఉంది. అదేవిధంగా భారత్‌కు చెందిన కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్, నికోబార్, లక్ష దీవుల చుట్టూ తీరరేఖను కలిగి ఉన్నాయి. భారత్ తీరరేఖ ఏయే ప్రాంతాల్లో విస్తరించి ఉంది.. ఏ ప్రాంతాలు ఎంత పొడవైన తీరరేఖను కలిగి ఉన్నాయి.. దీవులు ఎలా ఏర్పడ్డాయి. వాటి ఉనికి గురించి తెలుసుకుందాం.
భారత తీరరేఖ (coastal line ):
- భారత్‌లో మొత్తం 13 రాజకీయ విభాగాలు (9 రాష్ర్టాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు) తీరరేఖను కలిగి ఉన్నాయి.
- భారతదేశ మొత్తం తీరరేఖ పొడవు 7,516.6 కిలోమీటర్లు. ఇందులో ప్రధాన భూభాగం మొత్తం తీరరేఖ పొడవు 5,422.6 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్, లక్షదీవుల తీరరేఖ పొడవు 2,094 కిలోమీటర్లు.
- ప్రపంచంలో అతిపొడవైన తీరరేఖ కలిగిన దేశాలు వరుసగా కెనడా, ఇండోనేషియా, రష్యా. భారతదేశ స్థానం 18.
- 5,422.6కిలోమీటర్ల తీరరేఖపై ఉన్న రాష్ట్రాల సంఖ్య 9.
కేంద్ర హోం శాఖ అధికారిక సమాచారం 2019-20 ప్రకారం రాష్ట్రాల తీరరేఖల వివరాలు:
పశ్చిమ తీర రాష్ట్రాల సంఖ్య: 5 అవి:
1. గుజరాత్: దీని తీరరేఖ పొడవు 1214.7 కిలోమీటర్లు. అధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం.
2. మహారాష్ట్ర: 652.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. పశ్చిమ తీరం రెండో అధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం.
3. గోవా: 101 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. తక్కువ పొడవు తీరరేఖ గల రాష్ట్రం.
4. కర్ణాటక: 280 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది.
5. కేరళ: 569.7కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది.
ఇది అత్యధిక చీలికలు కలిగిన తీర ప్రాంతం.
తూర్పు తీర రాష్ట్రాల సంఖ్య-4. అవి:
1.తమిళనాడు: 906.9కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. భారతదేశంలో 3వ పొడవువైన తీరరేఖను కలిగి ఉంది.
2. ఆంధ్రప్రదేశ్ : 973.7 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. తూర్పుతీరంలో అధిక పొడవైన తీరరేఖ గల రాష్ట్రం. భారతదేశంలో రెండో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం.
3. ఒడిశా: 476.4 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగిఉంది.
4. పశ్చిమబెంగాల్: 157.5 కిలోమీటర్లతో తక్కువ పొడవైన తీరరేఖ గల తూర్పుతీర రాష్ట్రం.
భారతదేశం- దీవులు (indian islands )
నాలుగు వైపులా నీటితో ఆవరించి ఉన్న భూమిని దీవి అంటారు.
బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ ద్వీప సముదాయంలో 572 ద్వీపాలు, అరేబియా సముద్రంలోని లక్ష ద్వీప సముదాయంలో దాదాపుగా 36 ద్వీపాలు ఉన్నాయి.
2020-21 కేంద్ర హోం శాఖ నివేదిక ప్రకారం దేశంలో దీవుల సంఖ్య: 1,382
1. ఖండ సంబంధ దీవులు
నిజానికి భూమిపై ఉన్న ఖండాలన్నీ దీవులే.
ఖండాల కంటే విస్తీర్ణంలో చాలా తక్కువగా ఉండి చుట్టూ నీరు ఉన్న ప్రాంతాలు/భూభాగాలను దీవులు అంటారు.
వేల సంవత్సరాల క్రితం భూమిపై తక్కువ ఉష్ణోగ్రత వల్ల నీరు మంచు రూపంలో ఉండి సముద్ర మట్టాలు చాలా తక్కువ స్థాయిలో ఉండేవి.
భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరిగి ఖండాంతర అంచుల్లో భూభాగాల చుట్టూ నీరు చేరి దీవులు ఏర్పడ్డాయి. వీటినే ఖండ సంబంధ దీవులు అంటారు.
ఖండ చలనం వల్ల కూడా ఖండాల నుంచి భూభాగాలు విడిపోయి దీవులుగా ఏర్పడతాయి.
ఉదా: గ్రీన్లాండ్- ప్రపంచంలోనే అతిపెద్ద దీవి.
న్యూగీనియా దీవి- ప్రపంచంలోనే రెండో పెద్దది.
బోర్నియా దీవి- ప్రపంచంలోనే మూడో పెద్దది.
బోర్నియా దీవిని ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాలు పంచుకుంటున్నాయి.
2. సముద్ర సంబంధ దీవులు
సముద్ర గర్భంలోని భూతలం నుంచి అగ్ని పర్వత పేలుళ్ల వల్ల లావా బయటకు వచ్చి గట్టిపడి సముద్ర ఉపరితలాన్ని చీల్చుకొని బయటకు రావడంతో సముద్ర సంబంధ దీవులు లేదా అగ్నిపర్వత దీవులు ఏర్పడ్డాయి.
ఉదా: హవాయి దీవులు: ఇవి పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడ్డాయి.
ఐస్లాండ్: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని పర్వత దీవి.
3. ఉష్ణమండల ప్రాంత దీవులు
వీటినే పగడపు దీవులు అని కూడా పిలుస్తారు.
సముద్రాల్లో కోట్ల కొద్ది గుంపులుగా నివసించే చిన్న జీవులు ప్రవాళాలు. శత్రువుల నుంచి రక్షణ కోసం వీటి మెత్తటి శరీరం నుంచి కాల్షియం కార్బోనేట్ లేదా లైమ్ స్టోన్‌ను స్రవించడం వల్ల శరీరం చుట్టూ గట్టి కర్పరాలు ఏర్పడతాయి.
అవి చనిపోయిన తర్వాత వాటి కర్పరాలు గుంపులుగా పోగుపడి గట్టి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని ప్రవాళ బిత్తికలు అంటారు.
ఈ ప్రవాళ బిత్తికలు కాలక్రమేణా ప్రవాళాల వల్ల ఎత్తు పెరిగి సముద్రపు ఉపరితలాన్ని చేరుకొని దీవులుగా మారతాయి. వీటినే పగడపు దీవులు (coral islands ) అంటారు.
ఉంగరం ఆకారంలో ఏర్పడ్డ పగడపు దీవులను అటోల్ అంటారు.
పగడపు దీవులకు ఉదాహరణలు
1. లక్ష దీవులు 2. మాల్దీవులు 3. ఫిజీ దీవులు 4.టోంగా, నౌరు దీవులు
ప్రపంచంలోనే అతిపొడవైన, పెద్ద ప్రవాళ బిత్తిక- గ్రేట్ బారియర్ రీఫ్
దీని పొడవు 2300 కిలోమీటర్లు. తూర్పు ఆస్ట్రేలియాలోని ఈశాన్య దిక్కులో క్వీన్‌ల్యాండ్ దగ్గర కోరల్ సముద్రంలో ఏర్పడింది.
ప్రవాళాలు నివసించే ప్రాంతాల్లో సగటు సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు 24 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా సముద్ర లోతు 200 మీటర్ల కన్నా తక్కువగా ఉండాలి.
4. పర్వతోద్భవ ద్వీపాలు
ముడత పర్వతాలు నిర్మాణ ప్రక్రియలో భాగం గా సముద్ర భాగంలో విస్తరించినప్పుడు ఇలాంటి ద్వీప తోరణాలు ఏర్పడతాయి.
ఉదా: ఇండోనేషియా ద్వీపాలు, జపాన్ ద్వీపాలు, అండమాన్ నికోబార్ ద్వీపాలు
గొలుసు రూపంలో ఏర్పడ్డ దీవుల సముదాయాలను ‘ఆర్చిపెలాగో’ అంటారు. ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఇండోనేషియా (13,500 దీవులు)
అండమాన్, నికోబార్ దీవులు
- మయన్మార్‌లోని ‘అరకాన్ యెమ’ పర్వతాల దక్షిణ కొనసాగింపుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్వీప సముదాయాలే ‘అండమాన్, నికోబార్ ద్వీపాలు’
- ఈ ద్వీపాల్లో బారెన్, నార్కొండం అగ్ని పర్వతాలతో పాటు భారతాంగ్ అనే బురదను స్రవించే అగ్ని పర్వతం కూడా ఉంది.
- అండమాన్, నికోబార్ దీవుల్లోని మొత్తం దీవుల సంఖ్య సుమారుగా 572. వీటి మొత్తం విస్తీర్ణం 8249 చదరపు కిలోమీటర్లు. 38 నివాసయోగ్యంగా ఉన్నాయి.
- ఇది భారతదేశ అతిపెద్ద ద్వీప సముదాయం (ఆర్చిపెలాగో)
- ఉనికి రీత్యా అండమాన్, నికోబార్ 6045l నుంచి 140ఉత్తర అక్షాంశాల మధ్య 920 నుంచి 940 15l తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
- ఇవి సాండ్ స్టోన్, లైమ్‌స్టోన్, షీల్డ్ శిలలతో ఏర్పడి ఉన్నాయి. అదేవిధంగా సరళ రేఖాకృతిలో లేదా కొద్దిగా అర్ధ చంద్రాకృతిలో విస్తరించి ఉన్నాయి.
- అండమాన్, నికోబార్ దీవుల్లో పెద్దది- మధ్య అండమాన్(1523 చదరపు కిలోమీటర్లు)
- చిన్న దీవులు- కర్లూ దీవి, రాస్ దీవి (0.3 చదరపు కిలో మీటర్లు)
- అత్యంత ఉత్తరాన ఉన్న దీవి- ప్రెపారిస్ దీవి
- అత్యంత దక్షిణాన ఉన్న దీవి- గ్రేట్ నికోబార్ దీవి
- సున్నపురాయి దీవులు- అండర్సన్ దీవి, ఇంటర్వ్యూ దీవి
తీర రేఖను కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు, దీవులు
1 అండమాన్, నికోబార్ దీవులు: 1962 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. భారత్‌లో అతిపొడవైన తీరరేఖ కలిగిన ప్రాంతం. పొడవైన తీరరేఖ గల కేంద్రపాలిత ప్రాంతం
2. లక్షదీవులు: 132 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది.
3. పుదుచ్చేరి: 47.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ గల కేంద్రపాలిత ప్రాంతం
4. డామన్, డయ్యూ: 42.5 కిలోమీటర్ల అతి తక్కువ తీరరేఖ గల ప్రాంతం
భారతదేశంలో తీరరేఖపై గల జిల్లాల సంఖ్య- 73
మూడు సముద్రాల సరిహద్దు లేదా తీరరేఖ (బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం) కలిగిన రాష్ట్రం: తమిళనాడు
అండమాన్, నికోబార్ దీవులు రెండు రకాలు
1. అండమాన్ దీవులు:
- ఇవి ఉత్తర అక్షాంశం నుంచి 140ఉత్తర అక్షాంశం, 920తూర్పు రేఖాంశం నుంచి 930 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
- వీటి విస్తీర్ణం 6596 చదరపు కిలోమీటర్లు.
- వీటిని ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
- ఉత్తర అండమాన్ దీవి: అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం సాండిల్ శిఖరం (738 మీటర్లు). ఇది ఉత్తర అండమాన్ దీవిలో ఉన్న హురియత్ పర్వతాల్లో ఉంది.
- విలుప్త అగ్ని పర్వతమైన నార్కొండం ఉత్తర అండమాన్ దీవికి దగ్గరగా తూర్పు దిక్కున ఉంది.
- అండమాన్, నికోబార్ దీవుల్లో రెండో పెద్దది ఉత్తర అండమాన్(1375 చదరపు కిలోమీటర్లు).
- మధ్య అండమాన్: ఇది భారతదేశ దీవులన్నింటిలో అతిపెద్ద దీవి(1536 చదరపు కిలోమీటర్లు), అండమాన్, నికోబార్ ద్వీపాల్లో పెద్దది.
- ఇండియా, దక్షిణాసియాలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్ని పర్వతమైన ‘బారెన్’ మధ్య అండమాన్ దీవికి సమీపంలో ఉంది.
- దక్షిణ అండమాన్: అండమాన్, నికోబార్ రాజధాని పోర్ట్‌బ్లేయిర్ దక్షిణ అండమాన్ దీవిలో ఉంది.
- ఇందులో ఎత్తయిన శిఖరం కోయబ్(460 మీటర్లు).
- చారిత్రక ప్రసిద్ధి చెందిన కాలపానీ చెరసాల (అండమాన్ సెల్యూలర్ జైలు) ఇక్కడే ఉంది.
- లిటిల్ అండమాన్: దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ మధ్య డంకన్ ప్యాసేజ్ ఉంది.
2. నికోబార్ దీవులు
- ఉనికి రీత్యా నికోబార్ దీవులు 6045l నుంచి 100ఉత్తర అక్షాంశాల మధ్య, 920 నుంచి 940తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
- నికోబార్ మొత్తం దీవుల సంఖ్య 22 (1653 చదరపు కిలోమీటర్లు).
- నికోబార్ దీవుల్లో అతిపెద్దది గ్రేట్ నికోబార్ దీవి (10451 చదరపు కిలోమీటర్లు).
- అతి చిన్న దీవి ‘పులోమిలో’ (1.3 చదరపు కిలోమీటర్లు), ఇది గ్రేట్ నికోబార్, లిటిల్ నికోబార్ దీవుల మధ్య విస్తరించి ఉంది. దీనికి దగ్గరలోనే ‘కచల్ దీవి’ విస్తరించి ఉంది.
- నికోబార్ దీవుల్లో ఎత్తయిన శిఖరం ‘తుల్లియర్ శిఖరం’(642మీటర్లు). ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది.
నికోబార్ దీవులు రెండు రకాలుగా ఉన్నాయి. - కార్ నికోబార్ దీవులు: కార్ నికోబార్ దీవులు, లిటిల్ మాల్దీవులకు మధ్య 100 చానల్ ఉంటుంది.
- గ్రేట్ నికోబార్ దీవులు: వీటిని ‘లాహెన్చింగ్ దీవులు’ అని కూడా పిలుస్తారు.
- మొత్తం భారతదేశ దక్షిణాగ్రం ఇందిరా పాయింట్ (హిగ్మాలియన్ పాయింట్) గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది.
- భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం ‘గ్రేట్ నికోబార్ దీవి’
- గ్రేట్ నికోబార్ దీవి 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ సునామీ వల్ల తీవ్ర విపత్తుకు గురైంది.
- దేశంలో అత్యంత దక్షిణాన ఉన్న ‘గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్’ భారతదేశంలో ఉన్న 18 బయోస్ఫియర్ రిజర్వుల్లో ఒకటిగా ఉంది.
- దీన్ని యునెస్కో 2013 మే 31న ప్రపంచ బయోస్ఫియర్లలో ఒకటిగా గుర్తించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు